Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట డెబ్బదియొకటవ అధ్యాయము - ఛాయా ప్రకరణము

దినగతశేషాల్పకాల స్యోత్తర గోలేర్ధ రాత్రార్ధం తస్యదక్షిణ యుక్తస్య జీవాసాహోరాత్రావ హతాత్రి జ్యాహతో గోల విపర్యయేణ త్రిజ్మాయుతోన్యచ్ఛేదః; భేదోవలంబకవ్యాహతః త్రిజ్యావిభాజితః శంకుః; శంకువర్గహీనస్య త్రిజ్యావర్గస్య పదం దృశ్యద్వాదశహతా శంకుహతా ఛాయా మాధ్వాహ్నికార్కక్రాంత్యా సాక్షసంయోగ వివరో దక్షిణోత్తర గోలయో రనష్ట తద్రా శిత్రయాదపాస్య తజ్జ్యా భాగావహారః ద్వాదశహతాయా అనష్టజీవాయా లబ్ధం మాధ్యాహ్నికే చ్ఛాయా త్రిజ్యార్క మధ్యాహ్నచ్ఛాయా భాగావహార విభక్త స్తత్కర్ణః విషువకర్ణహతాం త్రిజ్యాం స్వేష్టకా యాకర్ణేన విభ##జేత్‌; లబ్ధముత్తర దక్షిణ గోలయోః క్షితిజ్యయా యుతోన వ్యాసార్ధతాడితం స్వాహోరాత్రార్ధేన విభ##జేత్‌ ; లబ్ధా చాయం గోల విపర్యయా శ్చరదలోనయుతం దివ సస్యగతం శేషంవా భవతి.

ఇతి జ్యోతిశ్శాస్త్రే ఛాయాప్రకరణం నామ ఏకసప్తత్యుత్తర శతతమో7ధ్యాయః

సాయన సూర్యుడు మేష రాశిలో ప్రవేశించు రోజు (21 మార్చి ) గాని తలలో ప్రవేశించు రోజు (22 సెప్టెంబరు) గాని నిమ్నోన్నతములు లేకుండునట్లు సమీకరింపబడిన నేలమీద భూమినుంచి 12 అంగుళముల ఎత్తు గల గుండ్రనయిన శంకువును సూటిగా పాతవలెను. అనాడు మధ్యాహ్నమున భారతవర్ష మంతటను ఉత్తరముగా శంకువు మొక్క నీడ వచ్చును. విషువద్దినమందలి (రాత్రి పవలు సమానమైన రోజున నీడ గావున దీనికి విషువచ్ఛాయ అనుపేరు గలదు. ఆనాడు సూర్యుడు విషవద్వృత్తుడగును. విషువద్వృత్తము భూమధ్య రేఖకు తిన్నగా ఖగోళమందుండు కాలమును దెలుపునది గావున భూమధ్య రేఖ మీద నుండు దేశములలో నీనాడు విషువచ్ఛాయ శూన్యమగును. సూర్యుడు సరిగా శంకువు నెత్తిమీద నుండుటయే దీనికి కారణము. భారతదేశమంతయును భూమధ్య రేఖ కుత్తరముగా నున్నందున నీనాడు శంకువుకు దక్షిణముగా సూర్యుడుండుటచే ఛాయ ఉత్తరముగా వచ్చును. ఈనీడను అంగుళాదిగా కొలవలెను. ఇదే స్వదేశీయ విషువచ్ఛాయ.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున ఛాయాప్రకరణమను నూట డెబ్బది యొకటవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters