Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట అరువదియవ అధ్యాయము - మంత్రాధ్యాయ వర్ణనము

రామః - ఛత్రాణాం కేతుకరిణాం పతాకా ఖడ్గచర్మణామ్‌ | తధాదుందుభి చాపానాంబ్రూహి మంత్రాన్‌ మమానఘ!

పుష్కరఃశృణు! మంత్రాన్‌ మహాభాగ! భగవాన్‌ యత్పరాశరః | గాలవాయ పురోవాచ సర్వధర్మ భృతాం వరః ||

రాజచ్ఛత్రముల (గొడుగుల) జెండాల ఏన్గుల పతాకల కత్తుల వాడులయొక్క దుందుభులయొక్క బాణములయొక్కయు మంత్రములను దెల్పుమని పరశురాముం డడుగ పుష్కరుండిట్లనెయి : మహానుభావా! పరాశర భగవానుడు మున్ను సర్వధర్మినిధి గావున గాలవునకీ మంత్రములను జెప్పెనె. వినుము.

పరాశరః - యధా7ంబుదశ్ఛాదయతి శివాయేమాం వసుంధరామ్‌ |

తధా ఛాదయ రాజానం విజయారోగ్య వృద్ధయే || ఇతి ఛత్రమంత్రః

ఛత్ర మంత్రార్థము :- జగన్మంగళము కొఱకు మేఘమీ వసుమతిని గప్పినట్లు ఓ ఛత్రమా! విజయము కొఱకు అభివృద్ధి కొఱకు నీవు రాఉను గప్పుము. నీ నీడనిమ్మని యర్థము.

పరాశరః - గంధర్వకుల రాజస్త్వం మాభూయాః కులదూషకః | బ్రహ్మణః సత్యవాక్యేన సోమస్య వరుణస్య చ ||

ప్రభావశ్చ హుతాశస్య భవస్యత్వం తురంగమః | తేజసా చైవసూర్యస్య మునీనాం తపసా తధా ||

రుద్రస్య బ్రహ్మచర్యేణ పవనస్య బలేనచ | స్మర త్వం రాజపుత్రో7సి కౌస్తుభంచ మణిం స్మరః ||

అశ్వ మంత్రార్థముః- ఓ గుఱ్ఱమా! నీవు గంధర్వకుల ప్రభువవున. నీ కులమును జెఱుపకుము. చెడ్డమాట రానివ్వకుము. బ్రహ్మ సోముడు పరుణుడుననువారి నిజమైన మాటననుసరించి అగ్నిహ్రోత్రునియొక్క ప్రభావము నీవే. సూర్యునియొక్క తేజస్సు చేత మునుల తపస్సుచేత రుద్రుని బ్రహ్మచర్యముచే వాయువుయొక్క బలముచే నీవు గంధర్వ (అశ్వ) కులమునకు బేరు సంపాదింపుము. నీవురాకుమారుడ వన్నమాటను జ్ఞాపకము సేసికొనుము. కౌస్తుభమణిని జ్ఞప్తి చేసికొమ్ము. (కౌస్తుభమణితో బుట్టినవాడవన్నమాట మఱువకుమన్న మాట.)

యాంగతిం బ్రహ్మహా గచ్ఛేత్‌ పితృహా మాతృహా తధా | భూమ్యర్థే7నృతవాదీ చ క్షత్రియశ్చ పరాఙ్ముఖః ||

సూర్యాచంద్రమసౌ వాయు ర్యావత్‌ పశ్యంతి దుష్కృతమ్‌ | వ్రజేత్త్వేతాం గతిం క్షిప్రం తచ్చపాపం భ##వేత్తవ ||

నీవు నీ విధిని సక్రమంగా నెరవేర్చకపోయినచో బ్రహ్మహత్య పితృ మాతృ హత్య చేసినవాడు, భూమికొఱకబద్ధమాడిన వాడు యుద్ధమందు బెడమొగమువెట్టిన రాజు పొందు గతిని సూర్యచంద్రులు వాయుదేవుడు జీవులు చేసిన పాపము నెంతదాక కని పెట్టి చూచుచుందురో అంతదాక నీవు పొందుదువు.

వికృతిం యది గచ్ఛేన్నో యుద్ధే7ధ్వని తురంగమః | రిపూన్విజిత్య సమరే సహ భర్త్రా సుఖీభవః ''ఇత్యశ్వమంత్రః''

అశ్వ మంత్రము :- ఓ గుఱ్ఱమా! నీవు యుద్ధమున దారిలో నెట్టి వికారమును బొందకుము. శత్రువులననిలో గెల్చి రాజుతో గూడ నీవును సుఖముండుము. అను నీ మంత్రమును జపించిన జయము గల్గును.

పరాశరః - శక్రకేతోః మహావీర సువర్ణః స్తత్సమాశ్రితః | పతత్రి రాట్‌ వైనతేయః తధా నారాయణధ్వజః ||

కాశ్యపేయో7మృతాహర్తా నాగారి ర్విష్ణువాహనః అప్రమేయో దురాధర్షః రణ చైవారిసూదనః ||

గరుత్మాన్‌ మారుత గతిః త్వయి సన్నిహితః స్థితః |

సాశ్వ వర్మాయుధా న్యోధా న్రక్ష7స్మాకం మహద్రిపూన్‌ || ''ఇతిధ్వజ మంత్రః''

ధ్వజ మంత్రము

పరాశరుండనియె. ఓ యింద్ర ధ్వజమా! మహావీరుడు పక్షులకెల్లరాజు, వినత కొడుకు, విష్ణువు యొక్క జెండా యందు గుర్తుగా నుండు వాడు, కాశ్యపుని కొడుకు, అమృతముం గొని వచ్చిన వాడు, నాగులకు శత్రువు, శత్రు సంహారకుడు, ఊహింపగ రాని శక్తి గలవాడు, యుద్ధమందేరికి నెదిరింపరాని వాడు, వాయుసమాన గతి గలవాడు నగు గరుత్మంతుడు నీయందు సన్నిధిసేసి యున్నాడు. కావున అశ్వములతో కవచములతో నాయుధములతో గూడిన ప్రబల శత్రువులతో దలపడుచున్న మా యోధులను రక్షింపుము.

పరాశరః - కుముదైరావణౌ పద్మః పుష్పదన్తో7ధవామనః | సుప్రతీకోంజనో నీలేఏతే7ష్టౌ దేవయోనయః ||

తేషాంపుత్రాశ్చ పౌత్రా శ్చ ధన్యానష్టౌ సమాశ్రితాః | భద్రోమందో మృగశ్చైవ గజః సంకీర్ణ ఏవచ ||

వనేవనే ప్రసూతస్తే స్మరయోనిం మహాగజః | పాన్తు త్వాం వసవో రుద్రో ఆదిత్యాః సమరుద్గణాః ||

భర్తారం రక్ష ! నాగేంద్ర ! సమయః ప్రతిపాల్యతామ్‌ | అవాప్నుహి జయం యుద్ధే గమనే స్వస్తి నోవ్రజః ||

శ్రీస్తేసోమా ద్బలం విష్ణోస్తేజ స్సూర్యాజ్జవో7నిలాత్‌ | స్థైర్యం మేరోః జయం రుద్రాద్యశో దేవా త్పురందరాత్‌ ||

యుద్ధేరక్షన్తు నాగా స్త్వాం దిశశ్చ సహదేవతైః |

అశ్విభ్యాంసహ గంధర్వాః పాన్తు త్వాం సర్వతః సదా || ''ఇతిహస్తిమంత్రః''

గజ మంత్రము

కుముదుడు ఐరావణుడు పద్ముడు పుష్పదంతుడు వామనుడు సుప్రతీకుడు అంజనుడు నీలుడు నను నీ గజరాజులు దేవ సంతతి వారు.వారి కొడుకులు మనుమలు నెనిమిది ధనముల అనగా అష్ట విభూతులును అణిమాదులు గలవారు. వారిపేర్లు భద్రుడు మందుడు మృగుడు గజుడు సంకీర్ణుడు నను వారు ఆ యా పనము లందు పుట్టిన వారు. ఈ గజ సంతతి యొక్క యోనిని = జన్మస్థానమును స్మరింపుము. నిన్ను వసువులు రుద్రులు ఆదిత్యులు మరుద్గణములు రక్షింతురుగాక. ఓ నాగేంద్ర! నీవు మన రాజేంద్రుని (యజమానిని) రక్షింపుము సమయము=రక్షింప వలసిన తరుణమును గనిపట్టి చూడుము. యుద్ధమందు గెలుపొందుము. నీ నడకయందు మాకు మంగళమగు గాక ! నడువుము.

నీకు సోముని వలన సిరి (సంపద) విష్ణువు వలన బలము సూర్యుని వలన తేజస్సు (ప్రతాపము) వాయువు వలన వేగము మేరువు నుండి స్థైర్యము రుద్రుని వలన జయము దేవేంద్రుని వలన యశస్సును గలుగు గాక ! నిన్ను నాగులు యుద్ధమందు రక్షింతురుగాక. దిక్కులు తమ తమ అధిష్టాన దేవతలతోను అశ్వనీ దేవతలతో గంధర్వులును నిన్నన్ని యెడల రక్షింతురు గాక !

పరాశరః - హుతభు గ్వసవో రుద్రాః వాయుస్సోమో మహర్షయః | నాగకిన్నర గంధర్వ యజ్ఞ భూత గణగ్రహాః ||

ప్రమథాస్తు సహాదిత్యైః భూతేశో మాతృభి స్సహ | శక్ర సేనాపతి స్కన్దో వరుణ శ్చాశ్రిత స్త్వయి ||

ప్రదహన్తు రిపూ న్సర్వా న్రాజా విజయ మృచ్ఛతు | యాని ప్రయుక్తా న్యరిభి ర్దూషణాని సమన్తతః ||

పతన్తూపరి శత్రూణాం హతాని తవ తేజసా | కాలనేమి వధే యధ్వ త్రిపురపాతనే ||

హిరణ్య కశిపో ర్యద్వద్వధే సర్వాసురేషుచ | శోభితాసి తధై వాద్య శోభస్వ సమయం స్మర ! ||

హుతాశనుడు (అగ్ని) పసువులు రుద్రులు వాయువు సోముడు మహర్షులు నాగ కిన్నర గంధర్వులు యజ్ఞములు భూత గణము నవగ్రహములు ప్రమథ గణములు. ఆదిత్యులు మాతృకలతో భూతపతి ఇంద్రసేనాపతి స్కందుడు వరుణుడు నీమీద ఛత్రములట్లుండి (గొడుగుపట్టినట్లు రక్షణ యిచ్చవారు) నీ సర్వశత్రులను దహింతురు గాక ! నీ ప్రభువు విజయ మందుగాక. శత్రువులు చేసిన ప్రయోగములు (ఆభిచారికలు చేతబడులు) దూషణము లెల్లెడల తేజస్సుచే దెబ్బతిని శత్రువుల మీదబడు గాక ! కాలనేమి సంహార మందు త్రిపురాసుర పాతన మందు హిరణ్యకశివు వధయందు సర్వరాక్షసుల యెడను (రాక్షస సంహార మందన్న మాట) నీవెట్టు శోభించితివో అట్లు యిప్పుడు గూడ శోభింపుము. (రాణింపుము) నీ సమయమును (ప్రతిజ్ఞను) నీవు స్మరింపుము.

నీలాన్‌ శ్వేతా నిమాన్‌ దృష్ట్వా నశ్యం త్వాశు నృపారయః | వ్యాధిభి ర్వివిధై ర్ఝోరై శ్శసై#్త్రశ్చ యుధి నిర్జితాః |

ఈ నీల వర్ణములు తెల్లనివియునగు ఈ అశ్వములను జూచి శత్రురాజులు వివిధ ఘోర వ్యాధులచేత శస్త్రముల చేతను యుద్ధములందోడిపోయి నశింతురు గాక !

పృతనా రేవతీ నామ్నా కాలరాత్రీతి పథ్యతే |

దహత్వాశు రిపూ న్సర్వాన్‌ పతాకే : త్వాముపాశ్రితా || ''ఇతి పతాక మంత్రః||

పతాకమంత్రము :- ఓ పతాకమా! రేవతియను సేన కాలరాత్రియని పఠింపబడును. ఆసేన నిన్నాశ్రయించి (నీదరింజేరి) శత్రువులనంవఱను శీఘ్రముగ దహించు గాక !

అసిర్విశసనః ఖడ్గ స్తీక్షణధారో దురాసదః | శ్రీగర్భో విజయ శ్చైవ ధర్మాచార స్తధైవచ ||

ఇత్యష్టౌ తవనామాని స్వయ ముక్తాని వేధసా | నక్షత్రం కృత్తికా తుభ్యం గురుర్దేవో మహేశ్వరః ||

రోహిణ్యా శ్చ శరీరం తే దైవతంతు జనార్దనః | పితా పితామహోదేవః సత్వం పాలయ సర్వదా || ''ఇతి ఖడ్గమంత్రః''

ఖడ్గ మంత్రము :- (అసి = కత్తి విశసనః = నఱకునది ఖడ్గమన బడునది. తీక్షణధారః = పదునైన వాయి (అంచు) గలది. దరియరానిది శ్రీగర్భము (ఐశ్వర్యముం బ్రసవించునది) విజయము ధర్మాచారము. ధర్మము చేయునది) అని యెనిమిది పేర్లు నీకు బ్రహ్మ పెట్టినవి గలవు. నీ నక్షత్రము కృత్తిక. నీ గురువు మహేశ్వరుడు, నీశరీరము రోహిణిది. నీకు జనార్దనుడ దేవత నీకు పిత పితామహుడు (బ్రహ్మదేవుడు) అట్టి నీవన్నివేళల మమ్ముపాలింపుము !

పరాశరః - వర్మ ప్రదస్త్వం సమరే ధర్మసైన్యాయ మానద ! |

రక్షమాం రక్షణీయో7హం తవా7సఘః నమో7స్తుతే || ''ఇతి వర్మమంత్రః||

కవచ మంత్రము

నీవు ధర్మసైన్యమునకు వర్మప్రదవు. రక్షణనిత్తువు. నన్ను రక్షింపుము. నీకు నేను రక్షింపవలసిన వాడను. ఓ కవచమా! నీకు నమస్కారము.

దుందుభేః త్వం సపత్నానాం ఘోషా ద్ధృదయ కంపనః | తత్ర భూమిపసైన్యానాం తధా విజయ వర్ధనః ||

యధా జీమూతఘోషేణ హృష్యన్తి శర వారణాః | తథాచ తవ శ##బ్దేన త్రస్యన్తే స్వద్ద్విషో రణ || ''ఇతి దుందుభి మంత్రః''

దుందుభి మంత్రము

ఓ దుందుభి వాద్యమా! నీ ఘోషముచే (ధ్వనిచే) శత్రువుల హృదయమును గంపింపజేయుదువు. సమరమందు నీవంక రాజులయొక్క సేనలకు విజయవర్ధనము గావింతువు. మేఘ ఘోషముచే హర్షించు జలగజములట్లు నీ ధ్వనిచేత మా శత్రువులనిలో హడలిపోదురు గాక !

పరాశరః -సర్వాయుధ మహామాత్రః సర్వదేవారి సూదనః |

చాపస్త్వం సర్వదా రక్ష! సాకంశరకరై సదా || ''ఇతిచాప మంత్రః''

పుష్కరః మంత్రాస్త వైతే7భిహితానృవీర! సంమ్మంత్రణ వైజయికా యధావత్‌ |

ఏతైస్తు మంత్రైరభి మంత్రితానాం చలత్యమోఘం బలమ ప్రవృష్యమ్‌ ||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితియఖండే మంత్రాధ్యాయ వర్ణనంనామ షష్ట్యుత్తర శత తమోధ్యాయః ||

ధనుర్మంత్రము

సర్వాయుధ శ్రేష్ఠమా ! సర్వదేవ శత్రుసూదన! ఓ చాపమా! ఉత్తమ బాణములతో గూడి నీవెల్లవేళ రక్షింపుము.

పరశురామ! అభిమంత్రణముచే విజయప్రదములైన మంత్రములన్నియు యధాక్రమముగ నీకు దెల్పితిని. వీనిచేత నభిమంత్రింపబడిన యాయా యుద్ధపరికరము యొక్క (లేదా రాజుయొక్క) బలమమోఘమై యెదిరింపనురానిదై రణమున మెలగును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమున ద్వితీయ ఖండమందు మంత్రాధ్యాయ వర్ణనమను నూటయరువదియవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters