Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట ముప్పది ఎనిమిదవ అధ్యాయము - సృష్టివైకృత్య వర్ణనము

గర్గః- అతివృష్టి రనావృష్టి ర్దుర్భిక్షాయో భయం మతమ్‌ | అనృతే భదినే రిక్తావృష్టి ర్జేయా భయావహా ||

అనభ్రే వికృతా చైవ విజ్ఞేయా రాజమృత్యవే | శీతోష్ణతా విపర్యాసే జంతూనాం రిపుజం భయమ్‌ ||

శోణితం వర్షతే యత్ర తత్ర శస్త్రభయం భ##వేత్‌ | అంగారపాంశు వర్షేణ నగరం తద్వినశ్యతి ||

మజ్జాస్థి స్నేహ మాంసానాం జనమారభయం భ##వేత్‌ | ఫలపుష్పే తధా ధాన్యం హిరణ్యాది భూయాయతు ||

పాంశు జంతూపలానాం తు వర్ణణ రోగజం భయమ్‌ | ఛిద్రాణాంతు ప్రవర్షేచ సస్యానా మీతి వర్ధనమ్‌ ||

విరజస్కేరవౌ వ్యభ్రే యదా ఛాయానదృశ్యతే | దృశ్యతేతు ప్రతీపాయా తత్ర దేశభయం భ##వేత్‌ ||

నిరభ్రే చాధరాత్రౌవా శ్వేతం యామ్యోత్తరేణ తు | ఇంద్రాయుధం తదా దృష్ట్వా ఉల్కాపాతాం స్తథైవ చ ||

దిగ్దాహ పరివేషౌవా గంధర్వ నగరం తధా | పరచక్ర భయం బ్రూయా ద్దేశోపద్రవ మేవ వా ||

గర్గమహర్షి యనియె. అతివర్షము అవర్షము నను నీ రెండింటి వలన దుర్భిక్షము (కఱవు) ఏర్పడును. మబ్బుపట్టకుండ విపరీత వర్షముకురియుట రాజునకు మరణ హేతువు. చలి వేడియు తారుమారగుటచే జంతువులకు శత్రువుల వలన భయముగల్గును. రక్తవర్షము గురిసినచో శస్త్రభయము ఆయుధములతో యుద్ధము తటస్థించును. నిప్పులు దుమ్ము వర్షించునేని నగరము నశించును. మజ్జ ఎముకలు నూనె మాంసములు వర్షించునేని జనమారక భయముగల్గును. పండ్లు పువ్వులు ధాన్యము వర్షించిన బంగారమునకు భయము కల్గును. దుమ్ము జంతువులు రాళ్ళు వర్షించునేని రోగభయము. ఛిద్రముల యొక్క వర్షమందు (అనగా చిందఱవందఱగా) పంటలకు ఈతిబాధలు ఎలుకలు మిడుతలు వడ్ల చిలుకల వలని బాధలు గల్గును. ఆకాశము నిర్మలముగా మబ్బు లేనప్పుడుగూడ సూర్యకాంతి కనిపించకున్నను, కనిపించినను అది ప్రతికూలముగ (విరుద్ధముగా) కనిపించినను దేశోపద్రవము కల్గును. మబ్బు లేనపుడు రాత్రివేళగాని దక్షిణోత్తర దిశగా నింద్రాయుధము (ఇంద్రధనుస్సు), ఉల్కలు (కొఱవులు) పడుటయు గనిపించిన, దిక్కులందు అగ్ని కావిరి గ్రమ్మినను గంధర్వ నగరము=భూమిమీది యెండమావులవలె నాకాశమందు లేని నగర మున్నట్లు కనిపించుట అనువానింబట్టి శత్రుమండల భయము దేశోపద్రవమును జెప్పవలయును.

సూర్యేన్దు పర్జన్య సమీరణానాం యాగస్తు కార్యో విధివద్ద్విజేంద్ర! |

ధాన్యాన్న గో కాంచన దక్షిణాశ్చదేయా ద్ద్విజానాం భయనాశ హేతోః ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే వృష్టివైకృత్య వర్ణనంనామ అష్టత్రింశదుత్తర శతతమోధ్యాయః .

సూర్యచంద్రులను వర్షాధి దేవత యగు నింద్రుని వాయుదేవతను ఉద్దేశించి యాగము సేయవలెను. ధాన్యము అన్నము గోవులు బంగారమును దక్షిణలను ద్విజుల కీయవలెను. దానివలన ఉత్పాత భయము నశించును.

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తర ద్వితీయఖండమున వృష్టివైకృత్య వర్ణనమను నూటముప్పది యెనిమిదవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters