Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఇరువదియెనిమిదవ యధ్యాయము -రాజరక్షావిధానము

రామః- రాజరక్షా రహస్యాని యాని దుర్గే నిధాపయేత్‌| కారయేద్వా మహీభర్తా కథయ స్వా7శు తాని మే|| 1

పుష్కరః- శిరిషోదుంబర శమీ బీజపూరం ఘృత ప్లుతమ్‌| క్షుద్యోగః కథితో రామ! మాసార్ధస్య పురాతనైః|| 2

కశేరూత్పల మూలాని ఇక్షుమూలం తథా విమమ్‌|| 3

దూర్వాక్షీర ఘృతై ర్మండః సిద్ధో7యం మాసికః పరమ్‌| శూలప్రోతం నరం ప్రాప్య తస్యా స్థ్నామరణీ భ##వేత్‌|| 4

కల్మాష వీణునా తత్ర జనయేద్వా విభావసుమ్‌|

గృహే త్రిరపసవ్యం తత్క్రియతే యత్ర భార్గవ ! | నా7న్యోగ్నిర్జ్వలతే తత్ర నా7త్ర కార్యా విచారణా || 5

కార్పాసా7స్థి భుజంగంస్య తథా నిర్మోచనం పరమ్‌ | సర్ప నిర్వాసనే ధూపః ప్రశస్త స్సతతం గృహే ||6

సాంద్రసత్త్వా చ వయసా విద్యుద్దగ్ధా చ మృత్తికా | తయా7నులిప్తం యద్వేశ్మ నాగ్నినా దహ్యతే ద్విజః|| 7

పరుశురాముడు రాజదుర్గమందు రాజరక్షా విధాన రహస్యముల వేనినేని సమకూర్చుకొనవలెనో అందులకేమి చేయవలెనో వేగచింపుమన పుష్కరండిట్లనియె. దిరిశెన మేడి జమ్మి మాధీఫలము నేతిలో నానవేసినది క్షుద్యోగము (ఆకలికి మంచి మందు) పదునేనిరోజులదాక ఆకలిగలుగనీయదు. కశేరు కలువదుంపలు చెఱకు మొదలు విమము (విషము) కలిపి గరికపాలు నేయితో గావిన మండము శేవించిన నెలరోజుల వరకు ఆకలియుండదు. ఇది సిద్ధౌషధము శూలముపై గ్రుచ్చిన వాని యెముక చేతిలో పట్టుకున్న యడల మరణము కలుగును. కల్మాషువేణువుచే నింటనగ్నిని ప్రత్వలింజేసి అపసవ్యముగా మూడు మారులు ద్రిప్పిన నా యింట నింకొక నిప్పుమండదు. సర్పముల పారదోలుటకు ఎప్పుడు నింటదూది ఎముక పాముకుబుసము ధూపము వేయుట చాలా మంచిది. పాటి మట్టితో గట్టినది. విద్యుద్దగ్దము (పిడుగుపడి కాలిన ) మట్టితో పూతపెట్టబడిన యిల్లు నిప్పునగాలదు.

దివా చ దుర్గే రక్షో7గ్ని ర్వాతి వాతే విశేషతః | విషాచ్చ రక్ష్యో నృపతి స్తత్ర యుక్తిం నిబోధ మే || 8

క్రీడా నిమిత్తం నృపతే ర్ధార్యాః స్యుర్మృగ పక్షిణః| అన్నం చ ప్రాక్‌ పరీక్షేత వహ్నావథ నరేషు చ || 9

వస్త్రం పత్ర మలంకార భోజనా7చ్ఛాదనే తథా| నా7పరీక్షిత పూర్వం తు స్పృశేదపి మహీపతిః|| 10

శ్యావాస్య వక్త్రః సంతప్తః సోద్వేగం చ పరీక్షతే | వితుదేన విషం దత్తం యత్ర తత్ర నిరీక్షతే|| 11

స్రస్తోత్తరీయో విమనాః స్తంభ కుడ్యాదిభి స్తథా | ప్రచ్ఛాదయతి చాత్మానం ఖిద్యతే లజ్జతే తథా || 12

భువం విలిఖతే గ్రీవాం తథా చాలయతే ద్విజ| కండూయతి చ మూర్ఖానం పరిలే ఢ్యధరం తథా ||13

క్రియాను త్వరతే రామ! విపరీతా స్వపి ధ్రువమ్‌ | ఏవ మాదీని చిహ్నాని విషదస్య పరీక్షయేత్‌|| 14

రాజదుర్గమందు పగలుగూడ వాయువు వీచుచుండ నగ్నిని గాపాడుకొనవలెను. విషము నుండి కూడ రాజును రక్షంపవలెను. అందుపయోగించు యుక్తి నెరింగింతును. రాజు వినోదము కొరకు కొన్ని మృగములను పక్షులను కోటలో పెంచవలసి యుండును. రాజు తిను నన్నమునుగూడ ముందుగా నగ్ని మూలమున మనుష్యుల మూలమున బరీక్షింప వలయును. రాజు దాల్చు వస్త్రము వాడుకొను పత్రము కాగితము లేక ఆకు ఆభరణము భోజనము పైగప్పుకొను వస్త్రము మొదలయినవి ముందుగా బరీక్షింపకుండ మహీపతి తాకకూడదు.

విషము పెట్టినవాని లక్షణములు:- ముఖము వెల వెల బోవును. పరితాప పడును. ఆందోళనతో జూచును. ఉత్తరీయము జారిపోవుచుండును. మనస్సు వ్యాకులపడును. స్తంభము గోడ చాటునకు బోవుచుండును. ఖిన్నుడగును. సిగ్గుపడుచుండును కాలితో నేల రాయును. మెడ యట్టిట్టు త్రిప్పును. తల బరికి కొనను పెదవులు నాకును. తలక్రిందులు చేష్టలు చేయుచు తొందరపాటు సెందును. ఇవి విషము పెట్టిన వాని గుర్తులు. వీనిని బరీక్షింపవలెను.

తతో విచారయే దగ్నౌ తదన్నం త్వరయా7న్వితః | ఇంద్రాయుధ సవర్తస్ణు వృక్ష స్ఫోట సమన్వితః || 15

ఏకా7వర్తో7థ దుర్గన్థీ భృశం చటచటాయతే | తద్ధూమ సేవనా జ్జంతో శిరో రోగశ్చ జాయతే || 16

సవిషే7న్నే నిలీయంతే న చ భార్గవ! మక్షికాః | నిలీనాశ్చ విపద్యంతే దృష్టే చ సవిషే తథా|| 17

విరజ్యతి చకోరస్య దృష్టి ర్భార్గవసత్తమ! | వికృతిం చ స్వరో యాతి కోకిలస్య తథా ద్విజః|| 18

గతిః స్ఖలతి హంసస్య భృంగరాజశ్చ కూజతి | క్రౌంచో మద మథా7భ్యేతి కృతవాకు ర్విరౌతి చ || 19

విక్రోశతి చకోరశ్చ శారికా వాశ##తే తథా | చామీకరో7న్యతో యాతి మ్భత్యుం కారండవ స్తథా || 20

మేహతే వానరో రామ గ్లాయతే జీవ జీవకః | హృష్టరోమా భ##వేద్బభ్రుః పృష్టతశ్చైవ రోదితి|| 21

హర్ష మాయాతి చ శిఖీ సవిషే దర్శనే ద్విజ! | అన్నంచ సవిషం రామ! చిరేణ చ విపచ్యతే || 22

తథా భవిత్యతి స్రావం పక్వం పర్యుషితోపమమ్‌ | వ్యాపన్న రస గంధం చ చంద్రికాభి స్తథా యుతమ్‌ || 23

వ్యంజనానాం చ శుష్కత్వం, ద్రవాణాం బుద్బుదోద్భవః | ససైంధవానాం ద్రవ్యాణాం జాయతే ఫేనమాలికా || 24

రసస్య రాజీ నీలాస్యా త్తామ్రా చ పయస స్తథా | కోకిలా77 భా చ సధ్యస్య తోయస్య చ భృగూత్తమ! || 25

ధ్యాన్యా7వ్లుస్య తథా కృష్ణా కపిలా కోద్రవస్య చ | మధుశ్యావా చ తక్రస్య నీలా పీతా తథైవ చ || 26

ఘృతస్యోదక సంకాశా కపోతా7భాచ మస్తునః | హరితా సాక్షికస్యా7పి తైలస్య చ తథా7రుణా || 27

ఫలానా మప్యపక్వానాం పాకః క్షిప్రం ప్రజాయతే | ప్రకోపశ్చైవ పక్వానాం మల్యానాం వ్లూనతా తథా || 28

మృదుతా కఠినానాంస్యా న్మృదూనాం చ విపర్యయుః | సూక్ష్మతంతూపసదనం తథా చైవాతి రోమతా || 29

శ్యామ మండలతా చైవ వస్త్రాణా మవిశేషతః | లోహనాం చ మణీనాం చ మలపంకోపదిగ్ధతా || 30

అనులేపన గంధానాం స్నానానాం చ భృగూత్తమ! | విగంధతా చ విజ్ఞేయా పర్ణానాం వ్లూనతా తథా || 31

పీతా నీలా సితా జ్ఞేయా తథా రామా7ంజనస్య చ | దంతకాష్ఠ త్వచః శాంతా స్తంతు సత్వం తథైవ చ || 32

ఏవ మాదీని చిహ్నాని విజ్ఞేయాని భృగూత్తమ! తస్మా ద్రాజా సదా తిష్టే న్మణి మంత్రౌషధీ గణౖః || 33

అపై#్త స్సంరక్షితో రామ! ప్రమాద పరివర్జకైః || 34

ప్రజాతరో ర్మూల మిహా7వనీశస్త ద్రక్షణా ద్వృత్తి ముపైతి రాష్ట్రమ్‌ |

తస్మా త్ప్రయత్నేన నృపస్య రక్షా సర్వేణ కార్యా భృగువంశచంద్ర! || 35

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే- ద్వితీయఖండే- రాజరక్షా వర్ణనంనామ అష్టావింశతి తమో7ధ్యాయః.

అమీద తనకు బెట్టిన యన్నమును నిప్పులో బరీక్షింపవలెను. అగ్నిలో విసాన్న మింద్రధనస్సు రంగుల నుండును. చిటపట లాడును. ఒక్కమారు సుడి దిరుగును. చెడు కంపు గొట్టును. మిక్కిలి ఛట ఛట లాడును. అప్పుడా నిప్పులో వెడలిన పొగ వల్ల జీవులకు దలనొప్పి తల తిరుగుట మున్నగు శిరోరోగములు వచ్చును. విషాన్నము మీద నీగలు వ్రాలవు. వ్రాలిన చచ్చును. విషా7న్నమును చూచిన చకోరపక్షి కండ్లెరుపెక్కును. కోకిల యొక్క స్వరము మారును. హంస నడక తొట్రుపాటొందును. తుమ్మెద కూత పెట్టును క్రౌంచ పక్షి (బెగ్గురు) మత్తు గొనును. కోడి వెర్రిగా కూయును. చకోరపక్షి యార్చును. గోరువంక తెగ గూత లిడును. చామీకర మను పక్షి వేరొక చోటి కెగిరి పోవును. చక్రవాకము మరణించును. వానరము మూత్రించును. జీవజీవకము (చకోరము) వాడువారును. బభ్రువు (కపిలగోవు) గగుర్పాటు సెందును. పృషతము ఏడ్చును. నెమలి హర్షించును. విషాన్నము చాల సేపటికి గాని యుడుకదు. నీళ్లుగారి పోవును. ఉడికినను (పర్యుషితమట్లు) పాచిపోవును. రుచి వాసనయుంజెడును. చంద్రికలతో గూడి యుండును. తీగలు సాగును. వ్యంజనములు కూరలు పచ్చడులు తడియారి పోవును. ద్రవదార్ధములు బుడగలు దేరును. ఉప్పు గలిసిప వస్తువులు నురుగు దేరును. రసముపై నలుపు పాలపై నెరుపు గనిపించును. జలమునకు కోకిల రంగు (నలుపు) వచ్చును.

ధాన్యావ్లుము నలుపు దేరును. వాకోద్రవము కపిల వర్ణ మందును. తేనె నీరగును. తక్రములు నీల పీత వర్ణము లగును. నేయి నీరగును. మనువునకు పావురము రంగు వచ్చును. సాక్షికము హరితమగును. నూనె యరుణ వర్ణమగును. పరువుకు రాని పండ్లు వెంటనే పండును. పండిన పండ్లు కుళ్ళి పోవును. పూలమాలలు వాడిపోవును. గట్టి వస్తువులు మెత్తపడును. మృదు వస్తువులు గట్టిపడును. వస్త్రములందు సూక్ష్మతంతూపసదనము అతిరోమత్వము నల్లమచ్చలు కలుగును. లోహములు మణులు మట్టి గొట్టుకొని మాసిపోవును. స్నానములందు పూసికొను గంధములు దుర్వాసన గొట్టును. ఆకులు వాడిపోవును. స్త్రీలు పెట్టుకొను కాటుక పసుపు రంగు తెలుపును బడయును. పలుదోము పుల్లలపై పట్టు ఊడిపోవును. తీగలు సాగును. విషస్పర్శ వలన ఏలాటి వెన్నో గుర్తులు తెలియనగును. అందుచే రాజెల్లతరి మణి మంత్రౌషధులతో గూడి సిద్ధముగా నండవలెను. ప్రమాద పడని (పొరబడని) అప్తులచే (అప్తుడు- యధార్థము చెప్పువాడు) సురక్షితుడై యుండవలెను. ప్రజలను వృక్షమునకు మూలము రాజు. అతని సురక్షితునిగా జేసికొన్నయెడలనే రాష్ట్రము (రాజ్యము) వృత్తిని (బ్రతుకు తెరువును) బడయును. ఓ భృగువంశచంద్ర! రాజా అందుచే రాజు యొక్క రక్షణ యెల్లరు గావింపవలసి యున్నది.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున రాజరక్షా వర్ణనమను నిరువది యెనిమిదవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters