Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

శ్రీ గురుభ్యోనమః

శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము

ద్వితీయ ఖండము

ఒకటవ యధ్యాయము - పరుశురాముడు పుష్కరగృహమున కేగుట

వజ్ర ఉవాచ:- ఆదౌభగవతా ప్రోక్తో విజయో భరతస్య మే | యచ్ర్ఛుత్వా వేద్మి చాత్మానం బ్రహ్మన్‌! విగతకల్మషమ్‌ ||

సుఖశ్రావ్యశ్చ హృద్యశ్చ కథాసారస్తు భార్గవ ! కథాశ్చ వివిధాః ప్రోక్త స్తత్ర్పసంగా త్త్వయానఘ! 2

రసవత్యశ్చ ధర్మజ్ఞ! సర్వపాపక్షయంకరాః | యాస్తా బ్రహ్మన్‌ ! ప్రసంగేన మయాపహృతచేతసా || 3

ప్రస్తుతా స్తాః కథా స్త్యక్తా స్తా ఏవ కథయస్వ మే | భగవన్‌ ! సర్వదర్మజ్ఞ ప్రత్యక్షామల దర్శన ! 4

కథానాంతు ప్రసంగేన ప్రస్తుతా యాః కథాః పురా !

సుదూర మంతరీభూత్వా రామస్య విదితాత్మనః | తా ఏవ శ్రోతు మిచ్ఛామి త్వత్తో భృగుకులోద్వహ! 5

లోకం వారుణ మాసాద్య రామో భృగుకులోద్వహః | శ్రుతవాన్‌ దేవదేవేశాత్‌ కింను భూయః ప్రచేతసః || 6

ఏతన్మే సర్వమాచక్ష్వ ! తత్ర మే సంశయో మహాన్‌ |

మార్కండేయ ఉవాచ: కాలస్య సంఖ్యాం తాం శ్రుత్వా రామః ప్రోక్తాం ప్రచేతసా |

వజ్రుండనియె. తాము వచించిన భరత విజయ చరిత్ర మాలించి నేను కల్మషములెల్ల బాసితినని యనుకొనుచున్నాను. ఓ పుణ్యమూర్తీ! శ్రావ్యములు మనోహరములు నైన పెక్కు కథల సారమును సత్ర్పసంగమున సెలవిచ్చితిరి. ఆ కథలు రసవంతములగుటయే కాదు సర్వదురితహరములుగూడ. ప్రసంగవశమున నేను మైమరచి వానినెల్లను సమగ్రమున విననేమో! వానినే మరియు నిప్పుడానతిండు. జ్ఞానియగు పరశురాముడు వరుణలోకమేగి దేవదేవుని వలన వరుణుని వలనను మరియు నేమి శ్రవణము సేనె నది యెల్ల తెలియబలకుమన మార్కండేయుడిట్లనియె.

పప్రచ్ఛ వరుణందేవం రాజధర్మా నతః పరమ్‌ | పృష్టస్తు జామదగ్న్యేన రామం ప్రాహ జలేశ్వరః || 8

రాజధర్మాన్‌ శృణుష్వార్య ! పుష్కరాత్తనయా న్మమ | రాజ ధర్మశ్ర్శుతాస్తేన దేవాద్దశశ##తేక్షణాత్‌ || 9

స యథావ ద్విజానాతి రాజధర్మాన్‌ ద్విజోత్తమ| ఏవముక్త్వా తదా రామ మానాయ్యచ తథా సుతమ్‌ || 10

ఉవాచ భార్గవస్యాస్య ధర్మాన్‌ కథయ పుత్రక! | యత్ర యత్రాస్య సందేహో భవిష్యతి మహాత్మనః || 11

త దుపానుద భద్రంతే మమ వాక్యేన పుత్రక !

ఏవముక్తస్తధే త్యుక్త్వా గ్భహాన్నిన్యే భృగూత్తమమ్‌ | తత్రాస్య కథాయామాస రాజధర్మాన్‌ మహోదయాన్‌ || 12

రామేణ పృష్టో వరుణస్య పుత్రో జగాద ధర్మాన్‌ నృప సత్తమానమ్‌ |

ద్రవ్యాన్‌ మహార్థాన్‌ భువి పాలనాయ లోకస్య సర్వస్య నరేంద్రచంద్ర !

ఇతి విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే మార్కండేయ వజ్రసంవాదే రామస్య

పుష్కర గృహగమనం నామ ప్రథమో7ధ్యాయః.

రాముడు వరుణదేవునివలన కాలసంఖ్యామాన మాలించి యవ్వల రాజధర్మముల నానతిమ్మన జలాధిపతి నాకొడుకు పుష్కరు డింద్రునివలన దొల్లి వాని వినియుండె నాతని నడిగి వినుము. అతడు చక్కగ వానినెరంగునని యప్పుడ తనకొడుకును రావించి యితనికి నీతెలిసిన రాజధర్మములనెల్ల తెలుపుము. నీకు శుభంబగుగాక! యని దీవించివప్పగించెను. అతండును ధరాపాలనమున కవసరమైన మహాపదార్థములను సర్వాభివృద్ధిప్రదములయిన రాజధర్మములను వరుణకుమారుడు పుష్కరుడు వజ్రపాలునకు దెలుపనారంభించెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున పరుశురాముడు

పుష్కరగృహమున కేగుట యను మొదటి యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters