Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట నలుబడియవ అధ్యాయము - స్త్రీ ప్రసవ వైకృత్య వర్ణనము

గర్గః - కాలప్రసవనా నార్యః కాలాతీతాః ప్రజాస్తధా | వికృత ప్రసవాశ్చైవ యుగ్మ ప్రసవికాస్తధా ||

అమానుషా అరుండాశ్చ సంజాత వ్యసనాస్తధా | హీనాంగా అధికాంగాశ్చ జాయన్తే యది వాస్త్రియః ||

పశవః పక్షిణశ్చైవ తధాచైవ సరీసృపాః | వినాశం తస్య దేశస్య కులస్యాపి వినిర్దిశేత్‌ ||

వివాసయేత్తా న్నృపతిః స్వరాష్ట్రాత్‌ ప్రియంచపూజ్యాశ్చ తతో ద్విజేంద్రాః |

కిమిచ్ఛకై ర్బ్రాహ్మణ తర్పణంచకార్యం తతః శాన్తి ముపైతి పాపమ్‌ ||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయ ఖండే స్త్రీ ప్రసవ వైకృత్య వర్ణనం నామ చత్వారింశ దుత్తర శత తమోధ్యాయః ||

గర్గుడనియె. స్త్రీలు కాల ప్రసవలు, కాలాతీత ప్రసవలు, వికృత ప్రసవలు, కవలల ప్రసవలు, నని నాల్గు విధములు అమానుషులు, అరుండులు= తల లేనివారు వ్యసనయుతులు, అంగలోపము, అధికాంగములు గలవారునై శిశువులు జనింతురేని స్త్రీలు, పశువులు, పక్షులు, పాములను బుట్టుదురేని ఆ దేశమునకు ఆ కులమునకు నాశనమగునని చెప్పవలెను. నృపతి వాండ్రను రాజ్యమునుండి వెళ్లగొట్టవలెను. ద్విజులను ప్రియముగ బూజింపవలెను. ఏ కోరిక కోరువారైనను బ్రాహ్మణ సంతృప్తి చేయవలెను. అందువలన పాపము శాంతించును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున స్త్రీ ప్రసవ వైకృత్య వర్ణనమను నూటనలుబదియవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters