Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

పదునైదవ యధ్యాయము - రత్నలక్షణము

పుష్కరః: వజ్రం మరకతం చైవ పద్మరాగంచ మౌక్తికమ్‌l ఇంద్రనీలం మహానీలం వైడూర్య మథ సస్యకమ్‌ ll 1

చంద్రకాంతం సూర్యకాంతం స్ఫటికం పులకం తథా l కర్కేతనం పుష్పరాగం తధా జ్యోతీరసం ద్విజ! ll 2

స్ఫటికం రాజవర్తంచ తధా రాజమయం శుభమ్‌ l సౌగంధికం తధా సఖ్యం శంఖ బ్రహ్మమయం తధా ll 3

గోమేధం రుథిరాక్షంప చ తధా లబ్లాతకం ద్విజ! l ధూళీ మరకతం చైవ తుత్తూకం శేష మేవచ ll 4

పలుం ప్రవాలకం చైవ గిరివజ్రం చ భార్గవ l భుజగేశమణిం చైవ తధా వజ్రమణిం శుభమ్‌ ll 5

టీటిభం చతుతాపిచ్ఛం భ్రామరం చ తధోత్పలమ్‌ ll రత్నాన్యేతాని ధార్యాణి సర్వాణ్యవ మహీక్షితా ll 6

సువర్ణ ప్రతి బద్ధాని జయా7రోగ్య సమృద్ధయే l తేషాం గురుత్వం రాగశ్చ సచ్ఛత్వం రం

రశ్మి మాలితా ll 7

సుజాతతా మసృణతా సుసంస్థానత్వ మేవచ l గుణవంతో వినిర్దష్టా ధార్యాస్తే గుణ సంయుతాః ll 8

పుష్కరుడనియె. వజ్రము మరకతము పద్మరాగము మౌక్తికము ఇంద్రనీలము మహనీలము వైడూర్యము సస్యకము చంద్రకాంతము సూర్యకాంతము స్ఫటికము పులకము కర్కేతనము పుష్కరాగము జ్యోతీరసము స్ఫటికము రాజవర్తము రాజ మయము సౌగంధికము సఖ్యము శంఖము బ్రహ్మమయము గోమేదము రుధిరాక్షము బల్లాతకము ధూళీమరకతము తుత్తూకము శేషము పలుపు ప్రవాలము గిరివజ్రము భుజగేశమణి వజ్రమణి టీటిభము తాపిచ్ఛము భ్రామరము వుత్పలమునను నీ రత్నములెల్ల మహీపతి ధరింపవలసినవి. జయము ఆరోగ్యము సమృద్ధిగ గలుగుటకు వీనిని బంగారములో బొదిగి కై సేయనగును. వాని గురుత్వము (బరువు) రాగము (రంగు) స్వచ్ఛత్వము రశ్మిమాలిత్వము (కిరణసమూహత్వము) సుజాతత్వము (జాతి) మసృణతా మృదుత్వము సుసంస్థానత్వము గుణవిశేషములు శాస్త్రములందు నిర్దేశింపబడినవి. అవి తెలిసి వానిం ధరింపవలెను.

ఖండా స్సశర్కరా యేచ నిష్ర్పభా మలినా స్తధా l నతే ధార్యా నరేంద్రాణాం జయశ్రీ జీవితై షిణామ్‌ ll 9

సమస్తరత్న వర్గే7పి వజ్రధారణ మిష్యతే l అంభస్తరతి యద్వజ్ర మభేద్యం విమలం చయత్‌ ll 10

తధాచ శుద్ధం షట్కోణం లఘు భార్గవనందన! ప్రభాచ శక్ర చాపాభా యస్యా7ర్కాభిముఖి భ##వేత్‌ ll 11

తం వజ్రం ధారయన్‌ రాజా సర్వాన్‌ జయతి శాత్రవాన్‌ l శుక్లపక్షనిభః స్నిగ్థః కాన్తిమాన్‌ విమల స్తధా ll 12

సువర్ణచూర్ణ సంకాశై స్సూక్ష్మై ర్బిందుభి రన్వితః l శస్తో మరకతోరామ! గంభీరశ్చోన్నత స్తధా ll 13

ధార్యశ్చ పృథివీశానాం సర్వోపద్రవ నాశనః l కురువిందా ద్భవేజ్జన్మ తధా సౌగంధికా ద్ద్విజ! 14

స్ఫటికా త్పద్మరాగాణాం శ్రేష్ఠాస్తే హ్యుత్తరోత్తరమ్‌ l జహరంగా భవన్తీహ కురువింద భవాశ్చ యే || 15

కషాయ రంగా నిర్ధిష్టా యేచ సౌగంధి కోద్భవాః స్వచ్ఛాశ్చ రాగవంతశ్చ విజ్ఞేయాః స్పటికొద్భవాః ll 16

ముక్తాఫలాః శుక్తిభవా బహవో మత్స్యజా స్తధా l ఉత్కృష్టా నతధా తేభ్యో యేతు శంఖోద్భవా ద్విజ ! 17

తేభ్యః ప్రశస్తా విజ్ఞేయా నాగకుంభ సమద్భవాః l నిష్ర్పభా స్తే సముదిష్టాః శ్రేష్ఠా క్రోడి భవా ద్విజ! 18

తేభ్యో వేణుదళాః శ్రేష్ఠాః తేభ్యో భుజగ సంభవాః l తేభ్యో7పి భువి దుష్ప్రాప్యం మౌక్తికం మేఘ సంభవమ్‌ ll 19

ధారణా త్తస్య నృపతేః సర్వసిద్ధిః ప్రకీ ర్తతా l మౌక్తికానాం చ సర్వేషాం వృత్తత్వం గుణ ఉచ్యతే ll 20

సుష్ఠుతా చ సుశుక్లత్వం మహత్వం చ భృగూత్తమ l ఇంద్రనీలస్తు యః క్షీరం రాజతే భాజనే స్థితమ్‌ ll 21

రంజయేత్‌ స్వప్రభావేన తమమూల్యం వినిర్దిశేత్‌ l నీల రక్తంతు వైడూర్యం సర్వత శ్శ్రేష్ఠ ముచ్యతే ll 22

సర్వేషా మేవ రత్నానాం ధార్యం కకతనం స్మృతమ్‌ l పుష్యరాగా స్తథా రామ! యే చాన్యే కీర్తితా మయా ll 23

ప్రశస్తరత్నై ర్భూపానాం మకుటా న్యంగదానిచ l హారాణి రామ! కార్యాణి కేయూరాభరణాని చ ll 24

అప్రశస్తాని రత్నాని వర్జనీయాని దూరతః l సర్వరత్నోత్తమం రామ! వివర్ణం మలినం తధా ll 25

న ధారయేత ధర్మజ్ఞః సుశుద్ధం ధారయే త్సదా l ధృతః ప్రశస్తాభృగు వంశచంద్ర! రత్నోత్తమానాం సతతం నృపాణామ్‌ ll

రత్నాంశు దగ్ధంతు నరస్యదేహా దనర్థమాశు ప్రశమం ప్రయాతి ll 26

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే రత్న లక్షణంనామ పంచదశో7ధ్యాయః

ఖండములు సశర్కరము (గులకతోగూడినవి) ప్రభాహీనములు మలినములైనవానిని జయలక్ష్మిని జీవితమునుగోరు రాజులు ధరింపరాదు. వ్రజము: రత్నాల రకములన్నిటిలోను వజ్రధారణ మతి ప్రశస్తము. ఆ రత్నము నీళ్ళమీద తేలును. దేనికిం దెగదు. విమలముగా నుండును. అందులో షట్కోణమై తేలికయై శుద్ధమై కాంతిగూడ సూర్యాభిముఖమైనపుడు ఇంద్రధనుస్తుల్యమై కాంతుల విరజిమ్మునో యది ప్రశస్తవజ్రము. అట్టి వజ్రము ధరించిన రాజు సర్వశత్రువులం జయించును. ఇక మరకతము: సువర్ణ చూర్ణము వంటిసూక్ష్మబిందువులతోగూడి శుక్లపక్షమట్లచ్చమై మెఱయుచు స్నిగ్ధమై కాంతిమంతమై స్వచ్ఛమై గంభీరమును నున్నతమై యుండు మరకతము చాలప్రశస్తమైనది. అది రాజులు ధరింతురు. సర్వోపద్రవ నివారకము. కురువిందము నుండి సౌగంధికము నుండి స్ఫటికము నుండి పద్మరాగముల నుండి మరకతమణులు పుట్టును. ఇంకొకదాని కంటె నొకటి శ్రేష్టము. ఇందు జహరంగములు కురువిందభవములు కషాయరంగములు సౌగంధికోద్భవములునైనవి స్వచ్ఛములు రాగవంతములునగును. ముక్తాఫలములు (ముత్యాలు) ముత్యపుచిప్పలో బుట్టినవి చేపలక డుపులో జనించినవి. శంఖోద్భవములకంటె ప్రశస్తములుగావు. వానికంటెసుప్రశస్తములు ఏనుగుకుంభస్థల మందు జనించినవి-పందుల వలన బుట్టినవి మంచి ముత్యములు ప్రభాహీనములు. వానికంటె వేణుదళమునందు బుట్టినవి మేలైనవి. వానికంటె పాములనుండి పుట్టినవి అన్నిటికంటె అత్యుత్తమమయిన ముత్యములు. మేఘమునుండి పుట్టినవి అతిదుర్లభములు. వానిందాల్చిననృపతికి సర్వసిద్ధికల్గును. ముత్యములన్నిటికి గుణము వర్తులత్వము. (గుండ్రదనము) ముఖ్యము. సుష్టుగానుండుట మిక్కిలి తెలుపుగా నుండుట మహత్వము ననునవి మౌక్తికముల విశిష్టలక్షణములు. ఇంద్రనీలము: వెండి గిన్నెలో పాలు పోసి యందింద్ర నీలము నుంచినచో నాపాలును తనయట్లు (నీలముగ) రంజింపచేయునది యత్యుత్తమయిన యింద్రనీలమనబడును. నీలము రక్తమునైన వైడూర్యము బహుప్రశస్తము. కకతనము పుష్యరాగము ననునవి రత్నాలతో నెల్లతప్పక ధరింపవలసినవి. ప్రశ స్తరత్నరాసులచే హారములు కీరీటములు అంగదములు కేయూరములు (భుజకీర్తులు) నను రాజాభరణముల జేయింప నగును. తక్కువ వానిని దూరముగ విడువవలెను. రంగులేనిది మాసిన దెంత యమూల్యమైనను నా రత్నముం ధరింపరాదు. పరిశుద్ధరత్నమునే యెల్లపుడూ వాడవలెను. ఓ భార్గవ వంశచంద్ర! రత్నకిరణములచే దగ్ధమై యనర్దమెల్ల దేహము నుండి తలగిపోయి శమించును. కావున నృపాలునకు ప్రశస్తరత్నధారణ మెంతేని ప్రశస్తము.

ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమున రత్నలక్షణమను పదునై దవయధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters