Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటఐదవ అధ్యాయము - వినాయకస్నానవిధి

రామ ఉవాచ || స్నానమన్యత్సమాచక్ష్య భగవన్దురితాపహమ్‌ | వియనాకోప సృష్టానాం సర్వకర్మ ప్రసాధకమ్‌ ||

పుష్కర ఉవాచ |. వినాయకః కర్మవిఘ్న సిద్ధ్యర్థం వినియోజితః | గణానా మాధిపత్యే చ కేశ##వేశపితామహైః ||

తేనోపసృష్టో యస్తస్య లక్షణాని నిబోధమే | స్వప్నే7వగాహతే7త్యర్థం జలం ముండం చ పశ్యతి ||

కాషాయ వాససశ్త్చెవ క్రవ్యాదాం శ్చా ధిరోహతి | అన్త్య జై ర్గర్దభైరుష్ట్రెః సహైకత్రా వతిష్ఠతే ||

ప్రజమాన స్తథాత్మానం మన్యతే7నుగతం పరైః | విమనా విఫలారంభః సంసీదన్న నిమిత్తతః |.

తేనోప సృష్టో లభ##తేన రాజ్యం రాజనందునః | యాకుమారీ చ భర్తారమ పత్యం గర్భమంగనా ||

ఆచార్యత్వం శ్రోత్రియ శ్చ నశిష్యో7ధ్యయనం తథా | వణిఙ్న లాభమాప్నోతిన కృషింతు కృషీవలః ||

స్నపనం తస్య కర్తవ్యం పూణ్యహ్ని విధిపూర్వకం | హస్తపుష్యాశ్వయుక్సౌమ్య వైష్ణవాన్యతేమే శుభే ||

నక్షత్రే చ ముహూర్తే చ మైత్రేవా బ్రహ్మదైవతే | చర్మణ్యానుడుహేర క్తే స్థాప్యం భద్రాసనం భ##వేత్‌||

భద్రాసునో పవిష్టస్య స్వస్తి వాచ్యం ద్విజోత్తమైః | గౌరసర్షప కర్కేన మేధ్యే నోత్సాదితస్య చ ||

సర్వౌషథైః సర్వగంధైః ప్రలిప్త శిరసస్తథా | చతుర్భిః కలశైః కార్యం స్నపనం మంత్రసంయుతమ్‌||

తధైక వర్ణాః కలశాః కర్తవ్యాస్తే హ్రదాంభసా | అశ్వస్థానా ద్గజస్థానా ద్వల్మీకాత్యం గమాద్ద్రదాత్‌ ||

మృత్తికాం రోచనం గంధాన్గుగ్గులుం తేషు నిక్షిపేత్‌ | సర్వౌషధీశ్చ బీజాని స్నాన మంత్రానతః శృణు||

జ్ఞీపిక-దిక్పాల స్నానవిధియందు పూర్ణకుంభ ప్రతిష్ఠచేసి ఔషధీ జలస్నాననిమిత్త మూపూర్దకుంభమందు వేయవలసిన ¸°షధులు గ్రంధ ద్రవ్యములు ఇక్కడ గ్రంధమునందు పేర్కొవబడినవి. అపదములకు నిఘంటువులలో ననేకార్థములుగలవు. ఈ ప్రత్యేకముగా నిచట నింపవలసిన మూలిక పేరు సాహిత్యదృష్టితో చెప్పుట సాధ్యమికాదు. అనిర్ణయము సంప్రదాయానుసారము పురోహితులవలన తెలియనగును. మూలికల యర్థముకూడ నిఘంటువుల వలన నిర్ణయించనగును.

సహస్రాక్షం శతధార మృషిభిః పావనం కృతమ్‌ | తేన త్వామభిషించామః పావమీనీః పునంతుతే ||

భగంతే వరుణో రాజభగం శుక్రో బృహస్పతిః | భగమింద్రశ్చ వాయు శ్చ భగం సప్తర్షయోదదుః || 15 ||

యత్తే కేశుషు దౌర్భాగ్యం సీమంతే యచ్చ మూర్దని | లలాట కర్ణయోరక్షోరపస్తద్ధంతుతే సదా ||

పరశురాముడు:- వినాయక గ్రహావిష్టులకు సర్వకర్మ సాధనమైన పాపహరమైన మఱొక స్నానముగూర్చి తెలుపు మన పుష్కరిండిట్లనియె. కర్మ విఘ్నము సేయుటకు కేశవుడుపితామహుడు(బ్రహ్మ) ఈశ్వరుడులచే వినాయకుడు గణాధిపతిగా నియోగింపబడెను. ఆ వినాయక గ్రహావిష్ణుని లక్షణము లిడె తెల్పెద నెఱింగికొనుము. అతడు కలలో తఱచుగ నీళ్ళలోనికి దిగుచుండును. అందు కాపాయధారి యొక్క బోడివతలను జూచును. తాను క్రూరమృగముల నెక్కుచుండును. చండాలురతో గాడిదలతో నొంటెలతో కలసియొండును. ఎటకేని నడచిపోవుచు నెవరో తనను వెంటాడుచున్నట్లు భావించబడును. మతిస్తిమితముగా నుండదు, వ్యర్థములయిన పనులేవో చేయిచుండును. అకారణముగ దుఃఖించిను. వైనాయక గ్రహా విష్టుడగు రాజు రాజ్యముంబొందడు. ఆగ్రహము పట్టిన పిల్ల భర్తను, స్త్రీత్వము సంతానము గాని గర్భము గాని పొందదు, ఆగ్రహము పట్టిన శ్రోత్రియుడాచార్యనందడు. శిష్యుడు వేదాధ్యయనము పొందడు. వర్తకుడు లాభమును వ్యవసాయకుడు వ్యవసాయమును బొందడు. అట్టివానికి పుణ్యదివసమున శాంతి స్నానము యధావిధిగ సేయింపవలెను - అస్నానము హస్త పుష్యమి అశ్వని మృగశిర శ్రవణము వీనిలో నేదేని యొక శుభ నక్షత్రమునందు మిత్ర దేవతాక బ్రహ్మదేవతాక ముహూర్తములందు స్నానము చేయింపవలెను. ఎఱ్ఱని ఎద్దు చర్మముపై భద్రాసనము వేసి, దానిపై కూర్చుండబెట్టి బ్రాహ్మణులు స్వస్తివాచనముచేయచుండ తెల్లయావాల ముద్దతో వానికి నలుగు పెట్టవలెను. అన్ని మూలికలు అన్ని గంధములతో వాని శిరస్సును పూసి నాల్గు కలశముతో సమంత్రకముగ స్నానము సేయింపవలెను. అట్లే మడుగునుండి తెచ్చిన నీరు నింపియొకే రంగు కలశములో గుఱ్ఱపుసాల ఏనుగుసాల పుట్ట నదీసంగమమందున్న మడుగు నుండితెచ్చిన మన్నులను గోరోచనము గుగ్గిలమును అన్ని మూలికలు నవధాన్యాలు కూడ వానియందు యామీద స్నానమంత్రములు పఠింపవలెను. ఆ మంత్రములు "సహస్రాక్ష్యం" మొదలుగ14, 15, 16శ్లోకములుగానున్న వాని తాత్పర్యము. వేయి కన్నులు (చిల్లులు) గలది నూరుధారలు గలది ఋషులచే పవిత్రము సేయబడినది యునగు పాత్రతో నిన్నభిషేకించుచున్నాను. పవమానసూక్త మంత్రములు నిన్ను బవిత్రుని గావించుగాక! వరుణరాజు శుక్రడు బృహస్పతి ఇంద్రుడు వాయువు సప్తర్షులు నీకు భగమున 6 రకాల ఐశ్వర్యము నిత్తురు గాక! నీ జుట్టునందు పాపిటనను మూర్దమందు నుదుటనుచెవులందు కన్నులందుగల దౌర్భాగ్యమున ఈ అభిషేక జలములు హరించుగాక! అని యీ మంత్రముల తాత్పర్యము.

దర్భ పింజల మాదాయ వామహస్తే తతో గురుః | స్నాతస్య సార్షపం తైలం స్రువేణౌ దుంబరేణ తు ||

జుహుయాన్మూర్ధ్ని ధర్మజ్ఞ చతుర్థ్యంతైశ్చ నామభిః | ఓంకార పూతైర్థర్మజ్ఞ స్వాహాకార సమన్వితైః ||

మితాయ సంమితాయాధ సాలంకటకటాయ చ | కుష్మాండ రాజపుత్రాయ తథైవ చ మహాత్మనే ||

నామ భిర్బలి మంత్త్రెశ్చ వషట్కార సమన్వితైః | దద్యాచ్చ తుష్పథే శీర్షే కుశానాస్తీర్య సర్వతః ||

కృతరక్తాం స్తడులాంశ్చ పల లౌదనమేవ చ | మత్స్యా న్పక్వాం స్తథైవామాన్మాంస మేతావదేవ తు ||

పుష్పం చిత్రం సుగంధం తు సురాం చ త్రివిధామపి | మూలకం పూరికాపూపాస్తధైవైండర్యకాణి చ ||

ఏతాన్సర్వాను పాహృత్య భూమౌ కృత్వాతతః శిరః | వినాయకస్య జననీ ము పతిష్ఠేత్తతో 7ంబికామ్‌ ||

రూపం దేహి యశో దేహి సౌభాగ్యం సుభ##గేమమ | పుత్రాన్‌ దేహి ధనం దేహి సర్వా న్కామాంశ్చ దేహిమే ||

తతః శుక్లాం బరధరః శుక్లమాల్యాను లేపనః | భోజనే ద్భ్రాహ్మణాన్ద ద్యాద్వ స్త్రయుగ్మ గురోరపి ||

వినాయక స్నానమిదం యశస్యం రక్షోహణం విఘ్నవినాశకారి|

సర్వామయఘ్నం రిపునాశకం చ కర్తవ్యమేత న్నియమేన రామ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే మా.సం రామం ప్రతి పుష్కరో పాఖ్యానే వినాయ స్నానవర్ణన న్నామ పంచోత్తర శతతమో7ధ్యాయః

అటుపై గురువు(పురోహితుడు) దర్భపింజలమును (దర్భలకట్టను) ఎడమచేతంగొని ఆవ నూనెను మేడిచెక్క స్రుమముతో చతుర్థీ విభక్త్యలతములైనవి ఒంకార పవిత్రములు (ఓంకార సంపుటితములు) స్వాహాకారముతో గూడిన నామములతో మిత్రునికొఱకు సంమిత్రుని కొఱఱకు సాలంకటకటునికొఱకు కుష్మాండరాజ పుత్రునికొఱకు మహాత్మునికొఱకు స్వాహా=అర్పితము అని స్నాతుని (స్నానము చేయింపబడినవాని) నిడినెత్తిన కులను పఱచి ఒం మితాయస్వాహా ఇత్యాదిగా హోమము సేయవలెను. వషల్కూరము సంపుటీకరించి యీ కామములతో బలి మంత్రములతో చతష్పథమందు (నాల్గుదార్లు కలిసినచోట) దర్భలు పరచి రక్తముతోడి బియ్యమును మాసౌందనము చేపల పక్వమాంసమును మరి అపక్వ మత్స్యములను మరి మాంసము యేదేని నివేదింపవలెను. రంగురంగుల పూలను గంధమును మూడు రకాల సురను (తాటికల్లు ఇప్పకల్లు ఖర్జూరపుకల్లు) మూలకము పూరీలు అప్పాలు ఏండ ర్యకములు గొనివచ్చిన తల భూమిపై నుంచి వినాయకజననియైన యంబికను నిలువబడి ప్రార్థింపవలెను. ప్రార్థన మంత్రముల తాత్పర్యము: నాకు దేవీ! అందమిమ్ము కీర్తినిమ్ము సుణగా! షడైశ్వర శాలినీ! సౌభాగ్యమిమ్ము! కొడుకులనిమ్ము! ధనమిమ్ము! అన్ని కోరికల దీర్పుము. అని అవ్వల తెల్లని మడువులందాల్చి తెల్లని పూలమాలలు దాల్చి గంధము పూసికొని బ్రాహ్మలకు విందు సేయవలెను. గురువునకు పంచెల చాపీయవలెను. ఈ వినాయక స్నానము యశస్సు నిచ్చును. రక్షోబాధలహరించును. విఘ్నములను వారించును. సర్వవ్యాధిహరము. శత్రునాశకము. పరిశరములో దీనిని నియముముతో గవింపవలెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణముద్వితీయఖండమందు వినాయక స్నానవిధియను నూటయైదవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters