Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటపన్నెండవ అధ్యాయము - గర్భ సంక్రాతివర్ణనము

రామః- జంతుః కధం సంభవతి చైవ విపద్యదే | కధం దేహాంతరం యాతి తన్మమాచక్ష్వ పృచ్ఛతః ||

పుష్కరః- వివ్వస్యావరణం రామ! తధైవాండం సహేమ యత్‌ | తథా ప్రాణి శరీరస్య పార్థివత్వం మహాభుజ!

ఆకాశో నర శార్ధూల! యధై వాండే వ్యవస్థితః | సుషిరం తద్వదేవేహ పురుషస్య శరీరగమ్‌ ||

ధారయన్తి యథా విశ్వ మండస్యాభంతరే స్థితాః | వాయ్వగ్నిసోమాః సతతం తథా దేహం శరీరిణామ్‌ ||

ఆధారభూతే ద్వే భూతే ఆద్యన్తే సర్వ దేహినామ్‌ | ప్రపద్యన్తే మహాభాగ! కలలత్వంహి తత్‌క్షణాత్‌ ||

కరోతి తత్ర చ తతః ప్రవేశం కర్మచోదితః | వాయు బూత స్తథా జీవ స్త్యక్త్వా భోగ వివర్ధనమ్‌ ||

స్వర్గా ద్వా నరకా ద్దేహం తిర్యగ్యోనా వథా పి వా ||

ఏవం ప్రవేశం స కరోతి గర్భే జీవస్తదా కర్మ వశాను బంధాత్‌ |

తతః ప్రవిష్టస్తు తథా స మూఢో మాసాం శ్చ షట్‌ తిష్ఠతి వేధనిత్యః ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే గర్భ సంక్రాంతి వర్ణనం నామ ద్వాదశోత్తర శతతమోధ్యాయః 112

పరశురాముడు- జీవుడెట్లు పుట్టును? ఎట్లు గిట్టును? దేహాంతర మెట్లు పొందు నానతిమ్మనం బుష్కరుం డిట్లనియె. ఈ విశ్వమునకు బంగారపు అండము (బ్రహ్మాండము) ఎట్లావరణమో అట్లు జీవి శరీరమునకు పృథివీ భూత ప్రధానమైన శరీర మావరణముగ నుండును. ఆకాశము బ్రహ్మాండమున నున్నట్లు జీవి శరీర మందు రంధ్ర మున్నది. అండమందున్న వాయువు అగ్నిసోముడు నను దేవతలు విళ్వమునెట్లు ధరింతురో అట్లే దేహధారుల యొక్క దేహమును వారు ధరింతురు. శరీర ధారులందఱకు ఆదియందును అంతమందును రెండు భూతము లాధారభూతమలైయున్నవి. అవి యా క్షణమ కలల (పిండ) రూపమును దాల్చును. అప్పుడు కర్మప్రేరణముచే వాయురూపు డయిన జీవుడు భోగ వర్ధనమైన శరీరమును విడిచి స్వర్గము నుండి కాని నరకము నుండి గాని మానవ మాతృగర్భబందు బ్రవేశించును. పశుపక్ష్యాది మాతృ శరీరమందైనను బ్రవేశించును. ఆయా గర్భములందు జీవుడు చేయు నా ప్రవేశము కేవల కర్మ నిమిత్తకము. అటు ప్రవేశించిన జీవుడు మూడుడై ఏమియు తెలివిలేనివాడై సర్వదా వేదన ననుభవించుచు ఆఱు మాసము లట్లె యుండును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమునందు గర్భ సంక్రాంతి వర్ణనమను నూట పండ్రెండవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters