Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట ముప్పదియైదవ అధ్యాయము - అర్చా వికారోపశమన వర్ణనము

గర్గః -దేవతార్చాః ప్రనృత్యన్తి వేపన్తే ప్రజ్వలన్తిచ | ఆరటన్తిచ రోదన్తి ప్రస్విద్యన్తి హసన్తిచ ||

ఉత్తిష్ఠన్తి నిషీదన్తి ప్రధావన్తి వసన్తి చ | భుంజతే విక్షిపన్తే ప్రహరణా ద్ధ్వజాన్‌ ||

ఆవాజ్‌ ముఖా వతిష్ఠిన్తి స్థానాత్‌ స్థానంభ్రమన్తి చ | వమన్త్యగ్నిం తధా ధూమం స్నేహరక్తే తధా వసామ్‌ ||

ఏవ మాదీని దృశ్యన్తే వికారాః సహసోత్థితాః | లింగాయతన చిత్రేషు తత్రవాసం నరోచయేత్‌ ||

రాజ్ఞోవా వ్యసనం తత్ర సర్వదేశో వినశ్యతి | దేవయాత్రాం సహోత్పాతాం దృష్ట్వా దేశభయం వదేత్‌ ||

గర్గు డిట్లనెను : దేవతా విగ్రహములు నాట్యముచేయును. కంపించును. ప్రజ్వలించును. అరచును. ఏడ్చును చెమర్చును. నవ్వును. దేవాలయములలో విగ్రహములు లేచి నిలువబడి కూర్చుండును. పరుగెత్తును. నివసించును. భుజించును. శరీరము విదలించి కొట్టుట ద్వారా ధ్వజస్తంభములను గదలించును. ముఖము క్రిందికి వ్రేలాడవేసికొని నిలబడును. ఒకచోటనుండి మరొకచోటికి తిఱగలాడును. నిప్పులు పొగ నూనె రక్తము వసను డోకుకొనును. ఈలాటి వికారములు హఠాత్తుగా లింగములందు గుడులందు విగ్రహములందు కనిపించును. అట్టిచోట నివాసము చేయరాదు. ఉత్పాతములతో గూడిన దేవయాత్రను చూచి అందువలన రాజున కుపద్రవము సర్వదేశ వినాశము గల్గునని చెప్పవలెను.

పితా మహర్షి ధర్మేషు యన్నిమిత్తం ద్విజేషు తత్‌ | గురు శుక్రాగ్ని జాతాని యానితాని పురోహితే ||

పశూనాం రుద్రజం జ్ఞేయం నృపాణాం లోకపాలజమ్‌ | జ్ఞేయం సేనాపతీనాంతు యత్‌ స్యాత్‌ స్కన్దవినాయకమ్‌ ||

లోకానాం విష్ణువాయ్వింద్ర విశ్వకర్మ సముద్భవమ్‌ | వినాయకోద్భవం జ్ఞేయం గణానాం యేతు నాయకాః ||

దేవప్రేష్య నృపప్రేష్య దేవస్తీషు నృపస్త్రియః | వాస్తుదేవేషు విజ్ఞేయం గృహిణా మేవ నాన్యధా ||

దేవతార్చా వికారేషు శ్రుతివేత్తా పురోహితః | దేవతార్చాం తతో గత్వా స్నాతా మాచ్ఛాద్య భూషయేత్‌ ||

పూజయేచ్చ మహాభాగ ! గంధమాల్యాన్న సంపదా | మధుపర్కేణ విధివ దుపతిష్ఠే దనన్తరమ్‌ ||

తల్లింగేన మంత్రేణ స్థాలీపాకం యధావిధి | పురోధా జుహుయా ద్వహ్నౌ సప్తరాత్ర మతంద్రితః ||

బ్రాహ్మణులందు గోచరించు అద్భుతములుక (ఉత్పాతములు) బ్రహ్మ మహర్షులు ధర్మము నెడగల్గిన అపచారము కారణమగును. పురోహితునియెడ గోచరించువానికి గురువు శుక్రుడు అగ్నియు కారణము. పశూపద్రవము రుద్రునివలన నేర్పడును. నరపాలురకు లోకపాలురు కారణము. సేనాపతులకు స్కందుడు, కుమారస్వామి, వినాయకుడును కారకులు. లోకోపద్రములకు విష్ణువు, వాయువు, ఇంద్రుడు విశ్వకర్మ అనువారు కారకులు. గణనాయకులకు గల్గు కష్టములు వినాయకునివలన గల్గునని తెలియునది. దేవతలయొక్క రాజుల సేవకులందు దేవతా స్త్రీలందు, రాజ స్త్రీలందు గోచరించు నుత్పాతములకు గృహస్థుల గల్గు నుత్పాతములకు గారణము వాస్తు దేవతలని తెలియవలెను. దేవతా విగ్రహములందు వికారముగల్గిన తఱి వేదవేత్తయగు పురోహితుడు ఆ విగ్రహముదగ్గరకు జని స్నానము చేయించి వస్త్రములు గప్పి ఆభరణము లలంకరింపవలెను. అటుపై గంధ మాల్యాన్న నివేదనాదులతో బూజింపవలెను. మధుపర్కము నీయవలెను. ఆ మీద యధావిధి నుపస్థానము ప్రార్ధనాదులు సేయవలెను. ఆ చేయునర్చనకు యా యా దేవతాలింగములుగల మంత్రములతో జరుప వలెను. యథావిధిగా స్థాలీపాకము గూడచేసి యేడురోజులు తొట్రపాటు పడకుండ అగ్నియందు హవనముకూడ చేయవలెను.

విప్రాశ్చ పూజ్యా మధురాన్నపానైః సదక్షిణౖః సప్తదినం ద్విజేంద్ర! |

ప్రాప్తేష్టహ్ని క్షితిగోప్రదానైః సకాంచనైః శాన్తి ముపైతి పాపమ్‌ ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే ఆర్చావికారోపశమన వర్ణనం నామ పంచత్రింశదుత్తర శతతమోధ్యాయః.

నరపాలుడు 'బ్రాహ్మణులను' మధురాన్న పానములతో దక్షిణలతో నేడు రోజులు పూజింపవలెను. ఎనిమిదవరోజున భూదాన, గోదాన, సువర్ణ దానములు సేసినచో పాపము శమించును.

ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున అర్చావికారోపశమన వర్ణనమను నూట ముప్పది యైదవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters