Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట డెబ్బది ఐదవ అధ్యాయము - యుద్ద యాత్రా కాలము

శ్రీపరశురామ ఉవాచః-

భగవన్‌ ! సర్వధర్మజ్ఞ ! సర్వశాస్త్రవి శారద ! జిగీషూణాం సమాచక్ష్వ యాత్రాకాలం మహీక్షితామ్‌.

పుష్కర ఉవాచ ః పూర్వేషా మేవవర్ణానాం యాత్రాకాలం నిబోధమే | అధికృత్య మహీనాథం జిగీషూణాం గుణాన్వితమ్‌.

పూర్వే కపాకేతౌ7ర్కో యాయీభవతి చాపరే | యాయిగ్రహౌ శుక్రకుజౌ శేషాః పౌరాః ప్రకీర్తితాః .

పౌరగ్రహైర్బలోపేతై ర్నయాత్రాం సంప్రయోజయేత్‌ | యాయి గ్రహబలేరాజా దిక్పతౌచ తథాగ్రహే.

విష్ట్యాం తే నీచగతే వివశేరిపురాశిగే | ప్రతిలోమేచ విధ్వస్తే శుక్రే యాత్రాం వివర్జయేత్‌.

ప్రతిలోమే బుధేయాత్రా దిక్పతౌచ తథాగ్రహే | వృషే వృద్ధ్యాం వాతివాతే వాత్యాయాంచ వివర్జయేత్‌.

వైధృతేచ వ్యతీపాతే నాగేచ శకునౌతథా | చతుష్పదేచ కింస్తుఘ్నే తథా యాత్రాం వివర్జయేత్‌.

విపత్కరే నైధనేచ ప్రత్యరౌ భేచ జన్మని | రణ వివర్జయేద్యాత్రాం రిక్తాయాంచ తథావపి.

ఉదీచీంచ తథాప్రాచీం తయోరైక్యం ప్రకీర్తితమ్‌ | పశ్చిమా దక్షిణాయా దిక్తయోరైక్యం తథైవచ.

వాయ్వగ్ని దిక్సముద్భూతం పరిధింతు నలంఘయేత్‌ | రామః సంవత్స రాద్యేషు సర్వేష్వేవ మహీపతిః .

సంవత్సర మదిక్ప్రాచీం పరిపూర్వస్యదక్షిణా | తత్పూర్వస్యాపరాజ్ఞేయా చానుపూర్వస్యదక్షిణా.

ఆద్యారస్తు వినిర్దిష్ట స్తథా వత్సర సంజ్ఞితః | ఉత్తరాయణగే సూర్యే ప్రాచీం యాయాద్దిశం నృపః .

చంద్రేచ బ్రాహ్మణ శ్రేష్ఠ పశ్చిమాం దక్షిణస్థితే | తయోరయనభేదేన యాయా త్సూర్యాయనం దివా.

రాత్రౌచంద్రాయణం యాయాద్యాదిగుక్తా మయాతవ | వసంత ఉత్తరద్వారః గ్రీష్మః ప్రాగ్ద్వారిక స్తథా.

శరచ్చ పశ్చిమ ద్వారః శిశిర శ్చోత్తరాముఖః | హేమంతః సర్వతోద్వారః ప్రావతద్వారి కాస్మృతా.

నక్షత్రవద్దేవతాభిర్యా యస్యతు దిగుచ్యతే | మాసార్ధే7స్య మహాభాగ తథైవ పరికీర్తితా.

ఆదిత్య సౌరచంద్రాఖ్య దివసాస్తు నశోభనాః | త ఏవ చానుకూలస్య దివసోన ప్రశస్యతే.

ప్రాగ్ద్వారో భాస్కరో జ్ఞేయః దక్షిణన తథా వచః | పశ్చిమేన శ##నైశ్చారీ ఉదగ్ధ్వారస్తు చంద్రమాః .

సర్వద్వారః స్మృతా రామ జీవశుక్రేందు నందనాః | తేషాంహి దివసాః శస్తాః విశేషేణ గమిష్యతామ్‌.

సమాగమే జితోయస్తు జీవూ మిత్రగ్రహేస్థితః | స్ఫురణోరశ్మి హీనశ్చ న ప్రశం సంతి తద్దినమ్‌.

ఉచ్చస్థో మిత్రగృహగః స్వ క్షేత్రస్థో7పియోగ్రహః | విజయీ రశ్మి వారిస్థూ దినంతస్య ప్రశస్యతే.

కృత్తికాద్యాని పూర్వేణమాఘాద్యాని చ యామ్యతః | మైత్రా ద్యాః పశ్చిమేచాపి వాసవాద్యా స్తథోత్తరే

భవంతి స్తంభ సంజ్ఞాని తాని దిఙ్మధ్యగాని చ | స్తంభర్షా యానిపూర్వాణి.

ప్రవేశ##భేషు దుష్టేషు యాయినాం విజయం వదేత్‌ | స్తంభ##నేషు తుదుష్టేషు దుర్గాణాం

ఉత్పాతదర్శనం చస్యా ద్యేన చర్షేణ భార్గవ | సంక్రాంతి ర్వా గ్రహస్య స్యా ద్యేన చాస్తోదయేతథా.

భిన్న శ్చంద్రమసా యశ్చ గ్రహేణాంన్యేన వాపునః | యన్నక్షత్ర గతే గ్రస్తే స్యాతాంవా శశిభాస్కరౌ

నతేన నృపతిర్యాయాన్న క్షత్రేణ కదాచన | అష్టవర్గానుకూలస్య చంద్రే యాత్రాం ప్రయేజయేత్‌.

పూర్వాద్వార స్థితా నందా భద్రా దక్షిణతః స్థితా | జయాచ పశ్చిమ ద్వారా రిక్తా చోదత్ప్రకీర్తితా.

పూర్ణాతు సర్వతోద్వారా తిథిరుక్తా మహాభుజ | నక్షత్ర దేవతా తుల్యా ముహూర్తానాం చ దిగ్భవేత్‌.

విదిగ్ద్వారా7భిజిద్‌ జ్ఞేయా దక్షిణన విగర్హితా | ప్రాగ్ద్వారాః కథితా రామ మేష సింహధనుర్ధరాః .

తథా చ పశ్చిమద్వారా కన్యా తులా మకర కుంభాశ్చ జ్ఞేయా పశ్చిమదిఙ్ముఖాః .

కీట వృశ్చిక మీనాశ్చ తథా చోదక్ప్రకీర్తితాః | లగ్నేనదిజ్ముఖం యత్నాత్‌ జ్ఞేయం ప్రాఙ్మఖమం శకమ్‌.

సౌరాః సర్వేప్రశస్యంతే కాలరోధం వివర్జయేత్‌ | విశాఖాద్యం భత్రితయం దినే సూర్యే వివర్జయేత్‌.

ఆషాఢ త్రితయం చంద్రే తథా బ్రాహ్మణ సంజ్ఞికం | ధనిష్ఠార్యత్రయం భౌమే పౌష్ణాద్యత్రి తయం బుధౌ.

రోహిణ్యాద్యంతథా జీవే పుష్యాద్యంచ తథా సితే | అర్యమాద్యం తధా సౌరే ప్రయత్నేన మహాభుజ.

మూలం చ శ్రవణం చైవ ఆహిర్భుధ్న్యం తథైవ చ | ఆగ్నేయ మథ చాదిత్యం భాగ్యం వాయవ్యమేవ చ.

ఆదిత్యాది దినేష్వేతే సిద్ధయోగాః ప్రకీర్తితాః | సిద్ధి యోగాన్విశేషేణ తిథి ష్వపిని బోధమే.

గ్రహక్రమేణ ధర్మజ్ఞ సర్వ కర్మసు సిద్ధిదాన్‌ | ద్వితీయా చ తృతీయా చ ప్రతి పచ్ఛాష్టమీ తథా.

సప్తమీ చ చతుర్థీ చ పంచమీ చ తథాతిధిః | అన్యాశ్చ మిత్రయోగేషు తిథయస్త్వంశృణు క్రమాత్‌.

ఏకాదశీ చ దశమీ నవమీ పంచద శ్యపి | చతుర్దశీ ద్వాదశీ చ తథారామ త్రయోదశీ.

ఛాయా ప్రమాణం వక్ష్యామి సిద్ధి భాగేష్యతః క్రమాత్‌ | తత్ర కాలే కృతం కర్మ సకృత్సంపశ్యతే ధ్రువమ్‌.

ఆదిత్యే వింశతిరేయా శ్చంద్రే షోడశకీర్తి తాః | భౌమే పంచ దశైవోక్తా శ్చతుర్దశ తథా బుధే.

త్రయోదశ తధా జీవే శుక్రే ద్వాదశ కీర్తితాః | ఉదితేనోత్తరాం గచ్ఛే త్ప్రాచీం మధ్య స్థితేపివా.

దక్షిణా మపరాహ్ణే చ అర్ద రాత్రేతు పశ్చిమాం | జన్మరాశ్యుదయే యాత్రాన ప్రశస్తా.

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే మహాపురాణ ద్వితీయఖండే యుద్ధ యాత్రాకాలోనామ పంచసప్తత్యుత్తర శతతమో7ధ్యాయః.

పరశురాముడు సర్వ ధర్మజ్ఞ సర్వశాస్త్ర విశారద ధగవంతుడ ! రాజులు విజయార్థులై యుద్ధమునకు నేగదగు కాల మాన తిమ్మన పుష్కరుం డిట్లనియెః- రాజు ననుసరించి పూర్వ వర్ణములవారు( బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మాత్రమే) యుద్ధయాత్రకు పోదగిన కాలము నెరింగింతు వినుము.

మొదటి కపాలమందు సూర్యుడు పౌరుడు. తరువాతి కపాలమందు యాయి యగును. శుక్రు కుజులు యాయి గ్రహములు. తక్కినవి పౌరములు. పౌర గ్రహములు బలము గలిగి యున్నపుడు దండయాత్ర సేయరాదు. యాయి గ్రహము యాత్ర వెళ్ళ దలచిన దిక్కున కదిపతియైన గ్రహము అస్తమించినగాని నీచలో నున్నను, శత్రురాశి యందున్నను ప్రతిలోమముగా నున్నను (వక్రించినను) శుక్ర గ్రహము విధ్వస్తము అయిన తరింగాని యాత్రకు పోరాదు. దిక్పతియు బుధుడును ప్రతిలోమముగా నున్న తరి (వక్రించిన) తరిగాలి వాన తుఫాను వచ్చినపుడు యుద్ధ యాత్ర కూడదు.

వైధృతి వ్యతీ పాత నాగము శకుని చతుష్పదము కింస్తుఘ్నము నను యోగములందు యుద్ధ యాత్ర విరమింపవలెను. విపత్తార ప్రత్యుక్తార నైధనతార జన్మ తారలు రిక్త తిథులు యుద్ద నిషిద్ధములు.

వసంత ముత్తరద్వారము గ్రీష్మము తూర్పు ద్వారము శరదృతువు పడమటి గుమ్మాలు శిశిరర్తువు ఉత్తరద్వారము హేమంతము సర్వతోద్వారము వర్షఋతువు అద్వారికము. అనగా ఏ ద్వారము లేనిదన్న మాట. నక్షత్రాధి దేవతానుసారము మాస విషయములో కూడ యాయా మాస దేవతానుసారము యాత్ర సాగింపనగును. ఆది శని సోమవారములు నిషిద్ధములు.

తూర్పు ద్వారము రవికి దక్షిణము కుజునికి పడమట శనికి ఉత్తర ద్వారము చంద్రునికి గురు శుక్ర బుధులకు సర్వ ద్వారములున్ను మంచిదని ఋషులు చెప్పిరి. వారు వారి (గురు శుక్ర బుధ) వారములు కూడ చాలా మంచివి. గురుడు మిత్ర గృహమం దున్నను యితర గ్రహము కూడికచేత జితుడయినచో గాని కారణహీనుడై స్ఫురించినచోగాని ఆ రోజు దండయాత్రకు శుభ దినము గాదని ఋషులన్నారు.

గ్రహ ముచ్చయందు మిత్రగృహమందు స్వక్షేత్రమందు నున్నచో నా సమయమందు దండయాత్ర సేసిన రాజు జయించును. ఆ గ్రహము కిరణ సమృద్ధమై స్థూలమై యున్నచో నిదే ఫలము నిచ్చును. కృత్తిక మొదలుకొని ఆశ్లేషదాక గల నక్ష త్రములు తూర్పునకు మఘ మొదలుకొని స్వాతిదాక నక్షత్రములు దక్షిణ దిశకు అనూరాధ మొదలు పడమటకు ఇంద్ర దేవతాక నక్షత్రము మొదలు స్తంభ నక్షత్రము లనబడును. అవే ఆయా దిక్కుల నడుము లనియు నగును.

ప్రవేశ నక్షత్రములు చెడ్డవై నచో దంయాత్ర చేయువారికి గెలుపు గల్గునని చెప్పవలయును.

ఏ నక్షత్రమం దుత్పాతము గ్రహణ వ్రణములు ఆయా గ్రహముల ఉదయాస్తమయములు చంద్రునితో గలియకున్న యాత్రా లగ్న మున్నచో గాని సూర్య చంద్రులు ఏ నక్షత్రమం దస్తమయం పొందుదురో ఆ నక్షత్రమందు గాని రాజు యాత్ర సేయరాదు. చంద్రుడష్టకవర్గు నందనుకులుడై యున్నచో యాత్ర చేయవచ్చును.

తూర్పుద్వారమందు నంద దక్షిణద్వారము భద్ర పశ్చిమద్వారమందు జయ ఉత్తరద్వారమున రిక్తయునని తిథులుండును. పూర్ణిమథితి సర్వతోబద్ర తిథియని చెప్పబడినది. యాత్రా ముహూర్తములకు ఆయా నక్షత్రదేవతలతో సమమైన దిక్కు యాత్రాదిక్కుగా చెప్పబడినది. అభిజిత్తు విదిగార=ఆగ్నేయాది మూలలందు ద్వారముగలది. అభిజిత్తుకు దక్షిణ ద్వారము నింద్యము. మేష సింహ ధనూ రాసులు ప్రాగ్ద్వారములు (తూర్పుద్వారము గలవన్న మాట) పశ్చిమద్వారములు కన్య తుల మకరము పడమటద్వారములు కర్కాటకము వృశ్చికము మీనము తూర్పుద్పారాలు లగ్నమునుబట్టి దిజ్ముఖము తెలియవలెను.

సౌరనక్షత్రాలన్నీ యాత్రకు మంచివే. సూర్యుడు దీనుడుగాన్నుపుడు మబ్బుపట్టినపుడు విశాఖాది మూడు నక్షత్రములలో చంద్రుడు నపుడు అది బ్రాహ్మణలగ్నమనబడును. పూర్వాషాఢఉత్తరాషాఢశ్రవణమును బ్రాహ్మణములను పేరుగలవి. ధనిష్ఠ శతభిషము పూర్వభాద్రయ కుజునియందు పౌష్ణము మొదలుగ మూడు బుధునందు రోహిణి మొదలు మూడు గురునియందు ప్రష్యమి ఆక్లేష మక నక్షత్రములు శుక్రునియందు అర్యమముమొదలు మూడునక్షత్రాలు శని యందు వదలి వేయవలెను. మూల శ్రవణ ఆహిర్బుధ్న్యము (ఆగ్నేయము) కృత్తిక ఆదిత్యము (భాగ్యము) (ఆదివారము మొదలగు) వాయవ్యము ఆదిత్యాది వారములందు ఇవి సిద్ధి యోగములు. విదియ తదియ పాడ్యమి అష్టమి సప్తమి చవితి పంచమి మఱియుగల తిథులు మిత్రయోగమున శుభమిచ్చు వానిని చెప్పెదవినుము. ఏకాదశి దశమి నవమి పూర్ణిమ చతుర్దశి ద్వాదశి త్రయోదశియు మిత్రయోగమున శుభప్రదములు.

ఇంటిపై సూర్యాది గ్రహముల ఛాయ ప్రమాణమును బట్టి కార్యసిద్ధి యుండును. గావున ఆయా ఛాయా భాగలను జెప్పెద. సూర్యునియందు ఇరువది చంద్రునందు పదునారు కుజునందు పదునైదు బుధునందు పదునాలుగు గురువు నందు పదమూడు శుక్రునియందు పండ్రెండు ఛాయలు. ఆ ఛాయలందు జేసిన పని తప్పక సిద్ధించును. సూర్యోదయమందు త్తరముగ మధ్యాహ్నము తూర్పుగ అపరాహ్ణమున దక్షిణ దిశగ అర్ధ రాత్రి పడమటి దిశగ యాత్ర సేయవలెను. జన్మ రాశి యుదయసమయమందు యాత్ర మంచిది కాదు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయ ఖండమున యుద్ధయాత్రా కాలమను నూటడెబ్బదియైదవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters