Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట ఏబదియవ అధ్యాయము - షాడ్గుణ్య వర్ణనము

పుష్కరః-సంధిశ్చ విగ్రహశ్చైవ ద్వైగుణ్యం కథితం బుధైః | యదాశ్రిత్య తధైవా7 న్యైః షాడ్గుణ్యం పరికీర్తితమ్‌ ||

సంధిశ్చ విగ్రహశ్చైవ యాన మాసన మేవచ | ద్వైధీభావం సంశ్రయంచ షాడ్గుణ్యం పరికీర్తితమ్‌ ||

పణబంధః స్మతః సంధి రపకారస్తు విగ్రహః | జిగీషోః శత్రువిషయే యానం యాత్రా విధీయతే ||

విగ్రహే7పిస్వకే దేశే స్థితి రాసన ముచ్చతే | బలార్ధేన ప్రమాణంతు ద్వైధీభావం తదుచ్యతే ||

ఉదాసీనే మధ్యమేవా సంశ్రయాత్‌ సంశ్రయః స్మృతః | సమేవ సంధి రన్వేష్యో హీనేనచ బలీయసః ||

పుష్కరుండనియె. సంధి విగ్రహము నను రాజనీతి ప్రసిద్ధ గుణములను ద్వైగుణ్య మందురు. మఱికొన్నిటిలో చేరిన వీనికి షాఢ్గుణ్యమని చెప్పబడును. సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైధీభావము, సమాశ్రయము అని వీనికి షాడ్గుణ్యమని ప్రసిద్ధి. పణముతోడి పొత్తు సంధి: ఇచ్చిపుచ్చుకొనుట ద్వారా ఇద్దరు రాజులు చేసికొన్న స్నేహమన్న మాట. అపకారము సేసికొనుట (తగవులాడుట) విగ్రహము. జయాపేక్షతో శత్రువుపైకి దండెత్తుట యానము. (దండయాత్ర) తగవున్నను తన దేశమందే యునికి ఆసనము. సగము సేననిత్తునని ప్రమాణముసేయుట; శత్రుమిత్రులకు భేదతంత్రము పెట్టుట. ద్వైధీబావము శత్రువుదాసీనుడు మధ్యవర్తియు నైనయెడ వాని నాశ్రయించుట సమాశ్రయ మనబడును. హీనుడైన రాజు (తగ్గియున్న రాజు) తనతో సమునితో తన కంటె బలవంతునితో సంధి కుదుర్చుకొను మార్గము వెదకి కొనవలెను.

హీనేన విగ్రహః కార్యః స్వయం రాజ్ఞా బలీయసా | తత్రాపి తస్య పార్షిస్తు బలీయాన్న సమాశ్రయేత్‌ ||

ఆసీనః కర్మవిచ్ఛేదం శక్తః కర్తుం రిపుర్యదా | అశుద్ధ పార్షిర్బలవాన్‌ ద్వైధీభావం సమాశ్రయేత్‌ ||

బలినా నిగృహీతస్తు యోమన్యేద్యేన పార్థివః | సంశ్రయస్తేన కర్తవ్యో గుణానా మధమో గుణః ||

బహుక్షయ వ్యయాయాసం తేషాంయానం ప్రకీర్తితమ్‌ | బహులాభకరం చ స్యాత్తదా రామ! సమాశ్రయేత్‌ ||

సర్వశక్తి విహీనస్తు తదా కుర్యాత్తు సంశ్రయమ్‌ |

ఏవంచ బుద్ధ్వా నృపతిర్గుణానాం కాలేచ దేశే చ తదా విభాగే |

సమాశ్రయే ద్భార్గవ వంశముఖ్య ! చైతా వదుక్తం నృపతేస్తు కార్యమ్‌ ||

ఇతీ శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే షాడ్గుణ్య వర్ణనంనామ పంచాశదుత్తర శతతమో7ధ్యాయః ||

రాజు తాను బలీయుడై యుండినచో హీనునితో విగ్రహముచితము. అప్పుడు గూడ వానికి వెనుకనున్న "పార్షిరాజు" బలవంతుడై యున్నవాడు సమాశ్రయము చేయరాదు. అసీనుడైన రాజు తన శత్రువు వ్యవహార భంగము చేయుటకు శక్తుడైనపుడు పార్షి= తన వెనుక నున్న రాజు బలవంతుడైనపుడు ద్వైధీభావ లక్షణమను భేద తంత్రము నాశ్రయింప వలెను. బలవంతుడైన శత్రువునకు లొంగిపోక తప్పదన్నప్పుడు వానిని సమాశ్రయము సేయవలెను. ఇది యాఱుగుణములలో నికృష్టము. బహు క్షయ వ్యయ ప్రయాసమైనది యానము (దంయాత్ర) అయినపుడు బహులాభకరమైన సమాశ్రయము సేయవలెను. సర్వశక్తులుడిగినవాడే సమాశ్రయము సేయవలెను. అది రాజుయొక్క సంధి విగ్రహాదులారుగుణముల యొక్క దేశాకాలనుసారి విభాగము లందు కర్తవ్యమేమో తెలిసి శత్రువును సమాశ్రయింప వలెను. రాజు చేయవలసిన దింతదనుక చెప్పితిని.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమునద్వితీయ ఖండమందు షాడ్గుణ్య వర్ణనమను నూటయేబదియవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters