Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

పదమూడవ యధ్యాయము - ఛత్రలక్ష ము

పుష్కరః: హంసపక్షై ర్విరచితం మయూరస్య శుకస్యచ l పక్షైరథ బలచ్ఛాయా ఛత్రం రాజ్ఞః ప్రశస్యతే ll 1

మిశ్రపక్షం నకర్తవ్యం హీనం పరిమితం తధా l చతురశ్రంతు కర్తవ్యం బ్రాహ్మణస్య భృగూత్తమ! 2

వృత్తం రాజ్ఞాం ప్రశస్తం స్యాచ్ఛుక్ల వస్త్ర విభూషితమ్‌ l సితం దుకూల సంఛన్నం పతాకాభి ర్విభూషితమ్‌ ll 3

ఏతస్మిన్‌ దిగ్విభాగేతు కార్యాశ్చంద్రాంశు నిర్మలాః l చతస్ర స్తస్య ధర్మజ్ఞ! పతాకా రుక్మభూషితాః ll 4

దండం చామర వత్కార్యం వైణవం చ ప్రశస్యతే l త్రిచతుః పంచషడ్‌సప్త చాష్టపర్వః ప్రశస్యతే ll 5

దశద్వాదశభిర్వాపి శేషైస్తు పరివర్జయేత్‌ l ఛత్రం దండోగ్ర పర్వాణం దండ స్సర్వత్ర శస్యతే ll 6

ధారయన్తి చ దండం వై వైణవం గృహమేధినః l రాజ్ఞాం ప్రశస్తం షడ్ఢస్తం ఛత్రదండం భృగూత్తమ! 7

అధ పంచోన హస్తంతు మహిషీ యువరాజయోః l సేనాపతి సురాధ్యక్ష సాంవత్సర పురోహితైః ll 8

పంచహస్తస్తు కర్తవ్య శ్ఛత్రదండో భృగూత్తమ! చతుర్హస్తస్తు కర్తవ్యోమయా యే7త్ర న కీర్తితాః ll 9

వ్యాసో దండార్ధ మానేన సదా ఛత్రస్య శస్యతే l ఛత్రం విభూషయే ద్రాజ్ఞాం త్వర్ధ చంద్ర దివాకరైః ll 10

వజ్రేంద్రనీలై స్స్ఫటికైశ్చ రామ! వైదూర్య ముక్తాఫల సత్ప్రవాళైః l

విభూషితం రశ్మియుతం ప్రశస్తం సదా7తపత్రం తు మహీపతీనామ్‌ ll 11

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే-ద్వితీయఖండే ఛత్రలక్షణం నామ త్రయోదశో7ధ్యాయః

పుష్కరుడనియె; హంసరెక్కలు నెమలిఫింఛము చిలుకరెక్కలతో కూర్చబడిన గొడుగు రాజునకు ప్రశస్తము. ఈ రెక్కలన్నిటిని గలిపి కూర్చగూడదు. ఆగొగుడు చిన్నది గాగూడదు. బ్రాహ్మణుడగు ప్రభువునకు వేయు గొడుగు చతురశ్రముముగా నలుచదరముగా నుండవలెను. రాజుల కవి గుండ్రముగా నుండదగును. ఆ గొడుగు గుడ్డ తెల్లగా నుండవలెను. తెల్ల పట్టగుడ్డతోనైన మంచిది. దానిమీద జెండా లుండవలెను. ఈ గొడుగు మూలలందు చంద్రకిరణములట్లు తెల్లని పతాకలు సువర్ణభూషితములు కూర్పవలెను. ఈ గొడుగు చామర దండమువలనే చేయవలెను. వెదురు ప్రశస్తము. దాని కణుపులు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదియేని గావలయును. వేణుమయ ఛత్రదండమును గృహస్థులయినవారు ధరింతురు. రాజుల ఛత్రదండ మారు హస్తములుండవలెను. ఆ గొడుగు పట్టమహిషికి యువరాజునకు సేనాపతికి నైదు హస్తములకు దగ్గియుండవలెను. శేనాపతి సురాధ్యక్ష్యజ్యౌతిషిక పురోహితులకైదు హస్తములుండవలెను. ఇచట పేర్కొనని యితరులకు నాల్గు మూరల గొడుగు యుండవలెను. ఛత్రముయొక్క వ్యాసము ఛత్రదండముతో సగము కొలతలో నుండుట ప్రశస్తము, రాజఛత్రమును అర్ధచంద్రచిహ్నములచే సూర్యబింబ చిహ్నములచే నలంకరింపవలెను. సార్వభౌముల యా చిహ్నములు వజ్ర-ఇంద్రనీల స్ఫటిక, వైడూర్యముక్తాఫపల ప్రవాళములను రత్నములచే నలంకరింపవలెను. ఆయాతపత్ర మామణి కిరణ మనోహరమై యండవలెను.

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున ఛత్రలక్షణమును పదమూడవయధ్యాయము.

* వి.ధ.పు-74

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters