Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ముప్పదియవ అధ్యాయము - వృక్షాయుర్వేదము

పుష్కరః- ఉత్తరేణ శుభః ప్లక్షో వటః ప్రాగ్భార్గవోత్తమ! | ఉదుంబరశ్చ యామ్యేన సౌమ్యేనా7శ్వత్థ ఏవ చ || 1

ఏతే క్రమేణ నేష్యన్తి దక్షిణా7ది సముద్భవాః | సమీపజాతాశ్చ తథా వర్జ్యాః కంటకినో ద్రమాః || 2

వామభాగే తథోద్యానం కుర్యాద్వాసగృహాచ్ఛుభమ్‌ | వాపయేత్‌ ప్రాక్తిలాం స్తత్ర మృందీయాత్తాంశ్చ పుష్పితాన్‌ ||

తతస్తురోపయే ద్వృక్షాన్‌ ప్రయతః స సమాహితః | స్నాతో ద్రుమ మథాభ్యర్చ్య బ్రాహ్మణాంశ్చ శివం తథా || 4

థ్రువాణి పంచ వాయవ్యం హస్తః పుష్యః సవైష్ణవః | నక్షత్రాణి తథా మూలం శస్యతేద్రుమ రోపణ|| 5

ఉద్యానం సజలం రామ! నా7భిరామం యదా తదా| ప్రవేశ##యే న్న విపట (కురుహాన్‌) పుష్కరిణ్యశ్చ తారయేత్‌ || 6

సంస్కార్య ముద్భిదం తోయం కూపాః కార్యాః ప్రయత్నతః | హస్తామాఘా తథా మైత్రం సౌమ్యం పుష్యం చ వానవమ్‌ ||

ఉత్తరా త్రితయం రామ! తథా పూర్వా చ ఫల్గునీ | జలాశయ సమారంభే ప్రశ##స్తే వారుణం తథా || 8

సంపూజ్య వరుణం దేవం విష్ణుం పర్జన్య మేవ చ | తర్పయిత్వా ద్విజాన్‌ కామై స్తథా7రంభకరో భ##వేత్‌ || 9

అథోద్యానే ప్రవక్ష్యామి ప్రశస్తాన్‌ పాదపాన్‌ ద్విజ ! | అరిష్టా7శోక పున్నాగ శిరీషా7మ్ర ప్రియంగవః || 10

పనసా7శోక కచలీ జంబూలకుచ దాడిమాః | మాంగల్యాః పూర్వ మారామే రోపణీయా గృహేషు వా || 11

కృత్వాబహుత్వ మేతేషాం రోప్యాస్సర్వే హ్యనన్తరమ్‌ | శాల్మలిం కోవిదారం చ వర్జయిత్వా విభీతకమ్‌ || 12

ఆసనం దేవదారుం చ పలాశం పుష్కరం తథా | న వివర్జ్యః తథా కశ్చి ద్దేవోద్యానేషు జానతా || 13

తత్రా7పి బహుతా కార్యా మాంగల్యానాం ద్విజోత్తమ! | సాయం ప్రాతస్తు ఘర్మా7ంతే శీతకాలే దినా7ంతరే || 14

వర్షాకాలే భువ శ్శోషే సేక్తవ్యా రోపితా ద్రుమాః | ఉత్తమం వింశతిర్హస్తం మధ్యమం షోడశాం7తరమ్‌ || 15

స్థానాత్థ్సానాం7తరం కార్యం వృక్షాణాం ద్వాదశా7వరమ్‌ | అభ్యాశజాతా స్తరవః సంశ్పృశంతః పరస్పరమ్‌ || 16

అవ్యక్త మిశ్రమూలత్వా ద్భవన్తి విఫలా ద్విజ! | తేషాం వ్యాధి సముత్పత్తౌ శృణు! రామ! చికిత్సతమ్‌ || 17

ఆదౌ సంశోధనం తేహాం కించి చ్ఛస్త్రేణ కారయేత్‌ | విడంగ ఘృత పంకా7క్తాన్‌ సేచయే చ్ఛీత వారిణా || 18

ఫలనాశే కులుత్ఖైశ్చ మాషైః ముద్గై స్తిలైర్యవైః | శ్రితశీత పయస్సేకః ఫలపుష్పాయ సర్వదా || 19

ఆవికా7జ శకృచ్చూర్ణం యవచూర్ణం తిలాని చ | గోమాంస ముదకం చేతి సప్తరాత్రం నిధాపయేత్‌ || 20

ఉత్సేకం సర్వవృక్షాణాం ఫలపుష్పాది వృద్ధిదమ్‌ | రంగతోయోషితం బీజం రంగతోయా7భిషేచనమ్‌ || 21

ఉదగ్రపుష్పం భవతి ¸°వనే నాత్ర సంశయః | మత్స్యా7ంభసా తు సి క్తేన వృద్ధి ర్భవతి శాఖినామ్‌ || 22

తతః ప్రధానతో వక్ష్యేద్రుమాణాం దోహదా న్యహమ్‌ | మత్స్యోదకేన శీతేన చా 7మ్రాణాం సేక ఇష్యతే || 23

మృద్వీకానాం తథా కార్యః తేనైవం రిపుసూదన ! | పక్వా7సృగ్రుధిరం చైవ దాడిమానాం ప్రశస్యతే || 24

తుషందేయం చ భవ్యానాం మద్యం చ వకులద్రుమే | విశేషా త్కామినీ వక్త్ర సంసర్గాత్తు గుణం చ యత్‌ || 25

ప్రశస్తం చా7ప్యశోకానాం కామినీ పాద తాడనమ్‌ | సృగాలమాంస తోయం చ నారంగా7క్షోటయో7ర్హితమ్‌ || 26

మధుయష్ట్యుదకం చైవ బదరాణాం ప్రశస్యతే | గంధోదకం చ గోమాంసం కతకానాం ప్రశస్యతే || 27

క్షరసేకేన భవతి సప్తవర్ణో మనోహరైః | మాంసపూతో వసా మజ్జా సేకః కురవకే హితమ్‌ || 28

పూతిమత్స్య ఘృతం పూతి కార్పాసా ఫల మేవ చ | అరిమేదస్య సేకో7యం పాటలేషు చ శస్యతే || 29

కపిత్థబిల్వయో స్సేకం గుడతోయేన కారయేత్‌ | జాతీనాం మల్లికాయుశ్చ గంధతోయం పరం హితమ్‌ || 30

తథా కుబ్జక జాతీనాం కూర్మమాంసం ప్రశస్యతే | ఖర్జూర నారికేరాణాం వంశస్య కదలస్య చ || 31

లవణన సతోయేన సేకో వృద్ధికరః స్మృతః | విడంగం తండులోపేతం మత్స్యమాంసం భృగూత్తమః ||

సర్వేషా మవిశేషేణ దోహదం పరికల్పయేత్‌ || 32

ఏవం కృతే చారు పలాశ పుష్పా | స్సుగంధినో వ్యాధి వివర్జితాశ్చ |

భవన్తి నిత్యం తరవ సరస్యాః చిరాయుషః సాధుఫలా7న్వితాశ్చ || 33

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే - ద్వితీయఖండే - వృక్షాయుర్వేద వర్ణనంనామ త్రింశత్తమో7ధ్యాయః.

పుష్కరుండనియె:- జువ్విచెట్టు ఉత్తరమున మఱ్ఱి తూర్పున మేడి దక్షిణమున రావి సౌమ్య దిశను నుండకూడదు. ముండ్లుగల చెట్లు గృహసమీపమందుండరాదు. ఇంటికెడమభాగమందుద్యానముండవలెను. ఆందు మున్ముందు నువ్వులం జల్లవలెను. అవి పుష్పింగనే పీకివేయవలెను. ఆమీద చెట్లను శుచియై పాతవలెను. ఉద్యానమందు వృక్షారోపణము సేయువాడు స్నానము చేసి యామొక్కను బ్రాహ్మణులను శివునిం బూజించి ధ్రువనక్షత్రములయందు వాయుదేవతాకమైన స్వాతి హస్తపుష్యమి విష్ణుదేవతాకము శ్రవణము మూలము వృక్షారోపణమున బ్రశస్తములు. ఉద్యానములో నీరునిలిచి సొంపుగాలేనపుడు ప్రవేశముసేయరాదు. చెట్లు నాటరాదు. పుష్కరిణి (కొలను) ద్రవ్వరాదు. భూమిని భేదించుకొని మీదికివచ్చు నీటిని సంస్కరింపవలెను. (శుద్ధిచేయవలెనన్నమాట.) కూపములు ద్రవ్వించవలెను. హస్త మఘు అనూరాధ (మిత్రదేవతాకము) సౌమ్యము చంద్రదేవతాకమైన చిత్ర ఉత్తరాత్రయము పుబ్బవరుణ దేవతాక మయిన శతభిషము వీటియందు జలాశయారంభము సేయవలెను. వాపీ కూప తటాకాదులు త్రవ్వుట కారంభింపవలెను. వరుణుని వర్షాధి దేవతలగు నింద్రుని పూజించి బ్రాహ్మణ సంతర్పణాదులుసేసి యారంభింపవలెను. ఉద్యానమందు నాట వలసిన బ్రశస్తములైన వృక్షములం దెల్పెద. అరిష్టము అశోకము పున్నాగము శిరీషము (దిరిశెన) ఆమ్రము (మామిడి) ప్రియంగువు (ప్రేంకణము) పనస అశోక అరటి నేరేడు దానిమ్మ (లి) లకుచ (కమ్మరేగు) గంగరేగు) ననునవి మంగళకరమైన చెట్లు తొలుత నాటవలెను. ఇవి తొలత నారుపోసి యామీద నాటవలెను. శాల్మవి = బూరుగు కోవిదారము (కాంచనము) విభీతకము (తాండ్ర) అసనము (వేగిస) దేవదారువు పలాశము (మోదుగు) పుష్కరము (తామర) వీని దేవలయోద్యానము లందు నాటవలెను. గాన మంగళకరములయిన వృక్షములను విరివిగా నాటవలెను వేసవిలో సాయం ప్రాతః కాలమందు శీతకాలములో పగలు, వర్షాకాలమందు భూమితడి యారినపుడు, నాటిన చెట్లకు నీళ్ళుపోయవలెను. చెట్టున చెట్టునకు నడుమ నిరువది మూరలుండుట యుత్తమము పదునారు మూరలు మధ్యమము. పండ్రెండు మూరల యొడమునకు దగ్గకూడదు. సమీపమున బుట్టిన చెట్లు నొకదానితో నొకటి రాచికొని మొదళ్ళు తెలియ రానంతగా పెనవేసికొని ఫలింపకుండ పోవును. కావున నొక దానికి మీదచెప్పిన యొడముండుట అవసరము. ఇక నాయా వృక్షములకు వ్యాధిగల్గినపుడు చికిత్స నెరింగించెదవినుము. మొదట వానిని కొలదిగా శస్త్రముతో నరికి సంశోధనము సేయవలెను. విడంగములు (వాయువిడంగలు) నేతిలో వేసి కాచి యానేయిని చన్నీళ్ళతో వానిపై చల్లవలెను. పండ్లు పండక పండి రాలిపోవుచున్నచో కులుత్థములు మినుములు పెసలు నువ్వులు యవలు నానవేసిన చల్లని నీళ్ళతో దడుపవలెను. పువ్వులు పండ్లు సమృద్ధములగును. గొఱ్ఱల మేకల పెంట యవచూర్ణము నువ్వులు గోమాంసము నీరును నేడురాత్రులు నిలువచేసి తడిపిన యడల దాని వలన వృక్షములు ఫలపుష్పాది సమృద్ధములగును. రంగతోయమునందుంచినది రంగతోయముచే నభిషేచితమైనదియునగు విత్తనము పుష్పసమృద్ధమగును. చెట్టునకు ¸°వనము వచ్చును. సందేహములేదు. చేపనీరుచే దడపిన వృక్షములు చక్కగా వృద్ధి సెందును. అవ్వల చెట్లయొక్క దోహదప్రక్రియ ముఖ్యముగా వచించెద. మామిడిచెట్లకు ద్రాక్షకును చల్లనిచేపనీరు ఉడికిన రక్తము, దానిమ్మలకు ప్రశస్తదోహదము. భవ్యములకు (పిప్పలికి) తుష (ఊకపోట్టు) వకులములకు (పొగడకు) మద్యము శ్రేష్ఠము. స్త్రీ నోటితో మద్యము నుమిసిన విశేషము. అశోకమునకు స్త్రీ పాదములతో దన్నిన చక్కగ పూయును. నారింజకు అక్షోటములకు (మృదుద్రుమమునకు) నక్కమాంసము నీరుమంచిది. రెగిచెట్లకు యష్టిమధుకము నానవేసిన నీరు శ్రేష్ఠము. కతకములకు (ఇండుప) గంధోదకము, మాంసము ప్రశస్తము ఏడాకులరటికి లేదా సురపొన్న చెట్టుకు క్షీరము చల్లవలెను. మాంసము వసమజ్జము కలిపి కురవకమునకు (ఎఱ్ఱగోరింట) జల్లవలెను పాటలముకు పూతి = దుర్వాసనగొట్టు చేపనూనె ప్రత్తికి నానవేసిన అరిమేదము (తెల్లతుమ్మ) చెక్కనీరు పోసిన బాగుగ పూయును. వెలగ మారేడు చెట్లకు బెల్లపు నీరు మంచిది. కుబ్జకమునకు జాజికి తినిశ తాబేలు మాంసము శ్రేష్ఠమైన ఎరుపు. ఖర్జూరములకు కొబ్బెరికి వెదురునకు కదలమునకు కోలపొన్న (పృశ్నిపర్ణికి) ఉప్పునీరు వృద్ధికరములు. వాయువిడంగాలు బియ్యముతో మత్స్యమాంసమును సర్వవృక్షములకు సర్వ సాధారణమైన ఎరుపు. ఈలా దోహదములు (ఎరువులు, వేసిన యెడల పువ్వులు పండ్లు సమృద్ధియై సుగంధభరితములయి వ్యాధిలేనివై వృక్షములు చిరకాలము యాయుర్దాయము గల్గి మంచిపండ్లు పండును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహోపురాణము ద్వితీయ ఖండమున వృక్షాయుర్వేదవర్ణనమను ముప్పదియవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters