Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట ఏబది ఎనిమిదవ అధ్యాయము - భద్రకాళీపూజ

రామః- విధానా పూజయేత్కేన భద్రకాళీం నరాధిపః | నవమ్యా మాశ్వినే మాసి శుక్లపక్షే నరోత్తమః ||

పుష్కరః- పూర్వోత్తరేతు దిగ్భాగే శిబిరాత్సుమనోహరే | భద్రకాళీ గృహం కుర్యాచ్చిత్రవసై#్త్రరలంకృతమ్‌ ||

భద్రకాళీం వటే కృత్వాతత్ర సంపూజయేద్ద్విజః | ఆశ్వినే శుక్ల పక్షేతు అష్టమ్యాం ప్రయత స్తతః ||

పరశురాముడు భద్రకాళీ పూజావిధానము ఆశ్వయుజశుక్ల నవమినాడు గావింపవలసిన తానతిమ్మన పుష్కరుండిట్టనియె. మనోహరమైన రాజశిబిరమునకు (డేరాకు) పూర్వోత్తర దిగ్భాగమందు (ఈశాన్యదిశగా) భద్రకాళీగృహమును రంగు రంగుల వస్త్రములతో నిర్మింపవలెను. భద్రకాళీ దేవిని పటమునందు (వస్త్రమునందు జిత్రించిన మూర్తిని) ఆశ్వయుజ శుక్లాష్టమినాడు శ్రద్ధతో బూజింపవలెను.

తత్రైవాయుధవర్మాద్యం ఛత్రంకేతుంచ పూజయేత్‌ | రాజలింగాని సర్వాణి తధాస్త్రాణిచ పూజయేత్‌ ||

పూషై#్పర్గంధైః ఫలైర్భక్ష్యైః భోజ్యైశ్చ సుమనోహరైః | బహుభిశ్చ విచిత్రాభిః ప్రేక్షాదానై స్తధైవచ ||

రాత్రౌజాగరణం కుర్యాత్‌ తత్రైవ వసుధాధివః | ఏవం సంపూజయేద్దేవీం వరదాం భక్తవత్సలాం ||

కాత్యాయనీం కామగమాం వరరూపాం వరప్రదామ్‌ | పూజితాం సర్వకామైశ్చ సాయుంక్తే వసుధాధివమ్‌ ||

ఏవంహి సంపూజ్య జగత్ప్రధానంయాత్రాతు దేయా వసుధాధిపేన |

ప్రాప్నోతి సిద్ధిం పరమా మహేశో జనస్తధా7న్యోపహి విత్తశక్త్యా ||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయ ఖండే భద్రకాళీ పూజా నామ అష్టపంచాశదుత్తర శతతమో7ధ్యాయః ||

అక్కడనే ఆయుధములను గవచములను ఛత్రమును కేతువును (జండాను) రాజుయొక్క సర్వ చిహ్నములను పూజింపవలెను. గంధ పుష్ప ఫల భక్ష్య భోజ్యముల నుపేక్షణీయములను జాల చక్కగా చిత్ర విచిత్రములైన వానిని సమకూర్చి పౌరులు దర్శనము సేయుట కనువుగ నొనర్చి రాత్రి జాగరణముసేసి భూపతి భక్తవత్సలను వరప్రదాత్రి భద్రకాళీదేవిని పూజింపవలెను. కత్యాయని కామప్రదాత్రిని వరస్వరూపిణిని వరప్రదాత్రిని సర్వోపచారములం బూజించిన రాజు నా తల్లి సర్వాభీష్ట సమన్వితునిం జేయును. సర్వ జత్ప్రధాన దేవతనిట్లు పూజించి యామెకు రథయాత్రను ఊరేగింపు నేర్పఱుపవలెను. ఇట్లు నగరోత్సవమును కలిమికొలది గావించిన రాజుగాని మరి యే మనుష్యుడుగాని పరమాభీష్టసిద్ధి నందును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున భద్రకాళీ పూజయను నూటయేబది యెనిమిదవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters