Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటడెబ్బది రెండవ యధ్యాయము - లగ్నోదయ కాలనిరూపణము

ఇష్టకాల స్ఫుటార్కరాశి భుక్తలిప్తా స్తదా క్రాంతిరాశ్యుదయ ప్రాణాహతాగ్రహ లిప్తాభిర్విభ##జేత్‌; లబ్ధమర్క క్రాంతిరాశేర్దిన భాగకాలః తదష్టకాలప్రాణభ్యోణస్యాదిత్యే చాభుక్త లిప్తా దేయాః కాలే చానంతర వ్యుదయాశ్రయాస్యాః అర్క... చరా చ్యుదయోదేః శేషా దశుద్దరాశ్యుదయై ర్భావాద్యాః ; ఏవం రాశిగత కాలలగ్నోదయః షడ్రాశియుతార్కా అర్కభుక్త కాలాద్యాః కాలాః లగ్నాశ్చ భుక్తకలాభ్య స్తద్యోగే తదంతరా వ్వుదయేయుతే లగ్నో దయః కాలః

ఇతి లగ్నప్రకరణంనామ ద్విసప్తత్యుత్తర శతతమో7ధ్యాయః.

సూర్యుడు మేషమందు ప్రవేశించినది మొదలు ఈ క్రింది పథకము ప్రకారము ఆయా రాసులలో బ్రవేశించును.

దిన ఘటికలు విఘటికలు దిన ఘటికలు విఘటికలు

మేష 30 56 59 తుల 29 53 13

వృష 31 24 49 వృశ్చిక 29 29 50

మిధు 31 38 1 ధను 29 19 34

కర్క 31 28 13 మకర 29 27 17

సింహ 31 1 50 కుంభం 29 48 43

కన్య 30 26 42 మీసం 30 20 50

స్వదేశ నిరయణ లగ్న ప్రమాణ విఘటికలను సూర్యుడు మేషాది రాశులలో నేరాశిలోనుండునో ఆ రాశియొక్క పై పధకమునందలి దినములు ఘటికలు విఘటికలతో భాగింపగా నా మాసములో ప్రతిదిన సూర్యభుక్తి విఘటికలు వచ్చును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున లగ్నోదయకాల నిరూపణమను నూట డెబ్బదిరెండవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters