Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఇరువదితొమ్మిదవయధ్యాయము-వాస్తువిద్యావర్ణనము

రామః- వాస్తువిద్యాం సమాచక్ష్వ! యాదోగణ నృపాత్మజ! హితయా మానవేంద్రాణాం తథా7న్యేషాంచ మానద! || 1

పుష్కర:- భూమి మాదౌ పరీక్షేతే శుభలక్షణ లక్షితామ్‌ | పూర్వోదక్ర్పవణాం ధన్యాం తథావై దక్షిణోన్నతామ్‌ || 2

న తథా శికటచ్ఛిన్నాం నా7న్యత్తోయ పరిప్లుతామ్‌ | వల్మీక మూషికా7వాసశ్వభ్ర కంటకిత ద్రుమైః || 3

విహీనాం మృదు సంస్పర్శాం కఠినాం చా7ప్యనూషరామ్‌ | న తథా యవ సంస్థానాం నేభ వజ్రోపమాం తథా || 4

న శూర్ప కూర్మ సంస్థానాం శక్తి హీనాం తథైవ చ | సంపూర్యమాణాం కృమిభిః తథా7ధిక మృదం శుభామ్‌ || 5

గర్భే చ కుసుమం యస్యాం న వ్లూని ముపగచ్ఛతి| న నిర్వాణ మవాప్నోతి యస్యాం దీపశ్చ భార్గవ! || 6

ఉదకం చ తథా యస్యాం శీఘ్రం రామః న జీర్యతే | సా ప్రశస్తా క్షితి, స్తస్యాం నివేశం కారయే ద్భుదః || 7

శ్వేతా రక్తా తథా పీతా కృష్ణా చైవ యథాక్రమమ్‌ | విప్రాదీనాం ప్రశస్తా స్యా న్మృత్తికా చ తతో ద్యిజ! || 8

ఘృతా7సృగన్న మద్యానాం తుల్య గంధా తథైవ చ | మధురా చ కషాయా చ అవ్లూెషణ రసా తథా || 9

కుశైశ్శరై స్తథా కాశైర్దూర్వాభి ర్యా చ సంభృతా | పరీక్ష్య యత్నతో భూమిం తిథి నక్షత్ర సంపదా || 10

సంపూజ్య బ్రాహ్మణాన్‌ పూర్వం నిశ్శల్యాం తాం తు కారయేత్‌| ఖాతపూర్వాం తతః కృత్వా దేవ భాగాంశ్చ కల్పయేత్‌|| 11

చతుష్షష్టిపదం కృత్వా వాస్తు పూర్వం యథావిథి | చతుష్షష్టి విభాగేన కల్పయిత్వా సమన్తతః || 12

ఏకైకం తు గృహం తత్ర తథైవ పరికల్పయేత్‌ | యస్మా త్పుర విభాగేన ద్వారన్యాసః ప్రకీర్తితః || 13

అతః పరం ప్రవక్ష్యామి దేవభాగాన్‌ యథావిథి | మధ్యే చతుష్పదః స్వామీ బ్రహ్మా శుభ చతుర్ముఖః || 14

ప్రాక్తథా నిగ్రహః స్వామీ కథితశ్చ తథా7ర్యమా| దక్షిణన వివస్వాంశ్చ మిత్రః పశ్చిమతః స్థితః || 15

ఉదక్‌ పృధ్వీధర శ్చైవ వికోణ ష్వథమే శృణు | వికోణ ళివ దైవత్యే కామపక్షా పుభౌ సురౌ || 16

సావిత్రీ సవితారౌ తు తథా7గ్రేయే ప్రకీర్తితౌ| తథానైరృతికోణ తు జయేంద్రౌ రామ ః కీర్తితౌ || 17

భద్రవ్యాధీ తు వాయవ్యే కథితౌ భృగునందనః | దేవతానాం తథైతాసాం భూయో బాహ్యే తు మండలే || 18

పూర్వాదిషు యథా దిక్షు దేవతా స్తా న్నిబోధ మే | మహేంద్రశ్చ రవి స్సత్యో భృశః ప్రాగ్రామః కీర్తితాః || 19

గృహక్షితో యమోభృంగో గంధర్వశ్చైవ యామ్యతః | భల్లాటశ్చ తథా సోమ అదితి ర్ధనద స్తథా || 20

ఉత్తరేణ స్మృతా దేవాః వికోణ ష్వథ మే శృణుః | దితి రీశో మేఘ జ¸° శివకోణ ప్రకీర్తితౌ || 21

వ్యోమాగ్నీ పూష వితథౌ శిఖికోణ చ భార్గవః | మృగ పిత్రీశ దౌవారీ సుగ్రీవాశ్చైవ నైరృతే || 22

రోగా7నాయుశ్చ నాగశ్చ ముఖ్యా7శ్వో7నిల దిక్‌ స్థితాః | తతో7పిబాహ్యత శ్యాష్టౌ శృణుష్యః గదతో మమ || 23

అష్టా వష్టౌ వినిర్ధిష్టాః దేవా దిక్షు విదిక్షు చ | అద్యన్తౌతు తయోర్దేవౌ ప్రోక్తా వథ గృహేశ్వరౌ || 24

పర్జన్యః ప్రథమో దేవో ద్వితీయశ్చ కరగ్రహః | మహేంద్ర రవి సత్యాశ్చ భృశో7థ గమన స్థథా || 25

పవనశ్చ మహాభాగాః పూర్వేణౖతే ప్రకీర్తితాః | పుష్యో7థ త్రితుదశ్చైవ తథైవ చ గ్రహరక్షతః|| 26

యమో భృశశ్చ గంధర్వో మృగో7థ పితర స్తథా | దక్షిణన వినిర్ధిష్టాః దేవా భృగుకులోద్వహః || 27

దౌవారికశ్చ సుగ్రీవః పుష్పదంత స్తథా సురః | వరుణస్తు తథా యక్షో రోగ శ్శోష స్తథైవ చ || 28

పశ్చిమేన వినిర్ధిష్టా దేవా దానవ నాశనాః | నాగరాజస్తథా ముఖ్యో భల్లాటశ్చ తథా శశీ || 29

అదితశ్చ కుబేరశ్చ నాగాశ్చ7థ హుతాశనః| ఏతే దేవా వినిర్దిష్టా స్తథా చోత్తర తోద్యిజ! || 30

ఏతేషా మేవ దేవానాం భాగే ద్వారాణి కారయేత్‌ | శుభాని తేషు వక్ష్యామి శేషాణి పరివర్జయేత్‌ || 31

మహేంద్ర సోమ దైవత్యౌ పూర్వత శ్శుభదౌ స్మృతౌ | గృహరక్షతశ్చ పుష్పశ్చ తథా దక్షిణత శ్శుభౌ || 32

వరుణకుమార! రాజుయొక్క మరి ప్రజల యొక్కయు క్షేమము కొరకు వాస్తువిద్యా విశేషము లెరింగింపుమని పరుశురాముడడుగ పుష్కరు డిట్లనియె. మొట్టమొదట భూపరీక్ష చేయవలెను. ఆ భూమి తూర్పు ఉత్తర దిశల వైపు వాటముగా (పల్లముగా) దక్షిణమం దెత్తుగను నుండవలెను శికటచ్చిన్నమును నన్యతోయ పరిప్లుతము గాగూడదు. పైనీరువచ్చి దానిలో పడగూడదు. పుట్టలు ఎలుకల కన్నాలు శ్వభ్ర రంధ్రములు (గోతులన్నమాట) ముళ్ళ చెట్లు లేనిది మృదుస్పర్శ కలిగి యున్నను, గట్టిగానున్నను చవిటినేల గాగూడదు. చేట తాబేలు నాకారము గానిది. యవగింజవలె స్థూలమధ్యముగా నుండనిది ఏనుగు వజ్రాయుధ మట్లుండనిది బలహీనము కృమి పూర్ణము గానిది మట్టి సమృద్ధముగా గలది శుభకరము. పువ్వు పడవేసిన వాడకుండునది దీపము పెట్టిన నారనిది నీరు త్వరగా నింకనదియు నైన క్షితి గృహనిర్మాణమునకు బ్రశస్తము. తెల్లని ఎర్రని పసుపు పచ్చనిది నల్లనిదియునైన నేల బ్రాహ్మణా దివర్ణముల వారికి వరుసగ ప్రశస్తము. నెయ్యి రక్తము అన్నము కల్లు వాసనలు గలది కషాయము (వగరు) పులుపుది ఊషణరసము (పిపిళ్ళరుచిగలది) కుశలు దర్భలు కాశ రెల్లు దూర్వ గరికలు వానితో నిండినదియునైన భూమిలో రాజ గృహము నిర్మాణము గావింపవలెను. శుభ నక్షత్రాదులు చూడవలెను. ముందు బ్రాహ్మణులు బూజించి యా నేలలో శల్యములం దొలిగించి తొలుత గోయి త్రవ్వి శంకుస్థాపన చేసి యందు దేవతలకు భాగములను గల్పింపవలెను. వాస్తుశాస్త్రనుసార మరువది నాలగడుగులు వైశాల్యములు నరువది నాలుగు విభాగములు చేయవలెను. ఆ యోక్కొక్క భాగములో నొక్కోక్క యిల్లు నేర్పరుపవలెను. పురవిభాగమనుసరించి ద్వార విన్యాసము చెప్పబడినది. ఇటుపిమ్మట దేవభాగములను యథావిథిగా చెప్పెదను. మధ్యయందు చతుష్పదమునకు స్వామి చతుర్ముఖ బ్రహ్మయు, తూర్పున నిగ్రహస్వామి అర్యముడును, దక్షణమున వివస్వానుడు పడమట మితుడు ఉత్తరమున పృథ్వీధరుడు చెప్పబడెను. ఇక కోణములందు నీశాన్యమున కాముడు పక్షుడు నను దేవతలు, అగ్నేయమున సావిత్రియు సవితయు నైరృతకోణమున జయుడు ఇంద్రుడు, వాయవ్య కోణమున భద్రుడు వ్యాధియు చెప్పబడిరి. ఈ దేవతలకు బహిర్మండలమున పూర్వాది దిక్కులందు గల దేవతలను వినుము. పరుశురామా! తూర్పు దిక్కున మహేంద్రుడు రవి సత్యుడు భృశుడు దక్షిణమున గృహక్షితుడు యముడు భృశుడు గంధర్వుడు ఉత్తరమున భల్లాటుడు సోముడు అదితి కుబేరుడు దేవతలు చెప్పబడిరి. ఇక వికోణము లందలి దేవతలను వినుము. ఈశాన్యదిక్కున నీశ్వరుడు దితి మేఘుడు జయుడు, ఆగ్నేయమున వ్యోముడు అగ్రియు పూష వితథుడు నైరుతి దిక్కున మృగుడు యముడు దౌవారి సుగ్రీవుడు వాయవ్యమున రోగుడు అనాయువు నాగుడు ముఖ్యాశ్వుడు. అంతకు బహిర్మండలమున గల యెనిమిది దిక్కుల యందలి దేవతలను వినుము. దిక్కు లందును విదిక్కు లందును యెనమండుగురు చొప్పున యుందురు. వారికి అద్యంతములయందు గ్రహేశ్వరు లుందురు. తూర్పున పర్జన్యుడు మొదటివాడు రెండవాడు కరగ్రహుడు మహేంద్రుడు రవి సత్యుడు భృశుడు గమనుడు పవనుడు నుందురు. దక్షిణమున పుష్యుడు త్రితిదుడు గ్రహర్షతుడు యముడు భృశుడు గంధర్వుడు మృగుడు పితరులు నుందురు. పశ్చిమమున దౌవారికుడు సుగ్రీవుడు పుష్పదంతుడు సురుడు వరుణుడు యక్షుడు రోగుడు శోషుడు నను దేవతలు దానవ నాశకులుందురు. ఉత్తరమున నాగరాజు భల్లాటుడు శశి అదితి కుబేరుడు నాగుడు హుతాశనుడు నను దేవతలు చెప్పబడిరి. ఈ దేవతల భాగములందే ద్వారముల నుంచవలెను. వానిలో శుభములు చెప్పెదను. ఆశుభముల నొదలవలెను. మహేంద్ర సోమ దైవత్య ద్వారములు తూర్పున శుభప్రదములు దక్షిణమున గ్రహరక్షత పుష్ప దైవత్యములు శుభప్రదములు.

సుగ్రీవః పుష్పదన్తశ్చ శుభౌ పశ్చిమతో ద్విజః | భల్లాట స్సోమదేవశ్చ ద్వారే శ్రేష్టౌ తథా హ్యుదక్‌ || 33

ద్వాత్రింశచ్చ బహిర్దేవా స్తథా7న్త ర్ద్వాదశ స్మృతాః | మధ్యే బ్రహ్మా తథా ప్రోక్తా ఏవం తే పిండదేవతాః ||34

చత్వారింశ ద్వినిర్ధిష్టా స్తథా పంచ చ భార్గవ! | విన్యస్యా7జిర మేవా7దౌ చతుష్షష్టిపదం ద్విజ! || 35

తత్ర దేవ విభాగేన గృహకర్మ విధీయతే | చంద్ర సుగ్రీవ పర్జన్య సత్యేంద్రా7ర్యమ వారుణ|| 36

భగవత్సంగ్రహం కుర్యాత్‌ యథా సంస్థానతో ద్విజ | సూర్యాన్తరిక్ష సత్యాగ్ని భాగేషు చ మహానసమ్‌ || 37

వాయ్వన్తరిక్ష సుగ్రీవభల్లాట పితృదైవతే | గంధర్వ పుష్ప దంతాఖ్యే భాగే కూపం తు కారయేత్‌ || 38

ఏక వృక్షాధికం తత్ర తథా కుర్యాద్ధ్విజోత్తమ! | అథవా దిగ్విభాగేన గృహకర్మ విధీయతే || 39

ఐశాన్యం దేవాతావేశ్మ తథా7గ్నేయ్యాం మహానసమ్‌ | అగ్న్య గారం చ తత్రైవ భ్రమం నైరృతికే తథా || 40

కొష్ఠా7గారా7యుధా గారౌ వాయవ్యాం చ తథా స్మృతౌ| కూపా7ది స్థోదకం శస్తం దిక్షు చైవోత్తరాసు చ || 41

అన్యాసు గర్హితం రామ ! ప్రయత్నేన వివర్జయేత్‌ | పురాణం నవ మిశ్రం తు దారువేశ్మని వర్జయేత్‌ ||42

స్వకుడ్యం పరకుడ్యం చ నైవ కార్యం విజానతా | వినా7ర్క చంద్ర గ్రహణం ద్వార సంపరి వర్తనమ్‌ || 43

వృద్ధిక్ష¸° న కర్తవ్యౌ భూయః కర్మణి వేశ్మనః | ప్రాగుత్తరే7థవా కార్యౌ బ్రాహ్మణా7నుమతే తథా|| 44

న పీడనీయం చ తథా నాగదంతా7దిభి ర్బవేత్‌ | మర్మాణీ రామ ! జానీయా ద్దేవతాపదసంధిఘ|| 45

నపీడయే త్తథా తాని నాగదంతాదిభి ర్ద్విజ! | యే ద్రుమా ఘట సంసిక్తా స్తథా యే చ సకోటరాః || 46

హస్తి విద్యుద్ధతా యేచ దేవతా వేశ్మజాశ్చ యే | వహ్నిస్పృష్టాః శ్మశానే చ యే చ జాతా శ్చతుష్పథే || 47

రోకవృక్షాశ్చ యే కేచి న్నతే శస్తాః కథంచన | వృక్షస్య మహతీం పూజాం కృత్వా తద్వాసకస్య చ || 48

మధ్వాజ్య దిగ్దేన తథాఛిన్ద్యాత్‌ పరుశునా ద్విజః |పూర్వోత్తరేణ పతనం ప్రశస్తం పరికీర్తితమ్‌ || 49

శేషాసు పతనం దిక్షు గర్హితం ద్విజసత్తమ ! | వటాశ్వత్థౌ చ నిర్గుండీ కోవిదార విభీతకౌ || 50

పుష్యకం శాల్మలి శ్చైవ పలాశం చ వివర్జయేత్‌ | విస్తార ద్విగుణోచ్చ్రాయం ద్వారం కార్యం తథా గృహే || 51

నిధి ప్రథమకో నాగ హంస సారస చిత్రితమ్‌ | ద్వారకో నేత్రమ ద్వాభ్ర చతుష్పధ సురాలయైః || 52

కూపైక వృక్ష రధ్యాభి ర్విద్ధం ద్వారం వివర్జయేత్‌ | ద్విగుణాత్తు గృహోచ్ఛ్రాయాత్‌ భూమిం త్యక్త్వా న దోషభాక్‌ || 53

సుగ్రీవుడు పుష్పదంతుడు దేవతులుగా గల ద్వారములు పడమటను భల్లాటుడు సోమదేవుడు నుత్తర ద్వార మందును శుభ ప్రదులుగా నుందురు. వీరికి బరడలమందు ముప్పది యిద్దరు లోపల పండ్రెడుగురు నడుమ బ్రహ్మయు పిండదేవతలను పేర నుందురు. మొత్తమున నలుబది యైదుగురు ఈవిధముగా గృహప్రాంగణము చతుష్షష్టి (దేవతా(64)దేవస్థాన) విభాగములు గావించి యటుపై నింటిపని ప్రారంభింపవలెను. చంద్ర సుగ్రీవ పర్జన్య సత్య ఇంద్ర అర్యమ వారుణ దేవతాక మయిన యీ గృహనివేశన మందు భగవత్సంగ్రహ మా స్థలానుగుణముగ చేయవలెను. సూర్య-అంతరిక్ష సత్య- అగ్ని భాగములందు వంటింటిని వాయు అన్తరిక్ష సుగ్రీవ భల్లాట పితృదేవతా భాగములందు గంధర్వ పుష్పదంత భాగములందు నూతిని నేర్పాటుచేయ వలెను. ఏకవృక్షాధికముగా చెట్టు నాటుట మొదలైన యారంభము చేయవలెను. లేదా ఆయా దేవతా దిగ్విభాగముగా గృహ నిర్మాణము చెప్పబడుచున్నది. ఈశాన్య మూల దేవతా మందిరమము ఆగ్నేయ మూల వంటిల్లు, అక్కడనే అగ్నిహోత్రశాల, నైరృతి మూల భ్రమమును (నీటి తూము) వాయవ్య మూల సామాన్ల గది, ఆయుధశాలయు ఉత్తర దిశను కూపాదు లందలి యుదకము వాడకము ప్రశస్తము. ఇతర మూలల నీయీ పనులు నింద్యములు. ఇంటిపనిలో ప్రాత కలప క్రొత్తదానితో గలిపినది పనికిరాదు. సరిహద్దుల నున్న యిండ్ల గోడలతో తన ఇంటి గోడ కలిపి కట్టరాదు. సూర్య చంద్ర దేవతా విభాగములు దప్పించి యితర చోట్ల ద్వారములు పనికిరావు. అట్లుపై నిల్లు నెంచుట తగ్గించుటయు జేయరాదు. ఓకవేళ నది తప్పనిసరియైనచో నీశాన్యమున బ్రాహ్మణానుజ్ఞతో జేయవచ్చును. బ్రహ్మస్థానము నిత్యము శుచిగానుంచవలెను. ఆ స్థానమును నాగదంతాదులచే పీడింపరాదు. ఆయా దేవతాస్థాన సంధులను మర్మ స్థానములుగా నెరింగి వానిం నాగదంతాదుల పీడ గల్గింపరాదు. ఇంటికివాడే కలపకు కుండలతో తడిపిన చెట్లు, కోటరములతో నున్నవి (తొఱ్ఱలు గలవి) ఏనుగులు విరిచినవి, పిడుగుపాటున కూలినవి, దేవాయములలో బుట్టినవి, అగ్ని స్పర్శ తగిలినవి, శశ్మానమందు బుట్టినవి, చతుష్పథమందు (నాల్గుదారులు కలిసిన కేంద్ర స్థానమున) పుట్టినవి రోకవీక్షములు నిండ్లకు పనికిరావు. కలపగా వాడదలిచిన చెట్టునకు దాని పుట్టిన తావునకు నందు వసించు దేవతకు మహాపూజ గావించి తేనెను నేతిని పూసిన గొడ్డలితో దానిని నరకవలెను. అది ఈశాన్య దిక్కుగా పడుట మంచిది. మిగత దిక్కులంబడుట గర్హితము. మఱ్ఱి రావి నిర్గుండి కోవిదారము విభీతకము పుష్యకము శాల్మలి పలాశము నను వాని నింటి పనికి వాడరాదు. విస్తారము కంటె('వెడల్పు కంటె) రెండు రెట్లెక్కువ యెత్తులో గృహద్వారము కొలత యుండవలెను. ఆ గుమ్మము నిధిప్రథమకము నుయ్యి చెట్టు వీధులతో ద్వారము విద్దము గారాదు. అనగా వాని కెదురుగా ద్వారముండరాదు. ఇంటి యెత్తునకు రెట్టింపు దూరము భూమి వదిలి కట్టిన యెడల శూల దోషము తగులదు.

ఆధ్యాత్మం సకటం రామ ! తధా7మ్బుప్లవి యద్భవేత్‌ | ద్వారం న తత్ప్రశంసన్తి తస్మాత్తు పరివర్జయేత్‌ || 54

పురద్వారా7ధికం శ్రీదం భాగేషు చ తథా భ్రమమ్‌ | ధనదస్య తథా భాగై ర్ధనవేశ్మ విధీయతే || 55

ఇంద్ర సత్యేంద్ర సుగ్రీవ ద్వార మన్యత్ర కారయేత్‌ | స్తంభం తు నవథా కృత్వా పీఠే భాగం తు కారయేత్‌ || 56

భాగే కుంభ స్తథా కార్యోభాగే పద్మం నివేశ##యేత్‌ | స్తంభం భాగత్రయే కార్యమష్టాస్ర మథ వర్తులమ్‌ | 57

తస్యోపరి తథా భాగే భవత్యామల సారకమ్‌ | భాగదోషే తులా కార్యా భాగే కార్యా తథా తులా || 58

ఏకశాల చతుశ్శాలౌ కర్తవ్యౌ స్వేచ్ఛయా సదా | పూర్వోత్తరాభి శ్శాలాభిర్హీనం కార్వం ద్విశాలకమ్‌ || 59

అన్యథా గర్హితం రామ ! సుతా7ర్థ క్షయదం మతమ్‌ | అష్టహస్తోచ్ఛ్రయా దూర్థ్వం భూమికాం తు న కారయేత్‌ || 60

వాస్తూచ్ఛ్రాయం న కర్తవ్యం తథా హస్త శతాధికమ్‌ | ఆరంభం సశిలాన్యాసం ద్వార స్తంభోచ్ఛ్రయా వుభౌ || 61

తథా రోహణ నిష్పత్తీ తథా వాస్తు ప్రవేశనమ్‌ | సర్వాణ్యతాని కార్యాణి దివసే రామ! పూజితే || 62

శేషే ష్వేతేషు కర్తవ్యం దేవ బ్రాహ్మణ పూజనమ్‌ | కాలజ్ఞ పూజనం చైవ స్థపతీనాం చ భార్గవ || 63

ప్రావృట్కాలే న కర్తవ్యం వాస్తుకర్మ విజానతా | కృష్ణపక్ష త్రిభాగాన్తే శుక్లాద్యే చ భృగూత్తమ! || 64

తిధిం చతుర్థీం నవమీం వర్జయేచ్చ చతుర్దశీమ్‌ | అంగారక దినం రామ! కరణం విష్టిసంజ్ఞితమ్‌ || 65

దివ్యాన్తరిక్ష క్షితిజై రుత్పాతైర్భం చ పీడితమ్‌ | గ్రహోపస్పృష్టం చ తథా వ్యతీపాతహతం చ యత్‌ || 66

చంద్ర తారానుకూలే భే వాస్తుకార్యం విజానతా | ధ్రువాణి తాని శస్తాని శాక్రం వై నైరృతం తథా || 67

సౌమ్యం చ వైష్ణవం పుష్యం పౌష్ణం సావిత్ర మేవ చ | స్థిరలగ్నే స్థిరాంశే చ కర్తు శ్చోపచయాత్మకే || 68

యస్య సౌమ్య గ్రహాః కేంద్రే త్రికోణ చా7పి భార్గవ! | పాపా శ్చోపచయ స్థానే తస్మిన్‌ కార్యం ప్రవేశనమ్‌ || 69

కేంద్రస్థం వర్జయే త్పాపం సర్వయత్నేన కర్మసు | కేంద్రం సౌమ్యయుతం దేవం నతు సూన్యం కదాచన || 70

అతః పరం ప్రవక్ష్యామి శిలాన్యాస విధింతవ |

- శిలాన్యాసవిధిః -

చతుష్షష్టిపదం కృత్వా సమే స్థానే తు మండలమ్‌ || 71

కృత్వా తు దేవతాన్యాసం తత్ర మండలకే ద్విజః | శ్రియ స్సంపూజనం కృత్వా వాసుదేవస్య చా7ప్యథ|| 72

పూజనం మండలే కార్యం వాస్తుదేవ గణస్య చ | గంధా7ర్ఘ్య పుష్ప నైవేద్య ధూప దీపై ర్భృగూత్తుమ! || 73

తేషాం సంపూజనం కృత్వా సమాదాయ హుతాశనమ్‌ | ఓంకార పూర్వమాజ్యం తు జుహుయా చ్ఛ్రీధరస్య తు || 74

శ్రియః కృత్వా తతో హోమం బ్రహ్మణః కారయేత్తతః | బ్రహ్మాణం తు పురస్కృత్య వాస్తుదేవ గణస్య చ || 75

హోతవ్య మాజ్యం ధర్మజ్ఞ ! యస్య దేవస్య హూయతే | తత్కాల మాశు భజతే లక్షణ7గ్నౌ ద్విజోత్తమః || 76

తస్యదేవస్యయత్‌ స్థానం తత్ర శల్యం వినిర్దిశేత్‌ | శల్యస్యోద్ధరణం కార్యం రామ! యత్నేన జానతా || 77

మధ్యేశైల మయం కుంభం శంకుంచ స్థాపయే ద్బుధః | ఐశానే చ తతః కోణశిలాం పూర్వం ప్రతిష్ఠయేత్‌ || 78

ప్రదక్షిణం తతో రామ! శిలాన్యాసం విధీయతే | కుంభస్య చ శిలానాం చ తత స్నానం విధీయతే || 79

వటా7శ్వత్థ కషాయేణ సర్వౌషధి జలైస్తతః | తతో7నులేపనం కార్యం చందనేన సుగంధినా || 80

ఆచ్చాదనం తతః కార్యం వాసోభిః కుసుమై శ్శుభైః | ధూపం ప్రదీపం నైవేద్యం తేషాం రామః నివేదయేత్‌ || 81

దక్షిణాభి ర్ద్విజేంద్రాణాం తతః పూజా విధీయతే | కాలవిత్‌ స్థపతీ పూజ్యౌ తతోరామ! విజానతా! 82

తతో మంత్రం జపూ త్కర్తా కాలజ్ఞః స్థపతి స్స్వయమ్‌ | గృహపుష్టికర రామః మునివక్త్రా ద్వినిస్సృతమ్‌ || 83

నందే ! నందయ వాసిష్ఠే! వసుభిః ప్రజయా సహ | జయే! జయావహే! దేవి! ప్రజనాం జయ మావహ || 84

పూర్ణే7ంగిరస దాయాదే! పూర్ణకామం కురుష్వమామ్‌ | భ##ద్రే ! కశ్యప దాయాదే! కురు భద్రాం మతిం మమ || 85

సర్వబీ జసమాయుక్తే ! సర్వరత్నౌషథై ర్వృతే ! | రుచిరేః నందనే! నందే వాసిష్ఠే ! రమ్యతా మిహ || 86

ప్రజాపతిసుతేః దేవిః చతురగ్నేః మహీమయే ! | సుభ##గేః సువ్రతేః భ##ద్రే గృహే కాశ్యపి! రమ్యతామ్‌ || 87

పూజితే! పరమా7చార్యై ర్గంధ మాల్యై రలంకృతే | భవభూతి కరీ దేవి! గృహే భార్గవి ! రమ్యతామ్‌ || 88

అవ్యంగే! చాకృతే! పూర్ణే సునేత్ర్యంగిరస స్సుతే | ఇష్టకే! త్వం ప్రయచ్ఛేష్టం ప్రతిష్ఠాం కామయామ్యహమ్‌ || 89

దేశస్వామి పురస్వామి గృహస్వామి గృహే వస! మనుష్య ధన హస్త్యశ్య పశువృద్ధికరీ భవ! || 90

గృహప్రవేశే7పి తథా శిలాన్యాస సమోవిధిః | కర్తవ్యః సకలో రామ! శిలాన్యాస వివర్జితమ్‌ || 91

పూజితా7పర లక్ష్మీకం హుత్వా7గ్నిం చా7ప్యలంకృతమ్‌ | పంచరంగేణ సూత్రేణ బద్ధప్రతిసరం తథా || 92

సఫలేషు చ బాణషు దిశాసు విదిశాసు చ | గవాక్షకేషు కర్తవ్యా శ్చక్రా రక్షోహణా స్తథా || 93

సర్వస్వా7స్య తథా న్యాసం మంత్రైరక్షోహణౖ ర్భవేత్‌ | గోపృష్ఠ విన్యస్తకరః ప్రవిశేచ్చ గృహీ గృహమ్‌ || 94

స్వనులిప్త స్సుఖీస్రగ్వీ సపత్నీక స్తథైవ చ |

ద్విజపుణ్యాహ ఘోషేణ వీణావేణు రవేణ చ || వందినాం చ నినాదేన పటహానాం స్వనేన చ || 95

కాలే శుభే కాలవిదా ప్రదిష్టే | సతోరణం పూర్ణ ఘటా7భిరామమ్‌ |

ప్రవిశ్య కాలజ్ఞ సమర్చితానాం | కృత్వా7ర్చనం తత్రుసురోత్తమానామ్‌ || 96

సంపూజ్య వహ్నిం ద్విజపుంగవాంశ్చ | మాంగల్య మాలభ్య చ భోజయిత్వా |

విప్రాన్‌ మధుక్షీర ఘృతోత్కటాన్నైః స దక్షిణాం స్తాంశ్చ తథా విసర్జ్య || 97

సప్తాహమగ్నిం పరిచర్య తత్ర సంపూజ్య విప్రాన్‌ విధివచ్చ రామ !

గృహే వసేత్‌ పూజిత దేవ విప్రే శుచౌ సదా సర్వగుణోపపన్నే || 98

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే - ద్వితీయఖండే - వాస్తువిద్యావర్ణనం నామ ఏకోనత్రింశత్తమో7ధ్యాయః.

సర్పహంస సారస పక్షులచే చిత్రింపబడినది గావలెను. చతుష్పథము దేవాలయము శూల పనికిరాదు. సింహద్వారము శబ్డించునది కట సహితమైనది నీటిలో తేలునది ప్రశస్తముగాదు. కుబేర భాగములందు ధనాగారము పురద్వారముకంటె పెద్దదిగా నుండవలెను. నీటి తూము గల్గియుండవలెను. అట్టి ధనాగారము శ్రీకరము. ఇంద్ర సత్య ఇంద్ర సుగ్రీవ దేవతా ద్వారముల నితర స్థానములందు నేర్పరచవలెను. గృహస్తంభములో దొమ్మిదవ భాగము కొలతలో స్తంభ పీఠముకొలత యుండవలెను. ఆ స్తంభము యొక్క యొక భాగమందు కుంభము (కడవ) ఒక భాగము నందు పద్మమును చెక్కింపవలెను. స్తంభము యొక్క మూడవభాగమందు ఎనిమిది పెడలుగాగాని వర్తులములుగాగాని గావింపవలెను. దాని మీది భాగమందు గంధపుపీట ఆమలసారకము భాగదోషమందు భాగమందు తక్కెడయు చెక్కించవలెను. ఆ గృహమేకశాలము చతుశ్వాలముగ (మండువా లోగిలి) నిష్టమువచ్చినట్లు కట్టుకొనవచ్చును. మండువా లోగిలిలో తూర్పు ఉత్తరముగా నున్న శాలలకంటె దక్షిణము పడమర శాలలు తక్కువ కొలతలో నుండవలెను. ఇంకొకలాగున్న నది నింద్యము, పుత్ర ధన క్షయము సేయును. ఎనిమిది హస్తముల మించి పై యంతస్తు కప్పు యుండరాదు. ఇంటి యెత్తు నూరు మూరలకంటె మించరాదు. గృహారంభము శిలాన్యాసము (కడపరాయి వేయుట) ద్వారము స్తంభము నెత్తుట రోహణము నిష్పత్తియు పరిసమాప్తి గృహప్రవేశము నను నీ పనులు శుభదివసము చూచి చేయవలెను. ఇవి జరుగుముందు దేవ బ్రాహ్మణ దైవజ్ఞ స్థపతుల పూజ గావింపవలెను. వర్షర్తువులో నింటిపని చేయరాదు. కృష్ణపక్షము దశమి దాటిన తరువాత (మూడవభాగమందు) శుక్లపక్షము మొదలు పంచమిదాక గృహనిర్మాణ మారంభింపరాదు. చతుర్థి నవమి మంగళవారము విష్టియనుకరణము గృహారంభమునకు నిషిద్ధములు. దివ్య-అంతరిక్ష-భౌమోత్పాతములచే నక్షత్రము పీడింపబడినపుడు గ్రహస్పర్శ నొందినను బలము అనుకూలము లైనపుడు వాస్తు కార్యక్రమము సేయవలె. ధ్రువనక్షత్రములు ఇంద్ర దేవతాకము (జ్యేష్ఠ) నిరృతి దేవతాకము విశాఖ సౌమ్యము సోమదేవతాకము (మృగశిర) విష్ణుదేవతాకము (పుష్యమి) పౌష్ణమి ( రేవతి) సవితృదేవతాకము సావిత్రము (హస్త) నక్షత్రములు శ్రేష్ఠములు. స్థిరలగ్న స్థిరాంశము లందు కర్త యొక్క ఉపచయస్థాన మందు సౌమ్య గ్రహములు కేంద్ర త్రికోణము లందున్న పాపగ్రహము లుపచయ స్థానమునందు నున్నప్పుడు గృహప్రవేశము సేయవలెను. కేంద్రమందు పాపగ్రహమున్నచో నది తప్పక విడిచిపెట్ట వలెను. కేంద్రమందు సౌమ్యగ్రహముండి తీరవలెను. అది శూన్యము మాత్రము గాగూడదు. ఇటుపై శిలాన్యాసవిధి దెలిపెద.

-శిలాన్యాస విధి-

సమప్రదేశమం దరువది పదముల మండలము నేర్పరచి యందు దేవతాన్యాసము సేసి లక్ష్మీ పూజ వాసుదేవ పూజ గావించి మండల మందు వాస్తుదేవతాగణ పూజ సేసి గంధార్ఘ్య పుష్ప థూప దీప నైవేద్యాదులు గావించి యగ్ని ప్రతిష్ఠ సేసి ఓంకార పూర్వకముగా విష్ణుమంత్ర పూర్వకముగా విష్ణుదేవతా హోమము సేయవలెను. ఆమీద శ్రీదేవికి బ్రహ్మకు హోమము గావించి బ్రహ్మపురస్కృతముగా వాస్తుదేవగణము నెంచి ఆజ్యహోమము గావింపవలెను. ఏ దేవత నుద్దేశించి హోమము సేయుచుండునో యప్పుడగ్నియందు వికృతలక్షణములు గనిపించెనేని యా దేవతాభాగమందా యింట శల్యములున్నవని తెలిసికొని వానిని తీసివేయవలెను. ఆమండపమధ్యమందు శిలామయమయిన కుంభము స్థాపింపవలెను. ఈశాన్య కోణమున శిలను ప్రతిష్ఠింప వలెను. ఆమీద ప్రదక్షిణ క్రమముగా రాళ్లు పరువ వలెను. ఆమీద నా కుంభమునకు న్యాసము సేసిన రాళ్ళకు స్నానము గావింపవలెను. మఱ్ఱిరావి కషాయములతో సర్వౌషధీజలములతో ప్రోక్షణము మంచి గంధముతో పూతయు పెట్టవలెను. నూతన వస్త్రములను పైన కప్పవలెను. పువ్వులు వేయవలెను. ద్విజులకు దక్షిణ లిచ్చి పూజసేయవలెను. కాలజ్ఞుని స్థపతి (శిల్పి) పూజింపవలెను. అటుపై యజమాని దైవజ్ఞుడు స్థపతియు ముని ముఖమున వచ్చిన గృహపుష్టిని జేకూర్చు మంత్రమును పఠింపవలెను.

నందా! వాసిష్ఠే వశిష్ఠమహర్షిచే రూపొందింపబడిన ఓ గృహలక్ష్మీ! వాస్తుదేవతా ధనముతో సంతానముతో ప్రజలకు జయము గూర్పుము. ఓజయాదేవి! జయమునుగూర్చుదానా! ఓ అంగిరసదాయాదా! (అంగిరస వంశమందు బుట్టినదానా!) నన్ను పూర్ణకాముం గావింపుము భద్రా! మంగళస్వరూపిణి! మంగళకరి! కర్యపవంశీయులా! నాకు భద్రమైన (మంగళకరమైన) బుద్ధినిమ్ము. సర్వబీజయుక్తా! సర్వరత్నౌషధులతోగూడినదానా! రుచిరా (సుందరీ!) నందనా ఆనందపెట్టుదానా! నందా! ఆనందించు దానా! వశిష్ఠా! ఈగృహమందు క్రీడింపుము. పరమాచార్య పూజితా! గంధమాల్యాలంకృతా! శాంభవ విభూతులను (అణిమాద్యష్టైశ్వర్యములను) చేకూర్చు దేవీ! భార్గవి భృగుకన్యా! మహాలక్ష్మీ! ఈయింట విహరింపుము. అవ్యంగా! ఏయంగలోపములేనిదానా! పూర్ణురాలా! సునేత్రి మంచినాయకుడుగలదానా! అంగీరసకుమారీ! ఓఇష్టకారూపిణీ నాయభీష్టమునిమ్ము. నేను ప్రతిష్టనుకోరుచున్నాను. దేశ ప్రభువు పట్టణాభివృద్ధి గృహ యజమానుల గృహమందు వసింపుము! గజాశ్వపశు సమృద్ధినిమ్ము ఈ శిలాన్యాస (శంకుస్థాపన) విధానమును గృహప్రవేశసమయమందుగూడ జరుపవలెను. ఇందుశిలాన్యాసము మాత్రమవసరములేదు. లక్ష్మీపూజయయిన తరువాత అలంకృతాగ్నియందు హోమముసేసి పంచవన్నెల సూత్రముతో తోరము చేతికి కట్టుకొని ములుకులతోడి బాణములందు దిక్కులందు మూలలందు గవాక్షములందు (కిటికీలందు) రక్షోహరమయిన చక్రముల నేర్పరుపవలెను. ఈ చక్రన్యాసము రక్షోఘ్నములైన మంత్రములచేతనే జరుపవలెను. గోవృష్ఠమునందు హస్తముంచి గృహయజమాని గృహప్రవేశము సేయవలెను. మరియు జక్కగా ధర్మపత్నితో గంధము పూసికొని సుఖముగా పూలమాలలుదాల్చి ద్విజులు పుణ్యహవాచనము సేయ, వీణావేణు నాదములు మ్రోయ వందిమాగధులు స్తుతింప పటహాదులధ్వనులతోదైవజ్ఞునిచే చెప్పబడిన శుభముహూర్తమందు తోరణాలంకృతము పూర్ణకుంభాభిరామము నైనగృహము ప్రవేశించి జ్యౌతిషికుడంతన్నర్చించిన దేవతలకు తానును బూజగావించి యగ్నిని వేల్చి ద్విజవరులను బూజించి మంగళ పదార్థాలంభనము గావించి బ్రహ్మణులకు తేనే పాలు నేతులతో మృష్ఠాన్న భోజనములు పెట్టి దక్షిణలిచ్చి వారింబంపి సప్తాహమగ్ని పరిచర్యసేసి విప్రుల యధావిధి బూజించి గృహయజమాని ద్విజదేవతా పూజలు జరిపిన యా గృహమందు సర్వగుణ సంపన్నమయిన దానియందు నిత్యము నివసించవలెను.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమున వాస్తువిద్యావర్ణనమను నిరువది తొమ్మిదవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters