Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటతొమ్మిదవ అధ్యాయము - మణిబంధ వర్ణసము

రామ ఉవాచ ||

మణీనా మథ కామ్యనాం శ్రోతు మిచ్ఛామ్యహం విధిమ్‌ | సర్వ కామకరం ముఖ్యం తథా చ దురితాపహమ్‌ ||

పుష్కరఉవాచ || ఆధర్వణన విధినా మణికర్మ నిభోద మే | ధ్రువస్తిష్టే త్యృ చా వృక్షం ప్రత్యక్షమను మంత్రయేత్‌

పాదోనయా మణిస్థానం ప్రోక్షయేత్తు ద్వితీయయా | అస్యాః పాదోనోత్తరేణ నిర్మిమీత మణిం తతః

సబంధుశ్చేతి తమృచా తస్మాచ్ఛిన్ద్యాదితి శ్రుతిః | ఆహరేత మణిం తస్మాత్సూక్తా దస్మాత్తృతీయయా ||

సర్వత్ర తు మణీచాం చ నిర్మాణం కేవలం భ##వేత్‌ | ఉపయుక్తాస్తు కేవాక్షా ద్రవ్యాస్తే పరికీర్తితాః ||

అంగుష్ఠ పర్వ మాత్రాస్తే కర్తవ్యాస్తు సమంతతః | సమ్య గుత్పాదయే త్తేషాం సమ్యగ్గ్రన్థి చతుష్టయమ్‌ ||

అగ్రతో మూలతో వాపి కల్ప మానే7తిరిచ్యతే | అరాతీయోరిత్యనయా ఛిన్ధ్యా చ్ఛ స్త్రేణ తత్త్వవిత్‌ ||

అర్థం చ సుశిరః కృత్వా తతః ప్రక్షాల్య వారిణా | పాత్రం తమగ్నౌ కృత్వా తు సమ్యగేవ యథావిధి ||

యత్రా చక్రురిత్యనయా ససూత్రమత ఉత్తరమ్‌ | కుర్యాత్తదగ్ని కుండం చ ప్రబోధ్య జుహు యాడ్‌ ఘృతమ్‌ ||

ప్రత్యృచా స్వేన మంత్రేణ సంపాతానయనం భ##వేత్‌ | కృతశాన్త్యుదకే పాత్రే రమ్యే లోహమయే దృఢే ||

స్వలింగో ద్ధృత మంత్రేణ దర్విదండాదతః పరమ్‌ | విముచ్య సర్వం తెనైవ మంత్రేణ భ్రామయేన్మణిమ్‌ ||

పాత్రే తస్మి స్తతస్త స్మాదు ద్ధృత్యా బంధనం భ##వేత్‌ | సకలేనైవ మంత్రేణ మంత్రయే చ్చ తధోద్గతమ్‌ ||

సామాన్య మిదముక్తం తేశృణు వైశేషికం ద్విజ | అభీవర్తమాణౌ కర్మ తవ వక్ష్యామ్యతః పరమ్‌ ||

అభీవర్తేన మణినేత్యా ద్యాభిస్తి సృభిర్మణౌ | అత్రాయం వాసవం పాత్రం ద్వేభ్యశ్చ ప్రత్యచంపునః ||

దత్వా సర్వేణ సూక్తేన మణరాధన్వనం భ##వేత్‌ | అభీవర్తమణిః ప్రోక్తో నో వా కాష్ఠాన్భృగూత్తమ ||

''అయం యోనిరత'' ఇతితస్య హోమోవిధీయతే | శశ##కేష్విహ యే శ్రాన్తవత్స భైషజ్య భాజనమ్‌ ||

పరశురాముడు, కామ్యములగు (కోరికలననుసరించి ధరింపవలసినవి) మణులు (తాయెత్తులు) పాపహరములు నైన వానింగూర్చి వినగోరెద నానతిమ్మన పుష్కరుండిట్లనియె. ఈ మణిధారణము అధర్వణ ప్రోక్త విధానమును జేయవలెను. ధ్రువస్తిష్ఠేత్తను ఋక్కుచే నెట్ట యెదుట వృక్షమును అభిమంత్రింపవలెను. రెండవ ఋక్కులో నొక పాదమును తగ్గించి దానిచే మణిస్థానమును(వృక్షమును) ప్రోక్షింపవలెను. ఈ మంత్రము తరువాతి వాదముచే మఱిని దయారు సేయవలెను. ''సుబంధుశ్చ'' అను ఋక్కుచే నా తాయెత్తు కట్టవలసిన యాకునో రెమ్మనో కోయవలెను. దానినుండి మణిని తీసికొనవలెను. మూడవ ఋక్కుచే మణిని నిర్మించవలెను, ఈ తాయెత్తులను గట్టుటకు ఉపయోగపడు గింజలు ద్రవ్యములు నీ కెఱింగింపబడినది. ఆ తాయెత్తులు బొటనవ్రేల కణుపంతగ నుండవలెను. వానికి నాల్గు గ్రంథులు (ముడులు) వేయవలెను. ఆ ముడులు చివర మొదలు మించియుండవలెను. 'ఆరాతీయోః' అనుమంత్రముతో శస్త్రముతో నా వృక్షము నుండి వానిని ఛేదింపవలెను. సగము ముడిచి చక్కగ తల యేర్పరచి నీటం గడిగి ఆపాత్రను అగ్నియందు యధావిధింగాచి ''యత్రాచక్రుః'' అను ఋక్కుచే దానిని మంత్రముతోనమరించి ఆ మీద అగ్నికుడమును (అగ్నిని) ప్రజ్వలింపచేసి నేతితో హోమము సేయవలెను. ప్రతి బుక్కుతో స్వస్వ మంత్రముతో సంపాతానయనము గావింపవలెను. అనగా హోమము చేసిన తరువాత స్రువాగ్రమున నున్న నేతిని ఉదకద్రోణియందు (ద్రోణకలశమందు) జిలికించవలెను. శాంత్యుదకమును నింపిన లోహమయమైన చక్కని గట్టిదగు పాత్ర విశేషమందు స్వలింగముతో-ఆ శాంతి లింగమయిన మంత్రముద్వారా(శాంతి శబ్దముకల మంత్రమన్నమాట) దర్వియను (స్రుక్కు)పాత్రద్వారా ఆ ఉదకమును వదలి అదేమంత్రముతో నా తాయెత్తునందు త్రిప్పవలెను. ఆ పాత్రనుండి దానిని పైకిదీసి ధరింపవలెను. అప్పుడా మంత్రము పఠింపవలెను. ఇది సర్వ సాధారణ మణిధారణ విధానము. ఇటుమీద విశేష మణిధాదణవిధిని ''ఆభీవర్తమణిధారణ'' మను దానిని దెలిపెద. ''అభీవర్తేన మణినా'' అను ఋక్కులు మూడింటిచేత అత్రాయం వాసవం పాత్రం అను రెండు మంత్రములచేతను ప్రతీ ఋక్కు పఠించుచు సూక్తమును పూర్తిగా పఠించుటచేతను నా తాయెత్తును విదిలింపవలెను. అయంయోనిరతః అను మంత్రముతో సమిధలను హోమము సేయవలెను.

క్షుద్రేషు యదపామార్గ మణిః శాన్త వి సంజ్ఞకః | ఇత్యేతే యావదుక్తాః స్యుర్వివాహ మధురాశ్చ యే ||

పూర్వోక్తేన భ##వేద్ధర్మ ఏతేషామితి మే మతిః | ద్రవ్యౌషధిమణీనాం చ సభార్యాణాం తథైవ చ ||

దాక్షాయణమణీనాం చ భ##వేద్థోమాదికో విధిః | ఔషధీనామిహేదానీం విధానం శృణు భార్గవ ||

వ్రీహీణాం వా యవానాం వా మూలేతు పరితః కిరేత్‌ | యదిసౌమ్యసుమంత్రేణ ఫలకాన్యేకవింశతిః ||

అముష్మిన్థ్సానరూఢాసు యథాభిలషితాం బుధః | యోజయేన్నామసం భూతా మముకస్య విభూతయే ||

ఘృతాహుతేతి చ ధ్వాభ్యాం ఘృతేన ప్రోక్షయే త్తతః | మాతేరిషసీత్యనయా ధ్యాత్వా తమభి మంత్రయేత్‌ ||

గంధం సంఛాదయే చ్ఛైవ తతో భూమేత్య నంతరమ్‌ | ఇత్యౌషధీనాం సర్వాసాం సామాన్యో7యం విధిః స్మృతః ||

ఏకకాద్యాస్తు మణయః సలింగం నిఖనేత్‌ బుధః | మంత్రేణతాన్ప్రవక్ష్యామి యథావదను పూర్వశః ||

ఏకాంక ఏకకామాయేత్యేకాంకే విధివత్ఖనేత్‌ | అక్రందయతి సూక్తేన ప్రదధ్నామ యద్యధా విధి ||

ఇయం వీరుదిత్యనయా విధి వస్మధుఘః ఖనేత్‌| సూక్తేన సుకలేనాస్య మణ రాబంధనం భ##వేత్‌||

ఇమాం ఖనామీత్యనయా నితనీ లింగయా ఖనిమ్‌ | ప్రతీచీ సౌమ మసితాం బధ్ని యాత్తు యాథావిధి||

ఇమాం ఖనామీత్యనయా నితనీ లింగయా ఖినమ్‌| ప్రతీచీ సౌమ మసితాంబ బధ్ని యాత్తు యథావిది||

యాత్వా గంధర్వ ఇంద్రాభ్యాం కపికచ్ఛుం ఖనేద్భుధః | సూక్తేనానేన తన్మేఢ్రే ప్రబధ్నీ యాదితి స్థితిః ||

ఇమాం ఖనామీత్యనయా దశధాస్రుతయా ఖనేత్‌ | పాఠాసూక్తేన బధ్నీ యాదే కారాజ్ఞీమితి శ్రుతిః ||

దశశీర్ష ఇతి ద్వాభ్యాం మహాఖ్యం విధి వత్ఖనేత్‌ | ఆపః పునన్త్వి త్యనేన బధ్నీయాత్తాం యథావిధి ||

ఇమాంఖనామ్యౌషధీం త్వాం ఢభీం నామ తథోత్ఖనేత్‌ | కాండీయా ఋక్తయా త్వేతే బధ్నీయాత్తు యధావిధి ||

య ఆత్మ జా ఇత్యనయా ఖన్యాదితి తథైవ తామ్‌ | అనేనైవ ప్రబధ్నీ యాద్విద్వాస్సూక్తేన తం మణిమ్‌ ||

''శశ##కేష్విహ యే శ్రాంతవత్స భైషజ్య భాజనం. క్షుద్రేషు యదపామార్గ మణిః శాన్తవి సంజ్ఞకః'' అను నీ వివాహమందలి సొంపైన మంత్రములేవి కలవో వానితోగూడ నీ హోమము విహితమకుకొనుచున్నాను. ద్రవ్యములు ఓషధులు మణులుననువానికి వానివాని భార్యలగు దాక్షాయణుల కెల్ల హోమాది విధులు కర్తవ్యములను ఔషధులను గూర్చిన విధానమును వినుము. వ్రీహులు యవలు అను ఓషధుల మూలములందు ''యదిసౌమ్య'' అను మంత్రపూర్వకముగా నంతట జల్లవలెను. ఇరువదియొక్క ఫలకములను అచట మొలచిన ఓషధులందు తనకు కావలసిన ఓషధిని దాని యభివృద్ధికై దానిపేరుతో యోజన చేయవలెను. ఘృతాహుత అను రెండు మంత్రములచే వానిని నేతితో ప్రోక్షింపవలెను మాతేరిషసి అను మంత్రముతో నభిమంత్రించవలెను. ''తతోభూమా'' అను మంత్రముతో గంధముచే నా విత్తనములను గప్పవలెను. ఇదిఔషధులన్నిటికి సర్వసాధారణమైన పూజా విధానము.

ఏకకము మొదలయిన (మణులు) తాయెత్తులు(మణులను పేరువీనికి ఈ పురాణమందీయబడినది) మంత్రలింగమును బట్టి యాయా మూలికలను నమంత్రముకముగా ద్రవ్వవలెను. ''ఏకాంక ఏకకామాయ'' అను మంత్రముతో నేకాంకమణిని 'ఆక్రందయతి' అను సూక్తముచే పదధ్నీయను నోషథిని 'ఇయంవీరుడ్‌' అసుదాన మధులేనమును మూలికను 'సుక' అను సూక్తముచే నీ మణులను తాయెత్తులను కట్టుకొనవలెను. 'ఇమాంఖనామి' అను నితని యను నోషధి లింగము (పేరుగుర్తు) గల మంత్రముచే ప్రచీని సౌమమును అసితమును కట్టుకొనవలెను. యాత్వా గంధర్వ ఇంద్రాభ్యాం అను మంత్రముతో ''కపికచ్చు'' వన మూలికలను ద్రవ్వవలెను.

ఈ మంత్రముచే దానిని మేఢ్రమునకుం గట్టుకొనవలెను. ఇమాంఖనామి అను దశధా స్రుతయా అను మంత్రముచే త్రవ్వవలెను. ''ఏకాఠాజ్ఞీం'' అను మూలికను పాఠాసూక్తముతో గట్టుకొనవలెను. 'దశశీర్ష' అనురెండు మంత్రములచే ''మహా'' అను పేరుగల ఔషధిని త్రవ్వవలెను. ''ఆపఃపునంతు'' అను మంత్రముచే దానింగట్టుకొనవలెను. ''ఇమాంఖనా మ్యౌషధీం త్వాం'' అను మంత్రముతో ''ఢబీం'' ఢబియను మూలికను ద్రవ్వవలెను. ''కాండియా బుక్తయాత్వేతే'' అను మంత్రము చెప్పి కట్టుకొనవలెను. 'య ఆత్మజా అను దానిచే త్రవ్వి అదే మంత్రముచే నా మణిని కట్టుకొనవలెను.

అరిష్టస్త్వా ఖనతు వైపిప్పలం తు ఖనే త్తథా | యావద్ధ్యౌరితి సూక్తేన తస్య చా బంధనం భ##వేత్‌ || 33

సాహసీ నావచేత్యేవం సైధకం చ తథా ఖనేత్‌ | అనేవైప ప్రబధ్నీ యాత్సూత్రేణ తు యథావిధి ||

పయోసీత్యథవాహన్యా త్స్వర్గ ప్రతీం యథావిధి | సూక్తేన తాం ప్రలధ్నీ యాదనేనైవయధా క్రమమ్‌ ||

ఇమాం ఖనామీత్యనయా మాషవర్ణీం తధా ఖనేత్‌ | ద్యాభ్యాం చానర్థసూక్తాభ్యాం ప్రబధ్నీ యాదితి శ్రుతిః ||

తతః ఖండారికాం ఖన్యా ద్రాజా త్వాం వరుణః ఖనేత్‌ | ఋచానయా సమస్తేన సూ క్తేనా బంధనం భ##వేత్‌ ||

ఏకార్క ప్రభృతీనాం తు లింగః కల్ప్యం ఫలం బుధైః | సామీయాత్వాహ వరుణత్యేవ మాదిషు సంశ్రితాః ||

సామీదయః పదార్థాస్తే ఉపక్ల ప్తా స్తథా స్మృతాః | ద్రవ్యేసై#్తస్తు మణింకుర్యా ద్దామ్నా యోక్తైర్యథా విధి ||

''తల్లింగేన'' తు మంత్రేణ యథాపదను పూర్వశః |

''అరిష్టస్త్వాఖనుతువై'' అని పిప్పలమును - రావిని డ్రవ్వి ''యావద్ధ్యౌః'' అను సూక్తముచే ధరింపనగును. ''సాహసీ నావచా'' అని సైంచకమును మూలికను వ్రవ్వి యిదే సూక్తముతో దానిం ధరింపవలెను. ''పయోసి'' అను మంత్రముచే త్రవ్వి స్వర్గ పత్రియను మూలికను ఆ సూక్తముతోనే కట్టుకొచవలెను. ''ఇమాంఖనామి'' అను మంత్రముచే మాషపర్ణి అను నోషధిని త్రవ్వి అనర్థ అను రెండు సూక్తములలో ధరింపవలెను. ''రాజా త్వాం వరుణః ఖనేత్‌'' అను ఋక్కుతో 'భాండారిక' యను మూలికను ద్రవ్వి యీ సూక్తమంతటితో గట్టుకొనవలెను ఏకార్కము మొదలయిన మూలికలకు పండితులు మంత్రలింగమును ఫలమును గల్పింపవలెను. సామయాత్వాహ వరుణ అనునది మొదలుగాగల మంత్రములందు సామాది పదార్థములు (ఓషధులు) ఉపకలుప్తము లైనట్లే స్మతులందు పేర్కొనబడినవి ఆమ్నాయమందు = వేదమందు జెప్పబడిన యాయా ద్రవ్యములచే (ఓషధులచే) తాయెత్తులను మంత్రలింగమును బట్టి క్రమము తెలిసి ధరింపవలెను.

కుష్ఠస్య మణయః పంచ ఉదపాత్రే విదుర్భుధాః ||

ప్రత్యెక పాఠసంస్కార శుద్ధయే వేతినః శ్రుతం | చతురస్రం ప్రబధ్నీయాన్మణి మంజన పత్తథా ||

సైధవం లవణం సిద్ధముభయత్ర పరిగ్రహాత్‌ | కుల్యాద్యాక్ష్యం చ సంస్కారం వ్యాఘ్రత్యప మణౌ తథా ||

చతురస్రే తు కర్తవ్యౌ మణీ కారణ కాలజౌ | నైమిత్తికా శ్చ మణయో మణయః సంవిదుశ్చ యే ||

స్వం స్వం మంత్రం భ##వేత్తేషా మితిమేనిశ్సితామతః | నైమిత్తికానాం ఘోరాస్తే తేషాం నైమిత్తికం భ##వేత్‌ ||

సంవదానాం తథా మధ్యే సాంపదం నాత్ర సంశయః | సీమాత్త్రాత్వాహే త్య నేన సీమసం జనవద్భవేత్‌ ||

పిశాచశాతనః పుంసాం యాతుధాన వినాశనః | మంత్ర లింగాదయం జ్జేయో మంత్రశ్చాస్య ప్రవక్ష్యతే ||

శరకాష్ఠే తు సంయోజ్య సీసం కృత్వేతి బుద్ధిమాన్‌ | భార్గీం జ్యాం ధనుషః కృత్వా బాధకేనాథ తేనతత్‌ ||

భూమౌ పిశాచమాలిఖ్య భగవేన తు తాడయేత్‌ | ఉత్తరేణ శ##రేణ్తౖవ పిశాచో నాశమాపప్నుయాత్‌ ||

శంకుధార మణర్మంత్ర అను సూర్యమితి స్మృతిః | ప్రజ్ఞాతవర్ణ శబ్దాశ్చ రోహితస్య పరిగ్రహః ||

చర్మణః స్యాత్తథా వర్గో రోహితా సాభ##వేచ్చ గౌః | శంకుర్నిధీయతే యత్ర విస్తరార్థం తు చర్మణః || 50

తస్మాద్దేశాన్మణిః కార్యః శంకుర్థన పరిగ్రహః | మణి ధనం చ దుగ్థం స్యాదుపవిష్టాయ చర్మణి ||

యజమానాయ ధర్మజ్ఞ! ఉదపాత్రం తథామయా | అతికామల రోగఘృ మాయుష్యం చ తథామణిః ||

ఇమం మే కుష్టేత్యనేన పంచానాం స్యాత్పరిగ్రహః | అత్యర్థమేవ నైతేషాం జలం కుష్ఠేన సంయుతమ్‌ ||

సత్కృత్య పానయోగత్వాద్యజమానః పిబేత్తతః | మణయః పంచకుష్టే ద్వౌ మణి శబ్ధపరి గ్రహమ్‌ ||

తుల్యేన విధినా కార్యాః ఫలం తేషాం పృథక్పృధక్‌ | శిరోర్తి నాశనః పూర్వో ద్వితీయో విషదూషకః ||

తృతీయ శ్చ తథా ప్రోక్తో విషమజ్వర నాశనః | చతుర్థ శ్చ తథా ప్రోక్తః సతతజ్వర నాశనః ||

చక్షుష్యః పంచమః ప్రోక్తో మణీర్భార్గవ నందన | కృత్వోద పాత్రం కుష్ఠంభో నవనీత విమిశ్రితమ్‌ ||

భూయః కుష్ఠం క్షీపేత్తత్ర మణిం తత్రాప తారయేత్‌ | మణి బంధం తతః కృత్వా తోయం తత్పాయ యేన్నరమ్‌ ||

లిప్యేచ్చ సరుజం దేశముద పాత్ర జలేన తు | యాః పురస్తాదిత్యనేన మణిః స్యాల్లవణస్య తు ||

పితుర్వస్త్ర పుటే బద్ద్వాలవణస్య తు తన్మణిమ్‌ | ఆబంధే కుష్ఠవత్స్యా చ్చ యాతుధాన వినాశనః ||

వ్యాఘ్రరూప ఇత్యనేన ఖంతవ్యం బాటరూపకమ్‌ | వ్యాఘ్రరూప ఇతిద్వాభ్యామృగ్భ్యామా బంధనం భ##వేత్‌ ||

పిశాచ నాశకస్త్వేవం స మణిః | స్యాదసంశయమ్‌ | ఏవమే వోత్తరాభ్యం చ భ##వేత్‌ ప్రత్యభి చారకః ||

విష్కందస్యేత్య నేనాహ త్రివర్ణీ విశ్వ భేషజీ | స్కంద స్యోపరి యః స్కందో భ##వేత్తస్య వినాశినీ ||

యస్మాదం గాదితి భ##వేద్గణాది త్వా త్పరిగ్రహః | గణస్య కర్మ సామాన్యం ప్రతిసూక్తం న కారయేత్‌ ||

గోరా చ వారి కర్మాణి హస్తవ్యాన్యీవ మాదిభిః | పతంగాద్యా శ్చ చత్వారః సంస్కృత్య ప్రాణి నో బుధః ||

తృష్ణత్వపై#్త శ్చ మంత్రేణ గాత్రం ప్రక్షాలయేత్ఖిలమ్‌ | ప్రధమేన తు సూక్తేన వేణు పాత్రే ద్రవోమణిః ||

వేణుః కుర్యాద్భవేద్ధర్మో వాక్షవద్దేప దారుణః | సంస్కృత్య పూర్వమంత్రేణ మాషకాదీన్ప్ర మర్ధయేత్‌ || 67

''కుష్ఠము''అను ఓషధితోడి తాయెత్తులైదు ఉదక పాత్రమందు ప్రత్యేక పాఠసంస్కార శుద్ధికి ఉంచవలెనని మాకు వినబడినది (శ్రుతిలోనున్న దన్నమాట) ఆ తాయెత్తు చతురప్రముగా నుండవలెను. దానిని నేత్రములకు బెట్టు కొనవలెను. అనగా నా నీళ్ళనుండి తీసిన తాయెత్తును రెండు కండ్లకద్దుకొనవలెనన్నమాట. సైంధవ లవణము ద్వారా రెండు కండ్లకు ఆవమణౌ = అనగా విరుద్ధమైనతాయెత్తు చే త బ డి మొదలయిన వానిచే గట్టబడినమణి పెద్దపులియట్లు విజృభించుచుండ నీ చెప్పిన తాయెత్తుద్వారా రెండు కండ్లకు సంబంధించిన సంస్కారము సేయవలెను. నైమిత్తికమయిన సమయమునందు గట్టవలసిన తాయెత్తులు చతురస్రములై యుండవలెను. కొన్ని మణులు నైమిత్తికములు. కామ్యములు. అట్టి కామ్యములయిన వానికి వాని వానికి సంబంధించిన ఆ మంత్రములు అతి ఘోరములు. వానినే వాడవలెను పిశాచములను నరకును. యాతుధానులను = రక్షస్సులను నాశనము చేయును. మంత్రలింగమును బట్టి యిది తెలియవలసినది. ఇక్కడా మంత్రముం దెల్పెద. (శర) రెల్లుకఱ్ఱయందు సీసము గూర్చి క్పత్నా అను మంత్రముతో భార్గిని = అల్లె త్రాడుగాన మారి శత్రుబాధకమైన ఆ బాణముతో భూమిమీద వ్రాసిన పిశాచమును భగవముతో = కొట్టవలెను. ఆమీద రెల్లుకఱ్ఱ బాణముచేత పట్టినపిశాచము నశించును. అంకుధాణ మంత్రము మునికి ''అనుసూర్యమ్‌'' అనునది. తాయెత్తు రెండు కుష్ఠముతో జేసినవి. మొదటిది తల నొప్పిని రెండవది విషమును మూడవధి విషమ జ్వరమును నాల్గవది యెడతెకుండవచ్చు జ్వరమును మాన్చును అయిదవది నేత్రముల చికిత్సకు సంబంధఙంచునది. కుష్ఠముతోడి నీటిని నింపిన పాత్రలో వెన్న కలిపి తిరిగి కుష్ఠమునందు పడవేసి దానినుండి తాయెత్తును వెలికి తీయవలెను. దానిని రోగికి కట్టి యానీటిని ద్రావింపవలెను. రోగగ్రస్తమైన ప్రదేశము నా ఉదక పాత్ర జలముతో గట్టిగా రాయవలెను. ''యాఃపురస్తాత్‌'' అను మంత్రముతో నుప్పుతోజేసిన తాయెత్తును తండ్రియొక్క పంచ కొంగున గట్టినచో నదికూడ కుష్ఠమణివలెనే రక్షవినాశమొనరించును. ''వ్యాభ్రురూప'' అను మంత్రముతో ''బాడరూపకము'' అను నౌషధిని ద్రవ్వి వ్యాఘ్రరూప యను రెండు మంత్రములతో దానిని కట్టుకొనవలెను. ఆ తాయెత్తును నిస్సందేహముగా పిశాచము వదిలించును. ఇట్లె ఈ మంత్రుమల తరువాతి రెండు మంత్రములచేత చేసిన ప్రక్రియ అభిచారకము = చేతబడిని త్రిప్పికొట్టుటను 'చేతబడిచేసినవానివైపునకు తిరిగిపోయి వానిని బాధించునన్నమాట) ''విష్కందస్య'' అను మంత్రసంపుటితో త్రిపర్ణి విశ్వభేషజియుస్కందునిపై స్కందునికి నాశకమగును. స్కందమను నా యభిచారము నడంచును. ''యస్మాదంగాత్‌ '' అనునది గణాది మంత్రమగుటచే గణ సంబంధమైన కర్మ సామాన్యమందు దానిం గ్రహింపవలెను. ప్రతిసూక్తముగ చేయరాదు. ''గోరాచావారి కర్మాణి'' ఈ చెప్పిన నశింపజేయనగుచు. పతంగము మొదలగు నాల్గు ప్రాణులను. సంస్కరించి ''తృష్ణత్వపై#్తశ్చ'' అను మంత్రముచే రోగియొక్క శరీరమును గడగవలెను. మొదటి మంత్రముతో వెదురుపాత్ర యందు దేవదారుమణికి వృక్షసామాన్యమున కట్లు సంస్కారము పూర్వ మంత్రముతో చేసి మాషకాది ద్రవ్యములను మర్ధింపవలెను.

గాత్ర సంస్కార సహితైః పిష్టైర్వా ప్రకృతి ర్భృశమ్‌ | కేవలేనైవ మంత్రేణ మర్దయేత్తు వినశ్యతి || 68

తథా స్వలోమ ప్రభృతీ విధూలో ధూశిరో యుతః | దేవ ప్రవేశం జతునా స్థగయిత్వా తు రక్తికా ||

దూష్యా ఇతి ప్రతీకేన కుర్యా త్ప్రతిసరం మణిమ్‌ | కృత్వా దూషణమాయుష్యం తథా ప్రత్యభి వాదకః || 70

అయం ప్రతిసరః పాణౌ యాత్రా కాలే సపత్నహా | సూత్రేణానేన బధ్నీ యాల్లింగా త్ప్రతి సరోవరః ||

అనేన విధినా వృత్రం నిజఘాన శతక్రతుః | అశంస ఇతి మంత్రేణ ప్రబధ్నీయా ద్యథావిధి ||

భూతిశ్రీ ప్రభృతీనాం చ విఘ్నమేవం కరోతియః | వినాశనం తస్య భ##వేదా బంధాద్యక్ష నాశనమ్‌ ||

జ్యా సూత్ర ప్రోథితాః సప్తవంశ ప్రాప్తాః సముద్భవాః | రక్యాంతరవ్యవహితా గర్భిణ్యా ఉద్ధరేద్‌ బుధః ||

మాసే చతుర్థే బధ్నీయా న్మంత్రేణానేన బుద్ధిమాన్‌ | ఏకైకస్మిన్నతీతే తు మాసే సూత్రాంతరే మణిః || 75

ఏకైకం ప్రక్షిపేద్ధీమాన్స సూత్రం పశ్చిమం తథా | ప్రాచీదిగితి మంత్రేణ ఉదీచీ భయనాశినీ ||

అక్షీయాభ్యా మిత్యనేన దాప్యః స్యాద్యక్ష్మ నాశనః | సంధానార్థం శీతమగ్నే రాత్రీ మాతేత మోహనః |

మయూర గోసుర వృద్దౌ ద్వౌ వేతీతి ప్రకీర్తితమ్‌ || 77 1/2

ప్రోక్తాస్తథైతే మణయోనృ వీర! కామ్యామయా సర్వహితాయ పుణ్యాః 78

యేషాం హి బంధో దురితాపహారీ భయాపహఃకేంవల వృద్ధికారీ ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే మా.సం. రామం ప్రతి

పుష్కరో పాఖ్యానే మణిబంధ వర్ణనన్నామ నవోత్తర శతతమోధ్యాయః || 109

(68 శ్లోకమునుంచి 78 శ్లోకముదాక చేతబడి ప్రయోగాదులు శాంతి ప్రక్రియ చెప్పబడినది. పాఠములు సరిగాలేక తాత్పర్యములు వ్రాయలేదు.)

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters