Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఇరువది ఒకటవ యధ్యాయము - రాజ్యభిషేకవిధి

పుష్కరః - స్నానం సమాచరే ద్రాజ్ఞో హోమకాలే పురోహితః | ఆదౌతు స్వేచ్ఛయా స్నాతః పున ర్మృద్భి స్సమాచరేత్‌ || 1

పర్వతాగ్ర మృదా తావ న్మూర్ధానం శోధయే న్నృపః | వల్మీకాగ్ర మృదా కర్ణౌ చందనైః కేశవా7లకాన్‌|| 2

చంద్రాలయ మృదా గ్రీవాం హృదయం తు నృపాజిరాత్‌ | కరిదంతోద్ధృతమృదా దక్షిణం తు తథా భుజమ్‌ || 3

వృషశృంగోద్ధృత మృదా వామం చైవ తథా భుజమ్‌ | 4

సరో మృదా తథా పృష్ఠం చోదరం సాంగమే మృదా | నదీకూల ద్వయ మృదా పార్శ్వే సంశోధయే త్తథా || 5

అశ్వస్థానా త్తథా జంఘే రాజా సంశోధయే ద్భుధః | రథ చక్రోద్ధృత మృదా తథైవ చ కరద్వయమ్‌ || 6

మృత్స్నాతః స్నపనీయ స్స్యాత్‌ పంచగవ్య జలేన తు | తతో భద్రాసన గతం ముఖ్యా7మాత్య చతుష్టయమ్‌ || 7

వర్ణ ప్రధానం భూపాల మభిషించే ద్యథావిధి | పూర్వతో హేమకుంభేన ఘృతపూర్ణేన బ్రహ్మణః || 8

రూప్యకుంభేన యామ్యేన క్షీర పూర్ణేన క్షత్రియః | దధ్నా చ తామ్రకుంభేన వైశ్యః పశ్చిమతో ద్విజ ! 9

మాహేయేన జలే నోదక్‌ శూద్రామాత్యో7 భిషేచయేత్‌ | తతో7భిషేకం నృపతేః బహ్వృచప్రవరో ద్విజః || 10

కుర్వీత మధునా రామ! ఛందోగశ్చ కుశోదకైః | సంపాతవంతం కలశం తథా నుత్వా పురోహితః || 11

విధాయ వహ్నిరక్షాం తు సదస్యేషు యథావిధి | రాజసూయా7భిషేకే తు యే మంత్రాః పరికీర్తితాః || 12

తైస్తు దద్యా న్మహాభాగ! బ్రాహ్మణానాం స్వనేన తు | తతః పురోహితో గచ్ఛే ద్వేదిమూలం తదైవ తు || 13

విభూషితం తు రాజానం సర్వతోభద్ర ఆసనే | శతఛిద్రేణ పాత్రేణ సౌవర్ణేన యథావిధి || 14

అభిషించతి ధర్మజ్ఞ ! యజుర్వేద విశారదః | యా ఓషధీ రోషధీభిః సర్వాభి స్సుసమాహితః || 15

రథే అక్షేతి గంధైశ్చ ఆబ్రహ్మన్‌ బ్రహ్మణతి చ | బీజైః పుషై#్ప తథా చైనం రామ| పుష్పవతీతి చ|| 16

తేనైవ చాభి మంత్రేణ ఫలైస్త మభిషేచయేత్‌ | ఆశుశ్శిశాన ఇత్యేవ సర్వరత్నైశ్చ భార్గవ! || 17

యే దేవాః వుర స్సదేతి కుశాభిః పరమార్జయేత్‌ | ఋగ్వేద క్రతుతో రాజ్ఞే రోచనాయా యథావిధి || 18

మూర్ధానం చ తథా కంఠే, గంధద్వారేతి సంస్పృశేత్‌ | తతో బ్రాహ్మణ ముఖ్యాశ్చ క్షత్రియాశ్చ విశ స్తధా || 19

శూద్రాశ్చ వారముఖ్యాశ్చ నానాతీర్థసముద్భవైః | నాదేయైః స్సారసైః కౌపై ర్నానా కలశ సంస్థితైః || 20

చతుస్సాగరజై ర్లాభా దలాభా ద్ద్విజ కల్పితైః | గంగా యమునయోశ్చైవ నిర్ఘరైశ్చ తథోద్భిజైః || 21

పుష్కరుడనియె. హోమ సమయమున (హోమాంగముగ) పురోహితుడు రాజును స్నానము సేయింపవలెను. ప్రథమమున రాజు మామూలుగా స్నానము సేసిన తరువాత తిరిగి పర్వతాగ్ర మృత్తికతో శిరస్సును, పుట్టమన్నుతో చెవులు, చందనముతో జుట్టును, చంద్రాలయ మృత్తుచే మెడను రాజగృహము వాకిటి మన్నుచే హృదయమును, ఏనుగుదంతముతో ద్రవ్వితెచ్చిన మట్టితో కుడి భుజమును, ఎద్దు కొమ్ముతో కోరాడిన మన్నుతో, నెడమ భుజమును, సరస్సు మృత్తుతో వీపును, నదీసంగమ స్థాన మృత్తుచే నుదరమును, నది రెండొడ్డుల మన్నుచే రెండు పార్శ్వములను, దోముకొనవలెను. అశ్వస్థానమందలి మట్టిచే పిక్కలను, రథచక్రపు మృత్తుతో రెండు హస్తములును, దోముకొనవలెను. మృత్తికాస్నాతుడైన వానిని పంచగవ్యములతో స్నానము సేయింపవలెను. అటుపై భద్రాసనమందు గూర్చున్నవానిని ముఖ్యమంత్రులు నలుగురును, వర్ణక్రమముగా నభిషేకింపవలెను. తూర్పున నున్న ఘృతపూర్ణ హేమకుంభముతో బ్రాహ్మణమంత్రియు, దక్షిణమున నున్న క్షీరపూర్ణ రజతకుంభముతో క్షత్రియ మంత్రియు, పడమట నున్న దధిపూర్ణ తామ్రకుంభముతో వైశ్యమంత్రియు, ఉత్తరమున నున్న జలపూర్ణ మృత్కుంభముతో శూద్రమంత్రియు, రాజు నభిషేకింపవలెను. ఆ మీద ఋగ్వేది ప్రవరుడైన ద్విజుడు తేనెతో, ఛందోగశాఖీయుడు కుశోదకములతో, రాజున కభిషేకము చేయవలెను. సంపాతవంతమయిన కలశమును నుతించి యా మీద పురోహితుడు రాజున కీయవలెను. వహ్నిరక్షణము గావించి యథావిధిగ సదస్యుల సమక్షమున రాజసూయాభిషేకమం దేమంత్రుములు పరికీర్తితములో వానితో బ్రాహ్మణ స్వస్తి వాచనములతో నభిషేకము గావింపవలెను. అటుపైని యజుర్వేద విశారదుడైన పురోహితుడు అగ్నివేది మూలమున కేగి సర్వతోభద్రాసనమందు గూర్చండ బెట్టి సర్వాలంకార భూషితుని చేసి శతచ్ఛిద్ర సువర్ణాభిషేక పాత్ర విశేషముచే యథావిధిగా నభిషేకింప వలయును. ''యా ఓషధిః'' అను మంత్రముతో సర్వౌషధులచేత ''రథే అక్షేతి'' మంత్రముచే గంధములచేతను ''ఆబ్రహ్మన్‌ బ్రహ్మణ'' అని బీజము (నవధాన్యములు) లతో ''రామాపుష్పవతీ'' యని పుష్పములతో అదే మంత్రముతో ఫలరసములతో నభిషేకింపవలెను ''ఆశుశ్శిశాన'' అను మంత్ర సంపుటితో రత్నములచేత ''యేదేవాః పురస్సదా'' అని కుశలచేతను పరిమార్జనము సేయవలెను. ఋగ్వేద క్రతులతో రాజునకు యథావిధిగ రోచనచే (గోరోచనముతో) రాజమూర్థమును గంధద్వారా అని కంఠమునందు స్పృశింపవలెను. ఆమీద బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ముఖ్యులు వారముఖ్యులు నానా తీర్థజలములచే నానా నదులు సరస్సులు కూపములనుండి తేబడిన నానా కలశస్థములయిన జలములచేతను, లభించినచో చతుస్సాగరోదకముల చేతను లభింపనిచో బ్రాహ్మణానీత జలముల చేతను గంగా యమునా నదీ ప్రవాహోదకముల చేతను, నిర్ఘరోదకములచేతను (కొండవాగులు) ఉద్భిదోదకముల (బుగ్గలు) చేత నభిషేకింపవలెను.

ఛత్రపాణి ర్భవేత్కశ్చిత్‌ కేచి చ్చామర పాణయః | అమాత్య ముఖ్యా స్తం కాలం కేచిత్‌ వేత్రకరా స్తథా || 22

శంఖభేరీ నినాదేన వందినాం నిస్స్వనేన చ | గీత వాదిత్ర ఘోషేణ ద్విజ కోలాహలేన చ || 23

రాజాన మభిషించేయుః సమేత్య సహితా జనాః | సర్వై స్తుతో7భిషిక్త శ్చ సంమిశ్ర జల మిశ్రితమ్‌ || 24

సర్వౌషధియుతం పుణ్యం సర్వగంథయుతం తథా | రత్నబీజ సమాయుక్తం ఫలబీజయుతం తథా || 25

ఊర్జితం సితసూత్రేణ వేష్టిత గ్రీవమేవచ | శ్వేతవస్త్రా7మ్ర పత్రైశ్చ సంవీతం సువిభూషితమ్‌ | 26

క్షీరవృక్ష లతా ఛన్నం సుదృఢం కాంచనం నవమ్‌ | ఆదాయ కలశం రాజ్ఞా స్వయం సాంవత్సర స్తథా || 27

మంత్రావసానే కలశం దద్యా ద్భృగుకులోద్వహ! | తతః పశ్యే న్ముఖం రాజా దర్పణ చాథ సర్పిషి || 28

సోష్ణీష స్సిత వస్త్రశ్చ మంగళాలంభనం తతః | కృత్వా సంపూజయేత్‌ విష్ణుం బ్రహ్మాణం శంకరం తథా || 29

లోకపాలాన్‌ గ్రహాం శ్చైవ నక్షత్రాణి చ భార్గవ! | తత స్స్వపూజాం కుర్వీత శయనీయం తతో వ్రజేత్‌ || 30

వ్యాఘ్ర చర్మోత్తరం రమ్యం సితవస్త్రోత్తర చ్ఛదమ్‌ | పురోధా మధుపర్కేణ తత్రస్థం తం సమర్చయేత్‌ || 31

రాజా చైవార్చయే త్తత్ర సాంవత్సర పురోహితౌ | మధుపర్కేణ ధర్మజ్ఞ స్తత స్తస్య సదైవ హి || 32

పట్టబంధం ప్రకుర్వీత ముకుటస్య చ బంధనమ్‌ | తత స్స బద్ధముకుటః కాలే పూర్వం మయేరితమ్‌ || 33

పరార్ధ్యా స్తరణోపేతే పంచచర్మోత్తర చ్ఛదే ధ్రువాద్యౌ ఇతి మంత్రేణ సోపవేశ్య పురోధసా || 34

వృకస్య వృషదంశస్య ద్వీపినశ్చ భృగూత్తమ! | తేషా ముపరి సింహస్య వ్యాఘ్రస్య చ తతః పరమ్‌ || 35

తత్రోపవిష్టస్య తతః ప్రతీహారః ప్రదర్శయేత్‌ | అమాత్యాంశ్చ తథా పౌరాన్‌ నైగమాంశ్చ వణిగ్వరాన్‌ || 36

తతః ప్రకృతయ శ్చాన్యా యథావ దనుపూర్వశః | తతో గ్రహవరాస్త్రేభ తురంగ కనకోత్తమైః || 37

గో7జా విగ్రహదానైశ్చ సాంవత్సర పురోహితౌ | పూజయిత్వా తతః పశ్చా త్పూజయే ద్బ్రాహ్మణత్రయమ్‌ || 38

అనేనైవ విధానేన యేన రాజా7భిషేచితః | తతస్త్వమాత్యాన్‌ సంపూజ్య సాంవత్సరపురోధసః || 39

తతో బ్రాహ్మణ ముఖ్యానాం పూజనం తు సమాచరేత్‌ | గోవస్త్ర తిలరూప్యాన్న ఫలకాంచన గోరసైః || 40

మోదకాక్షత పుషై#్పశ్చ మహీ దానైశ్చ పార్థివః | మంగలా7 లంభనం కృత్వా గృహీత్వా సశరం ధనుః || 41

వహ్నిం ప్రదక్షిణీకృత్య ప్రణిపత్య తధా గురుమ్‌ | పృష్ఠతో వృష మాలభ్య గాం సవత్సాం చ పార్థివః || 42

పూజయిత్వా చ తురగం మన్త్రితం చా7భిషేచితమ్‌ | మంత్రితం దక్షిణ కర్ణే స్వయం వేదవిదా తతః || 43

ఆరుహ్య రాజమార్గేణ స్వపురం తు పరిభ్రమేత్‌ | ముఖ్యా7మాత్యైశ్ఛ సామంతైః సాంవత్సర పురోహితైః || 44

సహితః కుంజరా7రూఢై రభి గచ్ఛేచ్చ దేవతాః | తాసాం సంపూజనం కృత్వా నగరే యా నివేశితాః || 45

ప్రవిశేత గృహం రాజా ప్రహృష్ట నరవాహనః | దానమానాది సత్కారైః గృహ్ణీయా త్ప్రకృతీ స్తతః || 46

సంపూజితా స్తాస్తు విసర్జయిత్వా | గృహే స్వకే స్యా న్ముదితో మహాత్మా |

విధాన మేత త్సమవాప్య రాజా | కృత్స్నాం సపృధ్వీం వశగాం హి కుర్యాత్‌ || 47

ఇతి శ్రీవిష్ణుథర్మోత్తరే ద్వితీయఖండే రాజ్యాభిషేకవిధిర్నామ ఏకవింశతితమో7ధ్యాయః.

అమాత్యులలో నొకడు ఛత్రము పట్టవలెను. కొందరు చామరములు గైకొనవలెను. కొందరు వేత్ర హస్తులు గావలెను. (బెత్తములు పట్టవలెను) శంఖభేరీ నినాదములతో వందిమాగథ గానములతో గీతవాదితృ ఘోషములతో ద్విజుల కోలాహలములతో సర్వజనులు కూడి రాజు నభిషేకింప వలయును. అందరిచే నభిషిక్తుడై సంస్తుతుడైన మీదట సర్వజన సంమిశ్రితము సర్వౌషధియుతము పుణ్యము సర్వగంధయుతము తెల్లని సూత్రముచే కుతికదగ్గర చుట్టబడినది శ్వేతవస్త్రములతో మామిడాకులతో, భూషితము సుదృఢము కాంచనము నూతనము ఊర్జితమునిండైనదియు క్షీరవృక్ష లతాఛన్నమునగు నభిషేక కలశము సాంవత్సరుడు (దైవజ్ఞుడు) స్వయముగ బూని మంత్రములు సమాప్తియైన తరువాత రాజునకందీయవలెను. అవ్వల రాజు దర్పణమందు నేతియందు దనముఖము వీక్షింపవలెను. ఆపైన ఉష్ణీషము ధరించి శుద్ధవస్త్రుడై మంగళాలంభనము (స్పర్శ) సేసి విష్ణువును బ్రహ్మను శంకరుని, లోకపాలురను, నవగ్రహములను, నక్షత్రములను జక్కగ బూజింపవలెను. ఆ మీద తన నిత్యదేవతార్చన గావింపవలెను. అవ్వల శయనీయము దరికేగవలెను. అది వ్యాఘ్రచర్మముపైన పరచినది రమ్యమైనది. ఆమీద తెల్లనివస్త్రము పరచిన పాన్పుపై కూర్చున్న ఱనిం బురోహితుడు మధుపర్కముచే నర్చింపవలెను. ధర్మజ్ఞుడైన రాజు గూడ యట దైవజ్ఞ పురోహితులను మధుపర్కముచే నర్చింప వలెను. అవ్వల నా ప్రభువునకు (మొదట) పట్టబంధము (బంగారపురేకు కట్టుట) గావింపవలెను. కిరీటము పెట్టవలెను. కిరీటాలంకరణమయిన తరువాత నా సమయమున నింతమున్ను నే దెల్పిన ''ధ్రువాడ్యౌః'' అను మంత్రముతో విలువైన అస్తరణము (తివాసీ వంటిది) వీని చర్మోత్తరచ్చదమైన (అయిదు రకాల చర్మముపైని వస్త్రముపరచిన) భద్రాసనమందు పురోహితుడు రాజును ప్రవేశింప జేయవలెను.

పంచచర్మములు 1. తోడేలు 2. కస్తూరిమృగము 3. చిరుతపులి 4. సింహము 5. వ్యాఘ్రము = పెద్దపులి అనువాని చర్మములు. తోడేలు కస్తూరి మృగము చిరుతపులి సింహము పెద్దపులి చర్మముపరచి యాపైనిఅమూల్యమైన వస్త్రము పరచి కూర్చున్న రాజునకు అమాత్యులను పౌరులను సరిహద్దురాజులను, చుట్టుప్రక్కలనుంచి వచ్చిన ప్రజలను వర్తక శ్రేష్ఠులను ప్రతీహారుడు జూపవలెను. ఆ మీదట ప్రకృతులు మంత్రిసామంతాదులు మరియుం గల జనులను యథాక్రమముగ రాజదర్శనము సేయింపవలెను. ఆ మీద గోవులను అజావికములను అస్త్రములను ఏనుగులను హయములను బంగారములను నిచ్చి జ్యౌతిషిక పురోహితులను బూజించి ఆమీద ముగ్గురు బ్రాహ్మణులను బూజింపవలెను. అటుపై మంత్రుల నిదే విధానమున బూజించి సాంవత్సర పురోహితుల పూజ తరువాత బ్రాహ్మణోత్తములకు గోదానములు వస్త్ర దానములు వెండి అన్నము పండ్లు బంగారము గోరసములు మోదకములు అక్షతలుపువ్వులతో బూజించి భూదానములుసేసి మంగళ పదార్థాలంభనము (ఆలంభనము = స్పృశించుట)గావించిధనుర్ధారియై అగ్ని ప్రదక్షిణముచేసి గావించి గురువునకు ప్రణమిల్లి వృషభ వృష్ఠము స్పృశించి దూడతో నున్న గోవును గుఱ్ఱమును బూజించవలెను. ఆ గుఱ్ఱము మన్త్రితము (మంత్రపూతము) గావలెను అభిషేకజలములచే బ్రోక్షింపబడ వలెను, వేదవిదులు దాని కుడిచెవిలో నా మంత్రములను పఠింప వలెను. రాజాగుఱ్ఱమెక్కి రాజమార్గమునం జని తన రాజధాని నగరము చుట్టును ముఖ్యమంత్రులతో సామంతులతో జ్యౌతిషికునితో పురోహితునితో బ్రదక్షిణము తిరుగవలెను. ఏనుగెక్కి తనపరివారము వెంబడింప నగరములో నున్న దేవతల దర్శనము సేయవలెను. తన నగరమందు బ్రతిష్ఠితులైన యా దేవతలకు పూజలు గావించి యానందభరితులయిన ప్రజలతో వాహనములతో స్వగృహప్రవేశము సేయవలెను పౌరవర్గము ప్రకృతులను వీరి నందరికి దానములు చేయుట మానముచేసి గౌరవించుట మొదలయిన సత్కారములచే వారిని జేకొనవలెను. (కర గ్రహణముచేయుట మూలమున వారి నాదరింపవలెనన్న మాట) వారిని పూజించి సాగనంపిన తరువాత రాజు తన మందిరము నందానందభరితుడై యుండవలెను. ఈ విధానము నొందిన ప్రభువు సర్వపృధ్విని తనవశము గావించు కొనగలడు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున రాజ్యాభిషేకవిధి యను నిరువది యొకటవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters