Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటపందొమ్మిదవ అధ్యాయము - నరకయాతనావర్ణనము

రామః- నామాని నరకాణాంచ యాతనా వివిధా స్తధా | భగవన్‌! శ్రోతు మిర్చామి పుంసాం నరక గామినామ్‌ || 1

పుష్కరః -- తామిస్ర మంధతామిస్రం మహారౌరవ రౌరవౌ | నరకం కాలసూత్రంచ మహా నరక మేపచ ||

సంజీవనం మహావీచిం తపనం సంప్రతాపనం | సంఘాతం చ సకాకోలం కశ్మలం పూతిసూతికమ్‌ ||

లోహశంకుం నృభీమంచ మంధానం శాల్మలిం నదీమ్‌ | ఆసిపత్ర వనం చైవ లోమకారం తధై వచ ||

పాతాళేషు మహాబాహో! త్రీం స్త్రీం వృద్ధిక్రమేణ తు | ఏకైకస్య తధై వాష్టౌ దిక్షుచాపి విదిక్ష్వపి ||

స్థితా స్తథాయే విజ్ఞేయాః నరకా ఘోర దర్శనాః | యాన్త్యేతే పాప కర్మాణో నరా యేషు భృగూత్తమః ||

ఏకస్మిన్నరకేకేచిత్‌ క్రమా దన్యే బహుష్వపి | యాన్త్యేతే మానవా రామ! పీడ్యమానాః పునః పునః ||

నరకాణాం నారణాం తు యాతాన కారినశ్చయే | ఘోరరూపాస్తుతే ప్రోక్తా దృష్టమాత్ర భయావహాః ||

మార్జారోలూక గోమాయు గృధ్రశ్యేనఖరాననాః | గజాశ్వోష్ట్ర వరాహాణాం సింహానాంచ తథా పరే ||

గోధా మహిషకాకానాం మద్గ సారసయో స్తథా | ఉరభ్రా7 పతంగానాంసర్పమూషకయో స్తథా ||

నరకమునకు జనిన జీవులక్కడ ననుభవించు యతనలనేకములు. వాని పేరులు విననెంచెదనన పుష్కరుడనియె. తామిస్రము అంధతామిసము మహాశారవము రౌరవము నరకము కాల సూత్రము మహానరకము సంజీవనము మహావీచి తపనము సంప్రతాపనము సంఘాతము కాకోలము కశ్మలము పూతిసూతికము లోమాశంకువు నృభీమము మంధానము శాల్మలినది. అసిపత్రవనము లోమకారము. ఇవిగాక పాతాళములందవికాక వానికంటె నింకొక దానియందు మూడేసి వంతున పెంపుగల సంఖ్యలో నరకములు, అట్లె దిక్కులెనిమిదింటను నెనిమిదిరకములును నతిభయందకరములైయున్నవి. పాపాత్ములిందు గుములుదురు. కొందఱొక దానియందుం గొందరీయనేక నరకములందు మఱి మఱి పీడింపబడుధురు. నరకయాతనలను జీవులచే ననుభవింపజేయు యమకింకరులక్కడ మహాభయంకరులు చూచినంత హడలు పుట్టింతురు. పిల్లి గుడ్లగూబ నక్క గ్రద్ద డేగ గాడిద ఏనుగు గుఱ్ఱము ఒంటె పంది సింహము ఉడుము దున్నపోతు కాకి ముద్గువు = నీటికాకి బెగ్గురు మేక పక్షులు ఉరభ్రము = పొట్లేలు పాము ఎలుకలు మొదలగువాని మొగములు గలవారు.

అన్యేషాం చైవ సత్త్వానాం తధన్యే జఠరా నరాః | స్కంధాననా స్తధైవాన్యే కబంథాకార దర్శనాః ||

భీమాననా భయకరాః నానాయుధ ధరా స్తధా | ఉగ్రవాచో దురాధర్షాః సర్ప వృశ్చిక వేష్టితాః ||

తైలద్రోణ్యాం నరాన్‌ క్షిప్త్వాజ్వాలయిత్వా హుతాశనమ్‌ | సుసమిద్ధం నరాన్‌ కాంశ్చిత్‌ క్వాధయన్తి పునః పునః ||

ఆంబరీషేషు చైవాన్యాన్‌ తామ్ర పాత్రేషు చాపరాన్‌ | ఆయః పాత్రేషు చైవాన్యాన్‌ ద్రవ్య ద్వహ్ని కణష్వపి ||

శూలేషు రోపితానన్యాన్‌ శుష్కాగ్నా వ పరాం స్తథా | ఉత్కృత్య విపచన్తే తానన్యాం శ్ఛిత్వా తథాపరాన్‌ ||

కశాభి స్తాడయ న్త్యన్యాం స్తథాన్యానపి మానవాన్‌ | భోజయన్తి మహాభాగ! వహ్నితప్తానయో గుడాన్‌ ||

పాంసూనపి తధైవా న్యాన్‌ వాంత మన్యత్ర చాపరమ్‌ | విష్ఠా మన్యత్ర చ కఫం తథా న్యత్ర చ కంటకాన్‌ ||

అన్యత్ర వహ్ని సంకాశా స్తథా భార్గవ! వాలుకాః | పాయయన్తి తథా న్యత్ర మహ్ని కర్ణాం చ వారుణీమ్‌ ||

అన్యత్ర నారకాణాం తే చిన్ధ న్త్యంగాని భాగశః | పాటయన్తి తథాన్యత్ర కరపత్రైః పునః పునః ||

పీడయన్తి తథాన్యత్ర కృత్వా యన్త్రేషు నారకాన్‌ | ఉలూఖలే కృతా నన్యాన్‌ ముసలైస్తాడయన్తి చ ||

కుంభీగతాం స్తథాన్యత్ర కుంభీతః కించి దుద్గతాన్‌ | ఘ్నన్తి ముద్గరకూటేన మహతీం వేదనాం గతాన్‌ ||

ఇతరజంతువుల పొట్టలుగలవారు మెడకుందించుకొనిపోయిన మొగము గలవాండ్రు కళ్ళులేని కబంధులు(మొండెమువాండ్రు) భీషణముఖలు నానాయుధధరులు ఊరక ప్రేలు బండలు మొండివారు పాములు తేళ్ళును నొడలెల్ల జుట్టుకొన్నవారునై యమభటులు వెఱపుగొల్పుచుందురు. సలసల క్రాగునూనె కాగులందు జీవులను విసరి పారవేసి మంటలు పెట్టి కొందరిని మండింతురు కొందరిని మంగలములందు వేయింతురు. రాగిపాత్రలందు ఇనుప మూకుడులందు నుడికింతురు. శూలముకొన నెక్కింతరు. మాంనముకోసి వండింతురు. కొరడాలం గొట్టుదురు నిప్పునం గాల్చిన యినపగుదియల దినిపింతురు. దుమ్మును వాంతులను మలములను కఫమును(శ్లేష్మమును) ముండ్లనుం దినిపింతురు. కనకనమంరు నిసుకను నిప్పువలె నుండు మద్యముం ద్రావింతురు. ఇంకొకచోట శరీర ములను బాడితలచే జెక్కుదురు రంపములం గోయుదురు. గానుగుల కెక్కించి పీడింతురు. ఱోళ్ళయందుంచి ఱోకళ్ళం దంపుదురు. బానలలో కళాయిలలో నుడికించి క్రుమ్ముదురు. అందుండి వెలికి పొంగిపడిన వాండ్రను లగుడముల మోదుదురు. 21

త్వచ ముత్కృత్య7చాన్యత్ర శునాం నరక వాసినః | త్యజన్తి తేచ భక్ష్యన్తే తీక్షదంతై ర్ముహు ర్ముహుః ||

అంధకారే తధాన్యత్ర భీమగంధే భయావహే | ఆత్యుష్ణే తైశ్చ పాత్యన్తే గర్భవాససమే జనాః ||

కాకై ర్గోమాయుభిః సర్పై ర్వృశ్చికై ర్మూషకై రపి | మక్షికాభిశ్చ భక్ష్యన్తే తేషా మన్యత్ర శాసనాత్‌ ||

అన్యత్ర శాల్మలిం ఘోరం సంతప్తం తీక్ష కంటకమ్‌ | సర్పకీటాది బహుళ మారోప్యన్తే నరాధమాః ||

ఆన్యత్ర చ తథా ఘోరం సంతప్తామయసః శిలామ్‌ | ఆలింగన్తే సుదుః స్పర్శాం తేషామేవ తు శాసనాత్‌ ||

అన్యత్రాసేవ్య వసతౌ వసన్తి భయపీడితాః | తత్ర తేషాం తు నాసా7క్షి కర్ణ వక్త్రేషు మానదః ||

ప్రవిశన్తి మహాభోగాః కృమయో మాంసభోజనాః | క్షారనద్యాం తధైవాన్యే పాత్యన్తే నారకా ముహుః ||

బహుశీతాం ధకారే చ పాత్యన్తే నరకే పరే | రక్తతోయ వహా మన్యే ప్రపద్యన్తే మహానదీమ్‌ ||

ఆసిపత్ర వనే చాన్యే కృష్యన్తే భీమదర్శనే | తృష్ణయా క్షుథయా చాన్యే భాధ్యన్తే తత్ర మానవాః ||

పరాన్నపానం లిప్సన్తః తాడ్యన్తే కూడ ముద్గరైః | పాయయన్తి తథా7న్యత్ర పరా యమ భటాస్తథా ||

తీవ్రదూమ మధోపక్త్రాన్‌ బద్ధ్వా వృక్షేషు మానద | త్వచోత్కర్తన మన్యత్ర తిలశః క్రియతే భ##టైః ||

కాష్ఠాన్య న్యత్ర బధ్యన్తే నారకాణాం తథా 7స్థిషు | కూటాగార ప్రమాణౖశ్చ తథా దేహైర్భ యా ర్దితాః ||

సూచీ వక్త్రా స్తథా7న్యత్ర యాప్యన్తే క్షుధయా భృశమ్‌ | సిచ్యన్తే చ తథాన్యత్ర లేన చ గుడేన చ ||

సంతప్తేన మహాభాగ! భృశం దుఃఖప్రదాయినామ్‌ | అన్యత్ర జాత పిటకాః స్రస్త జిహ్వాః సువిహ్వలాః ||

ఘోరాతప వినిక్షిప్తాః భక్ష్యన్తే చ పిపీలికైః | సూత్రేణా న్యత్ర ఛిద్యన్తే పాదతః ప్రభృతి క్రమాత్‌ ||

తిలశో భృగు శార్దూల! నారకాః పర్వతోపమాః | యావచ్చ తేషాం మూర్ధానం తావదేవ పునః పునః ||

కృత్వా చ పిష్టం వచనం పచ్యన్త్యే తథా భృశమ్‌ | అయః పాత్రేషు చాన్యత్ర తీక్ణ శంకుభి రాయసైః ||

క్రియన్తే సంయతా ఘోరైః సంతప్తేషు మహాభుజః | ఆపోధ్యన్తే తథా7న్యత్ర వినిగృహ్య శిలాసు తే ||

గర్తేషు తే మృదం దత్వా పూర్యన్తే ముసలై ర్భృశమ్‌ | బద్ధా స్తంభే తథా7న్యత్ర క్షిప్యన్తే సాయకై ర్నరాః ||

శృంఖలాభి శ్చ బధ్యన్తే లోఠ్యన్తే కంటకేషు చ | గంధే నాన్యత్ర బోధ్యన్తే విషమేణ పునః పునః ||

నారకై శ్చ తథా సత్వైః నానావేషై ర్భయానకైః | యాతనాభి శ్చ బహ్వీభి ర్యాప్యన్తే నరకే భృశమ్‌ ||

అన్యోన్యస్య చ మాంసాని భక్షయన్త్యపరే తథా | హాతా తమాతేతి తథా క్రందమానాః పునః పునః ||

నిన్దన్తః స్వాని కర్మాణి తాడ్యమానాశ్చ తై ర్భటైః | యాతనాభి శ్చ బహ్వీభి ర్యాప్యన్తే భృగు నందన ||

చర్మమునొలచి నరకవాసులు వదలెదరు. కుక్కల యొక్క పదునైనపండ్లచే గొరికీ కొరికి ఆ పాపులు దినబడుదురు. దుర్వాసనగొట్టే భయంకరమైన గొందిలోనికి కాఱుచీకటిలోనికి వేడి చిమ్ముచోటికి గర్భనరకమట్టి నరకములోనికి పాపులను గెంటుదురు. కాకులు నక్కలు తేళ్ళు ఎలుకలు కందిరీగలచే పొడిపించి కఱపించి తినిపింతురు. మరొక్కచో ఘోరమైన కఱకు ముండ్లు గలిగి వేడియెక్కిన జమ్మిచెట్టుపైకెక్కింతురు. జోరీగలు మొదలయిన వానితో నిండియుండి బాహు బాధాకరమగును. ఇంకొక్కచోట తాకరాని కాలిన యినుపచట్టం గౌగలింపింతురు. వేఱొకచో ముక్కులు కండ్లు చెవులు నోటిలో క్రిములుదూరి మాంసముం గఱచి తినుచుండును. అట్టి నరకమందు గొందఱు గుములుచుందురు. కారపునదిలో గొందఱిం రక్తపు నదులందుం గొందఱిం బడవేయుదురు. మిక్కిలి చలి చీకటియుగల నరకమందు వేయబడుదురు. కొందరిని రక్తజలముతో కూడిన మహానదిలో పడవేయుదురు. కొందరు భయంకరమగు కత్తులయడవిలో నీడ్వబడుదురు. ఆకలి దప్పికలచే పీడింపబడుదురు. ఇతరులకూడ నీరు హరింప గోరినవారిని బరిసెలతో నినుపదుడ్డులతో బాదుదురు యమభటులింకొకయెడ గొందఱిచే త్రావింతురు. చెట్ల మీదనుండి పెనుపొగలో తలిక్రిందులుగా వ్రేలాడదీయుదురు. నువ్వు గింజింతగా తోలు తునక తునకలు గావింతురు. పాపాత్ముల యెముకలువిరుగునట్లు బడితెలచే మోదుదురు. ఆ యమభటుల కూటగృహముల ప్రమాణదేహములతో భయపడుచుందురు. నోటసూదులు గ్రుచ్చి యాకలిచే దహింపజేయుదురు. తెగక్రాగిన నూనె బెల్లపుపాకము మీద బోయుదురు ఇంకొకచో బొబ్బలెక్కి నాలుకలు లేల మిక్కిలిగ గుములుచుండ మండుటెండల నిలిపి చీమలచే దినిపింతురు. ఆ పాదమస్తకము తాళ్ళు బిగించి నుప్పుగింజింతలుగ పెద్ద పర్వతములట్లున్న యమకింకరులు పాపుల దేహములను దునుకతునుకలుగ నఱుకుదురు తలదాక నొడలెర్ల ముద్ద చేసి యినుపబానల తెగ యుడికింతురు. వేఱొకచో నినుప శంకువులతో కాలిన యినుపబానలిని వేచుదురు. వేఱొకయెడ బంధించి కాలిన బండలం బడవైచి కొట్టుదురు గుంటలందు నెతిరోకళ్ళచో దంచుదురు. స్తంభములకు గట్టిపెట్టి ఆలుగులం పాడుతురు సంకెళ్ళం గట్టుదురు ముళ్ళం దొరలింతురు విషమమయిన పాడు గవులుకంపులో ముంతురు నరకమందలి క్రూరజంతువులు పలువేసముల వెఱపుగొలువు యమకింకరులును పెక్కురకము యాతనలకు గురిసేయుదురు. ఒక పాపుని మాంసమింకొక పాపిచే దినిపింతురు. అయ్యో! అయ్యా! అమ్మాయని మఱిమఱి నరకకూపమందలి నరులు గొల్లున నేడ్చుచుతమ చేసిన చేతలం దిట్టుకొనుచు యమభటులచే గొట్టబడుచు పెక్కు యాతనలంగుడుతురు. 44

విముక్త నారకా హ్యాన్యే వహ్ని మన్యే ఘశీతలమ్‌ | విజానన్తి మహాభాగః సుఖ స్పర్శతమం తథా ||

విముక్తో నారకాచ్ఛీతాత్‌ సుఖోష్ణం హిమ సంచయమ్‌ | మన్యతే సర్వమేవాన్యత్‌ సుఖస్పర్శతమం తథా ||

నరకేభ్య శ్చ శ##సై#్రభ్యో విముక్తోయో నరాధమః | శస్త్రాణ్యన్యాని జాతాని సుఖస్పర్శ సమాని చ ||

సుఖదుఃఖే తు మానుష్యే త్రివిదే కేవలం సుఖమ్‌ | నరకే దుఃఖ మేవోగ్రం సతతం భృగు నందన ||

తృష్ణా తత్ర క్షుధా తత్ర గంధస్తీవ్రో భయంకరః | యాతనా వివిధాః ప్రోక్తాః భయం తత్రా7తి దారుణమ్‌ ||

దుర్గంధ కంటకాకీర్ణం తథా కుణప సంకులమ్‌ | కేశాస్థి బహుళం భీమం నరకం దుఃఖమే వ తు ||

ఆర్తనాద మహానాద కాక క్రవ్యాద సంకులమ్‌ | కృమికీట పతం గాఢ్యం పూయాసృగ్బహుళం తథా ||

ఆన్యో7న్యక్లేశ సంయుక్త మన్యో7న్య కర్ష కారకమ్‌ | అన్యో7న్య తాడకం ఘోరం తథా7న్యోన్య భయంకరమ్‌ ||

ఏవమేతేషు తేపాపాః నరకేషు సమాగతాః | బహవః ఖలు యాప్యన్తే మానవాః పాపకారిణః ||

నరకమునుండి ముక్తులయినవాళ్ళు:- కొందఱు నరకమునుండి విడువఖడినవారు నిప్పును మిగుల చల్లనిది సుఖస్పర్శగల దని గుర్తింతురు. నరకమందలి చలినుండి విడి వడినవారు సర్వము సుఖస్పర్శగల మంచువలెను హాయిగలిగించుచు వెచ్చగను భావింతురు నరకమునుండి యక్కడి శస్త్రములనుండి ముక్తులయిన తరువాత కత్తులు కటారులే దేనిని యెంతసుఖముగా నున్నవి? అని యనుకొందురు. మనుష్యలోకమునందు సుఖము దుఃఖము రెండును స్వర్గమందు కేవలము సుఖము నరకమున గేవలము మహా దుఃఖము నియతములు నరకమందు ఆకలి దప్పిక తీవ్రగంథము (ఘాటు) వివిధయాతనలు అతిదారుణమైన భయము చెడుకంపు ముళ్ళు పీనుగులు వెంట్రుకలు ఎముకలతో భయము గొలుపునది కేవలము దుఃఖమే. గొల్లుమని యేడ్పులు పెడబాబ్బలు కాకులు క్రూరమృగములు అలజడులు కృమికీటకములు పక్షులు మలమూత్రములు రక్తపుమడువులు ఒకిరినొకరు బాధించుకొనుట ఒండొరులు పీకుకొనుట లాగికొనుట తమలోదాము గొట్టుకొనుటయను వానితో నరకకూపమతి భయంకరమది మహాఘోరము ఇట్లు పాపాత్ములు పలు విధముల నరకములంజొచ్చి మందలు మందలుగా నట గుములుదురు. 53

యావత్తేషాం న పాపాని క్షయం యాన్తి భృగూత్తమః | తావత్తే న విముచ్యన్తే నరకాద్ఘోర దర్శనాత్‌ ||

ఆత్యన్తఛీమా నరకాః సుఘోరాః భయావహ వ్యాళ గణావకీర్ణా |

భక్తిం వహన్త ః పురుషోత్తమస్య న యాన్తి తే భార్గవ వంశముఖ్య ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే నరకయాతనా వర్ణనం నామ ఏకోన వింశత్యుత్తర శతతమో7ధ్యాయః ||

అతిభయంకరమై కనిపించు నాఘోరనరకమునందు పాపములన్నియు క్షయించువఱకు నానాయాతనలం గుడిచి యామీద యందుండి విముక్తులగుదురు ఓ భార్గవవంశ తిలకా! నరకము లతిభయంకరములు అతిఘోరములు జడుపు గొలుపు క్రూరమృగముల నలముకొన్నవి పురుషోత్తమునిపై భక్తిగలవారానరకములకు బోరు. 55

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమందు నరకయాతనావర్ణనమను నూటపందొమ్మిదవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters