Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట యిరువది ఏడివ అధ్యాయము - ఆధర్వవిధికథనము

పుష్కరః-శాన్తాతీతం గణం హుత్వా శాన్తి మాప్నోతి మానవః | భైషజ్యంచ గణం హుత్వా సర్వాన్రోగా నపోహతి ||

త్రిసస్తీయం గణం హుత్వా సర్వపాపైః ప్రముచ్చతే | క్వచిన్నాప్నోతిచ భయం హుత్వా చైవా భయం గణమ్‌ ||

న క్వచిజ్జాయతే రామః గణం హుత్వా పరాజయం | ఆయుష్యంచ గణం హుత్వా చాపమృత్యూన్‌ వ్యపోహతి ||

ఏతే దశగణా శ్చైవహోతవ్యాః స్యుర్యధాక్రమమ్‌ | అష్టాదశసు ధర్మజ్ఞ! దశ శాన్తిషు భార్గవ ! ||

వైష్ణవీ చ తధా చైన్ద్రీ బ్రాహ్మీ రౌద్రీ తధైవచ | వాయవ్యా వారుణీ చైవ కౌబేరీ భార్గవి తధా ||

ప్రాజాపత్యా తధా త్వాష్ట్రీకౌమారీ వహ్నిదేవతా | మారుద్గణీచ గాంధారీ శాన్తిర్వై రుదతీ తధా ||

శాన్త రాంగిరసీ యామ్యాపార్థివీచ భృగూత్తమః | ఏతాస్తు శాంతయః ప్రోక్తాః సర్వకర్మ హితాః సదా ||

పుష్కరుండనియో. మానవుడు శాతాతీతగణము నుద్దేశించి హోమము సేసి శాంతిని బొందును. భైష్యజ్యగణ హోమము వలన సర్వరోగములను బాయును. త్రివస్తీయగణమును గూర్చి హోమమాచరించి సర్వపాప విమోచన మందును. అభయగణ హోమము సేసి యెన్నడు నేనిభయము పొందడు. గణహోమము సేసినచోనెన్నడు నేని పరాజయము గల్గదు. ఆయుష్య గణహోమము సేసినచో నపమృత్యువును బొందడు. వీనిని పదేసి (రెట్టించి) హోమము చేయవలెను. పదునెనిమిది శాంతులందు దశ శాంతులందును తప్పక యాచరింప వలసినవి. అవి వైష్ణవి ఐంద్రి బ్రాహ్మి రౌద్రి వాయవ్య వారుణి కౌబేరి భార్గవి ప్రాజావత్య త్వాష్ట్రి కౌమారి మహ్నిదేవతా మారుద్గణీ గాంధారి రుదతి అంగీరసి యామ్యా పార్థివి అనునవి నర్వకర్మ హితకరములైన శాంతులుగా చెప్పబడినవి.

యస్త్వా మృత్యు రితీత్యేతత్‌ జప్తం మృత్యు వినాశనం | హుత్వాచ మాతృనామాని కామానేవ మవాప్నుయాత్‌ ||

సువర్ఱస్త్వితి హుత్వాచ భుజగైర్నైవ బాధ్యతే | యస్యేదం భూమి మితి చ భూమి కామో జపేత్సదా ||

''యస్త్వా మృత్యుః'' అనునది జపించిన మృత్యు నాశనమగును. పై మాతృనామములతో హోమము సేసిన సర్వకామసిత్ధి కల్గును. ''సువర్ణస్తు'' అను మంత్రముతో హోమము సేసిన సర్పబాధ కలుగనే కలుగదు ''యస్యేదం భూమిమ్‌'' అను మంత్రమును భూకాముడు జపింపవలెను.

పృధివ్యాముత్తమోసీతి హుతం శ్రైష్ఠ్య ప్రదం సదా | ఔదుంబరే యోన ఇతి తదావీర్య వివర్ధనమ్‌ ||

ఇంద్రేణ దత్త మిత్యేతత్‌ సర్వబాధా వినాశనమ్‌ | హిరణ్య వర్ణ ఇతిచ స్నానం పాపహరం భ##వేత్‌ ||

ఆసితస్యేతి సర్వాణి విషఘ్నాని భృగూత్తమ | సారస్వతీ మంత్రాంశ్చ విషఘ్నా న్నిర్విషేద్బుధః ||

శరభాదీన సర్వాణీ పిశాచ క్షపణాని చ | యమస్యలోకా దిత్యేతత్‌ దుస్స్వప్న శమనం వరమ్‌ ||

పృధివ్యాముత్తమోసి అను మంత్రముతో హోమముసేసిన సర్వశ్రేష్ఠుడగును. ''ఔదుంబరేయోనః'' అను మంత్రము వీర్యవర్ధనము. ''ఇంద్రేణదత్తమ్‌'' అను మంత్రము సర్వబాధలను హరించును. ''హిరణ్య వర్ణ'' అను మంత్రముతోడి స్నానము పాపహరము. ''అసితస్య'' అను మంత్రము సర్వివిఘ్నహరము. ''సారస్వతీ'' అను మంత్రమును విషహరణమునకు జపింపవలెన. ''శరభాది'' మంత్రములు పిశాచహరములు. ''యమస్యలోకాత్‌'' అనునది దఃస్నప్నశమనము.

అగ్నేర్వ ఇతి చా ప్యేత త్రధితం మన్యు నాశనమ్‌ | ఊర్ద్వోభవతి విజ్ఞేయః కృత్వా స్నానకరః పరః ||

ఇంద్రం వయం వణిజ మితి వణ్య లాభకరం పరమ్‌ | కామోమో రాజ్ఞీతి హుతం స్త్రీణాం సౌభాగ్య వర్ధనమ్‌ ||

భద్రాయ కర్ణ మిత్యేతత్‌ కర్ఱ ప్రస్యందనే జపేత్‌ || భద్రాసాక్షి వధే జాతా కర్ణ ప్రస్యందనే తధా ||

తుభ్యమేవా జిరితి ఆయుష్యం తు హుతం భ##వేత్‌ ||ఆయాతు పిత మిత్యేతత్‌ మిత్ర లబ్ధికరం హుతమ్‌ ||

''అగ్నేర్వః'' అనునది మన్యు నాశనము. ''ఊర్ధ్వో భవతి'' అను మంత్రము స్నానకరము. ''ఇంద్రం వయం వణిజమ్‌'' అనునది వాణిజ్య లాభకరము. ''కామోమేరాజ్ఞీ'' అనుదానహోమము సేసినచో స్త్రీలకు సౌభాగ్య వర్థనము. ''భద్రాయకర్ఱమ్‌'' అనునది చెవిలో చీము మొదలైన దాని హరించును. ''భద్రాసాక్షివధే'' అనునది గూడ కర్ణ ప్రన్యందన రోగహరము ''తుభ్యమేవాజిః|| అను మంత్రముతో హోమము ఆయుష్యము. ''అయాతు పితమ్‌'' అను మంత్రహోమము మిత్రలాభకరము.

ఆశాసాన మిదం జప్త్వా మిశ్ర ధాన్యేన హోమయేత్‌ | ఆధిపత్య మవాస్నోతి సర్వత్ర మనుజోత్తమః ||

అగ్నిరీశేభి రిత్యేతత్‌ గవా వృద్థికరం పరం | ద్వాదశా హంతు జుహుయా త్పరాకుణ విశేషతః ||

శాతోహవి రితీ త్యేతత్‌ వామ స్వాస్థ్యకరం భ##వేత్‌ | తస్మాద్వామాన్‌ మృదా కౄత్వా వేదిసామ్యం సమశ్నుతే

విధాయ స్వేతి సర్వాణి రాష్ట్ర స్వీకరణా నితు | త్రిభ్యో భ##ద్రేభ్య ఇత్యేతత్‌ వాస్తోష్పత ముదాహృతమ్‌ ||

ధ్రువం ధ్రువేణతి హుతం స్థాన లాభకరం భ##వేత్‌ | ''అచ్యుతాపో'' స్తధా రామ ! కధితం స్థాన లాభదమ్‌ ||

''ఆశాసానమ్‌'' అను మంత్రము జపించి కలగలుపు ధాన్యముతో హోమము సేయవలెను. అందువలన సర్వాధిపత్యమును బొందును. ''అగ్నిరీశేభిః'' అనునది గోసంపదను గల్గించును. ఈ మంత్రముతో పండ్రెండు రోజలు జాకరూకతతో హోమము సేయవలెను. ''శాతోహవిః'' అను మంత్రము వామస్వస్థత చేకూర్చును. ఇది గోప్రకరణముతోజెప్పినారు. గావున వామశబ్దమునుకు (ఆవు పొదుగు అను నర్థము చెప్పవలెను.) ఆపొదుగునకేదేని వాపు మొదలైన రోగము గల్గినపుడీ మంత్రము వాడవలెనని భావము. ఆ మంత్రముతో పొదుగులను మట్టి ముద్దతో దయారుచేసిన అదే వేది సామ్యమువచ్చును ''విధాయస్వ'' అను మంత్రము లన్నియు రాష్ట్ర స్వీకరణ మంత్రములు (రాష్ట్రభృన్మంత్రములని వైదిక ప్రసిద్ధి) త్రిభ్యో భ##ద్రేభ్యః అనునది ''వాస్తోష్పతీ'' మంత్రము ''ధ్రువం ధ్రువేణ'' అను మంత్రమును, 'అచ్యుతాపో'' అను మంత్రముతో సంపుటీకరించి హోమము సేయవలెను. ఆప్రక్రియ స్థానలాభకరము.

వయో దేవేష్వితి హుతం రాయ స్పోషకరం పరమ్‌ | యునక్త సారేతి శునా కృషి లాభకరం భ##వేత్‌

ఆయం తే యోని రిత్యేత త్పుత్ర లాభకరం పరమ్‌ | శునే వతాతధా హ్యేత ద్గవాం వృద్ధికరం హుతమ్‌ ||

...............మేతి కధితం సర్వత్రశ్రైష్ఠ్య కారకమ్‌ | యదగ్న ఇతి చా ప్యేతత్‌ బంధనా న్మోక్ష కారకమ్‌ ||

''పయో దేవేషు'' అను మంత్రముతోచేసిన హోమము రాయస్సోషకరము=ధనపుష్టిని జేయునది. ''యునక్తసార'' అను మంత్రము కృషి (వ్యవసాయ) లాభకరము. ''అయంతే యోనిః'' అనునది పుత్రలాభకరము. ''శునేవత్సా తథా'' అను దానితో హోమము గోవృద్ధికరము. ...........అను మంత్రము శ్రేష్ఠత్వకారకము. ''యదగ్న'' అను మంత్రము బంధమోచనము సేయును.

యోనస్వ ఇతి చాప్యేత చ్ఛత్రు నాశకరం పరమ్‌ | సవన్నహ న్నితి తధా నాత్రకార్యా విచారణా ||

త్వమ త్వమ మితీత్యేత ద్యశసో వర్ధనం పరమ్‌ | యధావృషి మితీత్యేతత్‌ స్త్రీణాం సౌభాగ్య వర్ధనమ్‌ ||

''అనోఅగ్న'' ఇత్యేతచ్చ కధితం పతి లాభదమ్‌ | యేనవేహేతి మాచైవ గర్భలాభకరం భ##వేత్‌ ||

ఇమం తపస్విన్నితి తధా భ##వేత్సౌ భాగ్యవర్ధనామ్‌ | యావృధివ్యా మనావృత్తం హుతమేత ద్యధావిధి ||

కృత్వాతు సంశనం జ్ఞేయం నాత్రకార్యా విచారణా |

శివం శివాభి రిత్యేత ద్భవేచ్ఛ్రేయస్కరం పరమ్‌ | దూత్యా ద్రవిణ మిత్యేతత్‌ కృత్యాదూషణ ముచ్యతే ||

బృహస్పతిః పరిపాతు పధి స్వస్త్యయనం భ##వేత్‌ | మనో విపన్న భయదం వధిస్త్వస్త్యయనం భ##వేత్‌ ||

''యోనస్వ'' అనునది శత్రునాశకము. సవన్నహన్‌ అనునది కూడ శత్రునాశకము సందేహములేదు. ''త్వమత్వమమ్‌. అనునది మశోవర్థకము. ''యధావృషీ మితీ'' అనునది స్త్రీలకుసౌభాగ్యవర్ధనము. ''అనో అగ్నే''అనునది భర్తృ లాభము సేయును'' ''యేయవేహేతిమా'' అనునది గర్భలాభకరము. ''ఇమంతపస్విన్‌'' అనునదియు సౌభాగ్య వర్ధనము. ''యత్పృధివ్యామనావృత్తం'' అను మంత్రముతో యధావిధిగ హోమము సేసినచో శాంతి కలుగును. ''శివం శివాభిః'' అనునది శ్రేయస్కరము. ''దూత్యా ద్రవిణం'' అను మంత్రము ''కృత్య'' యనునొక దుష్టదేవతను నిరోధించును. ''బృహస్పతిః పరిపాతుపధి'' అనునది శుభప్రయాణకరము. ''మనోవిపన్న భయదం''అనునదియు కూడ ప్రయాణమందు శుభకరము.

అయన్నో అగ్ని రధ్యక్షో భ##వేదగ్ని ప్పసాదకః | సంవత్సరం తు శిరసా ధారయోద్యో హుతాశనమ్‌ ||

మంత్ర మేద జ్ఞపే న్నిత్య మాగ్నేయాశా ముఖస్థ్సితః | అనగ్ని జ్వలనం కుర్యాద్రామా ! సంవత్సరే గతే ||

ధూత్యా దూతి రసీత్యేత జ్ఞపేన్మంత్ర మనుత్తమమ్‌ | కుర్యా త్ప్రదిసరా బంధం సర్వదోష నిబర్హణమ్‌ ||

ప్రాణ సూక్తం చ కధితం తధా ప్రాణ వివర్ధనమ్‌ | ముంచామిత్వేతి కధిత మపమృత్యువిమోక్షణమ్‌ ||

''అయంనో అగ్ని'' అను మంత్రము అగ్ని దేవతానగ్రహకరము. అగ్ని దేవతను శిరస్సనధరించి ఆగ్నేయ దిక్కుగా దిరిగి కూర్చుండి నిత్యము జపింప వలెను. సంవత్సరముపూర్తియయినచో అగ్నిహోత్ర భయము కలుగనీదు. ''దూత్యాదూతిరసి'' అను పరమోత్మత్తమ మంత్రము జపించి తాయోత్తు (రక్షరేకు) కట్టుకొన్నచో సర్వదోషహరమగును. ప్రాణసూక్త జపము ప్రాణవర్ధనము. ''ముంచామిత్వా'' అనునది అపమృత్యు నివారకము.

అధర్వ శిరసో ధ్యేతా సర్వపాపైః ప్నముచ్చతే | పరమం పావనం - తద్ధి సర్వ కల్మష నాశనమ్‌ ||

ఏవ మేతే శుభా మంత్రాః ప్రతివేదం మయా తవ సమాసాత్కధితా రామ !సముద్ధృత్య ప్రధానతః ||

అధర్వశిరో మంత్ర పారాయణ చేసిన వాడు సర్వపాపముక్తుడగును. అది చాల పవిత్ర మొనరించు మంత్రము. పరశురామా! ఈ విధముగా సర్వపాప నాశనము, ప్రతివేదము నుండి శుభప్రదములైన ప్రధాన మంత్రముల నేరి నీకు సంగ్రహించి చెప్పితిని.

ఏకైకస్య చ మంత్రస్య వినయోగాః సహస్రశః | కధితా భృగుశార్దూల ! పురాణౖః సుమహాత్మభిః ||

నతేశక్యా మహాభాగ ! వక్తుం వర్షశ##తై రపి | ప్రాధాన్యేనతు మంత్రాణాం కంచి త్కర్మ తవేరితమ్‌ ||

ఇక్కోక్క మంత్రము యొక్క వినయోగ పద్ధతులు వేయి విధములుగా సనాతన మహర్షులు చెప్పియున్నారు. అవన్నియునుతెల్పుటనూ రేండ్లకైన శక్యముగాదు. అందులో ప్రధానమయిన మంత్రములతో నాచరించ వలసిని కర్మ విధానము నీకిపడు తెన్పితిని.

హోమే యత్ర న నిర్దిష్టం మయాద్రవ్యం పురాతం | హవీంషి తత్ర వక్ష్యామి తానిమే గదతః శృణు ||

వృక్షాణాం యజ్ఞియానాంతు సమిధః ప్రధమంహవి | ఆజ్యం చవ్రీహయశ్చైవ తధావైగొర సర్షపాః ||

అక్షతాని తిలాంశ్చైవ దధి క్షీరంచ భార్గవ ! దర్భాస్తధైవదూర్వాశ్చ బిల్వాని కమలాని చ ||

శాన్తిపుష్టికరాణ్యాహుః ద్రవ్యాణ్యతాని భార్గవ ! తైలేన్ధనాని ధర్మజ్ఞ! రాజకాం రుధిరం విషమ్‌ ||

సమిధః కంటకోపేతాః అభిచారేషు యోజయేత్‌ | ఆర్షం వై దైవతం చన్దస్త్వవిజ్ఞాయ భృగూత్తమ ! ||

మంత్రస్య తేన మంత్రేణ జప్యహోమౌన కారయేత్‌ | ఛందసిబ్రాహ్మణ సూక్తే యదవ్యక్తం ప్రదృశ్యతే ||

విద్వద్భిః సహ నిశ్చిత్య తద్యజ్ఞ మవతారమేత్‌ | సంభారా యే యధా యత్రయాని ద్రవ్యాణియో విధిః ||

శాఖాంప్రతి తధాతత్ర తత్ప్రమాణ మితి స్థితిః || యః స్వసూత్ర మతిక్రమ్య పరసూత్రేణ వర్తతే ||

అప్రమాణ మృషిం కృత్వా సోప్య ధర్మేణ యుజ్యతే | తస్మాత్సర్వ ప్రయత్నేన స్వసూత్రంన విలంఘయేత్‌ ||

-ఃహోమద్రవ్య నిర్దేశముః-

ఏ హోమమునందు నాచే ద్రవ్యము నిర్దేశించ బడలేదో ఆచటవాడదగిని హవిస్సులను గూర్చి తెల్పెదనిక వినుము. యజ్ఞియ వృక్ష సమిథలు ప్రప్రథమంముగా బేర్కొకనదగిన హవిర్ద్రవ్యమలు. యజ్ఞియ వృక్షములు- మేడి, మోదుగ, జువ్వి, మఱ్ఱి, రావి మున్నగునవి. నెయ్యి వ్రీహిధాన్యము తెల్లవాలు అక్షతలు నువ్వులు పెరుగు పాలు దర్భలు దూర్వలు (గరిక) మారేడు కమలములు ననునవి శాంతిని పుష్టిని గూర్చు వస్తువులు. తైలము (నూనె)తో గూడిన కట్టెలు రాజకను = గుంటకలగర, రక్తమును, విషమును ముళ్ళుగల సమిథలను అభిచార కర్మములందు వాడనగును. మంత్రమునకు ఋషి, దేవత, ఛందస్సులును తెలియకుండ ఆ మంత్రముతో జపము హోమమును జేయగూడదు. బ్రాహ్మణ మందు, ఛందస్సునందు, సూక్తము నందు అవ్యక్తముగా నుండునేని (ఋషి యెవరో దేవత యెవరో తెలియనపుడు) విద్వాంసులతోగూడ సంప్రతించి దానిని యజ్ఞమునందు వినియోగపరుపవలెను. యజ్ఞ సంభారమలు ఏయే ద్రమ్యములు చెప్పబడినవో ప్రక్రియ (విధి) యెట్లు చేయవలెనో అది ఆయాశాఖననుసరించి చేయవలెను. ఆపస్తంబాది శాఖలను గూర్చిన క్రియా భేదములాయా శ్రౌత గృహ్య స్మార్త సూత్రగ్రంథములందు జెప్పబడినవి. కావున తన సూత్రముంబట్టి యది చేయవలెను. అంతేకాని పర సూత్రానుసారమది సేసినచో నది తప్పిదమగును. ఋషి విషయములో ప్రమాణము లేకుండ జేసినచో నధర్మమగును. కావున సర్వప్రయత్నములచేత స్వసూత్రము నుల్లంఘింపగూడదు.

ప్రాక్తన్త్రోత్తర తంత్రేద్వే స్వశాఖా ప్రత్యయాద్విజ ! సర్వకర్మసు కర్తవ్యే మధ్యే కర్మ విధీయతే ||

ఆధర్వణో యంకథితో విధిస్తే సంక్షేపతో భార్గవవంశముఖ్య !

అతః పరం కిం కధయామ తుభ్యం తన్మే వదస్వాయతలోహితాక్ష ! ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే అధర్వవిధి కథనంనామ సప్తవింశత్యుత్తర శతతమోధ్యాయః.

ప్రాక్తంత్రము, ఉత్తరతంత్రము అనునీ రెండును జేయవలసినవి. ఆరెండు తంత్రముల నడుమ కర్మాచరణము విధింప బడినది. భార్గవరామ ! అధర్వ విధి యిది నీకు సంక్షేపముగా తెల్పితిని. ఈ పైనేమి సెప్పవలయునది తెల్పుము.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయ ఖండమున అధర్వవిధి అను నూటయిరువదియేడవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters