Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట డెబ్బది తొమ్మిదవ అధ్యాయము - ధనుర్వేదము - స్థాన వర్ణనము

పాణి పాద తలే పృష్ఠం సర్వే స్యుః సంహితా యది | దృష్టం సమపదం స్థాన మేతల్లక్షణత స్తథా .

బాహ్యాంగుళి స్ఫిచౌ పాదౌ స్తబ్ధ జాను బలా వుభౌ | త్రివితస్త్యంతరాయామ మేవం వైశాఖముచ్యతే.

మండలా కారపాదాభ్యా ముద్యతే యత్రజానునీ | చతుర్విధం త్రివిచ్ఛిన్నం తదేవం మండలం స్మృతమ్‌ .

ఫలాకృతి సమం యచ్చ స్తబ్ధ జానూరు దక్షిణమ్‌ | వితస్తి పంచ విస్తార న్తదాలీఢం ప్రకీర్తితమ్‌.

నమితా పూర్వజంఘా చ సదా 77 లీఢే విధీయతే | తిర్యగ్గతో భ##వే ద్వామో దక్షిణోపి భ##వే దృజుః .

గుల్ఫౌ పాణి స్థితా వేవ స్థిరౌ పంచాంగుళాంతరౌ | స్థానజాతం భ##వేదేత ద్ద్వా దశాంగుళ మాయతమ్‌ .

ఏతదేవ విపర్యస్తం ప్రత్యాఖ్యాతం ప్రకీర్తితమ్‌ | కుబ్జ జాను భ##వే ద్వామో దక్షిణస్తు ప్రసారితః .

అథవా దక్షిణం జాను కుబ్జం భవతి నిశ్చలమ్‌ | భ##వే ద్దండాయితో వామ శ్చరణః సహ జానునా.

ఏవం వికచ్ఛ ముద్దిష్టం ద్విహస్తాం తర మాయతమ్‌ | జానునీ ద్విగుణౌ స్యాతాం హ్యుత్తానౌ చరణావపి .

అనేన వినియోగేన సంపుటం పరికీర్తితమ్‌ | కించి ద్వివర్తితౌ పాదౌ సమదండాయితౌ స్థిరౌ.

పుష్కరుం డిట్లనియెః చేతులు కాళ్ళు దగ్గరగా చేర్చి నిలుచుట సమపద మనబడును.

వైశాఖముః చేతి వ్రేళ్ళు స్ఫిక్కులు పిరుదులు గుంట లానించి మోకాళ్ళు కదలకుండ పాదములనానించి వితస్తి (పండ్రెండంగుళములు) ఎడమగా నిలుచుట వైశాఖమనబడును. రెండు మోకాళ్ళతో పాదములను వర్తులాకారముగా జేసి నిలుచుట ఆలీఢము.

విలుకాడు కుడికాలు ముందుకు చాచి నిలుచుట ఎడమకాలు ముందుకు చాచె నిలుచుట ప్రత్యాలీఢము. ఆ లీడములో కుడి పిక్క తీరుగాకుండా ఎడమపిక్క అడ్డము తిరిగి ఉండుట.

స్థానభూతముః- చీలమండలమీద చేతులూనుకొని నిలుచుట రెండు చీలమండలకు నడుమ అయిదంగుళము లెడముండవలయును. పండ్రెండు అంగుళములు దురముండవలయును.

ప్రత్యాఖ్యాతముః- ఇది వ్యతిరేకమయినచో అనగా అయిదంగుళముల దూరము పండ్రెండంగుళము లెడమ అయినచో ప్రత్యాఖ్యాతము.

లికచ్ఛము ః- ఎడమకాలు వంచి కుడి మోకాలు చాచి నిలుచుట.

సంపుటము ః- కుడి కాలు వంచి ఎడమకాలు చాచుట.

దృష్టి మేవ యథా న్యాయం షోడశాంగుల మాయాతమ్‌ | స్వస్తి కేనాత్ర కుర్వీత ప్రణామం ప్రథమంద్విజః .

కార్ముకం బుజు (భృగు) వామేన వామం దక్షిణకేన చ | వైశాఖే 7 ప్యథవా జాతే స్థితో వాప్యథ వాయతే.

గుణాగ్రంతు తతః కృత్వా కార్ముకే ప్రియ కార్ముకః | అధః కోటింతు ధనుషః ఫలదేశే చ పత్రిణః.

ధరణ్యాం స్థాప యిత్వాతు లాలయిత్వా తథైవ చ | భుజాభ్యా మత్ర కుబ్జా భ్యాం ప్రకోష్ఠాభ్యా మరిందమ.

న్యస్య బాణం ధనుఃశ్రేష్ఠం పుంఖదేశే చ పత్రిణః | విన్యాసో దనుషశ్చైవ ద్వాదశాంగుళ మంతరః.

తయో ర్భార్గవ! కర్తవ్యో నాతో హీనో న చాధికః | నివే శ్య కార్ముకం కంఠే నితంబే శరసంకరమ్‌ .

ఉత్షిపే దస్థిరం హస్త మంతరేణాక్షి కర్ణయోః | పూర్వేణ ముష్టినా గ్రాహ్యాః స్తనాగ్రం దక్షిణః శరః.

హరణం తు తతః కృత్వా శీఘ్రం పూర్వం ప్రసారయేత్‌ | నా7త్యంతరా నైవబాహ్యా నోర్ధ్వగా నాధరా స్తథా .

న చ కుబ్జా న చోత్థానా న చలా నాతివేష్ఠితాః | సమాః స్థైర్యగుణోపేతాః పూర్వే దండమివ స్థితాః .

ఛాదయిత్వా తతో లక్ష్యం పూర్ణేనానేన ముష్టినా | తరసా తూత్థితో యత్నా త్త్రికోణవినతి స్థితః .

స్రస్తాంసో నిశ్చల గ్రీవో మయూరాంచిత మస్తకః | లలాట నాసా వక్త్రాం శః కూర్పరశ్చ సమం భ##వేత్‌.

ఆంతరం త్వంగుళం జ్ఞేయం చిబుకస్యాం సకస్యచ | ప్రథమే త్య్రంగుళే వింద్యాద్ద్వితీయే ద్వ్యంగులం స్మృతమ్‌.

తృతీయోం7గుళముద్దిష్టం చాయతం చిబుకాంసయోః | గృహీత్వా సాయకం తత్ర తర్జన్యంగుష్ఠమేవ చ.

అనామయా తతో గృహ్య పునర్మధ్యమయాపి చ | తావదాకర్షయే ద్యోగా ద్యావద్బాణః సుపూరితః .

ఏవంవిద ముపక్రమ్య మోక్తవ్యో విధివత్ఖగః | దృష్టి ముష్టి హతం లక్ష్యం భింద్యాద్బాణన భార్గవ.

ముక్త్వా చాపం వామహస్తం క్షిపేద్వేగేన పుచ్ఛతః | ఏతదుచ్చేద మిచ్ఛంతి జ్ఞాతవ్యం హి త్వయా ద్విజ.

యుద్ధము మొదట యోధుడు చూపును పదునారంగుళముల దూరమున సూచికగా నిలిపి స్వస్తిక ముద్రతో తొలుత నమస్కారము సేయవలెను. విలుకా డింతకు మున్ను చెప్పిన వైశాఖమను స్థానమందు నిల్చి వింటికొన యందు నారి చివర తగిల్చి ధనుస్సు యొక్క క్రింది కొనను బాణము కొలికి కానించి విల్లును నేలమీద నానించి అట్టిట్టునుంచి భుజములు ముంజేతులు వంచి తమయొక్క పుంఖ దేశమందు పండ్రెండంగుళము లెడమగా నాకర్షింపవలెను. బాణము పిడియందు ధనస్సు నారియందు నుంచి ఆ యెడ మంత యెక్కువయు తక్కువయుం గాకూడదు. కంటికి చెవులకు నడుమ చేతుల నెత్తవలెను కుడి గుప్పిట కుడి బాణము సర్వమగ్ర మెత్తున దొడిగిలాగి వదలవలెను. ఆ విసురు బాణములు ఒకదానివెంబడి నొకటిగా (యెక్కువ అంతరము లేకుండా) పోవలయును. గురికి వెలిగాగాని మీదికిగాని క్రిందికి గాని పోరాదు. అవి యెక్కువ క్రిందికి యెక్కువ మీదికి యెక్కువ చంచల ములుగా గాక ఒత్తుడు వడక సమములు స్థిరములై యుండవలెను.

నిండు గుప్పిటం బట్టి గురిని మేన నిడివిగ జాచి త్రికోణము వంపున నిలిచి మూపు లెగయించి మెడ కదలకుండ నెమలి మెడవోలె మెడ నిలిపి మొగము నొసలు ముక్కువైపున కెగయించి కూర్పరము (మోచేతులు మోకాలు చీలమండలు) సమముగ నుంచి నిలుపవలెను. చిబుకమునకు (గడ్డమునకు) మూపునకు ఆకర్షణములు, మొదటి దశలో మూడంగుళాలు రెండవదాన రెండంగుళములు మూడవ దశలో నొక్కంగుళము ఉండవలెను. ఆమ్ముల పొదినుంచి బాణము మొదట చూపుడు వ్రేలు బొటనవ్రేలితో ఆమీదన నామికతో తరువాత మధ్యమవ్రేలు చేర్చి బాణము లెస్సగ నెక్కువడుదాక లాగవలెను. ఈ విధముగా నారంభించి బాణ మును పరవి యథావిథిగ విసరవలెను. చూపునకు పిడికిలికి సరిగ లొంగిన గురిని బాణముచే ఖేదింపవలెను. బాణము నెడమ చేతి నెడలి వేగముగ వెనుకనుండి వదలవలెను. దీనినే ఉచ్ఛేదమందురు. ఇది నీ వెరుంగవలసినది.

కూర్పరం త్రివిధం కార్య మాకృష్టం తు ధనుష్మతా | తత్రాపి ముక్తకే కార్య మక్షశ్లిష్టం తు మధ్యమమ్‌.

జ్యేష్ఠం ప్రకృష్టం విజ్ఞేయం ధనుశాస్త్ర విశారదః | జ్యేష్ఠ స్తు పావకో జ్ఞేయో భ##వేద్ద్వాదశముష్టయః .

ఏకాదశ తథా మధ్యః కనీయాన్‌ దశముష్టయః | చతుర్హస్తం ధనుఃశ్రేష్ఠం ప్రయోగం చాస్య మధ్యమమ్‌.

కనీయసం త్రయః ప్రోక్తం నిత్యమేవ పదాతినా | అశ్వే రథే గజే జ్యేష్ఠం తదేవ పరికీర్తితమ్‌.

తదేవ హీనం ఖలు మధ్యమం స్యాత్‌ | తదే వ హీనం చ తథా కనీయః |

పూర్ణాయుధసై#్య వ విధిర్మయాతే | ప్రోక్తః సమాసాద్‌ భృగువంశ ముఖ్యః

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే ధనుర్వేదో నామ ఏకోనా7శీతిశతతమో7ధ్యాయః ||

కూర్పరము మూడు రకాలు. (కూర్పరశబ్ద మిది ధనుర్వేద పరిభాష. సరిగా అవగాహన కాలేదు.) అస్త్ర ప్రయోగ మందిది మూడు విధములుగా నుపయోగించ వలెనట. ఇందు మొదటిది కూర్పరము ప్రకృష్టము (చాల యెక్కువది) దాని పేరు పావకము దాని పరిమాణము పండ్రెండు పిడికిళులు (కొలత) అక్షశ్లిష్టము మధ్యమము. అది పదకొండు పిడికిళులు. చివరిది పది పిడికిళులు. మధ్యమ కూర్పరమున విల్లు నాలుగు మూరలుండును. తుది కూర్పరమందు విల్లు మూడు మూరలుండును; (పదాతి కాలి బంటు) చివరిది మూడవ రకము కూర్పరమునే ప్రయోగించవలెను. ఆశ్వికుడు (గుర్రమెక్కి యుద్ధము చేయు వాడు) రథికుడు గజయోధుడు జ్యేష్ఠ కూర్పరమునే పావకమనుదానినే ప్రయోగించ వలెను. పూర్ణాయుధునకు ఓ భార్గవ! సంపూర్ణాస్త్రవిజ్ఞానికి ఆ మధ్యమ కూర్పరము హీనమే. కనిష్ఠ కూర్పరమూ తక్కువదే. పూర్ణాయుధునకు జ్యేష్ఠ కూర్పర మొక్కటే యని నేను సంగ్రహముగా నీ విషయము నెరిగించితిని.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయ ఖండమున ధనుర్వేదమందు కూర్పర విధానమను

నూట డెబ్బది తొమ్మిదవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters