Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ముప్పది రెండవ యద్యాయము - బ్రాహ్మణప్రశంస

పుష్కరః- బ్రాహ్మణాన్‌ పూజయేద్రాజా, బ్రాహ్మణాన్‌ పాలయే త్సదా | బ్రాహ్మణాహి మహాభాగ! దేవానా మపిదైవతమ్‌ |

బ్రాహ్మణానాం క్షితిం దద్యా ద్భోగా నన్యాంశ్చ పార్థివః | బ్రాహ్మణషు తు యద్దత్తం నిధిస్త త్పారలౌకికమ్‌ || 2

వేదలాంగలకృష్టేషు ద్విజక్షేత్రేషు భారత! | ఉప్తస్య దానబీజస్య ఫలస్యా న్తో న విద్యతే || 3

బ్రహ్మస్యం చైవ నాదద్యాత్‌ బ్రహ్మస్వం పాలయే త్తథా | బ్రహ్మస్వహరణాద్రామ! నరకం పశ్యతే నరః || 4

న విషం విషమిత్యాహుః బ్రహ్మస్వం విషముచ్యతే | విష మేకాకినం హన్తి బ్రహ్మస్వం సాప్తపూరుషమ్‌ || 5

బ్రహ్మస్వం ప్రణయా ద్భుక్తం హిన స్త్యాసప్తమంకులమ్‌ | ద్రోహా ద్భుక్తం తదేవేహ కులానాం పాతయే చ్ఛతమ్‌ || 6

సువర్ణ మేకం గామేకం భూమే రప్యేక మంగుళమ్‌ | హర న్నరక మాప్నోతి యావదాభూతసంప్లవమ్‌ || 7

దృష్ట్వా విటం దురాచారం బ్రాహ్మణం న ద్విషే త్క్వచిత్‌ | బ్రాహ్మణానాం పరీవాదా న్నాశ మాప్నోతి మానవః || 8

న జాతు బ్రాహ్మణం హన్యాత్‌ సర్వపాపే ష్వవస్థితమ్‌ | నైవాస్తి బ్రాహ్మణవధా త్పాపం గురుతరం క్వచిత్‌ || 9

పుష్కరుండనియె. రాజు బ్రాహ్మణులను బూజింపవలెను. పాలింపవలెను. బ్రాహ్మణులు దేవతలకుగూడ దేవతలుగదా! వారికి భూమిని మరియితరభోగములను నృపతి సమకూర్చవలెను. బ్రాహ్మణులకిచ్చినది పరలోకనిధి. వేదమనునాగలిచే దున్నబడిన ద్విజులనెడి క్షేత్రమందు చల్లిన దాన మనుబీజముల ఫలమునకు అంతములేదు. బ్రహ్మస్వము హరింపరాదు. బ్రహ్మస్వమును రక్షింపవలెను. బ్రహస్వమును హరించుటచేత రాజు నరకమునుజూచును. విషము విషము కాదు. బ్రహ్మస్వము విషము. విషమొక్క తిన్న వానినే చంపును బ్రహ్మస్వమేడుపురుషాంతరములజంపును. బ్రాహ్మణధనము పరిచయముతో దిన్ననది యేడుతరములవారిం గూల్చును. బంగారమొక్కచిన్నము గోవొక్కటి భూమియొక్క అంగుళమునేని హరించినవాడు భూత ప్రళయముదాక నరకమందును. ద్రొహముచేసి తిన్నది నూరుతరములవారిని గూల్చును. జారుడు దురాచారుడునైన బ్రాహ్మణునేని ద్వేషింపగూడదు. బ్రాహ్మణనిందవలన మానవుడు నాశనమందును. బ్రాహ్మణునెప్పుడేని యెంతపాపియైన జంపరాదు. బ్రాహ్మణహత్యకంటె గురుతరమైన పాపమెక్కడనులేదు.

బ్రహ్మహా నరకం యాతి యావదాభూతసంప్లవమ్‌ | వర్షణా మయుతం రామ! పచ్యతే స్నాయు పూరితే || 10

శోణితం యావతః పాంశూన్‌ గృహ్ణాతీహ ద్విజన్మనామ్‌ | కర్తా తావన్తి వర్షాణి కృతకృ న్నరకే వసేత్‌ || 11

ఉపద్రుతో ద్విజో యేన త్యజే జ్జీవిత మాత్మనః | బ్రహ్మహత్యా భ##వేత్తస్య నాత్రకార్యా విచారణా || 12

దేహత్యాగాచ్చ నరకం బ్రాహ్మణోపి ప్రపద్యతే | తేన చాధిక మాప్నోతి రామ! పాపం నరాధమః || 13

అదైవం దైవతం కుర్యుః కుర్యు ర్దైవ మదైవతమ్‌ | బ్రాహ్మణాశ్చ మహాభాగాః నమస్యాస్తే స దైవహి || 14

బ్రహ్మణానాం తథా కార్యం యత్నాత్‌ త్కుర్వీత పార్థివః | కా7లాతిపాతం చ తథా విప్రకార్యే న కారయేత్‌ || 15

నిష్పీడిత స్తూపవసే ద్యేన విద్వా న్నిశాం జనః | స రామ! నరకం యాతి వర్షాణాం తు దశా7యుతమ్‌ || 16

బ్రాహ్మణీ రుదతీ హన్తి కులం రొదయతే ధ్రువమ్‌ | తదశ్రు వహ్ని ర్దహతి కులం త్రిపురుషం ధ్రువమ్‌ || 17

విద్వానప్యథవా7విద్వాన్‌ బ్రాహ్మణో మానమర్హతి | ప్రణీతశ్చా7ప్రణీతాశ్చ యధా7గ్ని ర్ద్విజ పుంగవ || 18

ప్రతిష్టాం ప్రాప్నువన్తీహ సురాః విప్ర ప్రతిష్టితాః | 19

తన్ముఖేతు తథా7శ్నన్తి దేవాశ్చ పితృభి స్సహ| వహ్నౌహుతా చ్ఛ్రేష్ఠతమం హుతం విప్రముఖా7గ్నిషు || 20

అస్కంద మవిరుద్ధంచ ప్రాయశ్చిత్తైర్వివర్జితమ్‌ | యావతోగ్రసితే గ్రాసాన్‌ విద్వాన్‌ విప్రస్సుసంస్కృతః || 21

అన్నప్రదస్య తావన్తః కృతవః పరికీర్తితాః | బ్రాహ్మణానాం కరాన్ముక్తం తోయం శిరసి ధారయేత్‌ || 22

భ్రాహ్మణ్యస్య కరే యస్మా త్సర్వతీర్ధ సమాగమః | బ్రాహ్మణభ్య స్సముత్పన్నం త్రైలోక్యం సచరాచరమ్‌ || 23

అమోఘశాపా ధర్మజ్ఞః కధితా స్తే జగత్త్రయే| ఆశీర్వాద మమోఘం చ బ్రాహ్మణానాం ప్రకీర్తితమ్‌ || 24

ఆశీశ్వాదపరాః కార్యాః తస్మాద్రాజ్ఞా ద్విజోత్తమాః | యైః కృత స్సర్వభక్షోగ్ని రపేయశ్చ మహోదథిః || 25

క్షయీ సోమోజ వృషణ స్తథైవ చ శతకృతుః | యేషాం కోపాగ్ని రద్యాపి దండకేనోపశామ్యతి || 26

విపులశ్చ తథా యేషాం ప్రసాదో భృగునందనః | యేషాం ప్రసాదాత్‌ క్షీణో పి వృద్ధి మృచ్ఛతి చంద్రమా ః ||

యేషాం ప్రసాదా ద్రక్షోభిర్నాభిభూయేత భాస్కర ః | యేషాం ప్రసాదా ద్విపులాం కార్తవీర్య శ్శ్రీయం గతః || 28

యేషాం ప్రసాదా ద్దనదో దనాధ్యక్షత్వ మాగతః | అస్నాత స్స్నానమాప్నోతి వ్రత మప్నో త్యథావ్రతీ || 29

యేషాం వనచమాత్రేణ కింభూత మధికం తతః | ఖోగం రాజ్యం తథా స్వర్గం యేషాం వాక్యేన లభ్యతే || 30

బ్రాహ్మణుని జంపినవాడు ప్రళయముదాక నరకమందుడును. పదివేలేండ్లు పేగులతో నిండిన నరకమందు పాకమందును. బ్రాహ్మణుల రక్తమెన్ని రేణువులను గ్రహించునన్నేండ్లు బ్రాహ్మణహత్యచేసినవాడు నరకమందుండును. బ్రాహ్మణుని దరుముగా నాతడు జీవితమువదలునేని అతరిమిన వానికి బ్రాహ్మణహత్యాదోషము చుట్టుకొనును. వాని దేహత్యాగముచే బ్రాహ్మణుడైనను నేరమందును. ఆ నరాధము

డధికపాపముందును. బ్రాహ్మణులు దైవతముగాని దానిని దైవతముగను దైవతమయిన దానిని అదైవతముగను చేయగలరు. అందుచే నా మహానుభావులు నమస్కారార్హులు. బ్రాహ్మణులపని వెంటనే చేయవలెను. దానిలో నాలస్యము చేయరాదు. వాయిదావేయరాదు. ఎవనిబాధపడి జ్ఞానియైనవాడొక్కరాత్రి యుపవాసము చేయునో వాడు లక్షయేండ్లు నరకమునం గూలును. బ్రాహ్మణస్త్రీ యేడ్చెనేని యాయేడ్పించిన వానికులమునంత నేడ్పించును. ఆమె కన్నీరనెడు నగ్నియు మూడుతరములను గాల్చును. వ్రణీతుడైనను అనగా వేల్వబడినను వేల్వడబకున్నను నగ్నియెట్లు గౌరవమునకర్హుడో అట్లే బ్రహ్మణుడు విద్యావంసుడైనం గాకున్నను గౌరవింపవలసినవాడె. విప్రునిచే బ్రతిష్టితులై యీలోకమందు దేవతలు ప్రతిష్టను గాంతురు. బ్రహ్మణముఖముననే దేవతలు పితరులు నాహారము నారగింతురు. అగ్ని యందువేల్చిన దానికంటే విప్రముఖమనెడి అగ్నిలో వేల్చినది. శ్రేష్టతమము. ద్రవ్యము స్కన్నముగాదు (వృథాయును) విరుద్ధముగాదు. ప్రాయశ్చిత్త మవసరము. హనిస్సువలె నది సద్వినియుక్తముగను. మంచి సంస్కారముగల విద్యావంసుడగు విప్రుడెన్నిముద్దలు తినునో యన్నదాత యన్నియజ్ఞములు సేసినవాడగును. బ్రాహ్మణకరమునుండి జారిన నీటిని శిరశ్సునందు ధరింపవలెను. ఆహస్తమందు సర్వతీర్థములు వచ్చినిలిచియున్నవి. చరాచరాత్మ కజగత్తంతయు బ్రాహ్మణుల వలననే పుట్టినది. త్రిభువనములందును వార మోఘశాపులని చెప్పబడినది. వారి యాశీర్వాదముకూడ యమోఘమే, కావున రాజువారి యాశీస్సులగొనవలెను. వారిచేతనే యగ్ని సర్వభక్షుడు, మహాబ్ది ఆపేయము నైనారు. చంద్రునికి కలాక్షయము, ఇంద్రుడజవృషణుడగుటయచు, బ్రాహ్మణులు చేసినదే, బ్రాహ్మణుని కోపాగ్నిచేతనే దండకుడను రాజ రాజ్యమడవియైపోయినది. ఇప్పటికినది యట్లే యున్నది. ఆ కోపాగ్ని చల్లారునదికాదు. అదేరీతివారియనుగ్రహముగూడ సర్వసమృడ్ధము. దాననే క్షయమందిన చంద్రుడు దినదినాభివృద్ధి నందుచున్నాడు. బ్రాహ్మణ ప్రసాదముచేతనే (వారు సకాలమున నిచ్చు నర్ఘ్యము చేతనే) నిత్యము సూర్యభగవానుడు మందేహులను రాక్షసుల బాధ తప్పించుకొను చున్నాడు. కా ర్తవీర్యార్జునుడు బ్రాహ్మణప్రసాదము చేతనే విపులైశ్వర్యము లందినాడు. వారి యునగ్రహముచేతనే ధనదుడు(కుబేరుడు) ధనాధ్యక్షత్వమందెను. వారిమాటమాత్రమున స్నానము చేయనివాడు చేసిన వాడును వ్రతములేనివాడు వ్రతము చేసినవాడు నగును అంతకు మించిన దేమున్నది? భోగము రాజ్యము స్వర్గముకూడ బ్రాహ్మణుని మాటమాత్రము చేత లభించును.

అపావనకరః క్రోధో యేషాం రామ ! సదాస్థితః | తే పూజ్యాస్తే చ సత్కార్యా స్తేషాం దారాణి దాపయేత్‌ || 31

ధారయన్తి జగత్సర్వం బ్రాహ్మణా వేద పారగాః | దేవా నా ప్యాయయన్తీహ బ్రాహ్మణా భృగునన్దన ః || 32

తే తృప్తా స్తర్పయ న్తీహ భువనం సకలం సురాః| బ్రాహ్మణనాహుతి ర్దత్తా వహ్నౌ భృగుకులోద్వహ ః || 33

ఆదిత్య మాప్నో త్యాదిత్యా ద్వృష్టిర్భవతి భూతలే | అన్నస్య చ తథోత్పత్తిరన్నా ద్భూతోద్భవః స్మృతః || 34

తస్మా త్త్రిభువనం సర్వం బ్రాహ్మణౖ రేవ ధార్యతే | బ్రాహ్హణ ప్రభవా భూమిర్ర్భాహ్మణ ప్రభవో దివః || 35

బ్రాహ్మణానా మిమేలోకాః పరలోకా స్తథైవ చ | ఇజ్యా స్వాధ్యాయ తపసా ముపరోథా ద్యదా ద్విజాః || 36

స్వామ్యం భువి న విందంతి క్షత్రియాస్తు తదా కృతాః | బ్రాహ్మణానాం వచః కార్యం రాజభిః సతతోత్థితైః || 37

ధర్మమర్థం చ కామం చ తేషాం వాచి ప్రతిష్టతమ్‌ | బ్రాహ్మణానాం తు వాక్యేన నిగ్రహానుగ్రహా వుభౌ 38

లోకే కార్యౌ భూమిభృతా భూతి కామేన నిత్యశః | రాజా బ్రాహ్మణ వాక్యేన యః కుర్యా చ్ఛాసనాదికమ్‌ || 39

సమ్యగ్వాప్యథవాసమ్యక్తేన నాకే మహియతే | ఉల్లంఘ్య శాస్త్రం నృపతిః యో యధారుచి వర్తతే || 40

స రామః నరకం యాతి సుకృతేనాపికర్మణా | యత్ర బ్రాహ్మణ వాక్యాని న కరోతీహ యో నరః || 41

న తత్ర దోషవా న్విప్రో రాజాదోషేణ లిప్యతే | బ్రాహ్మణం దశవర్షం చ శతవర్షం చ భూమిపమ్‌ || 42

పితాపుత్రోః విజానీయాత్‌ బ్రాహ్మణః స్తుతయోః పితా| యస్య రాజ్ఞస్తు విషయే బ్రాహ్మణః సీదతి క్షుదా || 43

తస్యసీదతి తద్రాష్ట్రం దుర్భిక్ష వ్యాధి తస్కరైః |

తస్మా త్పూజ్యా నమస్కార్యా స్సంవిభాజ్యా స్తథా ద్విజాః | రాజ్ఞా సర్వప్రయత్నేన లోకద్వయ మభిప్సతా || 44

యద్భ్రాహ్మణా స్తుష్టతమా వదన్తి | తద్దేవతాః ప్రత్యభినన్దయన్తి |

తుష్టేషు తుష్టాః సతతం భవన్తి | ప్రత్యక్షదేవేషు పరోక్షదేవాః || 45

ఇతి శ్రీ విష్ణు దర్మోత్తరే ద్వితీయఖండే బ్రాహ్మణా ప్రశంసా వర్ణనం నామ ద్వాత్రింశ త్తమోధ్యాయః.

వారికోప మపవిత్రునింజేయ గలదు అట్టివారు పూజనీయులు. సత్కరింపవలసినవారు. వారికి వివాహములు చేయింపవలెను. వేదపారగులయిన విప్రులు జగమెల్ల తారుమారు గాకుండా నిలుపగలరు. దేవతల కాప్యాయనము కల్గింపగలరు. దేవతలు తృప్తులయి యీభువమెల్ల సంతృప్తము సేయుదురు. ఓ భృగువంశమణి! బ్రాహ్మణు డగ్నియందిచ్చిన యాహుతి యాదిత్యునింబొందును. అదిత్యునివలన నీ భూతములమున వర్షముపడును. దాన నన్నముత్పత్తియగును. అన్నము నుండి భూతోత్పత్తి చెప్చబటినది. అందువలన త్రిభువనమిది యెల్ల బ్రాహ్మణుల చేతనే నిలువరింపబడుచున్నది. భూమి బ్రాహ్మణునివలన ప్రభవించును. దివము (ద్యులోకము)బ్రాహ్మణప్రభవము. ఇహలోకము పరలోకములుగూడ బ్రాహ్మణులవే. ఇజ్య(యజ్ఞము) స్వాధ్యాయము తపస్సుల యొక్క ఉపరోధమువలన బ్రాహ్మణులు భూలోకమున స్వామ్యమును బొందనపుడు (అధికారము గోల్పోయి నపుడు) క్షత్రియులు కావలసి వత్తురు. రాజులు నిత్యము సంసిద్దులై నిలిచి బ్రాహ్మణుల మాట జరుపవలెను. ధర్మము అర్ధము కామమునను పురుషార్ధములు మూడును బ్రాహ్మవచనమందు బ్రతిష్ఠతములైయున్నవి. బ్రాహ్మణవచనముచే భూపతి శాసనకర్తగా లోకముందు నిగ్రహాను గ్రహములు రెండును జేయవలెను. ఐశ్వర్యకాముడగు రాజున కది కర్తవ్యము. అది మంచిగనో చెడ్డగనో నెటు చేసినను నా మహీపతి స్వర్గమందు పూజింపబడును. రాజు శాస్త్రము నుల్లంఘించి తన యభిరుచి ననుసరించి ప్రవర్తించునేని యాతడాపనియెంత బాగుగ చేసినను దాన నరక మందును. బ్రాహ్మణునిమాట రాజ్యమందేమానవు డేని జేయకుండిన నా దోషము వానికి జెందదు. రాజుం జెందును, పదేండ్ల భ్రాహ్మణ బాలుడు నూరేండ్ల భూపాలుడు తండ్రి కొడుకులని యెరుంగవలెను. వారిలో బ్రాహ్మణుడే తండ్రిగ గణింపవలసిన వాడు. రాజు కొడుకుగా లెక్కింపవలసినవాడు. ఏ రాజు దేశమున బ్రాహ్మణు డాకలింగుములు నా రాజు రాష్ట్రము దుర్భిక్షవ్యాధి తస్కరులవలన పీడనందును. అందువలన ద్విజులు పూజ్యులు. నమస్కార్యులు. సంవిభాజ్యులు. (రాజ్యములోని యైశ్వర్యము పంచి యీయవలసినవారు) ఇహ పరలోకము గోరు రాజు సర్వ ప్రయత్నముచే వారిని పూజాదులను జేయవలెను. దేవ బ్రాహ్మణులు మిక్కిలి సంతుష్టులయియున్న వారి యామాటను దేవత లందికొని ప్రత్యభినందితురు ప్రత్యక్ష దేవత లయిన విప్రులు సంతుష్టులైన పరోక్ష దేవతలు సంతుష్టులగుతురు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున బ్రాహ్మణ ప్రశంశయను ముప్పదిరెండవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters