Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటయిరువది తొమ్మిదవ అధ్యాయము - పురుషసూక్తమహాత్మ్య వర్ణనము

రామః- ఏకం మన్త్రం సమాచక్ష్వ ! సర్వకర్మకరం శివమ్‌ | ఐహికం సర్వధర్మజ్ఞ ! పారలౌకిక మేవచ ||

పుష్కరః- ప్రతివేదం మహాభాగః యత్సూక్తం పౌరుషం స్మృతం | సర్వకర్మకరం జ్ఞేయం పవిత్రం మాధుసూదనమ్‌ ||

సర్వకర్మకరము, ఐహికపారలౌకిక మంగళప్రదమునైన యొక్క మంత్ర మానతిమ్మని పరశురాముడడుగ పుష్కరుండనియో. ప్రతివేదమున పురుషసూక్తమున్నదని చెప్పబడినది. అది సర్వకర్మకరము, పవిత్రము. దాని కధిష్ఠానదేవత మధుసూదనుడు.

ఏకైకయా ఋచారామః స్నాతో దత్వా జలాంజలీః పౌరుషేణ చసూక్తేనముచ్చతే సర్వ కిల్బిషైః ||

అన్తర్జలగతో జప్త్వాతధాసూక్తంతు పౌరుషమ్‌ | సర్వకల్మష నిర్ముక్తో యధేష్టాం లభ##తే గతిమ్‌ ||

ఏకైకయా ఋచా స్నాతః పుష్పం పుష్పం నివేదయేత్‌ | పురుషాయ జలేరామః సర్వపాపై ర్విముచ్యతే ||

ఏకైకయా ఋచాస్నాతో దత్వా రామ ! ఫలం ఫలమ్‌ | సర్వాన్‌ కామా నవాప్నోతి యాన్‌ కాంశ్చి న్మనసేచ్ఛతి ||

ఒక్కొక్క ఋక్కుతో స్నానముచేసిన యాతడు అర్ఘ్యము (జలాంజలులు) సమర్పించిన సర్వపాప ముక్తుడగును. నీళ్ళలో నిలిచి పురుషసూక్తమును జపించిన యాతడు సర్వకల్మషములంబాసి యిష్టగతిం పొందును. స్నానము సేసి జలమునందు ఒక్కొక్క ఋక్కుతో నొక్కొక్క పుష్పమును పురుషునికి (పరమాత్మకు) సమర్పింప వలెను. దాననెల్ల పాపముల నెడలును. అట్లే ఒక్కొక్క ఋక్కుతో ఒక్కొక్క పండు సమర్పించిన నభిలషించిన అన్ని కోరికలు సఫలమగును. ఫలమ్‌=పనస పండనికూడ అర్ధమున్నది.

పౌరుషేణ చ సూక్తేన ప్రాణాయామో మహాఫలః | జలహోమౌ తధా రామః సర్వకల్మష నాశనౌ ||

సురాపో బ్రహ్మహా స్తేన స్తధైవ గురుతల్పగః | పాపేబ్యో విప్ర ముచ్చేత జప్త్యా సూక్తం తు పౌరుషమ్‌ ||

కృచ్ఛైర్వి శోధితః పూర్వం మధ్యాహ్నే సలిలాపగః | స్నాతస్తు పౌరుషం సూక్తం జపేన్నిత్య మతంద్రితః ||

సంవత్సరేణ దేవేశం వాసుదేవం ప్రపశ్యతి | స్వయమేవ మహాభాగః శాకమూల ఫలాశనః ||

తస్మా త్కాను మవాప్నోతి యద్రామ ! మనసేచ్ఛతి ||

పురుషసూక్త సంపుటితో ప్రాణాయామము మహాఫల ప్రదము. జపహోమములు సర్వపాపహారముల. మద్యపాయి, బ్రహ్మఘ్నుడును, దొంగ, గురుతల్పగుడు గూడ పౌరుషసూక్తము జపించి పాపముం బాయును. మొట్టమొదల (ఇంతకుమున్నీ గ్రంథము నందుబేర్కొనబడిని) కృచ్ఛ్రవ్రతములచే (శోధితుడై) పాపశోధన గావించుకొని మధ్యాహ్నవేళ నీటికివచ్చి స్నానముసేసి యే మాత్రము తొందర పడక శాకముల ఫలాహారియై పురుషసూక్తముం జపింపవలెను. ఒక్క సంవత్సరములో వాసుదేవుని (దేవాదిదేవుని) తనంతట తాన దర్శించును. ఆ దేవుని వలన కోరిన దెల్లంబొందును.

శ్రియ మగ్య్రాం తధా రూపం జీవితం దీర్ఘమేవచ | అణిమాం లఘిమాం ప్రాప్తిం మహిమాం చ భృగూత్తమః

ఈశిత్వం చ వశిత్వం చ ప్రాకామ్యంచ భృగూత్తమ |

యత్ర కామావసాయిత్వం తస్మాత్‌ ప్రాప్నోతి మానవః | దురవాప మథాన్యద్వా యత్కించి న్మనసేచ్ఛతి ||

అకామః పౌరుషం సూక్తం జప్త్వా నిత్య మతంద్రితః | తత్రయాతి మహాభాగః యద్విష్ణోః పరమం పదమ్‌ ||

మాంగళ్యమేతత్పరమం పవిత్రం | సంసార దుఃఖౌఘ వినాశకారి |

సుఖప్రదం ధర్మవిధం నరాణాం మనోరమావాస్తికరం ప్రదిష్టమ్‌ ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే పురుషసూక్త మహాత్యవర్ణనం నామ ఏకోనత్రింశత్యుత్తర శతతమోధ్యాయః

పరమైశ్వర్యము, అందము, దీర్ఘజీవితము, అణిమాదులగునెనిమిది సిద్థులుం బొందును. సర్వకామ పరమావధి యగు పరమేశ్వరునివలన యదియునంబొందును. (బ్రహ్మానంద మందునన్నమాట) సాధ్యముకాని దేదైన కోరననది పొందును. నిష్కాముడై నిత్యమును దొందరపాటు లేక పౌరుష సూక్తము జపించిన యాతడు ఆ విష్ణువు యొక్క పరమపదమును (వైకుంఠమును) బొందును. ఈపురుషసూక్తము మంగళకారి, పరమపవిత్రము, సకల సంసార దుఃఖహరము, సుఖప్రదము, నరులకు ధర్మ విధానము, మనోరమా ప్రాప్తికరము నని పేర్కొనబడినది.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమందు పురుషసూక్త మహాత్యవర్ణనమమును నూటయిరువదితొమ్మిదవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters