Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట యారువది ఎనిమిదవ అధ్యాయము - ఉపకరణ వివరణము

అథ భగవంతం భువనోత్పత్తి స్థితిసంహార కారకం చరాచరగురు మతియశస మభిగమ్య భృగుర్వి జ్ఞాపయూమాస భగవాన్‌ జ్యోతిశ్శాస్త్రం వినా గణితేన దురవగాహ మతో గణితవిధి మాచక్ష్వ. త మువాచ శ్రీ భగవాన్‌ శృణు వత్స గణిత జ్ఞానమ్‌.

అనాది నిధనః కాలః ప్రజాపతిః విష్ణు స్తస్య గ్రహగ త్యను సారేణ జ్ఞానం గణితమ్‌; తత్రా7ర్క భాగ భోగః సౌరా7హోరాత్ర స్తిథిశ్చ చాంద్రః ఆర్కోదయాత్తదుదయా త్సావనః; చంద్ర నక్షత్రభోగో నాక్షత్రమ్‌| సావనో7హో రాత్రో నరాణామ్‌; తేషా మార్కం దినం. వ్యర్కా రాత్రి:. చంద్రమాసః పితౄణా మహోరాత్రమ్‌; తేషాం కృష్ణా7ష్టమ్యా మర్కోదయః; అమావాస్యాయాం మధ్యాహ్నః; శుక్లా7ష్టమ్యా మర్కా7స్తమయః; పౌర్ణ మాస్యా మర్ధరాత్రమ్‌; అర్క భగణభోగో దివ్యో 7హోరాత్రః; తేషా మర్కస్య మేష ప్రవేశే సూర్యోదయః; కర్కట ప్రవేశే మధ్యాహ్నః; తులాప్రవేశే 7స్తమయః; మకర ప్రవేశే7ర్ధరాత్రమ్‌ ః

మేషాదిస్థే మధ్యమే జీవే జీవమానై రాశ్వయుజాదయో వత్సారా భవంతి, లంకాయా మర్కోదయే చైత్ర శుక్ల ప్రతిపదారంభే7ర్కదినాదా వశ్విన్యాదౌ కింస్తుఘ్నాదౌ రాత్రా వథా7ర్కోదయే కాలే ప్రవృత్తిః హోరాది ప్రవృత్తిశ్చ. లంకాతశ్చ యావన్మేరో ర్యామ్యోత్తర దేశాం7తరే రేఖా తత్పూర్వేణా7పరేణ బలకాలార్కోదయ కాల ప్రవృత్తిః లంకా7ర్కోదయకాలం తన్మండలం ; స్వదేశ విషువా దర్కోదయ విషువన్మండలత్వం, ప్రతి దినం చరదలవశే నా7ర్కోదయః ! క్షితిజం మండలమ్‌ . తత్రార్క భగమ భోగేన సౌరాబ్దః యేషా మబ్దానాం పూర్ణ యమల గుణ వేదం కలియుగమ్‌; ద్విగుణం ద్వాపరమ్‌; త్రిగుణం త్రేతా; చతుర్గుణం కృతమ్‌; శూన్య చతుష్టయం యమలా7గ్ని వేదై తుర్యుగమ్‌; ఏక సప్తతి శ్చతుర్యుగాని మన్వంతరమ్‌; చతుర్దశ మన్వంతరాణి కల్ప:.

-: భ గ ణ ప్ర మా ణ మ్‌ :-

మన్వంతరాణా మాద్యాంతరాలేషు కృతయుగ ప్రమాణం సంధిః ; ఏవం చ చతుర్యుగ ప్రమాణం స కల్పః ; కల్పే సప్త శూన్యాని వస్వగ్ని వేదాశ్చ భగణ వరివర్తనాని భవంతి; యథా పంచ శూన్యాని గుణాగ్ని పంచ సప్తార్ధ చంద్రాశ్చంద్రమసః ; భౌమస్య ద్విపంచాష్ట నవయమ యమలాః; బుధస్య అష్ట నవాష్ట నవ నవ రామాగ్ని నవ సమచంద్రాః: జీవస్య పంచ పంచ షట్పంచ ద్విషడక్షద్వి కృతరస గుణాః; శుక్రస్య యమ నవాశ్వినవాష్టాగ్ని యమ ఖగిరయః; సౌరేః (శ##నేః) అష్ట నవ యమ గిరి రస పంచ నవాః.

-: మందగతి ప్రమాణమ్‌ :-

ఆదిత్యమందగమనాదా వుదయః; చంద్రమసః; అష్టార్ధ దిక్షష్ఠవేదాః; కుజమందస్య యమ నర పక్షాః; బుధ మందస్య ద్విత్రిగుణాః జీవమందస్య బాణశర వసవః; శుక్రమందస్య గుణ శర వసవః; సౌరమందస్య శశివేదాః.

-: పాతగతి ప్రమాణమ్‌ :-

చంద్రపాతస్య వసురస శశి రుద్రాగ్ని దశన యమలాః ; భౌమపాతస్య మహీధ్ర రంద్ర యమలాః; బుధ పాతస్య చంద్రాధ్యర్ధ యమలాః; జీవ పాతస్య గుణరసాః; శుక్ర పాతస్య త్రినవ వసవః ; అష్ట శూన్యానిలయమరస ఖరవిముని వసు నిశాకరాః.

:- కక్షా ప్రమాణాని :-

నవగ్రహాణాం ప్రాగ్యాప మానానాం కల్పాష్టక కల్పాదనో యస్యభగణభాగో7పక్రియతే- తసై#్యవ కక్షాయోజనాని లభ్యంతే; యస్య బహవో భగణపరి వర్తనాః తస్యో పరి తస్య కక్షా; యస్యాల్పాః కక్షా:- వర్గదశభాగమూల కక్షా కర్ణః; తదర్దే నోపరి భవో గ్రహే7వస్థానం కర్ణ వర్గస్య దశ గుణితస్య మూలకక్షా; ఏవం సర్వవృత్తానాం పరిధి వ్యాసానయనమ్‌ ; యత్ర చ సర్వ గ్రహాణా మేకత్వమేవ దృశ్యతే - ఖరసేందు యమ కక్షా; తస్యా యోజనతలిప్తే మధ్యమఖ ఖరేందు యజ్ఞై ర్యసై#్యవ కక్షా విభజ్యతే - తసై#్యవ లిప్త యోజనాని లభ్యంతే ; కల్పాద్య యోజన సమా వైకక్షాః.

-: గ్రహపతి ప్రమాణాని :-

యదనంతరం వితిమిరం రవిః కరోతి పక్షపక్షే7శ్వతవో దార్క మండల ప్రమాణం ; వేదా శ్చంద్రమసః ; పంచదశ భౌమస్య; షష్టి ర్బుధస్య, ఖర్కా జీవస్య ; ఖఖ యమాః శుక్రస్య ; త్రింశత్సౌరస్య ; ద్వాదశ దృశ్యాంశా శ్చంద్రమసః ; సప్తదశ భౌమస్య, త్రయోదశ బుధస్య.

-: కక్షా ప్రమాణాని :-

భచక్రమందు గ్రహములు సంచరించు మార్గము కక్ష్యయనబడును.

నక్షత్ర కక్ష్య : 257870012 యోజనాలు

శని ,, 127668255 ,,

గురు ,, 51375764 ,,

కుజ ,, 8146909 ,,

రవి ,, 4331500112 ,,

రవికక్షా ప్రమాణమే శుక్ర (శీఘ్రోచ్చ) 2664637 యోజనాలు

రవి కక్షా ప్రమాణమే బుధ (శీఘ్రోచ్చ) 1053208 ,,

చంద్ర ,, 324000 ,,

వీరిపై సిద్ధులు - విద్యాధరులు మేఘము వాయువు అనువారి కక్ష్యలున్నవి.

ఏకాదశ జీవస్య ; నవ చ శుక్రస్య; పంచదశ సౌరస్య ; త్రిభాగోనా శ్చతుర్దశ భాగాః సూర్యస్య; ఏకత్రింశ ద్భాగాః షట్త్రింశల్లిప్తా శ్చంద్రమసః ; సప్తతి ర్బౌమస్య ; వసురామా బుధస్య ; గుణరామా జీవస్య ; భవాః శుక్రస్య ; త్రింశచ్ఛనైశ్చరస్య ; ఏవం పరిధయో భౌమస్య ; శీఘ్ర పరిధి గుణ వేదాశ్చ సంభాగాలిమాః చత్వారింశ ద్బుధస్య ; భాగా యమా7గ్ని చంద్రాః ; అష్టగుణా జీవస్య ; వస్వర్థ పక్షాః శుక్రస్య ; పంచ వింశతిః సౌరస్య ; పరిధివశే నోర్ధ్వ మధశ్చ గ్రహగతిః జ్ఞేయా.

ఖఖరసేందు యమలానాం షణ్ణవతి భాగః ప్రథమా జ్యా ; తదేవం ప్రథమం జ్యాంతరా త్తస్య ప్రథమ జీవతయా భాగముపహృత్యా77ప్తం ప్రథమ జ్యాంతరా త్సంశోధ్య ద్వితీయం జ్యాం7తరం ద్వితీయ ప్రథమజ్యాం7తరయోగే ద్వితీయ ప్రథమం జ్యాం7తరయోగో జీవా ; తతః ప్రథమ జీవా7ప్తం సద్వితీయ జ్యాం7తరా త్సంశోధ్య తృతీయం జ్యాం7తరమ్‌ ; తతో ద్వితీయ జీవ యోగ స్తృతీయా ; తతః ప్రథమ జీవా త్సంశోధ్య చతుర్థం జ్యాం7తరమ్‌ : ఏవం తృతీయ జీవాయాం దత్వా చతుర్థీ జ్యా ; తస్యాః ప్రథమ జీవాయాం భాగ ముపహృత్యా77ప్తం చతుర్థా జ్ఞ్యా7తరా త్సంశోధ్య పంచమం జ్యాం7తరమ్‌ ; తత శ్చతుర్థజీవాయాం దత్వా షష్ఠీ జ్యా.

తతః ప్రథమ జీవాప్తం పంచమే జ్యాం7తరం సంశోధ్య షష్ఠం జ్యాం7తరం పంచమ జీవాయాం దత్వా సప్తమీ జ్యా ; తతః ప్రథమ జీవాప్తం సప్తమ జ్యాంతరా త్సంశోధ్యా7ష్టమమ్‌ ; తత్సప్తమ జీవాయాం దత్వా నవమీ జ్యా ; తతః ప్రథమ జీవాం7తరేణా7ప్తం దశమ జ్యాం7తరా త్సంశోధ్య నవమం జ్యాం7తరమ్‌.

తం నవమజీవాయాం దత్వా దశమీ జ్యా ; తతః ప్రథమ జ్యా7వాప్తమ్‌ ; ఏకాదశ జ్యాం7తరా త్సం శోధ్య ద్వాదశం జ్యాం7తరమ్‌ ; తదేకాదశజీవాయాం దత్వా ద్వాదశీ జ్యా ; తతః ప్రథమ జ్యా7వాప్తం ; ద్వాదశ జ్యాం7తరా త్సం శోధ్య త్రయోదశం జ్యాం7తరమ్‌ ; తత్త్రయోదశ జీవాయాం దత్వా చతుర్దశీ జ్యా ; తతః ప్రథమ జ్యా7వాప్తంచతుర్దశజ్యాంతరా త్సంశోధ్య పంచదశజ్యాంతరమ్‌ .

తత శ్చతుర్దశ జీవాయాం దత్వా పంచదశీ జ్యా తతః ప్రథమ జ్యా7వాప్తం పంచదశా జ్జ్యాం7తరా త్సంశోధ్య షోడశం జ్యాంతరమ్‌ ; త త్పంచదశ జీవాయాం సంశౌధ్య షోడశీ జ్యా; తతః ప్రథమ జ్యావాప్త సప్తదశ జ్యాంతరా త్సంశోధ్య అష్టాదశమం జ్యాంతరమ్‌ ; తత్సప్తదశ జీవాయాం దత్వైకోనవింశీ జ్యా ; తతః ప్రథమ జ్యావాప్త మేకోనవింశా జ్జ్యాంతరా త్సంశోధ్య వింశతితమం జ్యాంతరమ్‌ ; తదేకోనవింశ జీవాయాం దత్వా వింశతితమీ జ్యా ; తతః ప్రథమ జ్యావాప్తం వింశా జ్ఞ్యాంతరా త్సంశోధ్య వింశతితమం జ్యాంతరమ్‌ ; తదేకోనవింశ జీవాయాం దత్వా వింశత్తమీ జ్యా.

తతః ప్రథమజ్యావాప్తవింశా జ్జ్యాంతరా త్సంశోధ్యైకవింశం జ్యాంతరమ్‌ ; తద్వింశతిజీవాయాం దత్వా ఏకవింశీ జ్యా; తతః ప్రథమజ్యావాప్తం ఏకవింశా జ్జ్యాంతరా త్సంశోధ్య ద్వావింశం జ్యాంతరమ్‌ ; తదేకవింశజీవా యాం దత్వా ద్వావింశీ జ్యా ; తతః ప్రథమజ్యావాప్తం ద్వావింశా జ్జ్యాంతరా త్సంశోధ్య త్రయోవింశం జ్యాంతరమ్‌ ; తద్ద్వావింశజీవాయాం దత్వా త్రయోవింశీ జ్యా ; తతః ప్రథమం జ్యావాప్తం త్రయోవింశా జ్జ్యాంతరా త్సంశోధ్య చతుర్వింశం జ్యాంతరమ్‌ | తత్త్రయోవింశజీవాయాం దత్వా చతుర్వింశీ జ్యా ; తతః ప్రథమజ్యావాప్త చతుర్వింశా జ్జ్యాంతరా త్సంశోద్య పంచవింశం జ్యాంతరమ్‌ ; తచ్చతుర్వింశజీవాయాం దత్వా పంచవింశీ జ్యా.

ఖఖరసేందు కక్షాయాం చ వ్యాసార్థం తదేవా7నుపదవ్యాసాయామ్‌ ; జ్యాంతరవ్యస్తానామంతరాలయోగే చతుర్వింశతిశరా భవంతి ; క్రమజ్యాకృతిజీవాభి స్తత్తత్త్ర్కమజ్యాకృతిః శ##రే యాసాం లిప్తానాం జీవా క్రియతే తత్కేంద్రః తస్య చ రాశిత్రయే పదాఖ్యా ప్రథమపదస్థే తద్గమం చతుర్థపదస్థే చక్రా దూనమ్‌ ; జ్యాకేంద్రలిప్తా రాశి లిప్తా7ష్టవిభాగేన విభాజ్యా | లబ్ధాం7కసమాశ్చ స్థాప్యాః | అవశేషం తదనంతరం జ్యాంతరేణ గుణయేత్‌ ; రాశిలిప్తా 7ష్టభాగేన విభ##జేత్‌ | లబ్ధం స్థాపితజీవాయాం దత్వేష్టజ్యా సిద్ధిః .

కాలక్షణభ్యో లిప్తత్వేన పరికల్పితేభ్యో జీవా కార్యా ; లిప్తాభ్యో యావంతి జ్యాంతరాణి సంశుధ్యంతి - తావంతి సంశోధ్యా7వశిష్టభాగలిప్తా7ష్టభాగా7హతమశుద్ధజ్యాంతరేణ విభ##జేత్‌ ; లబ్ధహతాసు ఆద్యష్టకభాగలిప్తాసు క్షిపేత్‌ ; శరాంతరై ః శరచాపః భాగచతుర్వింశతిజ్యాపరమా7పక్రమాజ్యా మేషాదిస్థో విషువల్లేఖాస్థో గ్రహో భవతి ; కుళీరాదిస్థశ్చాం7తరేణ ; పరమా7పర్పమాం7తస్థో భవతి ; తులాదిస్థో విషువలేఖాస్థః మకరాదిస్థో దక్షిణన పరమా 7పక్రమహతాం వ్యాసార్ధేన విభ##జేత్‌ ; లబ్ధం చంద్రస్ఫుటవిక్షేపః.

తాత్కాలికశీఘ్రం స్ఫుటం సుపాతే యోజ్యం ; బుధశుక్రయోః స్వమంద విక్షేపహతాం స్ఫుటాం7త్యకర్ణేన విభ##జేత్‌ ; లబ్ధం తయోః స్ఫుటవిక్షేపః; తాత్కాలికస్ఫుటపాతయోగజ్యాం భౌమజీవసౌరాణాం మధ్యవిక్షేప హతాం స్ఫుట7ంత్యకర్ణేన విభ##జేత్‌ లబ్ధం తేషాం స్ఫుట విక్షేపః ఉత్ర్కాంతిః చాపస్ఫుటవిక్షేపయపయోర్దిశైకోయోగః తజ్జవస్యక్రాంతిః | తస్యా నియోగః శిష్యతే సా దిక్‌ తగ్గోలస్థశ్చ గ్రహో భవతిః ఏవం గ్రహణా ముత్తరేణ దక్షిణన గతిర్ఞేయా.

భచక్రవశేనోదయాస్తమ¸° కుర్వంతః వశ్చియేన మాంతి ; పూర్వాం వ్రజంతో భగణ పరివర్తాన్‌ కుర్వంతి; తత్ర చసూర్యా7శ్వ పాతైః సమమేవ లంకా దక్షిణోత్తర రేఖాయాః ఫాట్గణాంతే సర్వ ఏవ కల్పాదా వర్కోదయే మీన మేష సంధిగా భవంతి; కల్పావసానే చ మేషప్రవేశే వా భానో ర్గగన మధ్య వర్తిన్యాదిత్యే ద్వాదశాంగుళేన శంకునా సమావనౌ చ్ఛాయాశంకు వర్గ యోగేన విభ##జేత్‌; లబ్ధ మక్ష జ్యా వర్గః.

తత్పద మక్షజ్యా; తచ్చాపం స్వదేశాక్ష; తం రాశి త్రయా దపాస్యా స్వదేశా7వలంబకో భవతి; తజ్జ్యావ లంబకజ్యా త్రిజ్యావర్గస్య స్వ స్వక్రాంతివర్గోనస్య పదం స్వాహర్వ్యాసా7ర్ధ స్తస్య చ స్వక్రాంతి వశేన దిక్‌.

స్వక్రాంతి విషువచ్చాయా హతా శంకుహృతా క్షితిజా; సా త్రిజ్యాహతా స్వాహర్వ్యాసార్ధ భాజితాక్షయే వృద్ధిజ్యా; తద్ధనుశ్చరార్ధం వా ప్రాణాః; తద్ఘటికాభిః పంచదశ ఘటికాయుతా దినార్ధమ్‌; ఊనా రాత్య్రర్ధగా; ఏవ ముత్తరగోలస్ధా దక్షిణకారః స్వస్వ భాగావహారః; అవామధమ షామబోధః; శోధనం వ్యక్ష రాశ్యుదయప్రాణాః మేషవృషభమిథునానాం క్రమేణ; కర్కట సింహకన్యానా ముత్క్రమేణ.

-:ఛాయావిషయః:-

మేష వృషమిథున జీవాదిః ప్రాగ్వచ్చర ప్రాణాః కర్తవ్యాః, తేషా మవబోధః శోధనంచ తేనైక ద్విత్య్రాక్షర ప్రాణాఃతైః క్రమేణ మేషవృషమిథునాః ప్రాణహీనాః; ఉత్క్రమేణ కుళీరసింహకన్యానామ్‌; యుక్త స్వదేశే చరా వ్యుదయ ప్రాణాభవంతి; తేఏవోత్క్రమేణ తులాదీనాం మీనాదీ నామపి; అర్ధదిన మధ్యాహ్న చ్ఛాయా7 గ్రమూలయామ్యోత్త రాగ్రమూలాగ్ర పరిలేఖ మత్స్యముఖ పుచ్ఛరేఖా ప్రాచ్యా7వరా ఆదిత్యచంద్రయో రన్యతమస్య దేశాంతరకర్మ వినాగ్రహణంన కార్యమ్‌; తద్యథా గతే కాలే యది భవతి తదా రేఖా మధ్యే స్వదేశో జ్ఞేయః.

అథా77దౌ రేఖా పశ్చాచ్చేత్‌ ప్రాక్తత్కాలా7ంతర షష్టిహతం పంచభిః సహసై#్త్రర్విభ##జేత్‌; లబ్ధదేశాంతర యోజనాని గ్రహస్యా7ర్ధం రాత్రా న్మధ్యాహ్నం యావత్పూర్వః కాలో మధ్యాహ్నాదవర రాత్రం యావదపరః; తత్రా 7ర్కస్య కాలమవిలంఘయన్‌ చ్ఛాయా ద్వయం గృహ్ణీయాత్‌.

-: విఘవచ్ఛాయా గ్రహణమ్‌ :-

తత్కర్ణౌ వ్యత్యాసేన శంకుప్రాఛ్య పరాంతేరహితౌ; తదనంతరం విఘువచ్ఛాయా గ్రహణమ్‌; ఇష్టే7హ్ని; ఇష్టదినాక్ష వైఘవతా7క్షా7ంతమ్‌; ఏక దిగభియుఖీ భ్యశ్ఛాయాభ్యో స్వప్తరాక్రమః; తేన త్రిజ్యాహతా పరమా7పక్ర మజ్యయా విభ##జేత్‌; లబ్ధచాపమర్కఃప్రథమే పదే ద్వితీయాద్భావాచ్ఛుద్ధః తృతీయే యుక్తః చతుర్థే చక్రా చ్ఛుద్ధః; విషువచ్ఛాయాతరుణా చ హీయమానా చ ప్రథమ పదస్థే7ర్కే భవతి; ఊనా వృద్ధిమతీ ద్వతీయస్థే; హీయమానా7ధికా చతుర్థస్థే; ఏవ మతీతదివస్కా7ర్కస్య తదర్కస్య చ వివరం స్ఫుటభుక్తిః.

ఆదిత్యోదయా7స్తమయాద్వా చంద్రోదయం దృష్ట్యా నగ్రదద్ధరితో7ర్కః; తేన కాలేన చంద్రమా భవతి చంద్రాన్నక్షత్ర జ్ఞానమ్‌; చంద్రా7ర్కవివరా త్తిథిజ్ఞానమ్‌; తస్మా దహర్గణః ; స్ఫుటార్కా ద్విపరీతకర్మణా మధ్య మా7ర్కః ; సౌరజీవయో శ్చారా త్సంవత్సరః ; చంద్రవ త్సర్వగ్రహక్రియా; గ్రహేభ్యో వాకల్పగతకాలజ్ఞానమ్‌; ఏవం కాలవరిచ్ఛేదః.

-: నక్షత్ర ధృవకాః :-

అశ్విన్యాదీనాంధ్రువకా రాశ్యాధ్యాః, ఖమష్టౌ ఖం ఖం ఖయమాః ఖం శశీ మునయో7ష్టయమాః, శశీ నవేంద వో7శ్వయమాః, వక్షౌ గుణాః ; స్వపక్షౌశైలాః; ఖం గుణా గుణాః ; ఖం గుణా షోడశ ఖం వేదా రంధ్రాణి ఖం వేదా స్సప్తయమాః, ఖం శరా నఖాః ; ఖం రసాః పుష్కరాః; ఖం రసా నవేందవః ; ఖం సప్త వక్షౌ శరా మునయో మనవో భూతాని చసప్త నవేందవః పంచ అష్టౌ చ ఖం అష్ట చత్వారి ఖం నవ వసవః ఖం సూయమునయః ఖమ్‌.

-: నక్షత్ర విక్షేపాః :-

అథై తేషాం విక్షేపాంశాః దశ ద్వాదశ పంచదశ ఏకాదశ షట్‌ఖం సప్తఖం ద్వాదశ త్రయోదశ ఏకాదశ ద్వా వష్టాత్రింశత్సార్దం త్రీణి చత్వారి సార్ధాన్యష్టౌ పంచ విభాగాః ; వంచ ద్విషష్టిః త్రింశదంశభాగః చతుర్వింశతిః షడ్వింశతిః శూన్యం చా7శ్వినీ భరణీ కృత్తికా పునర్వసు పుష్యమఘా భాగ్యా7ర్యమాణః ; స్వాతి వైశ్వ దేవా7భిజి చ్చ్రవణ ధనిష్ఠా7జా7హిర్బుధ్న్య రేవతీనామ్‌ ఉత్తరా రోహిణీ సౌమ్యా77ర్ద్రా సార్ప హస్త చిత్త్రా విశాఖా మైత్రేంద్ర మూలా7వ్య వారుణానాయామ్యాః ; రేవత్యుదయః ప్రాచీ ; సర్వస్య మహతీ యోగతారా రాశిద్వయం ; సప్తవింశతి ర్భాగాః అగస్త్యధృవకః సప్తభిర్భాగై స్తస్య యామ్యో విక్షేపః.

-: గ్రహ వక్రానయనమ్‌ :-

అథ భౌమాదీనాం వక్రకేంద్రాణి రాశ్యాద్యాని పంచ మనవః ఖవేదాః షడ్యమాః ఖం పంచ వేదాః ఖం పంచ పంచదశ ఖం వేదా స్త్రయోదశ ఖమ్‌.

అథా7నువక్రకేంద్రాణి షడ్‌ షోడశ ఖం సప్త వేదాః ఖం షడ్యమాః ఖం షట్‌ పంచ వింశతిః ఖం ఖం మనవః ఖం షడ్‌ గుణాం ఖమ్‌ సప్తదశ ఖమ్‌.

అథ పూర్వద్వారోదయకేంద్రాణి ఖ మష్ట యమాః ఖం షట్‌ పంచవింశతిః ఖం ఖం మనవః ఖం షడ్గుణాః ఖం ఖం సప్తదశఖమ్‌.

అథ వశ్చా7ర్ధా7స్తమయకేంద్రాణి ఏకాదశ ద్వౌ ఖం పంచ పంచ ఖం ఏకాదశ షోడశ ఖం పంచ సప్త వింశతి ఖం ఏకాదశ త్రయోదశ ఖమ్‌.

అథ బుధశుక్రయోః పూర్వా7ర్ధాస్తమయకేంద్రే దశ దశ ఖం ఏకాదశ షోడశ ఖం చత్వారి శూన్యాని చత్వారి శూన్యాని చత్వారి శూన్యాని పంచ వేద రసా7గ్ని యమవక్షా7ష్ట శ##రేందవః కల్పనప్రతి నక్షత్రోదయః త ఏవా7ర్కభగణోనా దివసాః.

అర్కభగణా ద్వాదశహతాః తే మసాః తైః త్రింశద్ధతాః తద్దివసాః, చంద్రభగణాః సప్తవిశంతిహతా నక్షత్ర దివసాః భగణాంతర మర్కేంద్వోః చంద్రమసః తేత్రింశద్గుణాః తద్దివసా శ్చాంద్రమాసః. సూర్యవాసేనాధిమాసాః చంద్ర దివసస్తు దివసాంతర మవమానీతి.

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరరే ద్వితీయఖండే ఉపకరణ వివరణం నామ అష్టషష్ట్యుత్తర శతతమో7ధ్యాయః.

ఉపకరణ వివరణము

(గమనిక:- ఈ జ్యోతిః శాస్త్రాధ్యాయములందలి సిద్ధాంతగణితము 'పైతామహ' సిద్ధాంతము అని యున్నది. కాని ఇచ్చట సూర్య సిద్ధాంతాదికమును అనుసరించి ఆయాధ్రుపకములును గణిత క్రమమును ఈయబడుచున్నవి.)

పుష్కరుండనియె: అటుపై జగదుత్పత్తి స్థితిలయ కారణము స్థావరజంగమగురువు మహా యశస్వియునగు భగవంతుని సన్నిధికేగి భృగుమహర్షి భగవంతుడా! గణితములేకుండ జ్యోతి శ్శాస్త్రము దురవగాహము కావున గణిత విధాన మానతిమ్మని భృగుమహర్షి యడుగ నాతనికి భగవంతుడు వత్సా! (నాయనా) వినుమని యిట్లనియె.

కాలము అద్యంతములేని ప్రజాపతి విష్ణుస్వరూపము; గ్రహగతి ననుసరించి అట్టికాలము యొక్క పరిజ్ఞానమే గణితము, అందు సూర్యచంద్రులకు పండ్రెండు భాగల దూర మెడమున్నపుడది యొకతథి; అది శుక్ల పాడ్యమితో ప్రారంభమగును. ఇట్లు లెక్కపెట్టగా వచ్చినవి తిథులనబడును. ఈతిథినే చంద్రమాన మందురు.

సూర్యదయమునుండి మరల సూర్యోదయము దనుక అయిన లెక్కను సావనమాన మందురు. చంద్రుడు ఆయా నక్షత్రములందు సంచరించు కాల పరిగణనము నక్షత్రమానము; సావనాహోరాత్రములు మానవులకు హవ్య కన్యాదులకు ముఖ్యములు. అందులో సూర్యుడు కనిపించు కాలము దినము (పగలు) కనిపించనిది రాత్రి. ఒక చాంద్రమాసమే పితృదేవతల కొక అహోరాత్రము; మన కృష్ణాష్టమి వారికి సూర్యోదయకాలము మన అమావాస్య వారికి మధ్యహ్నము.

శుక్లాష్టమి సూర్యాస్తమయము; పూర్ణమ అర్ధరాత్రి; అర్కభగణభోగము సూర్యుడు పండ్రెండు రాసులందు సంచరించిన కాలము దేవతలకొక అహోరాత్రము (రోజు) మానవులకది ఒక సంవత్సరము; మనకు సూర్యుడు మేషములో ప్రవేశించు రోజు వారికి సూర్యోదయ సమయము. కర్కటక ప్రవేశము మధ్యాహ్నము; తులారాశి ప్రవేశము అస్తమయ కాలము; మకర ప్రవేశము వారికి అర్ధరాత్రము.

మానవులకు ఆశ్వయుజ మాసములో బార్హస్పత్య (గురు) మాస మారంభమగును. మానవులకు లంకయందు సూర్యోదయ సమయు చైత్ర శుక్ల పాడ్యమి ఆదివారము అశ్వినీ నక్షత్రము కింస్తుఘ్న కరణము నందు; అదే మానవ యుగారంభము. హోరాది కాలము లెక్క ప్రారంభము. హోర=ఒకగంట. 21/2 ఘటికలు; లంకనుండి మేరువుదాక దక్షిణోత్తరముగను యవకోటి నుండి రోమకము దనుకను రెండు సరళ రేఖలు గీసినపుడు దక్షిణోత్తరరేఖా ప్రాంతమును లంకార్కోదయ మండల మందురు. లంకకు ''రాక్షసాలయము'' అను పేరు జ్యోతిశ్శాస్త్ర ప్రసిద్ధము; అవంతి (ఉజ్జయిని) మీదుగా నుత్తరముగా వెళ్ళు ఈ రేఖను భారత భూమధ్య రేఖ యని కూడ వ్యవహరింతురు. తూర్పు పడమరలుగా నున్న రేఖ మొదట బిందువునందు సూర్యోదయమయి పశ్చిమ బిందువు నందస్తమయ మగుచుండును. సూర్యసంచార మండలమని దీన నందురు. లంకార్కోదయ మండలము ననుసరించి స్వదేశ విషువ చ్ఛాలను గ్రహించి (రాత్రి పగలు సమముగ నుండు సమయుము విషువము - విషువత్తు అనబడును. స్వదేశమునకు సూర్యోదయ కాల నిర్ణయము సేయు మండలము క్షితిజ మండల మనబడును. ఈ రీతిని నిర్ణయింపబడిన మండలమందు సూర్యుడు మేషాది పండ్రెండు రాసులందు సంచారమును భగణమందురు. అట్టి 1 భగణమును పూర్తి యేయు కాలమును మానవ సౌర సంవత్సర మందురు. ఆ సౌర సంవత్సరముల ననుసరించి పురాణ ఋషులు యుగాది పరిగణనము సేసినారు. ఆ వివరము లీ క్రింది పట్టికలందు స్పష్టపరుపబడుచున్నవి. ఈలాటి గణితమునుదెలుపు గ్రంధాలు మూడు రకాలు. వీనికి వేదమలు. వేదోపబృంహకములయిన పురాణములు మొదలగు ఆర్షవాజ్మయము మూలమయి యున్నవి.

అవి 3 రకాలు:- (1) కల్పాది (సృష్టి మొదలు) అహర్గణ సాధన సేయునవి - సిద్ధాంత గ్రంథములు.

(2) సూర్య సిద్ధాంతాదలు - యుగాదిగ అహర్గణ సాధన సేయునవి.

(3) తంత్రములు - శాలివాహనాది శకముల అహర్గణ సాధన సేయునవి - కరణములు.

గ్రహముల భగణకాల రాశి భోగములు

______________________________________________

గ్రహము భగణకాలదినాది రాశి భోగకాలదినాది

రాశి భాగ విక్తలు

______________________________________________

రవి 365 15 31 30 26 18

చంద్ర 27 19 18 2 16 36

కుజ 686 59 51 57 14 59

బుధ శీఘ్రోశ్చ 87 58 11 7 19 51

గురు 4332 19 13 361 1 36

శుక్ర శీఘ్రోశ్చ 224 41 55 18 43 30

శని 10765 46 30 897 8 52

చంద్రోచ్చ 3232 5 37 269 21 28

రాహు 6744 23 59 566 12 0

______________________________________________

కక్ష్యాపరిధి (కక్ష్యల చుట్టుకొలత)

గ్రహములు దిరుగు మార్గము కొలతలు

______________________________________________

గ్రహము చట్టు కొలత యోజనాలు

______________________________________________

సూర్యుని కక్ష 4331500 పరిధి=Circumference

చంద్ర 324000 వ్యాసము= Diametre

బుధ 1043209 నిజానికి గ్రహములు గ్రహములు తమ ఈ కక్ష్యా

శుక్ర 2664637 పరిధివెంట స్ఫుటముగా సంచరింపవు. దానికి కొంత

సూర్య 4331500 పైకి క్రిందకి ఒక్కొక్కటి కదలుచుండును. ఈ

కుజ 4046909 హెచ్చు తగ్గుల అవధుల మధ్యకే పరమెచ్చ పరమ

చంద్రోచ్చ 38328484 నీచ మంద పరిధులని శీఘ్ర పరిధులని పేరు.

గురు 51375764 సూర్యకాంతి దీనికి లోపుగానే ప్రకాశించును. ఇదే

రాహు 80572864 లోకాలోక పర్వతము. ఆకాశ మ్రహ్మండ సంపుట

శని 127668255 పరిధి.

నక్షత్ర 259890012

_______________

18712080864000000

______________________________________________

ఈ నేటి శ్వేతవరాహ కల్పములో 1 స్వాయంభువ 2 స్వారోచిష 3 ఉత్తమ 4 తామస 5 రైవత 6 చాక్షుషములు ఆరుమన్వంతరములు గడచినవి. ఇప్పుడు సప్తము వైవస్వత మన్వంతరము నడచుచున్నది; వైవస్వత మనువు ఇప్పుడున్నారని కూడ గ్రహింప నగును. ఇక రాబొవు మనువులు 8 సూర్యసావర్ణి 9 ధర్మసావర్ణి 10 దక్షసావర్ణి 11 రుద్రసావర్ణి 11 బ్రహ్మ సావర్ణి 13 రౌచ్య 14 భౌత్యులు.

ప్రసంగవశమున గమనించవలసినది :

ఈ శ్వేత వరాహ కల్పములో వైవస్వత మన్వంతరమందు 27 మహాయుగములు గడచినవి. నేడు అష్టావింశతి (28) మహాయుగము; ఇందులో కలియుగము సాగుచున్నది.

ఇందు శ్రీ శంకర భగవత్పూజ్యావతారాబ్దములు 2007

రామానుజాచార్య 909

మధ్వాచార్య 872

శాలివాహన శక 1908

ప్రభవాది గతాబ్దములు 59

ఇంకొక రకము యుగమున్నది:

5 సంవత్సరాలలో 1 యుగము 2 సంవత్సరము 3 పరివత్సరము 4 ఇడావత్సరము 5 ఇద్వత్సరము: వీనిలో చివరి నాల్గు యుగాలు అధమముల: ప్రస్తుతము (1986-87) ఇద్వత్సరము: దీనిని గురించి విష్ణధర్మోత్తరమందు ఇద్పూర్వేజత స్యాపి దానం ప్రోక్తం మహాఫలం. ఈ సంవత్సరమందు వెండి దానము మహాఫలప్రదము. ఇందులో ''స్వల్పోదకం పంచమ మబ్ద ముక్తమ్‌'' ఈ యిద్వత్సరంలో నీటి కరువుండునని ఋషులన్నారు. అది మనము చూచుచున్నాము. కావున ఋషుల యెడ విశ్వాసమవసరము.

మహాయుగమలో

______________________________________________

గ్రహసావన దినములు గ్రహభగణములు

______________________________________________

రవి 1577917828 4320000

చంద్ర 1524484492 57753336

కుజ 1579940996 2296832

బుధ 1564300768 17937060

గురు 1581873608 364220

శుక్ర 1575215452 7022376

శని 1582091260 146568

______________________________________________

యుగము సౌర సం.రాల ప్రమాణము అది సంధి కాలము అంత సంధికలము

కలి 432000 36000 36000

ద్వాపర 864000 72000 72000

త్రేతా 1296000 144000 144000

కృత 3456000 288000 288000

యుగము సౌర సం||రాల ప్రమాణము ఆది సంధి కాలము అంత్య సంధికాలము

మహాయుగము 6048000 540000 540000

71మహాయుగము 593748000 మనుసంధి మనుసంధి

1 మన్మంతరము 1728000 1728000

కల్పము 8102472000 4320000000 4320000000

14 మన్వంతరాలు బ్రహ్మకొక పగలు కల్ప సంధి కల్పసంధి

2 కల్పాలు 16204944000

బ్రహ్మకొక రోజు

బ్రహ్మకుసం. 563378984000 బ్రహ్మ సృష్టికి ముందు ధ్యాన కాలము

360 రోజులు బ్రహ్మ సంవత్సరం 1706400 సౌర సంవత్సరాలు

1100 56337898400000

సం. రాలు బ్రహ్మ ఆయుర్దాయం

బ్రహ్మకు నేటి 51 సంవత్సరాల 1 రోజులో ఘ. 13-42 విఘడియలు గడచినవి. అనగా 6 మన్వంతరములు, 7 మనసంధులు, 27 మహాయుగాలు 4 కృత 5 త్రేతా 6 ద్వాపర యుగాలు గడచినవి.

ప్రస్తుతం కలిలో 5087 సం.రలు గడచినవి.

విధ్య దక్షిణమున చాంద్రమానము (నాక్షత్రమానమిదే) వింధ్యకుత్తరమున బార్హస్పత్య మానము. సౌర సావనమానం యజ్ఞాదులలో గ్రాహ్యము.

భూమ్యాది లోకముల కాల గణనము

భూ (మానవ) లోకము పితృలోకములో దేవలోకములో బృహస్పతి లోకములో బ్రహ్మలోకములో

1. సం. రము 12 రోజులు 1 రోజు 5 ఘటికలు -

60 సం. రాలు 2 సం.లు ఋతువు (2మా) 5 రోజులు 1 విఘటిక

కలియుగము 14400 సం. 1200 సం. 100 సం. 6 విఘ.

ద్వాపర 28800 2400 సం. 200 సం. 12 విఘ.

త్రేతా 43200 3600 సం. 300 సం. 18 విఘ.

కృత 57600 4800 సం. 400 సం. 24 విఘ.

మానవ పితృ దేవ బృహసృతి భూపతి బ్రహ్మ

మహాయుగ 144000 1200 1000 1 ఘటిక

మన్వంతరం 10088000 924000 77000 1 రోజు

కల్ప 14400000 12000 1000000 15 రోజులు (పక్షము)

కాలమానము

తృటి=సూది మొన తామర పువ్వు చివరి రేకు దాక తాకు కాలము

100 తృటులు=1 లవ 30 లవలు = 1 నిమేషము

27 నిమేషాలు = 1 గుర్వక్షరోచ్చారణ కాలము 10 గుర్వక్షరాలు = 1 ప్రాణము

6 ప్రాణాలు = 1 వినాడి (విఘటిక) 60 వినాడులు =1 నాడి (ఘటిక)

21/2 ఘటికలు = 1 గంట 60 నిమిషాలు

దేశమానము - విష్ణుధర్మోత్తరము 1 ఖండములో 4 అధ్యాయము.

పురాణ ప్రోక్తదేశకాల మానములు - విష్ణుధర్మోత్తరం 1 ఖండం 4 అధ్యాయం.

సూర్యుని కాంతి కిటికీ రంధ్రము నుండి ప్రవేశించునపుడు క్షిప్త ధూళి కనిపించును. ఆ ధూళి లేశము త్రసరేణువులు.

8 త్రసరేణువులు 1లిక్ష 3 లిక్షలు 1 రాజ సర్షపము

3 రాజ సర్షపాలు 1 గౌర సర్షపము 6 గౌర సర్షపాలు 1 యవ

8 యవలు 1 అంగుళము 12 అంగుళములు 1 శంకువు

2 శంకులు 1 హస్తము 4 హస్తాలు ధనుస్సు

వేయి ధనుస్సులు ఒక క్రోను 2 క్రోనులు 1 గవ్యూతి

4 గవ్యూతులు ఒక యోజనము 5 మైళ్ళు 800 వందల యోజనాలు శేషస్థానము

అదేవరాహ స్థానము అదే పాతాళము అశేష పర్యంకము.

పాతగతి

సూర్యాది గోళముము లంబాంశలో సరళ##రేఖలో నుండుట పాత మనబడును, కోటి సంవత్సరముల కాయా గ్రహముల పాతగతి ప్రమాణమును ఇక్కడ ఇచ్చుచున్నాము. దానిని బట్టి కల్పమునకగు మొత్తము పాతగతి సంఖ్య యిక్కడ ప్రమాణములో నిచ్చిన దానికి సరిచూచుకోవలెను.

కోటి సంవత్సరాలకు గ్రహముల మందగతి ప్రమాణము

రాశి భాగ లిప్త

రవి 10 22 30

చంద్ర 9 10 0

కుజు 8 26 40

బుధ 10 6 40

గురు 10 6 40

శుక్ర 2 25 50

శని 9 10 0

పాతగతి ప్రమాణము కోట్లసంఖ్యలో

కోటికి సంఖ్య పాతగతి

రాశి భాగ లిప్త

కుజ '' 5 28 20

బుధ '' 1 16 40

గరు '' 4 25 0

శుక్ర '' 1 2 30

శని '' 6 11 40

చంద్రుడు '' 11 16 40

యగ్మాంతందపరిధి ఓజాంత మంద పరిధి యుగ్మాతం శీఘ్ర పరిధి బీజాంత శీఘ్ర పరిధి

భాగలు లిప్తలు భాగలు లిప్తలు భాగలు లిప్తలు భాగలు లిప్తలు

రవి 14 0 13 40

చంద్ర 32 0 31 40

కుజ 75 0 72 0 235 0 232 0

బుధ 30 0 28 0 133 0 132 0

గురు 33 0 32 0 70 0 72 0

శుక్ర 12 0 11 0 262 0 260 0

శని 49 0 48 0 39 0 40 0

జ్ఞాపిక:- ఈ గ్రహకక్ష్యలు వృత్తములు ఒకేరీతి వృత్తములో ఒకే రీతి దీర్ఘవృత్తములనిగా గ్రహింపరాదు. ఈ పరిధులను బట్టియే రవ్యాది శన్యంత గ్రహముల మంద శీఘ్ర పఫలమును గ్రహింపవలసి యుండును. జ్యోతిష గ్రంథాలు 3 రకాలు : 1. కల్పాది (సృష్ట్యాది) అహర్గణ సాధకములు సిద్ధాంత గ్రంథములు 2. యుగాది అహర్గణ సాధకములు తంత్రములు 3. శాలివాహన శాకాది అహర్గణ సాధకములు కరణములు.

మహాయుగమలో గ్రహ భగణములు

రవి 43,20,000

చంద్ర 5,77,53,336

చంద్రోచ్చ 4,88,199

చంద్రపాత 2,.32,242

కుజ 22,96,832

బుధ 1,79,37,044

గురు 6,34,212

శుక్ర 70,22,364

శని 1,46,580

శక 421. చైత్ర బహుళ నవమి పగలు 12 గంటలకు మధ్య గ్రహములు

______________________________________________

రా భా లి విలి

______________________________________________

రవి 0 0 0 0

చంద్ర 9 10 48 00

చంద్రోచ్చ 1 05 42 00

కుజ 0 07 12 00

బుధ 6 00 00 00

గురు 6 06 00 00

శుక్ర 11 26 24 00

శని 1 19 12 00

______________________________________________

మందోచ్చ మరియు పాతల వార్షికగతి (విలిప్తలలో)

ఉచ్చ పాత

రవి + 0.1161

కుజ + 0.0612 - 00642

బుధ + 0.1104 - 0.1464

గురు + 0.27 - 00522

శుక్ర + 0.1605 - 0.2709

శని + 0.0117 - 0.1986

కక్షామాన యోజనములు

చంద్ర 324000 బుధ శీఘ్ర 1043209

శుక్ర శీఘ్ర 2664637 రవి 4331500

కుజ 8146909 గురు 51375764

శని 127668255

నక్షత్రమండలము 259890012 ఆకాశ మండలము 1872080864000000

నక్షత్ర ప్రదిక్షిణ కాలము

దినములు ఘడియలు విఘ లి

రవి 365 15 31 31.4

చంద్ర 27 19 17 1.6

చంద్రోచ్చ 3232 5 37 13.6

రాహు 6794 23 59 23.5

బుధ 87 58 10 55.7

శుక్ర 224 41 54 50.6

కుజ 686 59 50 5.87

గురు 4332 19 14 20.9

శని 10765 46 23 4.1

గ్రహముల మందోచ్చలు పాతలు

రా భా లి విలి రా భా లి విలి

రవి 2 17 07 48

కుజ 4 09 57 36 1 10 8 24

బుధ 7 10 19 12 0 20 52 48

గురు 5 21 00 00 2 19 44 24

శుక్ర 2 19 39 00 2 00 01 48

శని 7 26 36 36 3 10 37 12

గ్రహ విక్షేపములు

భాగలు లిప్తలు

చంద్ర 4 30

కుజ 1 30

బుధ 2 00

గురు 1 00

శుక్ర 2 00

శని 2 00

పశ్చాదస్తాది సూర్వాస్తమయ పర్యంతం దిన ప్రమాణ చక్రం

గ్రహములు పశ్చాదస్తాత్‌ ప్రాగుదయం వక్రాత్‌ ఋజుత్వాతం పశ్చాదుదయాత్‌

ప్రాగుదయాత్‌ వక్రత్వం ఋజుత్వం పశ్చాదస్తం వక్రత్వం

కుజ మా.4 మా. 10 మా. 2 - -

బుధ ది 16 - - - ది. 32 ది. 32

గురు మా. 1 మా4 1/2 మా. 4 - -

శుక్ర ది. 7 1/2 - - మా. 2 మా. 8

శని మా. 1 1/2 మా. 3 1/2 మా. 4 1/2 - -

వక్రాత్‌ పశ్చాదస్తాత్‌ పూర్వోదయాత్‌ ఋజుత్వాత్‌

పశ్చాదస్తం పూర్వోదయం ఋజుత్వం ప్రాగస్తమయం

కుజ - - - -

బుధ ది. 3 - ది. 3 ది. 32

గురు - - - -

శుక్ర ది. 22 1/2 - ది. 22 1/2 మా. 8

శని - - - -

వక్రాది దిన ప్రమాణ చక్రము

గ్రహములు వక్రప్రమాణ ప్రాగుదయాత్‌ పశ్చాదుదయాత్‌ పశ్చాదస్తాత్‌ ప్రాగస్తాత్‌

దినాని పశ్చాదస్త దినాని పశ్చాదస్త దినాని మౌఢ్య దినాని మౌఢ్య దినాని

దినాః దినాః దినాః దినాః దినాః

కుజ 66 660 - - 120 -

బుధ 21 37 35 16 32

గురు 120 372 - 30 -

శుక్ర 52 251 262 10 60

శని 135 342 - 36 -

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters