Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటనలుబది తొమ్మిదవ అధ్యాయము - ఇంద్రజాల వర్ణనము

పుష్కరః- చతురంగం బలంరాజా మాయాజాలేన దర్శయేత్‌ | సహాయార్థ మనుప్రాప్తాన్‌ దర్శయేత్త్రిదివౌకసః ||

రక్తవృష్టిశ్చ సందర్శ్యా పరేషాం శిబిరం ప్రతి |ఛిన్నాని రిపుశీర్షాణి ప్రాసాదాగ్రేషు దర్శయేత్‌ ||

ఆధిత్సతా సంధి మహీనసత్వ ! కార్యం భ##వేద్రామ! మహేంద్రజాలమ్‌ |

వక్ష్యామి తచ్ఛోపనిషత్పు తుభ్యం యోగాని చాన్యాని జయావహాని ||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయ ఖండే ఇంద్రజాల వర్ణనం నామ ఏకోన పంచాశదుత్తర శతతమో7ధ్యాయః ||

పుష్కరుండనియె. రాజు మాయాజాలము చేత చతురంగ బల ప్రదర్శనము సేయవలెను. తనకు సహాయ మొనరింప దేవతలను గూడ వచ్చినట్లు చూపింపవలెను. శత్రుసేనా శిబిరముపై రక్త వర్షము కురియుటను రాజ ప్రాసాదముపైని తెగిపోయిన శత్రువుల తలలను జూపవలెను. శత్రువుతో సంధి సేసికొన దలచినపుడీ మహేంద్ర జాలమును జూపవలెను. పరశురామా! రాజు నకు జయముగూర్చు మరికొన్ని యోగములుపనిషత్తు లందున్నవి. నీకు దెల్పెదను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయ ఖండమునందు ఇంద్రజాల వర్ణనమను నూటనలుబదితొమ్మిదవ అధ్యాయము

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters