Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట డెబ్బదియవ అధ్యాయము - తిథి నక్షత్ర ప్రకరణమ్‌

స్ఫుటగ్రహం లిప్తీకృతం అష్టభిశ్శతై ర్విభ##జేత్‌ ; లబ్దం గ్రహేణ భుక్తా న్నశ్విన్యాద్యాని నక్షత్రాణి; శేషం స్ఫుట భుక్త్యా విభ##జేత్‌ ; లబ్ధం దినాదిఃకలో నక్షత్రప్రవిష్టస్య అవశేష మష్టభ్య శ్శతేభ్యః సంశోధ్య అవమేషాత్ప్రాఫ్ఘుతకాలో నక్షత్రస్థితేఃరాశౌ భుక్తా అభుక్తావా స్ఫుటభుక్తా విభ##జేత్‌; లబ్ధం దినాదిః సంక్రాంతేః గతేష్యః కాలః అథ యోజనకర్ణాంతం సర్వాంత్యా7వశేషకర్ణాద్యంతం వ్యస్తం వ్యాసార్ధేన విభ##జేత్‌; లబ్ధం స్ఫుటాయోజన కర్ణార్థాం గ్రహాః ప్రమాణవ్యాసకలాః స్ఫుటాన్యర్క కర్ణార్ధయోజనాని పాంచసాహస్రికస్యపరిధేః కర్ణోనాని తేనైవ గుణితాని రవివ్యాసేన తద్గణన విభ##జేత్‌; లబ్ధం భూచ్ఛాయా స్ఫుట రాశికర్ణార్ధేన పాంచసాహస్రికస్య; పరిధేః కర్ణహతాం భూచ్ఛాయయా విభ##జేత్‌; లబ్ధం వ్యాసార్దగుణం చంద్రస్ఫుటయోజనకర్ణార్దేన విభ##జేత్‌ ; లబ్ధం రాహు మాసకలాః ; గ్రహమానార్ధకలాః షష్టిగుణా భుక్త్వా విభ##జేత్‌ ; లబ్ధం సంక్రాంతికాలాత్ప్రాగపరేణ చపుణ్యకాలః అర్కోనాచ్చంద్రాల్లిప్తీకృతాత్‌ వయమాగత భుక్తాచ్ఛుక్ల ప్రతిపదాద్యా తిథిః

శేషాత్‌ షష్టిగుణ్యాత్‌ భుక్తాంతరహృతాత్‌ ఘటికాదిఃకాలః కృష్ణ చతుర్ధశాంతః సదైవశకునిః అమాయాఅద్యర్ధే చతుష్పాత్‌ ద్వితీయే నాగః ప్రతిపదాద్యర్ధే కింస్తుఘ్నమ్‌ అర్కోన చంద్ర లిప్తాః ఖరదాగ్నిభిః విభ##జేత్‌; అవశేషాత్తిథివిశేకాలః లబ్ధాదేకోనాశే సప్తమహృతాదవశేషం బవాద్యంకరణం చంద్రా7ర్కయోగే చంద్రార్ధయో రాసవైధృతే తేన చంద్రార్కయోః క్రాంతిసామ్యే ; తత్రవ్యతీపాతౌ భిన్ననయనే గోవైకత్వేచ వైధృతః సమాయనే గోలభేదే చ ధృవకా7ర్కచంద్రయోగాంతరం చంద్రార్క భుక్తియోగేన విభ##జేత్‌.

లబ్ధేన ధృవకాదిత్యే చంద్రార్కయోగాధికావితి; తతో7ర్కాత్‌ క్రాంతిః తాత్కాలికపాతేన చంద్రాత్‌స్వక్రాంతిః ప్రథమ తృతీయ పాదాంతస్థే చంద్రస్య క్రాంతే చంద్రక్రాంతిః యదోనాభవతి తదాక్రాంతి సామ్యారావాః ప్రథమ తృతీయ పదస్థే చంద్రుమసి తదపక్రమ మర్కాపక్రమాదూనే ఏష్యః క్రాంతి సామ్యకాలో7న్యథా7తీతః ; ద్వితీయచతుర్థ పదస్థా7న్యధా విక్షేపేణ స్వక్రాంతిదిగుత్పత్తౌ చంద్రాపక్రమమధికృతం కల్పయేత్‌.

క్రాంతేర్యతు రన్యదిశో రంతరం వ్యతీ పాతే7న్యథా వైధృతిప్రథమాఖ్యః ; ఏవమిష్టకాలికైరర్క చంద్రపాతై ర్ద్వితీయాదయః తతః ప్రథమ ద్వితీయ కాలయోః ద్వయోరేష్యో7తీతోవాపాతః ; తదా తయోరంతరమ్‌; అన్యథా యోగో భాగాపహారః ప్రథమగుణితస్య ఇష్టకాలస్యతే కాలస్య తేన కాలేనా7సకృత్‌ ద్వితీయం కృత్వా విశేష కర్మణా స్ఫుట కాలః సాధ్యః సవ్యతీపాత పాతమధ్యకాలః

ఆదిత్యచంద్రమానయోగః షష్టిగుణో భుక్త్యంతరేణ హృతో లబ్ధా స్థితి రితి.

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే తిథి నక్షత్రప్రకరణంనామ సప్తత్యుత్తర శతతమో7ధ్యాయః .

స్ఫుట గ్రహమును లిప్తలకు మార్చుకొని ఎనిమిది వందల సంఖ్యచే భాగింపవలెను. వచ్చిన లబ్ధము అశ్విన్యాదినక్షత్రము లగును. శేషించిన స్ఫుటమును తిరిగి భాగించవలెను. ఆ లబ్ధము దినము లగును. మేషాది మొదలుకొని జరిగినకాలమును స్ఫుటగ్రహముచే భాగింపగా సంక్రమణము నుండి గతించిన రోజులు వచ్చును. అటుపైని గ్రహముల యోజన కర్ణాంతమును ఆ గ్రహముల వ్యాసార్ధముచేత భాగింపవలెను. లబ్ధము స్ఫుటయోజన కర్ణార్ధ గ్రహమగును.

గ్రహ ప్రమాణ యోజనముల నుండి గ్రహము యొక్క వ్యాసార్ధ యోజనములను దీసివేసి స్ఫుటయోజన కర్ణార్ధముచే భాగింపవలెను. లబ్ధము స్ఫుటగ్రహ ప్రమాణ వ్యాస కళ లగును. ఈ విధముగా వచ్చిన సూర్య కర్ణార్ధ యోజనములను అయిదు వేల సంఖ్యచే గుణించి (పరిధి సంఖ్య) రవి వ్యాసముచే భాగింపవలెను. లబ్ధము భూచ్చాయాస్ఫుట రాశి కర్ణార్ధమగును. పరిధిని (Circumference) కర్ణమునుండి తీసివేసిపై భూచ్ఛాయచే భాగింపవలెను. లబ్ధము వ్యాసార్ధమగును. వ్యాసము (Diametre) ఇది చంద్రస్ఫుట యోజన కర్ణార్ధమగును. గ్రహ ప్రమాణ కళను అరువది సంఖ్యచే గుణించి వ్యాసార్ధ సంఖ్యచే భాగింపగా వచ్చు కాలము పూర్వాపరము లందలి సంక్రమణ పుణ్యకాలము లగును. శేషములను తిథి (30) నక్షత్ర (27)యోగ (25) కరణ (7) సంఖ్యలచే గుణించి వ్యాసార్ధసంఖ్యచే భాగింపగా తిథి నక్షత్ర యోగకరణ ప్రమాణము వచ్చును. సూర్య చంద్ర క్రాంతులు లేనపుడు పాత లేర్పడవు. ఆ రెండు గ్రహముల క్రాంతులు సమ సంఖ్యలో నున్నప్పుడు వ్యాతీపాత వైధృతి యమపాతలేర్పడును. క్రాంతులు అంతరమును 27 చే భాగింపగా వ్యతీపాత వైధృతి పాతల స్ఫుట మధ్య స్ఫుట కాలము వచ్చును.

సూర్య చంద్రుల యోగమును 60 చే గుణించి దానినుంచి భుక్త్యంతరములం దీసివేయగా వచ్చు లబ్ధము తిథి ప్రమాణమగును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురణామందు ద్వితీయ ఖండమున తిథి నక్షత్ర ప్రకరణమను నూట డెబ్బదియవ అధ్యాయము.

నక్షత్ర ధృవకములు మరియు విక్షేపములు - 1987 జనవరి నా1టికి

నక్షత్రముల పేర్లు నిరయనస్థితి

అశ్విని 0 10 07 + 8 29' 12' + 2 45'

భరణి 0 24 21 + 10 26 56 + 27 12

కృత్తిక 1 06 08 + 4 02 59 + 24 4

రోహిణి 1 15 56 - 5 28 06 + 16 29

మృగశిర 1 29 51 - 13 22 16 + 9 56

ఆరుద్ర 2 04 54 - 16 01 43 + 7 24

పునర్వసు 2 29 22 + 6 41 00 + 28 04

పుష్యమి 3 14 52 + 0 04 36 + 18 12

ఆశ్లేష 3 18 29 - 11 06 18 + 6 28

మఖ 4 05 58' + 0 27 52' + 12 02'

పూర్వ ఫల్గుని 4 17 28 + 14 20 00 + 20 36

ఉత్తర ఫల్గుని 4 27 46 + 12 16 04 + 14 39

హస్త 5 19 36 - 12 11 42 - 16 27

చిత్త 5 29 59 - 2 03 13 - 11 06

స్వాతి 6 00 23 + 30 44 42 + 19 15

విశాఖ 6 21 14 + 0 20 05 - 15 59

అనూరాధ 7 08 43 - 1 59 4 - 22 35

జ్యేష్ఠ 7 15 54 - 4 34 06 - 26 24

మూల 8 00 44 - 13 47 12 - 37 06

పూర్వాషాడ 8 10 43 - 6 28 14 - 29 50

ఉత్తరాషాడ 8 18 32 - 3 26 52 - 26 19

శ్రవణ 9 07 55 + 29 18 14 + 8 50

ధనిష్ఠ 9 22 29 + 31 55 10 + 14 33

శతభిష 10 17 43 - 0 23 11 - 7 39

పూర్వాభాద్ర 10 29 38 + 19 24 23 + 15 08

ఉత్తరాభాద్ర 11 15 18 + 19 24 23 + 15 07

రేవతి 11 26 01 - 0 12 49 + 7 30

అభిజిత్‌ 8 21 27 + 61 44 01 + 38 46

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters