Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

పదునేడవ యధ్యాయము - ఖడ్గలక్షణము

పుష్కరః : పురా సుమేరు శిఖరే కాంచనే రత్న పర్వతే | స్వర్గంగా యత్రతే బ్రహ్మాయజ్ఞం యజతి భార్గవ! || 1

తస్మిన్‌ యజ్ఞే స దదృశే విఘ్నం ఖే లోహ దానవమ్‌ | విఘ్నస్య శమనం తస్య చిన్తయామాస తత్త్వవిత్‌ || 2

తదా చిన్తయత స్తస్య పురుషః పావకా ద్బభౌ | నీతోత్పల దళశ్యామ స్స్వరుచా వంచితేక్షణః || 3

ప్రాంశు స్సువదనః శ్రీమాన్‌ బలేనా7ప్రతిమో భువి | స వవన్దే తధా గత్వా దేవం కమలసంభవమ్‌ || 4

అభ్యనన్దన్త జాతేన తేన దేవా స్సవాసవాః | తస్మా త్స నందకోనామ ఖడ్గరత్న మభూ త్తదా || 5

తం దృష్ట్వా భగవాన్‌ బ్రహ్మా కేశవం వాక్య మబ్రవీత్‌ | ఖడ్గం గృహ్ణీష్వ గోప్తారం ధర్మస్య జగతాంపతే! || 6

యజ్ఞ విఘ్నకరం హత్వా ఖడ్గే నానేన కేశవ! | నిపాతయ మహాబాహో! బలినం లోహదానవమ్‌ || 7

ఇత్యేవ ముక్తో జగ్రాహ గ్రీవయా తం జనార్దనః | గ్రహీతమాత్రే దేవేన వికోశ స్సమపద్యత || 8

ఖడ్గః కమల పత్రాక్షో నీతోత్పల సమద్యుతిః | రత్నముష్టి ర్మహాన్రామ! నిర్మలాకాశన్నిభః || 9

పుష్కరుడనియె. మునువు బంగారు సుమేరుపర్వత శిఖరమందలి స్వర్గంగాతీరమందు బ్రహ్మ యజ్ఞము సేయుచుండెను. అందాయన యజ్ఞవిఘ్నము సేయవచ్చిన లోహుడను రాక్షసు నాకాశమునం జూచెను. ఆ విఘ్నము శమింపజేయు నాలోచన సేసెను.. ఆలోచించు చుండగనే యజ్ఞాగ్నినుండి యొక పురుషుడు నల్లగలువరేకు చాయ మేనివాడు లేచెను. బ్రహ్మ తేజస్సుచే వాని కన్నులు మిరుమిట్లు గొనెను. ఎత్తయినవాడు చక్కని ముఖము గలవాడు శ్రీమంతుడు అనుపమాన బలశాలియు నైన యా పురుషుడు కమలజుని దరికేగి మ్రొక్కెను. అట్లు పుట్టిన యా పురుషుని నింద్రాదిదేవతలు అభినందించిరి. దాన నపు డతడు ''నందక'' మను ఖడ్గరత్నమయ్యెను. భగవంతుడగు బ్రహ్మ యా ఖడ్గముం జూచి కేశవునితో ధర్మరక్షకమయిన యీ ఖడ్గము నీవు గైకొనుము.

ఈ కత్తిగొని యజ్ఞవిఘ్నకరుని బలశాలియగు నీ దానవుం గొట్టి పడవేయు మనియె. అది విని జనార్దను డాకత్తిని మెడ యొడ్డి గ్రహించెను. గ్రహించిన మాత్రన దాని యొఱ వదలి పోయెను. ఆకత్తి తామరరేకులట్టి కన్నులు గలది నల్లగలువ చాయ గలది నిర్మలాకాశమట్లు దీపించుచున్నదియు నయ్యెను.

ఏతస్మి న్నంతరే తత్ర వ్యదృశ్యత తదా మహాన్‌ | కరాళః కృష్ణవదనః శతబాహు ర్మహోదరః || 10

ప్రాంశు స్సువృత్త దంష్ట్రాగ్రో బలవాన్‌ లోహదానవః | యజ్ఞ విఘ్నార్థినం ప్రాప్తం స దృష్ట్వా లోహదానపమ్‌ || 11

ఖడ్గమాదాయ వేగేన య¸° తం ప్రతి కేశవః | స కేశవ మనాదృత్య దేవాన్‌ శక్రపురోగమాన్‌ || 12

విద్రావయామాస తదా గదయా భీమవేగయా | తదా భ##గ్నేషు దేవేషు యుద్ధం కృత్వా హరి శ్చిరమ్‌ || 13

ఖడ్గేన తస్య గాత్రాని చిచ్ఛేద మధుహా రణ | ఖడ్గ ఛిన్నాని గాత్రాణి నానాదేశేషు భూతలే || 14

నిపేతు స్తస్య ధర్మజ్ఞ! శతశో7ధ సహస్రశః | నందకస్య తు సంస్పర్శాత్‌ తాని గాత్రాణి భార్గవ! || 15

లోహీభూతాని సర్వాణి ప్రసాదా త్కేశవస్య తు | హతాయా7సై#్మ శరం ప్రాదాద్భగవాన్‌ మధుసూదనః || 16

త్వదంగాని విచిత్రాణి భవిష్యన్తి మహీతలే | ఆయుధాని చతైర్లోకే కరిష్యంతీహ మానవాః || 17

ఏవ ముక్త్వా హరి ర్దేవో బ్రహ్మాణం వాక్య మబ్రవీత్‌ | వినా విఘ్నం మఖ మిదం కరు శీఘ్రం జగద్గురో! || 18

ఏవముక్త స్తదా బ్రహ్మా యజ్ఞేన మధుసూదనమ్‌ | ఆత్మనా పూజయామాస సుసమిద్ధ మనోరథః || 19

ఉత్పత్తి రుక్తా ఖడ్గస్య లోహస్య చ మయా తవ | అతః పరం ప్రవక్ష్యామి ఖడ్గ లక్షణ ముత్తమమ్‌ || 20

ఈలోన నక్కడ భయంకరుడు నల్లని మొగమువాడు నూరుచేతులు పెద్దకడుపు గలవాడగునొక మహాదానవుడు గనిపించెను. ఎత్తుగనున్నువాడు గుండ్రని దంతాగ్రములుగలవాడు బలశాలియగు లోహదానవుడు యజ్ఞవిఘ్నము సేయగోరి వచ్చినవానింగని విష్ణువు. నందకమును నా కత్తింబట్టుకొని వేగమున వాని పైకెగెను. వాడు హరి ననాదరించి ఇంద్రాది దేవతలను భీమవేగమయిన గదచే బారదరిమెను. అట్లు దేవతలు భంగపడి హరి వానితో చిరకాలము పోరి నందకమను నా కత్తితో వాని మేను తనుకతునుకలు గావించెను. ఆ తునుకలు భూతలము నలువైపులం జిమ్ముకొని పడెను. నందక స్పర్శచే ఆ శరీర శకలము లన్నియును హరి యను గ్రహముచే లోహములైనవి. మధువైరి హతుడైనవానింజూచి నీవిచిత్రాంగములివి యవనితలమునం బడినవానిని విచిత్రములైన యాయుధములు గావించి మానవులు వాడుకోగలరు. అని పలికి విష్ణుదేవుండు బ్రహ్మతో జగద్గురూ ! నిర్వఘ్నముగ నిక నీ యజ్ఞమిది గావింపు మనియె. బ్రహ్మ విని సంపూర్ణ మనోరథుడై యజ్ఞముచే మధువైరిని పూజించెను. లోహఖడ్గముయొక్క పుట్టువు నీకు వచించితిని. ఈపైని ఖడ్గ లక్షణము తెల్పెద వినుము.

ప్రధానదేహ సంభూతైర్దత్యాస్థిభి రరిందమ! | లోహం ప్రధానం ఖడ్గర్థే ప్రశస్తం తద్విశేషతః || 21

కటీకదూర ఋషికం వంగేశూర్పావరేషుచ | విదేహేషు తధాంగేషు మధ్యమం గ్రామ చేదిషు || 22

సహగ్రామేషు నీపేషు తథా కలాంజరే7పిచ | లోహం ప్రధానం తజ్జానాం ఖడ్ఘానాం శృణు లక్షణమ్‌ || 23

కటీక దూరజాతాయే దర్శనీయాస్తుతే స్మృతాః | కాయచ్ఛిన్నాస్తు ఋషికా మర్మఘ్నా గురవ స్తధా || 24

తీక్‌ష్ణశ్ఛేథసహా వాంగా దృఢా శ్శూపరికో ద్భవాః | సుహస్తాశ్చైవ విజ్ఞేయాః ప్రభావంతో విదేహజాః || 25

అంగదేశోద్భవా స్తీక్‌ష్ణా శ్చేది దేశ సముద్భవాః | కాళింజరా భారసహా స్తధా వక్ష్యామి లక్షణమ్‌ || 26

ఓ శత్రుఘాతుక ! పరశురామ! దానవుని లోహప్రధాన దేహమునుండి పుట్టిన యెముకల గుటచే ఖడ్గము చేయుటకు లోహము ప్రధాన ప్రశస్త ద్రవ్యము. కటీక దూరము ఋషికము వంగము శూర్పాకరములు విదేహములు అంగములు మధ్యదేశ గ్రామములు చేది దేశము నీ ప్రదేశములు అందలి గ్రామములు కలంజరము. ననుచోటగల (యినుపగుహలలో) లోహము ప్రధానమైనది. దానిచే జేసిన కత్తుల లక్షణము వినుము. కటీక దూరదేశమందలి యినుముతో జేసిన ఖడ్గములు చూడసొంపుగా నుండును. ఋషిక దేశపు నినుప కత్తులు కాయమును నరుకును. మర్మములను జీల్చును. అవి బరువెక్కువవి. వాంగములు (వంగదేశపు యినుముతో జేసిన కత్తులు) చాల పదును గలవి. ఎంత ఘనమైన దానినైన నరక గలవు. శూర్పరిక దేశపు గత్తులు చాల గట్టివి. సుహస్తములు గూడ. (పట్టుకొనుటకు చాల యనువుగ నుండునవి.) విదేహ దేశపు ఖడ్గములు ప్రభావంతములు. (కాంతిచిమ్ముచుండును) అంగదేశ ఖడ్గములు చేది దేశపు బాకుల సుతీక్‌ష్ణములు కాళింజర దేశ ఖడ్గము లెంత బరువైన మోయగలవి. ఇక వాని లక్షణములెరింగించెద.

సుప్రమాణాంగులా స్తే తు శ్రేష్ఠాః ఖఢ్గాః ప్రమాణతః | ప్రమాణం తత్ర విజ్ఞాయ తతో హీనం న ధారయేత్‌ || 27

ప్రమాణా7భ్యధికం చైవ ఛిన్నవంశం తథైవచ | శీఘ్ర స్సుమధుర శ్శబ్దో యస్య ఖడ్గస్య భార్గవ! || 28

కింకిణీ సదృశ స్తస్య ధారణం శ్రేష్ఠ ముచ్యతే | ఖడ్గః పద్మ పలాశాగ్రో మండలాగ్రశ్చ శస్యతే || 29

కరవీర పలాశాగ్ర సదృశస్య విశేషతః | మహీధృత సుగంధశ్చ పద్మోత్పల సుగంధికః || 30

వర్ణత శ్చోత్పలాకార స్సవర్ణో గగనస్య చ | సమాంగుళస్థా శ్శశ్యన్తే వ్రణాః ఖడ్గేషు భార్గవ ! 31

శ్రీవృక్ష పర్వతాకార వంశపద్మ నిభాశ్చ యే | మాంగళ్యానాం తధా7న్యేషాం సదృశా యే చ భార్గవ || 32

కాకోలూక కబంధాభా విషమాంగుళ సంస్థితాః | వంశానుగాః ప్రభూతాశ్చ న శస్తా స్తే కదాచన || 33

న ఖడ్గే వదనం పశ్యేత్‌ వృథా వివృణుయా న్నచ | ఉచ్ఛిష్టోన స్పృశే త్ఖడ్గం నిశిమత్యాచ్ఛ శీర్షకే || 34

దివాచ పూజయే దేనం గంధ మాల్యాను సంపదా ||

ఖడ్గం ప్రశస్తం మణిహేమచిత్రం కోశే సదాచందన చూర్ణయుక్తే |

సంస్థాపయే ద్భూమిపతిః ప్రయత్నా ద్రక్షే త్తధైనంస్వశరీరవ చ్చ || 35

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే ఖడ్గలక్షణంనామ సప్తదశో7ధ్యాయః

ఏ కత్తులైన నంగుళ ప్రమాణము సరిగా నున్నవేని శ్రేష్టములగును. ఏది యెంత కొలతలో నుండవలెనో యెరిగి చేకొనవలెను. కొలత తగ్గిన దానిని వదలివేయవలెను. చెప్పిన కొలతకంటె మించినది వెదురు పిడి పగిలినదియుం బనికిరాదు. వేగముగలది (ఇది బరువునుబట్టి నిర్ణయింపడలెను) చక్కగ గణిల్గణిల్లుమని చిరుగంటలట్టి మ్రోత గల కత్తి చాల శ్రేష్టము. తామరరేకు కొస వంటి కొసగలది కరవీపత్రము కొన వంటి కొనదేరినది (కరవీరము = గన్నేరు) మహీధృతపరిమళము పద్మపరిమళము గలది. రంగులో నల్లగలువం బోలినది ఆకాశమురంగు (నీలము) గలదియునైన ఖడ్గము ప్రశస్తము. ఖడ్గములపై సమాంగుళములుగా (సరికొలతలోనున్న వ్రణములు) నరకులు చాల ప్రశస్తములు. ఆ ముద్రలు కొబ్బరిచెట్టు పర్వతము వెదురు పద్మమునుంబోలియున్నవి. యింకనుంగల మంగశద్రవ్యము లట్లున్నవేని యా ఖడ్గములు శ్రేష్ఠములు-కాకి గ్రూడ్లగూడ కబంధములం బోలినవి విష మాంగుళములందున్న (బేసిసంఖ్య యంగుళములలోనున్నవి) పిడివెంటనున్నవి యొక్కవగా నున్నవి ప్రశస్తములు గావు. కత్తి తళుకులో మొగము జూచుకొన రాదు. పనిలేనిదే యొరనుండి తీయరాదు. ఉచ్చిష్టుడై యున్నపుడు ముట్టుకొనరాదు (అనాచారస్థితియందు తాక రాదన్న మాట.) రాత్రివేళ నొరలో నుంచవలెను.. పగలే గంధమాల్యాదులచే పూజింపవలెను. రత్నాలు బంగారముతో చిత్రితమైన కత్తిని ప్రశస్తముగా దానిని గంధపు పొడినించిన యొరయం దుంచవలెను. తన శరీరమునట్లు దానిని భూపతి రక్షించు కొనవలెను.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున ఖడ్గలక్షణమను పదునేడవయధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters