Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట పదహారవ అధ్యాయము - యమమార్గ వర్ణనము

పుష్కరః- ఆయుషి కర్మణి క్షీణ సంప్రాప్తే మరణ నృణామ్‌ | ఊష్మా ప్రకుపితః కాయే తీవ్రవాయు సమీరితః ||

శరీరము వరుధ్యాధ కృత్స్నాన్‌ దోషన్‌ రుణద్దివై | భినత్తి ప్రాణస్థానాని పునర్మ ర్మాణి చైవహి ||

శైత్యాత్ర్పకుపితో వాయుశ్స్చిద్ర మన్వ్ఛేష్యతే తతః | ద్వేనే త్రేచ తధా కర్ణౌద్వౌ తు నాసాపుటే తథా ||

ఊర్ధ్వంతు సప్త భిద్రాణి సప్తకం వదనం తధా | ఏతైః ప్రాణో వినిర్యాతి ప్రాయశః శుభకర్మణామ్‌ ||

అధః పాయు రుపస్థంచ ఛిద్రద్వయ ముదాహృతమ్‌ | ఛిద్రద్వయేన తేనాధ మ్రియంతేశుభకారిణః ||

మూర్ధానం యోగినాం భిత్వాజీవో వ్రజతి భార్గవ | అథవా స్వేచ్ఛయా రామ! యేన చేచ్ఛన్తి యోగినః ||

అంతకాలే తు సంప్రాప్తే ప్రాణా పానేష్వవస్థితః | తమసా సంవృతే జ్ఞానే సంవృతేషుచ మర్మసు ||

సజీవో నాభ్యదిష్ఠాన శ్చాల్యతే ఘాతదిశ్వనా | సజీవ శ్చాల్యమానస్తు కర్మభిసైః పురాతనైః ||

అష్టాంగాం ప్రాణవృత్తిం తాం శ##నైశ్చాల్యవయతే ద్విజ | శరీరం ప్రజహాత్యస్మా న్నిశ్వాసస్తు భ##వేత్తతః ||

చ్యవన్తం జాయమానం వా ప్రవిశంతంచ యోనిషు | పశ్యన్త్యేవం విధం సిద్ధాజీవం దివ్యేన చక్షుషా ||

సతు దేహ పరిత్యాగకాలేప్రాప్తే తదానషు | తత్‌ క్షణాదేవ గృహాతి శరీర మతివాహికమ్‌ |

ఊర్ధ్వం భజన్తి భూతాని త్రీణ్యస్మాత్తస్య విగ్రహాత్‌ | ఆకాశవాయుతేజాంసి ద్వేచాధో భృగునందన ||

సలిలంచ మహాభాగ! తధైవచ వసుంధరా | ఏవం పంచత్వ మాపన్నః పురుషస్త్వభి ధీయతే ||

ఏవం పంచత్వమాపన్నే తద్దేహమతి వాహికమ్‌ | భయానకై ర్మహాఘోరై ర్నానా వేషధరై స్తధా ||

ఉచ్చైస్తస్య తదా బద్ధం కాలపాశేన సత్వరమ్‌ | నీయతే కాలపురుషైః యామ్యం మార్గం సుదుస్తరమ్‌ ||

తప్తాంబరీష సంకాశం త్వయోగుణనిభం మహల్‌ | సంతప్త సికతం ఘోరం తామ్రపర్ణనిభం తథా ||

షడశతి సహస్రాణీ యోజనానాం మహీతలం | యమస్యతు పురీరామ! ఘారా సంయమనీ స్మృథా ||

నీయతే తేన మార్గేణ తాదృశేన తాం పురీమ్‌ | ఆకృష్యమాణః పురుషై ర్యామ్యై ర్గోరై ర్మహేతతే ||

పీడా మనుభవం స్తత్ర మ్రియతే నచ మానద! | అత్యర్థ విషమః ప్రోక్తః సమారో గోర దర్శనః ||

విశ్వరూపధరో రామ! భువి శీతావృతో మహాన్‌ | హిమ ప్రపాత బహుల శ్చాతిశీతః దుస్తరః ||

అంధకారవృతే దుర్గే గర్భవాసోపమస్తధా | అగ్ని సంస్పర్శవదనైః కాక కాకోల జంబుకైః ||

మక్షికా దంశమశ##కైః ఆవృత స్సరవృశ్చికైః | భక్ష్య మాణోపి తైర్జంతు ర్భక్ష్యతే చాపి రాక్షసైః ||

ఉత్కృత్యో త్కృత్య సహసానచ ప్రాణౖర్వియుజ్యతే | ముద్గరై శ్చూర్ణ్యతే ఘోరైస్తుద్యతే లోహ కంటకైః || 23

క్షుధయా తృషయా చైప ఘోరయా చాపి పీడ్యతే | దహ్యమానోతి ఘోరేణ సైకతేనచ నీయతే ||

ఏవం సంయాప్యమానస్తు ప్రాప్యతే యమ మందిరమ్‌ | దశభిస్స ముహూర్తైస్తు పంథాన మతి దుస్తరమ్‌ ||

ప్రాప్నోతి భీమ నిర్ఘోషం దుర్గంధి భయదర్శనమ్‌ | తత్కాలం సుమహ ద్వేత్తి పురుషో దేవ మాయయా ||

పాపాను రూపం తత్కాలం తస్యతత్రాభిజాయతే | కస్య చిద్ద్విశతం కాలం కస్యచిచ్ఛత సంభవమ్‌ ||

క్షత్తృష్ణా సంభవాశ్చైవ భవన్త్యథ మహాభయాః | దండో పిండస్య ధర్మజ్ఞ! ప్రేతత్వ ముపజాయతే ||

ప్రేతలోకె స వసతి తత స్సంవత్సరం నరః | సోదకుంభమతోన్నాద్యం బాంధవైస్తస్య దీయతే ||

దినే దినే యద్ధర్మజ్ఞ! తద్భుంక్తే నాత్ర సంశయః |నదీయతే తు యసై#్యత త్సతు తత్రాయుధా స్వయమ్‌ ||

పూర్వ దత్త మధాన్నాద్యం ప్రాప్నోతి స్వయమేవతు | స్వయ మేవ నదత్తంతు తధా దాతాన విద్యతే ||

న చాస్త్యుదకదాతాచ సతుత త్పరి తప్యతే | బాంధవై స్తూదకం దత్తం తత్ర తత్రస్య జాయతే ||

నదీ శీతజలా నామ బహు పానీయ సంయుతా | మాసి మాసి చ యచ్చ్రార్ధం తత్ర తస్య ప్రదీయతే ||

తేన తృప్తిమవాప్నోతి పరమాం నాత్ర సంశయః | మానుష్యేణ తు మాసేన పితృలోకే దినం స్మృతమ్‌ ||

ప్రేతలోకే తు దివసో మానుష్యేణ విధీయతే | తస్మా ద్దినేదినే దేయం ప్రేతాయాన్నంతు వత్సరమ్‌ ||

ఏవం సయాప్యమానస్తు ప్రాప్నోతి యమ మందిరమ్‌ | తతః పవ్యత్యసౌ దేవం పాపాత్మా ఘోర దర్శనమ్‌ ||

చిత్రగుప్త స్తత స్తస్య జ్ఞా కర్మ యధావిధమ్‌ | ఆజ్ఞావయతి ధర్మజ్ఞః శుభం వాయదివా శుభమ్‌ ||

తతః శ్మశానికా నామదేవాయామ్యా భయావహాః శీత వాతాతపోపేతం తదా రక్షన్తి మానవమ్‌ ||

యధేహ బంధనే కశ్చిద్రక్ష్యతే విషమై ర్నరైః | ప్రేతపిండై స్తతో దత్తైర్దేహ మాప్నోతి భార్గవ ||

భోగదేహ మితి ప్రోక్తేం క్రమాదేవ న సంశయః | ప్రేత పిండాన దీయ నైయస్య తస్య విమోక్షణమ్‌ ||

శ్మశానికే భ్యోదేవేభ్యః ఆకల్పం నైవ విద్యతే | తత్రాస్యయాతనా ఘోరాః శీతవాతాత పోద్భవాః ||

తతః సంపీడీకరణ బాంధవైశ్చ కృతే నరః | పూర్ణే సంవత్సరే దేహమతో న్యం ప్రతిపద్యతే ||

తతస్స నరకం యాతి స్వర్గంవా స్వేన కర్మణా | పతస్య కాలంవసతి కర్మణామనురూపతః ||

అర్వాక్‌ సపిండీ కరణం యస్య సంవత్సరాత్‌ కృతమ్‌ | ప్రేతత్వమపి తస్యాపి ప్రోక్తకం సంవత్సరం ధ్రుపమ్‌ ||

యైరిష్టం వివిధై ర్యజ్ఞైః పూజితో యైవ్యకేశవః | ప్రేత లోకం న తేయాన్తి తధాయే సమరే హతాః || 45

శ్మశానికానాం దేవానాం భవన్తి వశగానతే | ప్రేతలోకం ప్రపద్యన్తే తధా ఘోరం భయావహమ్‌ ||

శ్మవాలికానాం దేవానాం భవన్తి పశగా నతే | ప్రేతలోకం ప్రపద్యన్తేతధా ఘోరం భయావహమ్‌ ||

ఏవం యామ్యేన మార్గణ యాన్తి పాపా నరాధమాః | అరామసదనం యాన్తి తధైవ ద్రుమరోపకౌః ||

శీతలేన తు మార్గేణ ఫల పుష్పవతా సుఖమ్‌ | ఛత్రదాశ్చ సుఖం యా న్తిమార్గేణ సుసుఖేన తే ||

యాన మశ్వతరీయుక్త మాస్థాయోపానహ ప్రదాః | విమానై ర్యానదా యాన్తి తధా శయ్యాసన ప్రదాః ||

గృహదాః సవిహరంతు యాన్తి తృప్తా జలప్రదాః | భ##క్ష్యైర్భోజైస్తధాతృప్తాః యాన్తి భోజనదాయినః ||

దీప ప్రదాః ప్రకేశేన యాన్తిమర్గేణ తే సుఖమ్‌ | పూజ్యమానా యమభ##టైః యాన్తి భక్తాజనార్దనమ్‌ ||

నాస్తి తేషాం భయం కించి దిహలోకే పరత్రచ | తే తృప్తాః సర్వకామైశ్ప తదసా యాన్తి మానవాః ||

బుద్ధిం సమాస్థాయ తు సాత్వికీం యే భక్తాః సురేశస్య జనార్థనస్య |

తేషాం గతి స్తత్రతు యత్ర రామ శ్వేతాః పుమాంసో గత సర్వపాపాః ||

ఇతి శ్రీ విష్ణుథర్మోత్తరే ద్వితీయ ఖండే యమ మార్గవర్ణనం నామ షోడశోత్ర శతతమోధ్యాయః.

పుష్కరుండనియె. ఆయువు పురాకృతకర్మమును క్షీణమై మానవులకు మరణ సమయమురాగానే దేహమందు తీవ్రవాయువుచే లేపబడి ఊష్మము (వేడి) శరీరమంతటనావరించి యెల్ల దోషములను సమీకరించి ప్రాణస్థానములను ఆయువుపట్టులను బ్రద్దలు కొట్లును. చలువవలన ప్రకోపము చెందిన వాయువప్పుడు వెలికి పోవుటకు రంధ్రమును (దారిని) వెదకుకొనును. ఈ దేహ మందు మీదిభాగమందున్న చిద్రములేడు. కండ్లు రెండు, చెవులు రెండు, ముక్కులు రెండు నోరు తఱచుగనీ రంధముల ద్వారమున పుణ్యాత్ముల ప్రాణము పోవును. శరీరమందధోభాగమున పాయువు (గుదము)ఉపస్థయు నను రెండు భిద్రములున్నవి. పాపముచేసిన వారి ప్రాణ మాదారిబోవును. యోగులకు నడితలను (బ్రహ్మరంధ్రమును) భేదించుకొని జీవుడు పోవును. లేదా యోగులే దారింబోవనిశ్చయింతురాదారినే పోగలరు, అవసానకాలము రాగానే జ్ఞానము తమస్సుచే (తమోగుణముచే) నావరింపబడగా మర్మస్థానములు మూసికొనిపోగా ప్రాణాపానగతుడై నాభిస్థానమునాశ్రయించియున్న జీవుడు వాయువుచే జలింపజేయబడును. అట్లు గొట్టబడిన జీవుడు పురాతన కర్ములచే నెనిముది యంగములుగల ప్రాణవృత్తిని యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధిరూపములు గలదాని నుండి వదిలింపబడి యిశరీరమును వదలిపోవును. అంతట తుది నిశ్శ్వాసము (నిట్టూర్పు) వెడలును. క్రిందికి జారు (చినిపోవు) చుండెడు పుట్టుచుండెడు తల్లి యోనియందు ప్రవేశించుచుండెడి యీ జీవుని యీ యీ దశలను సిద్ధులు (యోగసిద్ధినందినవారు) దివ్య దృష్టిచేత జూతురు. దేహము వదలుచున్న యాక్షణములోనె (మరణ సమయమునందు) జీవుడాతివాకిహింక శరీరమును గ్రహించును. మీదిలోకములకు మోసికొనిపోవు శరీరమునే యాతివాహిక శరీరమందురు. మూడుభూతములనగా నాకాశము వాయువు తేజస్సును నీ శరీరమునుండి మీదికిపోవును, నీరు భూమియుం గ్రిందికిపోవును. ఈ విధముగా జీవుడు పంచత్వము పొందినాడని చెప్పబడును. అనుగా బంచభూతాత్మకమైన యీజీవ దేహము పంచ భూతములలో గలిసెనని తాత్పర్యము. ఇట్లు చనిపోయిన వెంటనే జీవుడు ప్రవేశించిన ఆతివాహిక శరీరమును భయంకరులు మహాక్రూరులు నానావివృతాకారులగు యమకింకరులచే కాలపాశముచే బిగింపబడి కాలిన మూకుడట్లు ఇనుమువలె కాలుచుండు నిసుకతో సలసలకాగిన రాగి రేకట్లుండు గడువరాని యమమార్గము వెంట (దక్షిణముగా) గొంపోబడును. ఆదారియెనుబదియారువలే యోజనములలో యమపురి సంయమని యనుపేర మహాఘోరముగా నుండును. ఘోరాతిఘోరమైన యమభటులా పురమునకు నేలపై నడ్చుచుండ నక్కడ నమిత భాదగుడుచుచుంగూడ మానవుడు మరణింపడు. ఆ యమమార్గ మత్యవత విషమము నతిఘోరమయికనిపించును. అది పెక్కురూపులంగొని విపరీతమైన చలితో మంచుగడ్డలు పైబడుచుండ వణకింపజేయుచు నతిదుస్తరమైయుండును. తల్లి గర్భమట్లందకార బంధురమయి తాకిన నిప్పులవలెనుండు ముక్కుతో నుండు నేకులు మాలకాకులు నక్కలు తెగబొడుచు ఈగలు అడవియీగలు, దోమలచే నావరింపబడి కఱచు పాములు కుట్టుతేళ్ళచే దినబడుచు నీ జీవుడు రాక్షసులచే గూడ భక్షింపబుడును. వేగముతో నెగిరెగిరి పడుచున్నను వీని ప్రాణములు మాత్రముపోవు. లగుడములతో నూరబడున. ఘోరములగు ఇనుప సూదులచే పొడవబడును. ఆకలి దప్పికలం గుములును కాలుచుండు నిసుక మార్గమున గొంపోబడును. ఇట్లు పదిముహూర్తము లాదస్తరమగు దాఱింగొంపోబడి ఆర్పులు పెడబొబ్బలచే జడుపుగొలుపుచు జూడం జడిసిపోయెడి యాదారిం గడచునపురు దేవమాయచే క్షణమొక యుగముగదోచును. మున్నజేసిన పాపములు ననుసరించి యాకాలమొకనికి రెండువందలుగా నొక్కొక్కనికిమారుగా ననిపించును, అపుడు జీవికాకలిదప్పికలు మమాభయంకరములై తోచును. యమదండనకు గురియగు నాయాతనా శరీరమునకప్పుడు ప్రేతత్వము వచ్చును, దానితో నొక్కసంవత్సర మాప్రేతలోకమునల దుండును. అందుచే నీజీవికి బంధువులు ఢంభముతో (ఉదక కుంభ దానముతో) నన్నాదులు వెట్టుదురు. ఆ పెట్టిన పిండములట నా ప్రాణి దినదినముందినును ఇందు సందియములేదు. వానికిట్లు పిండము పెట్టబడదేని వాడే మున్ను పెట్టిన యాన్నాదులు నక్కడ తానకుడుచును. తానుమున్న పెట్టకయున్న వానిని బెట్టువాడు తుదకు నీళ్ళైన వదలు వాడునుండడేని అట్టి వాడక్కడ నేడ్చుచుండును. బంధువలు వదలు నీరక్కడ వాని కందును. చల్లని శీతజల (చల్లని నీరుగలది) యనబడు నిండునది యిక్కడ వాని కేర్పడును నెల నెలమాసికములిట పెట్టినయెడలనది వాని కందుచుండును. దాని వలన నతడు నిండు తృప్తి నందును. సందియము లేదు. ఇక్కడ మనుష్య మానముచే నొక్కనెల యక్కడ పితృలోకమునం దొక్కదినముని బుషులు స్మృతి కర్తలు సెప్పినారు. కావున ప్రేత్కకమందు ప్రతి దినమందును ప్రేత కిక్కడ నొక్క సంవత్సరము పెట్టితీరవలెను. అనగా నిక్కడ ప్రతి మాసము మాసికము జరపవలెనన్నమాట. ఇట్లొక సంవత్సరము దారిగడచివాడు యమ మందిరముల బ్రవేశించును. అక్కడ వీడు పాపాత్ముడగుచో మహాభయంకారాకారుని యమునిజూచును. అవ్వల చిత్రగుప్తుడు వానిచేసిన కర్మమెల్ల యథాతధముగ పాపమును పుణ్యమును ప్రభువునకు నివేదించను. అప్పుడు శ్మశానికులను పేరుగల యమభటులు శీతవాతాత పాదులతో కుములు నా మానవు నిహలోకమందొక దుష్టుని కారాగామందు రక్షక భటులట్లు రక్షించుదురు. శ్రాద్ధ మందిగ్కడ పెట్టిన ప్రేత రండములచే నక్కడ నీజీవి ''భోగదేహము'' అనుపేర నొక దేహముం బొందును. ఇక్కడ ప్రేతపిండమీయబడని వానికక్కడ బంధవిమోక్షణ ముండదు. శ్మశానికలను పేరి ప్రేతలోకదేవతలు రక్షక భటులు వానిని కల్పాంతముదాక వదలనే వదలరు. అక్కడ శీతవాతాతపా దినిమిత్తములైన వాడు వడు యాతనలతి ఘోరములు. బంధువులు వీనికి సపిండేకరణము పెట్టిరేని సంవత్సరము పూర్ణముకాగ వాడింకొక దేహముం బొందును. అటుపై నరకమునకో స్వర్గమునకో పోవును. అదివాని కర్మానుసారముండును. సంవత్సరములో పల సపిండీకరణము జరిపింపబడిన వానికిగూడ ప్రేతత్వమొక సంవత్సరము తప్పదని శాస్త్రములం జెప్పబడియున్నది. వివిధయజ్ఞములుసేసిన వారు విష్ణుపూజ సేసినవారు రణరంగమున గూలిన వారికి మాత్రము ప్రేతత్వములేదు. వారు శశ్మానిక దేవతల వఝశముగారు. ఘోరమైన ప్రేతలోకమయునకు వారుపోరు పాపాత్ములిట్లు యమమార్గమునం బోదురు. బెట్లునాటిన వారు తోటలు నిండ్లు చేరుదురు. గొడుగిచ్చినవారు సుఖముగ పూలతో పండ్లతోనున్న చల్లని దారింబోవుదురు. పాదరక్ష వచ్చినవారు గుఱ్ఱపు బండినెక్కియు మంచము ఆసనము (పీటకుర్చీ) ఇచ్చినవారు విమానము నెక్కియుంజనెదరు. ఇల్లిచ్చినవారు మందచినీళ్ళిచ్చినవారు షడ్రసోపేత భోజనము పెట్టినవారు తృప్తితో నానందముగ నేగెదరు. దీపదానము చేసినవారు చక్రని వెలుతురు గల బాటను హాయిగా వెళ్ళెదరు. భక్తులు యమభటులచే బూజింపబడుచు విష్ణువుదరి కేగుదురు ఆ విష్ణుభక్తుల కిహమందును బరమందును నించుకేని భయముండదు. వారు సర్వ భోగములను భరించి సంతృప్తితో శీఘ్రమునేగుదురు. సాత్త్విక బుద్దినిగొని దేవదేవుని యందునిలిపినవారు పాపములెల్ల బాసిన అచ్చపుమేనివార (పుణ్యాత్మ) లుండు గతి నందుదురు.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమందు యమమార్గ వర్ణనమును నూటపదునాఱవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters