Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటపదునేడవ అధ్యాయము - స్వర్గగామివర్ణనము

రామః :- భగవన్‌ః శ్రోతు మిచ్ఛామి యే నరాః | స్వర్గగామినః | కేన ధర్మభృతాంశ్రేష్ఠః తధా నిరయ గామినః ||

పుష్కరః : ఆశ్రమేషు యఢో క్తేషు కర్తన్తేయేద్విజోత్తమాః | స్వధర్మసక్తాః సతతం తే నరాః స్వర్గగామినః ||

వర్తన్తే యే మహీపాలః రాజధర్మాను సారతః | పురోహితమతే యుక్తా రాజానః స్వర్గగామినః ||

ప్రజాసుఖే సుఖం యేషాం తద్దుఃఖే యేచ దుఃఖినః | దుష్టనిగ్రహ కర్తారో జ్ఞేయాస్తే స్వర్గ గామినః ||

స్వామ్యర్థే బ్రహ్మణార్ధేవా మిత్రకార్యేచయేహతాః | గోగ్రహే నిహతా యేచతేనరాః స్వర్గగామినః ||

దేహధాతూన్‌ పరిత్యజ్య సలిలా రణ్య వహ్నిషు | అనాశ##నేవా ధర్మజ్ఞః మృతాః స్యుః స్వర్గగామిపః ||

తీర్థయాత్రా ప్రసక్తాశ్చ నిత్య మధ్వని కర్షితాః | తపసా కర్షితా యేచ తేజ్ఞేయాః స్వర్గచామినః ||

మధుమాంస నివృత్తాశ్చ నివృత్తా మధుపానతః | కామమైథునతశ్చాపి విజ్ఞేయాః స్వర్గగామినః ||

మాతాపితృపరా దాన్తా గురుభక్తాః ప్రియంవదాః | సత్యార్జపరతా యేచ తేనరాః స్వర్గగామినః ||

వై వాహికానాం వస్త్రాణాం ప్రపానాంయే పరదాయినః | ఉద్యానారామ కర్తారః తేనరాః స్వర్గగామినః ||

తడాగ కూపకర్తారః తధా కన్యాప్రదాయకాః | ఛత్రోపానహ దాతారస్తేనరాః స్వర్గగామినః ||

ఇంధనానాం ప్రదాతార స్తధా గోగ్రాసదాయినః | గవాం శుశ్రూషకా యేచ తేనరాః స్వర్గ గామినః ||

పరోపకార సక్తాశ్చ పరబంధవివర్జితాః పూజ్యపూజయితారశ్చ తేనరాః స్వర్గగామినః ||

స్వాధ్యాయసక్తా ధీమంతో గురు శుశ్రూషణ రతాః | ఉపాసకాశ్చ వృద్ధానాం తేజ్ఞేయాః స్వర్గ గామినః ||

ప్రతిశ్రయ ప్రదాతార స్తధాయే సత్రదాయకాః | భక్తా గోదేవ విప్రాణాం తేనరాః స్వర్గగామినః ||

శ్రోతారో యేచ ధర్మాణాం యేతధా యజ్ఞ యాజినః | ఉపవాసరతాయేచ తేజ్ఞేయాః స్వర్గ గామినః ||

క్లేశా ననుభన్తీహ శాస్త్రాధ్యయన తత్పరాః | శాస్త్రాణాంచ హితే యుక్తాస్తే జ్ఞేయాః స్వర్గ గామిన ః ||

అర్తప్రాణ ప్రదాయేచ యేచ హింసా వివర్జకాః | అపీడకాశ్చ భూతానాం తేనరాః స్వర్గగామినః ||

దరిద్రాయచ దాతారః ప్రభవశ్చక్షమాన్వితాః | ¸°వన స్థాశ్చ యే శాన్తాః తేనరాః స్వర్గగామినః ||

పౌత్రదౌహిత్ర సంయుక్తాః యేతధా చిరజీవినః | ప్రియంకరాశ్చ బాలానాం తేనరాః స్వర్గగామినః ||

పోషకాణా మనాధానాం యేచైవోద్వాహ కారిణః | ద్విరాగమనదా యేచ తేనరాః స్వర్గగామినః ||

గ్రహాణాం పూజకాయేచ యేతధా శ్రాద్ధకారిణః | సంవిభాగ కరాయేచ తేనరాః స్వర్గగామివః ||

సర్వాసాం దేవతానాంచ యేచపూజారతా స్పదా | సర్వదానరతా యేచ తేనరాః స్వర్గగామినః ||

అహతాశ్చతధా తత్ర కృత్వా కర్మాతి దుష్కరమ్‌ | కాలేనాపిమృతా రామ! తేనరాః స్వర్గగామినః ||

యేభ క్తిమన్తో మధుసూదనస్య దేవేశ్వరస్యాప్రతిమస్య నిత్యమ్‌ ||

సత్వేన హీనాః రజసా వియుక్తాః తే యాన్తి నాకం సురసంఘపూజ్యాః ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే న్వర్గ భాగ్వర్ణనం నామ సప్తదశోత్తర శతతమోధ్యాయః ||

ధార్మిక శ్రేష్ఠ! మానవులేకారణముచే స్వర్గమునకేగుదురో యేకారణమున నరకమునకుం జనుదురో వినవలతునన పుష్కరుండిట్లనియె. బ్రహ్మచర్యా ద్యాశ్రమములందు స్వధర్మవిష్టులైనవారు స్వర్గముం బొందుదురు. ఓరాజా! పురోహితుని యిష్ట ప్రకారము రాజధర్మాను సారులైన రాజులు స్వర్గగాములు, ప్రజల సుఖమే తన సుఖముగా వారిదుఃఖమే తన దుఃఖముగ భావించి దుష్టశిక్షణము (శిష్టరక్షణము) సేయు భూపాలకులు స్వర్గమందుదురు. స్వామికొఱకు (రాజు యజమాని మొదలగు వారికొఱకు) స్నేహితుని పనిలో గోరక్షణమందు జంపబడిన వారు స్వర్గగాములు, దేహధాతువలను నీటిలో నడవిలో నగ్నిలో నిరాహార వ్రతమందును వదలి మరణించినవారు స్వర్గగాములు. తీర్థయాత్రలు సేయుచు ద్రోవలో మార్గయాసపశులైన వారు తపస్సుచే గృశించినవారు స్వర్గగాములు. మద్యము మాంసములు మధుపానమును మానినవారు స్వేచ్ఛా మైధునము నుండి మరలిన వారు స్వర్గగాములు. తల్లిదండ్రుల యెడల భక్తిగలవారు ఇంద్రియనిగ్రహము గలవారు గరుభక్తులు ప్రియముగ మాటలాడువారు సత్యమునందు ఆర్జపమునందు (కపటము లేమియందు ) నిరతులు స్వగార్గములు. వివాహసామగ్రులను వస్త్రములను, దానము చేసినవారు చలివెందలను తోటలను దొడ్లను నేర్పరచినవారు స్వర్గగాములు. చెఱువులు నూతులు ద్రవ్వించినవారు కన్యాదాతలు గొడుగు పాదరక్షలను నిచ్చినవారు స్వర్గగాములు. వంట చెఱకును గోవులకు మేతను నిచ్చినవారు గోసేవసేసినవారు స్వర్గగాములు. పరోపకారసక్తులు పరులబంధము నుండి విడిపించినవారు పూజ్యులం బూజించువారు స్వర్గగాములు. వేదాధ్యయననిరతులగు బుద్ధిమంతులు గురు శశ్రూషా పరులు వృద్ధులసే వించువారు స్వర్గగాములు, నిలువనీడనిచ్చినవారు సత్రములు పెట్టినవారు గోవులయెడ దేవతలయెడ బ్రాహ్మణులయెడ భక్తిగలవారు స్వర్గగాములు. ధర్మముల నాలించువారు యజ్ఞములు సేసినవారు ఉపవాసనిరతులును స్యర్గగాములు. కష్టసహనము గల్గి శాస్త్రాద్యయనము సేయుచు వాస్త్ర సమ్మతముగ నడచువారు స్వర్గగాములు. రోగాదులచే నార్తలగువారికి ప్రాణమిచ్చనవారు హింసకు దూరులు భూతుములను పీడింపనివారు స్వర్గగాములు. దరిద్రునికి దానము సేయువారుసర్వసమర్థులయ్యు నోరిమి పట్టువారు నడివయస్సులో నుండియు వాంతులగువారు స్వర్గగాములు. పౌత్రులతో దౌహిత్రులతో గూడిన చిరంజీవులు బాలురకు ప్రియము సేయువారు స్వర్గగాములు. తన పోషకులకు దిక్కులేనివారికి పెండ్లిగావించువారు రెండవసారి వచ్చినవారికి కూడ (మరలవచ్చినాడేయని యనకుండ) నిచ్చువారు స్వర్గగాములు. గ్రహములం బూజించువారు శ్రాద్దముయధావిదిం బెట్టువారు సమవిభాగముగ పురుషార్థసాధన సేయువారు లేదా యిది మంచిది యిది చెడ్డదియును విచక్షణ చక్కగ సేయువారు స్వర్గగాములు. లేదా పుత్ర మిత్రకలత్రాదులకు అతిధ్యభ్యాగతులకు చక్కగ భాగమొసంగి తామారగించువారు స్వర్గగాములు. ఎల్లదేవతలను పూజింప నాసక్తులైనవారు సర్వదానరతులును స్వర్గాములు. చేయలేని ఘనకార్యునొనరించి యందేమాత్రము భంగపాటు నొందనివారు అకాలమరణమందనివారు కాలమువచ్చ మాత్రమే మరణించువారు స్వర్గగాములు. సాటిలేని దేవేశ్వరుడు మధుసూదనునిపై నిరంతర భక్తిగలవారు బలహీనులైనను రజోగుణహీనులు నైన మహానుభావులు సురసంఘములు పూజించుచుండ స్వర్గమునకేగుదురు.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమందు స్వర్గగామి వర్ణనమను నూటపదునేడవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters