Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటయిరువది యెనిమిదవ అధ్యాయము - చతుర్వేదోక్త శ్రీసూక్త మహాత్వ్య కథనము

రామః-ఏకం మన్త్రం సమాచక్ష్వ దేవ! లక్ష్మీ వివర్ధనమ్‌ | ప్రతివేదం జగన్నాధ! యాదోగణ నృపాత్మజ ||

పుష్కరః-శ్రీ సూక్తం ప్రతి వేదంచ జ్ఞేయం లక్ష్మీ వివర్ధనమ్‌ | అస్మిన్‌ లోకేపరేవాపి యధాకమం ద్విజస్యతు ||

వరుణాత్మజ! జగన్నాధ! దేవా! లక్ష్మీ వివర్ధనమైన దొక మంత్రమా యా వేద శాఖానుగుణ విధానమానతిమ్మన పుష్కరుం డిట్టనియో. శ్రీసూక్తము ప్రతివేదమునందున లక్ష్మీవివర్ధనమని తెలియదగినది. అది యిహమందును పరమందుం గూడ కోరనవిధముగ ఫలించునది.

రామః-ప్రతివేదం సమాచక్ష్వ శ్రీ సూక్తం పుష్టివర్శనమ్‌ శ్రీ సూక్తస్య తధా కర్మ సర్వధర్మ భృతాం వర ||

పుస్కరః-హిరణ్య వర్ణాం హరిణీమృచః పంచదశ ద్విజ | శ్రీ సూక్త కధితం పుణ్య మృగ్వేదే పుష్టి వర్ధనమ్‌ ||

దథే అక్షేషు వాజేతి చతస్రస్తు తధా ఋచః | శ్రీ సూక్తంతు యజుర్వేదే కధితం పుష్టి వర్ధనమ్‌ ||

నావిని పరాశురాముడు ప్రతివేదానుగుణముగా పుష్టిం బెంచు శ్రీ సూక్తమును దెల్పుము. సర్వధర్మవిధి గావున నీకది శక్యమన పుష్కరండనియె. హిరణ్యవర్ణాం ఇత్యాది బుక్కులు పదునైదు. బుగ్వేదుమందిదే శ్రీసూక్తమని చెప్పబడినది. ఇది పుష్టివర్ధనము. ''రధే అక్షేషువాజ'' అను నాల్గు మంత్రములు యుజర్వేదమందు శ్రీసూక్తమని పేర్కొనబడినది. ఇదిపుష్టివర్ధనము.

శ్రాయన్తీయం తధామాసం సామవేదే ప్రకీర్తితమ్‌ | శ్రియం దాతుర్మయి దేహి ప్రోక్త మధర్వణ తధా ||

శ్రీసూక్తంయోజయే ద్భక్త్యా తస్యాలక్ష్మి ర్వినశ్యతి || జుహుయాద్యశ్చ ధర్మజ్ఞ ః హవిష్యేణ విశేషతః ||

''శ్రాయన్తీయం తధామాసమ్‌'' అనునది సామవేదమందలి శ్రీసూక్త మంత్రము. ''శ్రియందాతుర్మయి దేహి'' అనునది అధర్వణ వేదమందలి శ్రీసూక్తము. వీనిని భక్తితో జపహోమములందు ప్రయోగించినచో నలక్ష్మి (దారద్ద్య్రము) పోవును.

శ్రీసూక్తేన తుపద్మానాం ఘృతాక్తానాం భృగూత్తమ | అయుతం హోమయే ద్యస్తువహ్నౌభక్తియుతో నరః ||

పద్మహస్తద్వయా లక్ష్మీస్తం నరం తూపతిష్ఠతి | దశాయుతం తు పద్మానాం జుహుయాద్య స్తధా జలే ||

నాపైతి తత్కులా ల్లక్ష్మీర్విష్ణోః వక్షోగతా యధా | ఘృతాక్తానాం తు బిల్వానాం హుత్వా రామాయుతం తధా ||

బహు విత్త మవాప్నోతి స యావన్మనసేచ్ఛతి | బిల్వానాం లక్షహోమేన కులే లక్ష్మి ముపాశ్నుతే ||

నేతిలోముంచిన పద్మములు పదివేలు భక్తితో నగ్నియందు వేల్పవలెను. అట్లుచేసినచో రెండుచేతులయందు తామరపూవులు పట్టకొని లక్ష్మియా హోమకర్త దగ్గర నిలుచును. నేతితో పదిపదివేలు (లక్ష) పద్మము హోమము చేసినచో నాతని కులమునుండి (కుటుంబమునుండి) తరతరములు విష్ణువక్షస్థలమును వీడనట్లు మహాలక్ష్మి విడిచివెళ్లదు. ఆ యజమాని మనస్సులో నెంత విత్తముకోరునో యంతనుంబడయును. ఘృతాక్తములగు బిల్వములతో పది వేలు హోమము సేసినయోడల మనసునందు కోరినంత ధనము లభించును. బిల్వముల లక్ష హోమముతో కులము సంపదనందును.

పద్మానా మధ బిల్వానాం కోటి హోమం సమాచరేత్‌ | శ్రద్దధానః సమాప్నోతి దేవేంద్రత్వ మపి ధ్రువమ్‌ ||

సంపూజ్య దేవీం వరదాం యధావత్‌ పద్మైస్సితై ర్వా కుసుమైస్తధాన్యైః |

క్షీరేణ ధూపైః పరమాన్న భ##క్ష్యైః లక్ష్మీమవాస్నోతి విధానతశ్చ ||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయఖండే శ్రీసూక్తమహాత్మ్య కథనంనామ అష్టావింశత్యుత్తర శత తమోధ్యాయ ః ||

పద్మములయొక్కయు బిల్వములయొక్కయు కోటిహోమము శ్రద్దాభక్తులతో చేయవలెను. దాననాతడు దేవేంద్రత్వమునందును. ఇది నిశ్చయము. వరప్రదాత్రిని లక్ష్మిదేవిని యధోక్తవిధానమున తెల్లని పద్ములతోగాని మంచి లెల్లని పువ్వులతో పాలతో పరమాన్నములతో భక్ష్యములతో ధూపదీపాదులతో చక్కగ పూజించినచో లక్ష్మీసంపన్నుడగును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వతీయ ఖండమున శ్రీసూక్తమహాత్మ్య కథనమను నూటయిరువది యెనమిదవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters