Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఇరువదిమూడవ యధ్యాయము -తీర్థఫలవర్ణనము

పుష్కరః- మంత్రాయే కీర్తితా రామ! మయా7స్మిం స్తవ భార్గవ! | తేషాం సంకీర్తనం ధన్యం సర్వపాప ప్రణాశనమ్‌||1

ఏతేషాం కల్య ముత్థాయ యః కుర్యా త్కీర్తనం నరః | సర్వపాప వినిర్ముక్తః స్వర్గలోక మవాప్నుయాత్‌ || 2

తిర్యగ్యోనిం న గచ్ఛేత్తు నరకం సంకరాణి చ | నచ దుఃఖం న చ భయం మరణం న చ ముహ్యతి || 3

ఏతేషాం చ నమస్కారః యః కుర్యా త్ప్రయతో నరః | న తస్య తిష్ఠతే పాప మబ్బిందు రివ పుష్కరే || 4

ఏతేషాం తర్పణం కృత్వా స్నాతః ప్రయతమానసః |మహాపాతకయుక్తో7పి త్వచే వాహి ర్విముచ్యతే || 5

ఏతేషాం పుష్పదానేన మహతీం శ్రియ మశ్నుతే | ఏతేషాం చార్ఘ్యదానేన పూజ్యో భవతి మానవః || 6

ఏతేషాం దీపదానేన భ్రాజన్తే చంద్రవద్దిని| ఏతేషాం మాహుతిం దత్వా కామా నాప్నోతి పుష్కలాన్‌ ||7

నైవేద్యం చ బలిం దత్వా భోగాన్‌ ప్రాప్నో తన్యుత్తమాన్‌| ఏతా నుద్దిశ్య విప్రేషు దత్వా భార్గవ! భోజనమ్‌|| 8

సంతర్ప్య దక్షిణాభిశ్చ త్రిదివం ప్రాప్నుయా చ్చిరమ్‌ అభిషేకదినే రాజ్ఞాం పుష్పస్నానే తథైవ చ || 9

తథా సంవత్సర గ్రంధౌ సర్వే పూజ్యా హితైషిణా| యాని తీర్థాని చోక్తాని సరితశ్చ సమాసతః || 10

తేషాం గమేన పూజన్తే యే7పి పాతకినోజనాః | స్నానం మహాఫలం తేషాం తప శ్శ్రాద్ధ క్రియా స్తథా || 11

దానం బహుఫలం ప్రోక్తం దర్శనం పాపనాశనమ్‌ | కీర్తనం భార్గవ శ్రేష్ఠ! న మే చాస్తి విచారణా || 12

తీర్థే ష్వథైతేషు భృగుప్రధాన! స్నాతా నరా యాన్తి నరేంద్ర! సద్యః|

తీర్థాని గమ్యాని తతః ప్రయత్నాత్‌ | పుణ్యాశ్చ సర్వా స్సరితశ్చ రామః || 13

ఇది శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే - తీర్థఫల వర్ణనం నామ త్రయోవింశతితమో7ధ్యాయః.

పుష్కరుండనియె: భార్గవ! ఏవింత దనుక గీర్తించిన యీ మంత్రముల సంకీర్తనము ధన్యము. సర్వపాపహరము. ఉషఃకాలమున లేవగానే వీనిం గీర్తించిన యతడు పశుపక్ష్యాది జన్మమందడు. నరకమును సాంకర్యము నందడు. వానికి దుఃఖము భయము మరణము మూర్ఛయు గలుగదు. ఈ తీర్థముల కెవడు నమస్కారము సేయునో తామరాకున నీటి బొట్టంటనట్లు వానిం బాపమంటదు. ఈ తీర్థములందు స్నానము సేసి తర్పణము సేయు నాతడు పాము కుబుస మట్లు పాపమును వీడును. వీనియందు పుష్పదానము సేసిన మహైశ్వర్యము నందును. ఇందర్ఘ్యదానము చేసిన సర్వపూజ్యుడగును. వీనికి దీపదానము చేసిన దివంబున చంద్రుడట్లు దీపించును. ఈ తీర్థముల నెంచి యాహుతులిచ్చిన పుష్కర కామము లందును. వీనియందు బలి నిచ్చిన నుత్తమ భోగము లందును. ఈ తీర్థముల నుద్దేశించి విప్రులకు భోజనము పెట్టి దక్షిణలతో తృప్తిగావించిన చిరకాల స్వర్గసుఖ మందును. రాజుల పట్టాభిషేకమందు పుష్పస్నానమందు సంవత్సర గ్రంధి యందు (పాత సంవత్సరము గడచి క్రొత్త సంవత్సరము వచ్చు నడుమ) నీతీర్థములెల్ల పూజనీయములు. ఈతీర్థముల కేగినవారు పాపులైనను బూజనీయు లగుదురు. స్నానము మహాఫలము. అట శ్రాద్ధము పెట్టుట దానముచేయుట బహుఫలము. దర్శనము సంకీర్తనము గూడ పాపహరము. శుభకరము. ఇందుకు సందియము లేదు. ఓభృగువంశముఖ్య! ఈ తీర్థములందు స్నానముసేసినవారు సద్యఃఫలముం బొందుదురు. ఇవి పుణ్యసరిత్తులు సేవింపవలసినవి.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున తీర్థఫల వర్ణనమను

నిరువది మూడవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters