Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటపదునేనవ అధ్యాయము - శరీరవిషయవర్ణనము

రామః- శరీరం సకలం దేవ! తన్మమాఖ్యాతు మర్హసి | ఏతదేవ పరం జ్ఞానం త్వం హి వేత్సి మహాభుజః ||

పుష్కరః- భూమిః పంచగుణా జ్ఞేయా జలం జ్ఞేయం చతుర్గుణం | తేజస్తుత్రి గుణం రామ! పవనో ద్వి గుణో మతః ||

తత్రైక గుణ మాకాశం నిత్యం జ్ఞేయం మనీషి భిః | శబ్దః స్పర్శ శ్చ రూపం చ రసో గంధ శ్చ పంచమః ||

భూమే ర్గుణాన్‌ విజానీయాత్‌ ఉపాన్తే గంధ వర్జితాః | రసగంధ విహీనాస్తు తేజసః పరికీర్తితాః ||

గంధో రస స్తథా రూపం నాస్తివాయోః భృగూత్తమ! గంధో రస స్తథా రూపం స్పర్శః ఖే న చ విద్యతే ||

రసో గంధ స్తథా రూపం స్పర్శనం శబ్దఏవ చ | భూమ్యాదీనాం గుణాః ప్రోక్తాః ప్రధానాః భృగునందన ||

ఆకాశజాని స్రోతాంసి తథా శ్రోత్రం వివిక్తతా | శ్వాసోచ్ఛ్వాసౌ పరిస్సందో వాక్చ సంస్పర్శనం తథా ||

వాయవీయాని జానీయాత్‌ సర్వాణ్య తాని పండితః | రూపం సందర్శనం పంక్తిం పిత్త మూష్మాణ మేవ చ ||

మేధా వర్ణం బలం ఛాయా తేజ శ్శౌర్యం తధైవ చ | సర్వాణ్యతాని జానీయా తైజసాని శరీరిణామ్‌ ||

అంభసానీహ రసనం స్వేదః క్లేదో వసా తథా | రసాసృక్‌ శుక్రమూత్రాది దేహే దవ్రచయ స్తథా ||

శైత్యం స్నేహ శ్చ ధర్మజ్ఞః తథా శ్లేష్మాణ మేవ చ | పార్థివానీహ జానీహి ఘ్రాణకేశ నఖాది చ ||

అస్థ్నాం సమూహో ధైర్యం చ గౌరవం స్థిరతా తథా | మాతృజాని మృదూన్యత్ర త్వక్‌ చ మాంసంచ భార్గవ ||

హృదయం చ తథా నాభిః స్వేదో మజ్జా యకృ త్తథా | క్లోమాంతం చ గుదం రామ! ఆమస్యాశయ మేవ చ ||

పితృజాని స్థిరాణ్యత్ర భూమిజానీహ యాని తు | స్నాయు శుక్ర శిరశ్చైవ ఆత్మజాని నిబోధ మే ||

కామః క్రోదో భయో హర్షో ధర్మాధర్మాత్మతా తథా | ఆకృతిః స్వర వర్ణౌ చ చేతనాద్యం తథా వయః ||

తామసాని తథా జ్ఞాన ప్రమాదాలస్య తృట్‌ క్షుధః | మోహ మాత్సర్య వైగుణ్య శోకాయాస భయాని చ ||

కామక్రోధో తధా శౌర్యం యజ్ఞేప్సా బహు భాషితా | అహంకారః పరావజ్ఞా రాజసాని మహాభుజః ||

ధర్మేచ్ఛా మోక్షకామిత్వం పరా భక్తిశ్చ కేశ##వే | దాక్షిణ్యం వ్యవసాయ శ్చ సాత్తవికాని వినిర్ధిశేత్‌ ||

చతురః క్రోథనో భీరుర్భహుభాషీ కలి ప్రియః | స్వప్నే గగనగ శ్చైవ బహు వాతో నరో భ##వేత్‌ ||

ఆకాలపలితః క్రోధీ మహా ప్రజ్ఞో రణప్రియః | స్వప్నే చ దీప్తి మ త్ర్పెక్షీ బహువాత్తో నరో భ##వేత్‌ ||

స్థిరచిత్తః స్థిరోత్సాహః స్థిరాంగ రచనా న్వితః | స్వప్నే జల సి తాలోకి జహుశ్లేష్మా నరో భ##వేత్‌ ||

రసస్తు ప్రీణనో దేహే జీవనో రుధిర స్తథా లేపనం చ తథా మాంసే మేదః స్నేహకరం చ తత్‌ ||

ధారణం త్వస్థి కథితం మజ్జాభవతి పూరణీ | గర్భోత్పాదకరం శుక్రం తధా వీర్య వివర్ధనమ్‌ ||

తేజః ప్రాణకరం నిత్యం తత్ర జీవో వ్యవస్థితః | శుక్రా దపి పరం సార మపీతం హృదయోపమమ్‌ ||

షడంగాని ప్రధానాని కధయిష్యామి తే శృణు ! | ద్వౌ బాహూ సక్థినీ ద్వేచ మూర్ధా జఠర మేవ చ ||

షట్‌ త్వచ శ్చ శరీరేస్మిన్‌ కీర్త్యమానా నిబోధమే | బాహ్యతో హ్యధరా రామ! త్వచా రుధిర ధారిణీ ||

విలాసకారిణీ చాన్యా చతురీ కుష్ఠ కారిణీ | పంచమి విద్రధి స్థానం షష్టీ ప్రాణధరా మతా ||

కలాస్సప్త స్మృతా దేహే తాసాం వక్ష్యామి లక్షణమ్‌ | ఏకా మాంనధరా రామ! ధమన్యో యత్ర సంస్థితాః ||

అసృగ్థరా ద్వితీయాతు యకృత్ల్పీహా శ్రయా మతా | మేదోధరా తృతీయాస్సాత్‌ సూక్ష్మస్థూలాశ్రయాతు యా || 29

మజ్జాశ్రయా చతుర్థీ తు తథా శ్లేష్మపరా మతా | పురీషధారిణీ చాన్యా యధా పక్వాశ##యే స్థితా ||

షష్ఠీ పిత్తధరా నామ జఠరాగ్నౌ సమాశ్రితా | శుక్రాశయా శుక్రధరా తధా జ్జేయా చ సప్తమీ ||

బుద్ధీంద్రియాణి పంచాత్ర శ్రోత్రం ఘ్రాణం చ చక్షుషీ | త్వక్‌ తథా రసనా చైవ మహాభూతా శ్రయాణి తు ||

ఇంద్రియార్థా స్తథా పంచ తేషాం నామాని మే శృణు! | శ్రోత్రస్య శబ్ణః కథితో గంథో ఘ్రాణస్య పార్థివ! |

రూపం చ చక్షుషో జ్ఞేయం, త్వచః సంస్సర్శనం తథా | రసినస్య రస శ్ఛైవ మహా భూతా శ్రయాస్తు తే ||

కర్మేంద్రియాణి పంచాత్ర తేషాం నామాని మే శృణు ! | పాయూపస్థం హస్త పాదో జిహ్వా చైవాత్ర పంచమీ ||

తేషాయార్థా స్తధా పంచతాన్‌ ప్రవక్ష్యామ్యతః పరమ్‌| ఉత్సర్గం చ తథా నందః ఆదాన గమనే రసః||

ఇంద్రియాణ దశైతాని తేషాం వై నాయకం మనః పంచ కర్మేంద్రియాణ్యత్ర పంచ బుద్ధీం ద్రియాణి చ||

ఇంద్రియార్థా శ్చ పంచాత్ర మహా భూతాని పంచ చ | ఇంద్రియేభ్యః పరాః ప్రోక్తాః చత్వారో భృగు నందన ||

ఇంద్రియాణ దశైతాని తేషాం వై నాయకం మనః | పంచ కర్మేంద్రియాణ్యత్ర పంచ బుద్దీంద్రియాణి చ ||

ఇంద్రియార్థా శ్చ పంచాత్ర మహా భూతాని పంచ చ | ఇంద్రియేభ్యః పరాః ప్రోక్తాః చత్వారో భృగునందన ||

మనోబుద్ధి స్తధైవాత్మా అవ్యక్తశ్చ మహాభుజ! | తదాశ్రయాణీంద్రియాణ ఇంద్రియేభ్యః పరాశ్చతే ||

తత్త్వాన్యేతాని జానీహి చతుర్వింశతి సంఖ్యయా | యేషామైక్యం మహాభాగ! పురుషః పంచవింశకః ||

సంయుక్త సై#్తర్వియుక్త శ్చ యథా మత్స్యోదకే ఉభే | మనః సంశయకృ న్నిత్యం తథాబుద్ధి ర్వివేచనీ ||

ఆత్మా జీవః స్మృతో రామ| యో భోక్తా సుఖ దుఃఖ యోః | అవ్యక్తో మిశ్రితా నీహ రజస్సత్వ తమాంసి చ ||

పురుషస్త్వపరోజ్ఞేయో యశ్చ సర్వగతో మహాన్‌ | చతుర్వింశతి కాత్సంఖ్యా ద్య స్స నిత్యః పృథక్‌ స్థితః ||

ఏకత్రితాని తత్త్వాని పురుషస్య తధైకతః | న చైవ వ్యతిరిక్తాని తత్వాని పురుషా త్పరమ్‌ ||

ప్రకృతిః పురుషో రామ! నిష్కలః పంచ వింశకః | వికృతి స్తస్య విజ్ఞేయః శేషస్తత్వగణో బుధః ||

సర్వతః పాణపాదోసౌ సర్వతోక్షి శిరోముఖః | పురుషః సవరో జ్ఞేయః సర్వశక్తీస్తు సర్వతః ||

నాది ర్న మథ్యో నైవాంతో వ్యాప్తి సంభవయోర్థ్వయోః | యస్య జానన్తి మునయో యస్తం వేద స వేద విత్‌ ||

స యాతి పరమం స్థానం యోవేత్తి పురుషం పరమ్‌ | ఏత దేవ చ విజ్ఞానం ప్రస్తుతం శృణు భార్గవ! ||

సప్తాశయాః స్మృతా దేహే శృణు తానపి భార్గవ! అశయో రుధిర సై#్యకః కఫస్య చ తథా పరః ||

ఆమ పిత్తాశ¸° చాన్యౌ జ్ఞేయః పక్వాశయోపరః | వాయుమూత్రాశ¸° చాన్యౌ ఆశయాః సప్త కీర్తితాః || 50

పరుశురాము డిట్లనియె :- ఓ వీరాగ్రేసరా! దేవా ! నీవు శవీర స్వరూప మెల్ల తెలుపవలయు నీ సంపూర్ణ స్వరూపము నీవ యెఱ్ఱుంగుదువు. పుష్కఱుండనియె. భూమి గుణము ల్తెను. జలము గుణములు నాల్గు. తేజస్సు గుణములు మూడు. వాయువు రెండు గుణములు గలది. ఆకాశము గుణమొక్కటే. భూమి గుణములు శబ్దము. స్పర్శము రూపము, రసము గంధమునై యున్నవి. జలము యొక్క గునుములు గంధము తప్ప మిగిలినవి నాల్గునై యున్నవి. రసము గంధము తప్ప మిగతా గుణములు తేజస్సునకు సంబంధించినవి. వాయువునకు గంధమురసము రూపమునకు గుణములు లేవు. ఆకాశమందుగంధము రసము రూపము స్పర్శయను నాల్గు గుణములు లేవు. శబ్ధము ఒక్కటే యందున్నది. గంధము రసము రూపము స్పర్శ శబ్దము ననునవి. వరుసగా భూమి బలము తేజస్సు వాయువు ఆకాశమునను పంచ భూతముల యొక్క ప్రధాన గుణములు. స్రోతస్సులు శ్రోత్రము వివిక్తత ఆకాశము నుండి జనించినవి. శ్వాస = లోపలికి పీల్చు గాలి, ఉచ్ఛ్వాస = వెలుపలికి వదలు గాలి, పరిస్పందము = కదలిక వాక్కు. గురిస్పర్శనమనునవి వాయువునుండి యేర్పడునవి. రూపము సంస్పర్శనము పంక్తి వరుసపిత్తము, ఊష్మ ఆవిరిమేధరంగుబలము కాంతి, తేజస్సు శొర్యములు ననునవి తేజస్సువలనగల్గునవి. రసన = నాలుక, చెమట క్లేదము = తడి, వస, రసధాతువు రక్తము, శుక్రము మూత్రము దేహమందలి ద్రవములు. స్నేహము = నూనె. శ్లేష్మము వాసన కేశములు గోళ్ళు ఎముకల గూడు ధైర్యము బరువు స్థిరత్వము పృథిది వలన గలుగునవి. వాసన జుట్టు గోళ్ళు ఎముకల సమూహము ధైర్యము స్థిరత్వము (నిలుకడ) తల్లి భూమి వలన నేర్పడును. మృదువైన ధర్మము మాంసము నను నివి తల్లి వలన గల్గును. హృదయము నాభి చెమట మజ్జ యకృత్తు క్లోమము = మూత్రకోశము గుదము అమాశయము తండ్రి వలన గల్గును. ఈ మేని యందు స్థిరము లయిన స్నాయువులు శుక్రము శిరలు = నరాలు పృధివి వలన గల్గును ఆత్మవలన గల్గు గుణములు కామము, క్రోధము భయము హర్షము ధర్మము అధర్మము ఆకారము స్వరము రంగుచేతన మొదలయినది వయస్సును అజ్ఞానము ప్రమాదము పొరబడుట సోమరి తనము దప్పిక ఆకలి మోహము మాత్సర్యము దుష్టత్నము శోకము ఆయాసము భయము ననునవి తమోగుణము వలన కల్గును. కామ క్రోధములు శౌర్యము యజ్ఞము సేయుకోరిక బహుభాషిత్వము అహంకారము ఇతరుల నవమానించుటయు రాజసములు. (రాజోగుణము వలన గల్గునవి.) ధర్మమందు కోరిక మోక్షమందు వాంచ విష్ణువందు పరమభక్తి దాక్షిణ్యము = అందరి యందు సమప్రేమ వ్యవసాయము (కార్యాచరణ శక్తి) యనునవి సత్త్వ గుణము వలన లక్షణములు. వాతాధిక్యము కలవాడు నేర్పరి కోపి పిరికి వదరుబోతు కలహ ప్రియుడు కలలో నాకాశమునం దిరుగువాడునగును.

ఆ కాలములో తలనెరిసిన వాడు కోపి ప్రజ్ఞాశాలి యుద్ధ ప్రియుడు కలలో కాంతిగల వస్తువులను జూచు వాడు పిత్తాధికుడు పైత్య దోథము గలవాడునగును. శ్లేష్మ గుణమెక్కువ గలవాడు బుద్ధినిలకడగలవాడు గట్టియుత్సాహముగలవాడు రచనాశక్తి గలవాడు కలలో నీటి లోతును జూచువాడగును. శరీర మందు రసము = సప్తధాతువులందొకటి, ప్రీణనము తృప్తి కలిగించునది రక్తము జీవనము. మాంసము లేపనము మేదసు స్నేహకరము = చమురుం చేకూర్చునది. ఎముక ధారణము మజ్జ = ఎముకల యొక్క మాంసము పూరణి శుక్రము గర్భము నొదవించునది. వీర్య వర్ధనము గూడ, తేజస్సు ప్రాణకరము. దాని యందు జీవుడుండును శుక్రము కంటె సారముసీతమున శరీరమందు ఆఱు అవయములు ముఖ్యములు. రెండు బాహువులు రెండు సక్థులు = తొడలు నననెత్తి జఠరము = కడుపు. ఈ శరీరమందు త్వచః = చర్మములాఱు 1 వెలుపలివి 2 క్రిందివి చర్మము రక్తనును ధరించును ఇంకొక చర్మము అందముంజే కూర్చును. నాల్గవది వకుష్ఠవారిణి అయిదవది విద్రథికి స్థానము = పుండునకు స్థానము ఆరవది ప్రాణధారణ చేయును. దేహమందు కళ##లేడు. అందు ఒకటి మాంసము ధరించును. దానియందే బోలున = రాలుండును. రెండవరి రక్తమును ధరించును. యకృత్‌ ప్లీహములను ఆశ్రయ మైనది. హృదయ మందెడమ ప్రక్కనందు మాంస పిండము కడుపులో కుడివైపున గల కారిజమను భాగము. మూడవది మేధస్సును (వస. నయసు ధాతువును) ధరించునది. అది సూక్ష్మము స్థూలము మీద నాధార పడి యుండును. అనగా సూక్ష్మ శరీరమైనప్పుడు మనస్సును స్థూలమైన శరీరమును కూడ యాశ్రయించియుండును. నాల్గవది మజ్జ నాశ్రయించి యుండు నది శ్ణేష్మ ప్రధానము. అయిదవది పక్వాశయ మందుండి పరీషమును ధరించును. ఆరవది జఠరాగ్ని యందుండి పిత్తమును ధరించును. ఏడవది శుక్ర మందుండి దాని ధరించును. ఈ శరీర మందు బుద్ధీంద్రియములు (జ్ఞానేంద్రియములు) అయిదు. 1 చెవి 2 ముక్కు 3 కండ్లు 4 చర్మము 5 నాలుగ ఇవి పంచ మహాభూతములపై నాధారపడి యుండును. ఈ యింద్రియముల యర్థములు. అనగా నివి గ్రహించు విషయమము లైదు. 1 చెవికి శబ్దము 2 ముక్కునకు వాసన 3 కంటికి రూపము 4 చర్మమునకు స్పర్శ 5 నాలుకకు రసము (రుచి) ఇవి మహా భూతాశ్రయములు.

కర్మేంద్రియములైదు. 1. పాయువు (గుదము) 2 ఊవస్థ 3 చేయి 4 పాదము 5 నాలుక. వాని విషయములు వరుసగా 1 మలవిసర్జనము 2 ఆనందము 3 అందుకొనుట 4 నడక 5 రుచి

ఇవి పది యింద్రియములు. వీనిని నాయకము (నడిపించునది) మనస్సు అయిదు కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు కలిసి పది. యింద్రియ విషయములు ఐదు. మహాభూతములు అయిదు. ఇంద్రియముల కంటె పైవి మనసు బుద్ధి ఆత్మ కర్మేంద్రియ పంచవము. జ్ఞానేంద్రియ పంచవము, పంచ భూతములు పంచ తన్మాత్రలు, అవ్యక్తము, బుద్ధి, అహంకారము, ఆత్మ, మనస్సు ఇవే యిరువది నాల్గు తత్త్వములని తెలియుము. వీనితో గూడిన పురుషుడు ఇరువదియైదవ తత్త్వము నీటితో చేప అంటియు నంటనట్లుండు విధముగా నీ యిరువది నాల్ఞు తత్త్వములతో నంటియు నంటకుండ ఆత్మ పురుష శబ్దార్థము. మనస్సు సంశయాత్మకము బుద్ధి నిశ్చయాత్మకము ఆత్మ జీవుడనబడును. ఆజీవుడే సుఖ దుఃఖ భోక్త (సుఖదుఃఖానుభవము పొందు వాడు) అవ్యక్తమను తత్త్వము. రజస్సు సత్త్వము తమస్సు నను మూడు గుణముల కూడిక పురుషుడు. చతుర్వంశతి (24) తత్త్వములకు వేఱౖయుండు వాడు పురుషుడు. సర్వగతుడు. అది సర్వాతిశయమైన మహా పదార్థము. ఈ తత్త్వము లిరువది నాల్గు. ఇరువదియైదవ తత్త్వమగు పురుషునితో (ఆత్మతోరి అవి నా భావముగ నంటువడి యున్నవి. అయిన నవి పురుషుని కంటె వ్రేనుంగావు. ఇరువది యైదవ తత్త్వమగు పురుషుడే ప్రకృతి. నిష్ఫలుడు. ఫలసంబంధ మీతనికి లేదు. ఆయన యొక్క వికృతియే తక్కిన తత్త్వ జాలమంతయు. సర్వ తత్త్వాతీయమైన ఆత్మ బుధః = కేవల జ్ఞానరూపి. అన్ని యెడలం జేతులు కాళ్ళగలవాడు అంతట కన్నులుందలయు మొగముం గలవాడు సర్వశక్తి సర్వవ్యాపియు నైన యా పురుషుడు పరుడు అన్నిటికి మీది వాడు. (పరాత్పరుడని వ్యవహరింప బడువాడు) ఆ పరునకు మొదలు లేదు మధ్యలేదు. ఆయన తుది లేదు వ్యాప్తి (స్థితి) సంభవము = పుట్టువు నెవ్వ రెఱుంగరు. అట్టి పరమాత్మను (పరబ్రాహ్మమను) ఎవ్వడెఱుంగు నాతడు వేదవేత్త (వేదార్థవేత్త యన్నమాట) ఆ పరమ పురుషు నెఱిగిన యాతడు పరమస్థానమును (పరమ పదమును) అందును. ఈ ఎఱుకయే విజ్ఞాన మనియు ప్రస్తుతింప బడినది. దేహందు సప్తాశయము (ఏడు కోశము) లున్నవి. వానిని వినుము. 1. రక్తాశయము 2.కఫాశయము 3 ఆమాశయము 4 పిత్తాశయము 5 పక్వాశయము (జీర్ణ కోశము) 6 వాయువు యొక్క ఆశమము 7 మూత్రాశయము.

స్త్రీణాం గర్భాశయో రామ! పిత్త పక్వాశయాన్తరే | అష్టమ స భ##వే త్తాసాం యత్ర గర్భ స్స తిష్ఠతి ||

ఋతౌ వికోశా భవతి యోనిః కమల వత్సదా | గర్భాశ##యే తతః శుక్రం థత్తే రక్త సమన్వితమ్‌ ||

అన్యత్రకాలే ముకుళా యోనిర్భవతి యోషితామ్‌ | స్యస్తం శుక్రమతో యోనౌ నైతి గర్భాశయం మునే ||

ఋతాపపి చ యోని శ్చే ద్వాత పిత్త కఫా వృతా | భ##వేత్తస్యా విశౌచార్థం నైవ తస్యాః ప్రజాయతే ||

వృక్కా తు పుష్ప సప్లీహం హృత్కోష్ఠాంగ యకృద్ఘనాః | తండుల శ్చ మహాభాగ! నిబద్దా న్యాశ##యే తు తే ||

రసస్య పచ్యమానస్య సారాద్భవతి దేహినామ్‌ | ప్లీహా యవృచ్చ ధర్మజ్ఞ! రక్తఫేనాచ్చ పుక్కసః||

రక్త కిట్టాశ్చ భవతి తథా దండక సంజ్ఞ కః | మేదో రక్త ప్రసాదాచ్చ వృక్కయోః సంభవః స్మృతః ||

రక్త మాంస ప్రహదాచ్ఛ భవ న్త్యంత్రాణి దేహి నామ్‌ | సావిత్రి వ్యోమ సంఖ్యాని తాని స్త్రీణాం వినిర్ధిశేత్‌ ||

త్రివ్యోమాని తథా స్త్రీణాం ప్రాహుర్వేద విదోజనాః | రక్త వాయు సమాయోగా త్కాలో యస్యోద్భవః స్మృతః ||

కఫ ప్రసాదాద్భితి హృదయం పద్మ సన్నిభమ్‌ | అదోముఖం తత్సుషిరం యత్ర జీవో వ్యవస్థితః ||

చైతాన్యాను గతాః భావా స్సర్వే తత్ర వ్యవస్థితాః | తసవామే తథా ప్లీహా దక్షిణ చ తథా యకృత్‌ ||

దక్షిణ చ తథా క్లోమ పద్మసై#్యవ ప్రకీర్తితమ్‌ | స్రోతాంసియాని దేహేస్మిన్‌ కప రక్తవహాని తు ||

తేషాం భూతాను గానాం తు భవతీంద్రియ సంభవః | నేత్రయోర్మండలం ళుక్లం కఫా ద్భవతి పైత్తికమ్‌ ||

కృష్ణం చ మండలం వాతా త్తథా భవతి మాతృకమ్‌ | సర్వహృ న్మండలం జ్ఞేయం మాతా పితృ సముద్భవమ్‌ ||

పక్ష్మ మండల మేకం తు ద్వితీయం వర్త్మ మండలమ్‌ | శుక్లే తృతీయం కధితం చతుర్ధం కృష్ణ మండలమ్‌ ||

దృ జ్మండలం పంచమం తు నేత్రంస్యాత్‌ పంచ మండలమ్‌ | అన్యేతు నేత్ర భాగే ద్వే తథాపాంగ కనీనికే ||

యఖ్యాం నేత్రస్య జనితా మత్స్య సంస్థానతా ద్విజ! నాసా సమీపే కధితం తరపాంగేతి సంజ్ఞితమ్‌ ||

కపోలయో స్సమీపే తు తథా ప్రోక్తా కనీనికా | మాంసా సృక్‌ కఫజా జిహ్వా మేదోసృక్కఫ మాంస జౌ ||

వృషణౌ చ తథా జ్ఞేదు సర్వేషా మేవ దేహినామ్‌ | ప్రాణ స్యాయతనా న్యత్ర దశైతాని నిబోధమే ||

మూర్ధా చ హృదయం నాభి కంఠౌ జీహ్వా నిబంధనమ్‌ | రక్తం శుక్రం గుదో వస్తి స్తథా గుత్ఫౌ చ భార్గవ! || 70

కండరాః షోడశ ప్రోక్తాః తధా దేమే శరీరిణామ్‌ | ద్వే కరస్థే తధా ద్వేచ చరణస్థే పృథక్‌ పృథక్‌ ||

స్త్రీలకు పిత్త పక్వాశయముల నడుమ కుర్భాశయము శిశువుండునది యెనిమిదవ ఆశయము గలదు. ఋతుకాలము నందు స్త్రీయోని కమలమట్లు విప్పారును. రక్తముతో గూడిన శుక్రము గర్భాశయ మందు నది ధరించును. ఋతువుకాని సమయమందు యోని మొగ్గవలె ముడుచుకొని యుండును. యోనియందుంచ బడిన శుక్రము గర్భాశయముం జేరదు. ఋతు సమయమందక్కడ యోని వాతపిత్త కఫములతో నావరింపబడునేని యదిగర్భధారణయోగమ్యము కానేరదు. వెలుపలుండుటకు మాత్రమే అనుకూల తడును. పక్వమైన రస ధాతువు నుండెడి ప్లీహము = కడుపులో ఎడమప్రక్క నుండి మాంస పిండము యకృత్తు = కడుపులో కుడిప్రక్క నుండెడి మాంసపిండమనునవి యేర్పడును. రక్తఫేన మందుండి (రక్తపు నురుగునుండి) పుక్కసము రక్తమలమునుండి దండకము మేదస్సు రక్తమునను వాని ప్రసారము వలన రెండు మూత్రపిండములు రక్తమాంస ప్రసారమువలన ఆంత్రములు = ప్రేగులు శరీరధారులకు నేర్పడును. ఆ ప్రేవులు స్త్రీలకు త్రివ్యోమ సంఖ్యాకములు గలవని వేదవిదులు చెప్పుదురు. రక్తవాయు సమ్మేళనమున నవి పుట్టును. కఫ ప్రసాదమువలన పద్మమువంటి హృదయ మేర్పడును. ఆ హృదయము యొక్క సుషిరము = రంద్రము అదోముఖముంముగనుండును. ''పద్మకోశ ప్రతేకాశం హృదయం చాప్యథో ముఖమ్‌'' అని మంత్ర పుష్పము నందున్నది. ఆ రంధ్ర మందు జీవాత్మ యున్నాడు. చైతన్యమునను సరించివచ్చు సర్వ భావము (బుద్ధివృత్తు) అక్కడనేయున్నవి. దానికి నెడమవైపు ప్లీహము కుడివైపున యకృత్తును గలవు.

ఆ పద్మము కుడివైపు క్లోమ = నీటితిత్తి గలదు. కఫము రక్తము ప్రవహించు స్రోతస్సులు (దారులు) ఈ శరీరమున అందేకలవు. భూతముల ననుగమించి గుణాసుసారలెన ఆ కఫరక్త నాళికలనుండియే యింద్రియములేర్పడును. నేత్రముల తెల్లని మండలము వర్తులాకారమైన గ్రుడ్డు కఫమునుండి యేర్పడును. అది తండ్రివైపునుండి కల్గును. నల్లని మందలము అనగా నల్లగ్రుడ్డు వాతగుణమువలన తల్లి చాయనుండి యేర్పడును. సర్వహృదయ మండలము తల్లిదండ్రులిరువురి నుండ యేర్పడును. 1) పక్ష్మమండలము (ఱప్పల భాగము) 2) వర్త్మ మండలము 3)శుక్ల మండలము 4) కృష్ణమండలము (నల్లని కనుగుడ్డు) 5) దృజ్మందలము కంటిలో మఱిరెండు భాగములు అపాంగము కనీనిక అని పిలువబడును. వానివలననే కంటికి చేపకంటి పోలిక యేర్పడినది. ముక్కునకు దగ్గరగానగు చూపుయొక్క ప్రసారము అపాంగమని చెక్కిళ్ళవైపున కొఱగు చూపు కనిక యనియు పిలువబడును. మాంసము రక్తము కఫము ననువానివలన జిహ్వ = నాలుకయు మేదస్సు రక్తము కఫము మాంసము ననువానివలన వృష్ణములు నేర్పడును. ఈ శరీరమందు ప్రాణమునకు స్థానములు (ఆయువుపట్టులు) పది. 1) తుల 2) హృదయము 3) బొడ్డు 4) కంఠము 5) నాలుక 6) రక్త 7) శుక్రము 8) గుదము 9) పన్తి = పొత్తి కడుపు 10) గుల్పములు = చీల మండలు. మానవ శరీరమందు కండరములు పదునారు. వీనినే మహానుడులు మహాస్నాయువులు నందురు. వీనివలననే అవయవములు ముడుచుట చాచుట జరుగును. వానిలో రెండు చేతులందు రెండేసి కాళ్ళలోను రెండేసి,

చతస్రః పృష్ఠగా: జ్జేయా గ్రీవాయాం తావదేవతు | జలాని షోడశైవాత్ర విభాగస్తేషు కథ్యతే ||

మాంస స్నాయు శిరాస్థిభ్యః చత్వారస్తు పృధక్‌ పృధక్‌ | మణిబంధాని గుల్ఫేషు నిబద్ధాని పరస్పరమ్‌ ||

శంకూని చ స్మృతా నీహ హస్తయోః పాదయోస్తథా | గ్రీవాయాంచ తధా మేఢ్రే కధితాని మనీషిభిః ||

దేహేస్మింశ్చ తధాజ్ఞేయాః చతస్రో మాంసర్జనః | పృష్ఠ వంశోభయగతే ద్యేద్వే తత్ర ప్రకీర్తితే ||

తావన్త్యశ్చ తధా ప్యేతాస్తాసాం బంధన కారకాః | సీవన్యశ్చ తధా సస్త పంచ మూర్ధాన మాశ్రితాః ||

ఏకా మేఢ్రగతా చైకా తథా జహ్వాగతా పరా | అస్థ్నా మత్రశతాని స్యు స్త్రీణి షష్ట్యధి కాని తు ||

సూక్ష్మైస్సహ చతుషష్టి దశనా వింశతిర్నఖాః | పాణి పాదశలాకాశ్చ తాసాం స్థాన చతుష్టయమ్‌ ||

చత్వారింశత్తదాస్థీని జంఘయోస్తావదేవ తు | ద్వే ద్వే జాను కపోతౌష్ఠ ఫలకాంస సముద్భవే ||

అక్షిస్థలేష్టకం శ్రోణి ఫలకే చైవ మాదిశేత్‌ | భగా స్థ్యేకం తధా పృష్ఠే చత్వారింశచ్చ పంచచ ||

గ్రీవా పంచదశాస్థీని జత్ర్వేకం చ తధా హనుః | భ్రూమూలం ద్వేలతాటాస్థిరండ నాసా తధాస్థికౌ ||

సర్జుకా స్థాల కై స్సార్ధ మర్బుదైశ్చ ద్విసప్తతిః | ద్వౌ శంఖకౌ కపాలాని చత్వార్యేవ శిరస్తథా || 82

పృష్ఠమందు నాల్గు, మెడనునాల్గు, మొత్తము పదునాఱు కండరములు మాంసము స్నాయువు = సన్ననరములు శిర = నరముల అస్థి = ఎముకలు ననువానివలన వేర్వేర చీలమండలములందు మణి బంధములు ఏర్పాటు సేయబడినవి. చేతులలో పాదములందు మెడను న్నమందుగల నీ బంధములు శంకువులను పేరంగలవు. ఈ మేనిలో నాల్గు మాంస రజ్జువులుగలవు వెన్నెముక కిరువైపుల నవిగలవు. దాని నెడపవీడకుండ కట్టు నాల్గు మాంస రజ్జువులున్నవి. ఆటే ఏడు సేవనులు = కుట్లుమూర్లమందైదునుం శిశ్న మందొక్కటి. నాల్కయందొక్కటి యుంగలవు. ఈ మానవ శరీరములో మూడు వందల యిరువది యెముకలున్నవి. సూక్ష్మదంతములతో కలిపి ఆరువదినాల్గు పండ్లున్నవి. పాదములలోగోళ్ళు ఇరువది. నాల్గుచోట్ల మొత్తమిరువది గలవు. రెండు పిక్కలందు నలుబది యెముకలున్నవి. మోకాళ్ళు రెండిట రెండేసి కపోలమందు (చెక్కిళ్ళలో) రెండేసి పెదవులలో రెండేసి ఫలకములందు ఫలకముపిఱుద అఱచేయి శిరస్సునందు ఛదునైన వెడలుపైన ఎముక (ఫలకన్నమాట) మూపులందు కంటిదరినెనిమిది, కటి ప్రదేశమందె నిమిదిభగమెందొక్కటి పృష్ఠమున నలుబదియైదు మెడయందు పదునేను జత్రువునందు = మూపును ఱొమ్మునుం గలవు చోటనొక్కటి హనులు = చెక్కిలిమీద, బొమ్మల మొదట రెండు లలాటమందొకటి చెక్కిళులందు ముక్కునను నొక్కొక్కటియుం సర్జుకలు = తాలుకలు అర్బుదములు = కంతలు ననునవి డెబ్బది రెండున్నవి. రెండు శంఖకములు = నుదుటి యొముక కణత యొముక కపాలము (తలపుర్రెలో) శిరస్సునగలవు.

ఊరః సప్తదశాస్థీని పురుషస్యాస్థిసంగ్రహః | తధా చైవాత్ర సంధీనాం ద్వేశ##తేతు శతాధికే ||

అష్టషష్టిశ్చ శాఖాసు షష్టిశ్చైక వివర్జితా | అన్తరాధౌ త్వశీతిశ్చ కధితా భృగు నందన! ||

నచ స్నా యుశతా న్త్ర ద్వేతు త్రింశాధికే మతే | అన్తరాధౌతు కధితా హ్యూర్ధ్వగా శ్చైవ సప్తతిః ||

షట్‌కృతాని చ శాఖాసు కధితాని మనీషిభిః | పంచ పేశీ శతాన్యత్ర చత్వారింశత్తధోర్ధ్వగాః ||

చత్వారింశ చ్ఛతాన్యత్ర తధా శాభాసు పండితైః | అన్తరాధౌ తధా షష్టిః పేశ్యస్తు కధితా బుధైః ||

స్త్రీణాం చైకాధికా జ్ఞేయా త్రింశతిశ్చతు రుత్తరా | స్థానయో ర్దశ విజ్ఞేయా యోనౌరామ! తథా దశ ||

గర్భాశ##యే తధాజ్ఞేయా శ్తతస్రో గర్భచింతకైః | త్రింశచ్ఛత సహస్రాణి తధాన్యాని దశైవతు ||

షట్పంచాశత్‌ సహస్రాణి శిరాణా కధితాని తు | తా వషహన్తి రసం దేహే కేదారమివ కుల్యకాః ||

అభ్యంగారి తధా సర్వం స్వేదలేపాదికం చయత్‌ | ద్విసప్తతి స్తథా కోట్యో రోవ్ణూం విద్ధి మహాభుజ! ||

మజ్ఞాయా మేదసశ్చైవ వసాయాశ్చ తధా ద్విజ! | మూత్రస్యచైవ పిత్తస్య శ్లేష్మణః శకృత స్తధా ||

రక్తస్య చ రసస్యాథ క్రమశోంజలయః స్మృతాః | అర్ధా ర్ధా భ్యధికా స్సర్వాః పూర్వార్ధాంజవితః స్మృతాః || 98

ఱొమ్మున పదునేడెముకలున్నవి. ఈ యెముకలు సంబసంధములు మూడువందలు. శాఖలందు 68 + 59 = 127, ఆధినెనుబదియునుంగలవు. స్నాయువులు = నులినరాలు రెండువందల ముప్పది నడుమునకు మీదుగా నేడువేలు గలవు. శాఖలు రెండింటను (రెండుబాహువులందు) ఆఱవందలున్నవి. అయిదు వందల పేశులు దిగువ మీదుగా నలుబదివేలున్నవి. బాహువులయందు నలుబదివేలు దిగువ శరీరమందఱువది వేలు పేశులున్నవి (పేశి = మాంసఖండ) ఆడువారికి మాత్రము ముప్పదినాల్గువేలు మాంసఖమడములు పురుషుని కంటే నెక్కువున్నవి. పదివేలు స్తనములందు యోనిలో పదివేలు గర్భశయమందు నాల్గువేలు ముప్పది లక్షలు వారి యితర శరీరమందు నేబడియాఱువేత నరములు గలవు. ఇవి శరీరమందు పంటపొలములందు నుడులలో కాలువలట్లు రసధాతవును చెమల మొదలగు నాయా పదార్థరూపమున జాలువార్చుచుండును. ఇక రోమకూపములు డెబ్బదిరెండు కోట్లు. మజ్జ మేదస్సు వసమూత్రము పిత్తము శేష్మము శకృత్తు (మలము) రక్తము రసము ననునవి దోసిళ్ళ లెక్కలో స్మృతులందు జెప్పబడినవి. (యాజ్ఞవల్క్యస్మతియందీ విశేషమునున్నవి.) ఒక దాని నొకటి సగము సగమెక్కువగానుండునని జ్ఞాపకము సేయబడినది.

ఆర్ధాంజలిశ్చ శుక్రస్య తథార్దాచ తధౌజసః | రజసన్తు తధా స్త్రీణాం చతస్రః కధితా బుధైః ||

సమాధాతో రిదం ప్రోక్తం ప్రమాణం దేహచింతకైః | విలక్షణాని దేహాని నిత్యమేవ శరీరిణామ్‌ ||

తేషాం భేదేన భిద్యస్తే మల దోషానురూపతః ||

ఏత చ్ఛరీరం మల దోషపిండం ధాత్వాశ్రయం కర్మ వశాను బద్ధమ్‌ |

మోక్షాయ యస్యేహ భ##వేత్స ధన్యో మోక్షే చ హేతుః దమోహి విష్ణు || 96

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తదే ద్వితీయ ఖండే శరీర విషయ వర్ణనం నామ పంచదశోత్తర శతతమో ధ్యాయః ||

శుక్రము అరదోసిలి ఓజస్సు అరదోసిలి స్త్రీల రజస్సు నాల్గు దోషిళ్లని తెలిసిన వారన్నారు. సమథాతువైన శరీరము (సప్తదాతువులు స్వస్థమునైయున్న ఆరోగ్యవంతమైన శరీరము యొక్క ప్రమాణమిట్లు శారీరనిపుణులచే జెప్పబడినది. కాని శరీర ధారుల శరీరములన్నియు నొకే లక్షణము గలవి. వాని లక్షణముల ప్రమాణమును మలదోషానురూపముగ నెప్పుడును భిన్నములగుచునే యుండును. ఈ శరీరము మల (పాప) దోషభూయిష్ఠమైన పిండము ముద్ద. కర్మవశానుబద్దము థాతువుల మీద నాధారబడి యుండునది. ఈ దేహము ఎవనికి మోక్షము సాధించుటకు పకరణమగునొ యాతడు ధన్యుడు. ఆ మోక్షసిద్ధికి కారణముగూడ పరమాత్మయావిష్ణువే కదా!

ఇది శ్రీ విష్ణదర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమందు శరీరవిషయవర్ణనమను నూటపదునేనవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters