Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటఏడవఅద్యాయము - నానావిధస్నానములు

పుష్కరఉవాచ ||

స్నానాన్యన్యాని తే వచ్మి నిబోధ గదతోమమ | రక్షోఘ్నాని యశస్యాని మంగల్యాని విశేషతః ||

స్నానం ఘృతేన కథితం చాయుషో వర్థనం పరమ్‌ | రామ! గోశకృతా స్నానం పరం లక్ష్మివివర్ధనం||

స్నానం చ కధితం దధ్నా పరం లక్ష్మీ వివర్థనం | తథా దర్భోదక స్నానం సర్వ పావనిబర్హణం||

పలాశ బిల్వ కమవకుశ స్నానం పురోహితమ్‌ | తచా హరిద్రా మంజిష్ఠా తగరం చారకం తథా ||

స్నానమేతద్వినిర్దిష్టం రక్షోఘ్నం పాపసూదనమ్‌ | వచా హరిద్రయా యుక్తం స్నానం రక్షోహణం పరమ్‌ ||

ఆయుష్యం చ యశస్యం చ ధన్యం మేధావివర్ధరమ్‌ | స్నానం పవిత్రం మంగల్యం తథా కాంచన వారిణా |.

క్రమా దూనతరే కించిద్రూప్య తామ్రోదకై స్తతః | తథా రత్నోదక స్నానం సంగ్రామ విజయా వహమ్‌ ||

వైడూర్యం మధ్యతః కృత్వా ప్రవాలైః పరివారయేత్‌ | తేన పాత్రేణ యత్స్నానం సర్వ కామకరం హితమ్‌ ||

స్నానం సర్వౌషధైర్ముఖ్యం వివాదే విజయ ప్రదమ్‌ | సర్వ గంధోదకస్నానం సౌభాగ్యారోగ్య కారకమ్‌ ||

తథా బీజోదక స్నానం సర్వ కర్మ ప్రసాధకమ్‌ | తథైవామలక స్నాన మలక్ష్మీ నాశకం పరమ్‌ ||

తిలసిద్ధార్ధకైః స్నానమ మంగల్య ప్రణాశనమ్‌ | కేవలైర్వాతిలైః స్నానమథవా గౌరసర్షపైః ||

స్నానం ప్రియంగునా ప్రోక్తం తథా సౌభాగ్య వర్థనమ్‌ | సౌభాగ్యకం తథా స్నానం నాగకాంతా ప్రియంగు భిః||

పురో చారుకకుష్ఠైశ్చ తథైవ చ వినిర్ధిశేత్‌ | ధాత్రీ ఫతేన పద్మైశ్చ తథా మలక వారిణా ||

లక్ష్మీ వృద్ధికరం స్నానం కథితం భార్గవోత్తమ | పద్మో త్పలకదంబై శ్చ తథా లక్ష్మీ వివర్థనమ్‌ || 14

బలామతిబలాం చైన తథా నాగ బలామపి | బలాం మోటాం చతుర్థీం తు స్నానం వై బల వర్ధకమ్‌ ||

బ్రహ్మ కర్కోటకీ మూలం కుమారీ పద్మ చారిణీ | స్నానే రోగవినాశాయ స్మృతాః ప్రత్యేకశోద్విజ ||

మాంసీమురా చోరక నాగ పుషై#్పః సనాగదానైరతినాశకారి |

తురుష్క కక్కోలకజాతిపూగైః ఫలైః సషసై#్తః సుతరాం ప్రదద్యాత్‌ ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే మా. సం. రామం ప్రతి పుష్కరో పాఖ్యానే నానావిధ స్నాన వర్ణనన్నామ సప్తోత్తర శతతమో7ధ్యాయః.

పుష్కరుడనియె, రక్షోబాధ వారించునవి యశస్కరములు మంగళకరములు నైన స్నాన విశేషముల వెఱిగింతు నిదేవినుము. నేతితో స్నానము చేయుట యాయుర్దాయముంచెంచును. ఆవు పేడతో స్నానము లక్ష్మీ వర్ధనము, పెదుగుతో గూడ నదేఫలము. దర్భలతోడిది సర్వ పాపహరము. మోదుగ మారేడాకులతో తామర పువ్వులతో రెల్లుతో స్నానము పురోహితము శుభోదర్కము. వచ=పొత్తిదుంప పసుపు మంజిష్ఠ తగరము=గ్రంధి తగరము కాశ్మీరపు తంటెపు మొక్క మంగచెట్టు సందివర్ధనము చారకము=సారచెట్లు అనువానితోడి స్నానము రక్షోఃఘ్నము. (లక్షఃపిశాచాది బాధాహరమన్న మాట). వచ, పసుపుతోడి స్నానము కూడ రక్షోఘ్నమే, బంగారము నీటిలోవేసినస్నానము ఆయుష్యము యశస్కరము ధాన్య మేధాశక్తి వర్ధనము మంగళకరము. వెండి, రాగి యనువానితోడి స్నానమొకదానికంటె నొకటి తక్కువ ఫలమిచ్చును. రత్నములతో స్నానము యుద్ధ విజయమిచ్చును. నడుమ వైడూర్యము నుంచి చుట్టును పవడములను బెట్టిన పాత్రతో స్నానము సర్వాభీష్టప్రదము సర్వౌషథులతోడి స్నానమువివాదమందు జయమిచ్చును. సర్వగంధములతోడి స్నానము సౌభాగ్యముచు ఆరోగ్యముం గూర్చును. అన్ని బీజములు(ధాన్యములు) వేసి చేసిన స్నానము సర్వ కర్మ సంసిద్ధి నిచ్చును. ఆమలక స్నానము ఉసిరికాయ వేసి చేసిన స్నానము అలక్ష్మిని (దారిద్ర్యమును) తొలగించును. నువ్వులుతెల్లావాలతోడి స్నానము అమంగళనివారకము. కేవలము నువ్వులతోగాని తెల్లావాలతోగాని ప్రియంగువుతోగానిచేసిన స్నానము సౌభాగ్యవర్ధనము. నాగము=నాగకేసరాలు కాంతము=కుంకుమ పువ్వు ప్రియంగువు=ఆరెకొఱ్ఱలు)అను వానితో జేసినస్నానము సౌభాగ్య ప్రదము. నాగము=నానార్ధాలు తుంగముస్తలు తమలపాకులు తగరము(జిబిలిక బీరమురపొన్న వేగిస పుత్రదాత్రి యను తీగ పొత్తిదుంప, గొడ్డుఆగాకర, కేరళ##దేశ ప్రసిద్ధము. పురోచారుకము=కుష్ఠము (చెంగల్వ కోష్టు)సుగంధి ఉసిరికాయలు ఉసిరిరాకులనోడి స్నానము లక్ష్మీవృద్ధి ప్రదము. తామర పువ్వులు కలువపువ్వులు కడిమి పువ్వులతోడి స్నానము గూడ లక్ష్మీ వర్ధనమే.

1 బల(చిట్టా ముట్టె) 2 అతిబల=పేరాముట్టె(ముత్తవ పులగము) 3 నాగబల(జిబిలికబీర) 4 బలామోటా(సోమంద చెట్టు బ్రాహ్మి (నానా) నాగదమనము అనువానితోడి స్నానము బల వర్ధకము బ్రహ్మ(సంబరేణు వేళ్ళు కర్కోటకీ మూలము(కర్కోటికి, నానార్థాలు బూడిద గుమ్మడి, నేతిబీర బీర ఆగాకర పెద్ధబీర కలబంద అల్లితీగె, కెరదాళి, కుమారి (గులాబీలలోరకము) విష్ణుక్రాంతము పెద్ద మేలకలు ఆగాకర, విరబూజి మల్లిలో నొకరకము లేదా కల అరటి పెద్దనేరెడు కలబంద పిన్నగోరింట తిప్పతీగ మలుగోరింట, సంపెంగ పద్మచారిణీ గంటభారంగి నానార్థాలు- జమ్మిచెట్టు పసపు వృద్ధియనే దుంప మెట్టిదామర-వీనిని వేసి చేసిన స్నానము రోగనివారణకు ప్రత్యేకముగ జెప్పబడినది జటామాంసి, ముర(కారుముల)చోరక (నల్లకచోరాలు) నాగపుష్పా (సంపెగ) నాగకేసరములు నాగదమునము నాగపుష్ప (నాగదమనము) నాగ (చూడులోగడ) దాన (కుంకుమ పువ్వు) తురుష్క (సిహ్లకము) తెల్లకలిగొట్టు కక్కొల(తక్కోలము) జాతి (జాజి) పూగ (పోక)సర్వఫలములతోడి స్నానము బహుప్రశస్తము.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమున ద్వితీయఖండమున నానావిధ స్నాన వర్ణమను నూటయేడవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters