Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Siva Maha Puranam-3    Chapters   

అథ త్రిచత్వారింశో%ధ్యాయః

జ్ఞాన నిరూపణము

సూత ఉవాచ |

శ్రూయతామృషయస్సర్వే శివజ్ఞానం యథాశ్రుతమ్‌ | కథయామి మహాగుహ్యం పరముక్తిస్వరూపకమ్‌ || 1

కనారదకుమారాణాం వ్యాసస్య కపిలస్య చ | ఏతేషాం చ సమాజే తైర్నిశ్చిత్య సముదాహృతమ్‌ || 2

ఇతి జ్ఞానం సదా జ్ఞేయం సర్వం శివమయం జగత్‌ | శివస్సర్వమయో జ్ఞేయస్సర్వజ్ఞేన విప శ్చితా || 3

ఆబ్రహ్మతృణపర్యంతం యత్కించిద్దృశ్యతే జగత్‌ | తత్సర్వం శివ ఏవాస్తి స దేవాశ్శి వ ఉచ్యతే || 4

యదేచ్ఛా తస్య జాయేత తదా చ క్రియతే త్విదమ్‌ | సర్వం స ఏవ జానాతి తం న జానాతి కశ్చన || 5

రచయిత్వా స్వయం తచ్చ ప్రవిశ్య దూరతః స్థితః | స తత్ర చ ప్రవిష్టోసౌ నిర్లిప్తశ్చిత్స్వరూపవాన్‌ || 6

యథా చ జ్యోతిషశ్చైవ జలాదౌ ప్రతిబింబతా | వస్తుతో న ప్రవేశో వై తథైవ చ శివస్స్వయమ్‌ || 7

వస్తుతస్తు స్వయం సర్వం క్రమో హి భాసతే శుభః | అజ్ఞానం చ మతేర్భేదో నాస్తన్యచ్చ ద్వయం పునః || 8

దర్శనేషు చ సర్వేషు మతిభేదః ప్రదర్శ్యతే | పరం వేదాంతినో నిత్యమద్వైతం ప్రతిచక్షతే || 9

స్వస్యాప్యంశస్య జీవోంశో హ్యవిద్యామోహితో%వశః | అన్యో%హమితి జానాతి తయా ముక్తో భ##వేచ్ఛివః || 10

సూతుడు ఇట్లు పలికెను-

ఓ ఋషులారా! పరమరహస్యము, పరమోక్షస్వరూపము, అగు శివజ్ఞానమును నేను విన్నదానికి అనురూపముగా చెప్పుచున్నాను. మీరు అందరు వినుడు (1). బ్రహ్మ, నారదుడు, కుమారస్వామి, వ్యాసుడు మరియు కపిలుడు అను వారి సమాజములో ఇది నిశ్చయించబడి ప్రవచింపబడినది (2). సర్వమును తెలిసిన విద్వాంసుడు సర్వజగత్తు శివమయమనియు, శివుడు సర్వాత్మకుడనియు సర్వదా తెలియవలెను (3). బ్రహ్మతో మొదలిడి గడ్డిపోచవరకు గల దృశ్యజగత్తు సర్వము శివుడే అయి ఉన్నది. ఆ శివుడు ప్రకాశస్వరూపుడు (4). ఆయన సంకల్పము కలిగినప్పుడు ఈ జగత్తు సృష్టించబడును. ఆయనకు సర్వము తెలియును. కాని ఆయనను తెలిసినవాడు లేడు (5). ఆయన ఈ జగత్తును నిర్మించి దానిలో ప్రవేశించి దూరముగా నున్నాడు. కాని లేపమే లేనివాడు మరియు చైతన్యస్వరూపుడు అగు ఆ పరమేశ్వరుడు వాస్తవముగా ప్రవేశించలేదు (6). సూర్యుడు నీరు మొదలగు వాటియందు ప్రతిఫలించును. సూర్యుడు యథార్థముగా ప్రవేశించుట లేదు. శివుడే కూడ అటులనే చేతనుడై ప్రతిఫలించుచున్నాడు (7). శుభకరుడగు శివుడే స్వయముగా సర్వజగద్రూపములో భాసించుచున్నాడు. బుద్ధియందలి అజ్ఞానమే భేదదర్శనహేతువు అగుచున్నది. వాస్తవముగా ద్వితీయవస్తువు లేదు (8). దర్శనశాస్త్ర కారులందరిలో అభిప్రాయభేదములు గలవు. కాని వేదాంతులు నిత్యమగు అద్వైతమును వర్ణించుచున్నారు (9). జీవుడు స్వయముగా పరమేశ్వరుని అంశవంటి అంశ##యే అయినా, అజ్ఞానముచే మోహితుడై దానిచే పరవశుడై తనను ఈశ్వరభిన్నునిగా భావించుచున్నాడు. కాని ఆ అజ్ఞానము తొలగిపోగానే జీవుడు శివుడు అగును (10).

సర్వం వ్యాప్య శివస్సాక్షాద్‌ వ్యాపకస్సర్వజంతుషు | చేతనాచేతనేశో%పి సర్వత్ర శంకరస్వయమ్‌ || 11

ఉపాయం యః కరోత్యస్య దర్శనార్థం విచక్షణాః | వేదాంతమార్గమాశ్రిత్య తద్దర్శనఫలం లభేత్‌ || 12

యథాగ్నిర్వ్యాపకశ్చైవ కాష్ఠే కాష్ఠే చ తిష్టతి | యో వై మంథతి తత్కాష్ఠం స వై పశ్యత్యసంశయమ్‌ || 13

భక్త్యాదిసాధనానీహ యః కరోతి విచక్షణః | స వై పశ్యత్యవశ్యం హి తం శివం నాత్ర సంశయః || 14

శివశ్శివశ్శివశ్చైవ నాన్యదస్తీతి కించన | భ్రాంత్యా నానాస్వరూపో హి భాసతే శంకరస్సదా || 15

యథా సముద్రో మృచ్చైవ సువర్ణమథవా పునః | ఉపాధితో హి నానాత్వం లభ##తే శంకరస్తథా || 16

కార్యకారణయోర్భేదో వస్తుతో న ప్రవర్తతే | కేవలం భ్రాంతిబుద్ధ్యైవ తదభావే స నశ్యతి || 17

సర్వవ్యాపకుడు, స్థావరజంగమాత్మకమగు జగత్తునకు ప్రభువు, మంగళకరుడు అగు శివుడు స్వయముగా సర్వమును సర్వదేశములలో వ్యాపించియున్నాడు (11). ఏ విద్వాంసుడైతే ఆ పరమేశ్వర దర్శనముకొరకై ఉపనిషత్ర్పతిపాదితమైన మార్గములో యత్నించునో, వానికి దర్శనము మరియు దాని ఫలమగు మోక్షము లభించును (12). వ్యాపకుడగు అగ్ని కట్టెలన్నిటియందు ఉన్నాడు. కాని ఎవడైతే ఆ కట్టెను రాపిడి చేయునో, వానికి మాత్రమే నిస్సందేహముగా అగ్ని దర్శనమునిచ్చును (13). ఏ విద్వాంసుడైతే ఇహలోకములో భక్తి మొదలగు సాధనములననుష్ఠించునో, వాడు మాత్రమే నిశ్చితముగా నిస్సందేహముగా ఆ శివుని దర్శించును (14). ఈ జగత్తులో శివుడు తక్క మరియొక తత్త్వము లేదు. కాని శంకరుడు భ్రాంతిచే సర్వదా నానారూపములుగా భాసించుచున్నాడు (15). సముద్రము, మట్టి మరియు బంగారము ఉపాధిమూలకముగనే నానాత్వమును పొందుచున్నవి. అటులనే శంకరుడు కూడ ఉపాధిచే అనేకముగా కానవచ్చుచున్నాడు (16). కార్యకారణముల మధ్య యథార్థమైన భేదము లేదు. కేవలము భ్రాంతిబుద్ధిచే మాత్రమే ద్వైతము భాసించుచున్నది. భ్రాంతి లేనిచో ద్వైతము కూడ మాయమగును (17).

తదా బీజాత్ర్పరోహశ్చ నానాత్వం హి ప్రకాశ##యేత్‌ | అంతే చ బీజమేవ స్యాత్తత్ర్పరోహశ్చ నశ్యతి || 18

జ్ఞానీ చ బీజమేవ స్యాత్ర్పరోహో వికృతిర్మతా | తన్నివృత్తౌ పునర్‌ జ్ఞానీ నాత్ర కార్యా విచారణా || 19

సర్వం శివశ్శివస్సర్వం నాస్తి భేదశ్చ కశ్చన | కథం చ వివిధం పశ్యత్యేకత్వం చ కథం పునః || 20

యథైకం చైవ సూర్యాఖ్యం జ్యోతిర్నానావిధం జనైః | జలాదౌ చ విశేషణ దృశ్యతే తత్తథైవ సః || 21

సర్వత్ర వ్యాపకశ్చైవ స్పర్శత్వం న నిబధ్యతే | తథైవ వ్యాపకో దేవో బధ్యతే న క్వచిత్స వై || 22

సాహంకారస్తథా జీవస్తన్ముక్తశ్శంకరస్స్వయమ్‌ | జీవస్తుచ్ఛః కర్మభోగీ నిర్లిప్తశ్శంకరో మహాన్‌ || 23

యథైకం చ సువర్ణాది మిలితం రజతాదినా | అల్పమూల్యం ప్రజాయేత తథా జీవో%ప్యహంయుతః || 24

అప్పుడు బీజమునుండి అంకురము ఉదయించి శాఖాపత్రాదినానాత్వము ప్రకటమగును. మరల అంతమునందు అంకురము మొదలైనవి నశించి బీజము మాత్రమే మిగులును (18). జ్ఞాని బీజమువంటి వాడు. అతనిలో వచ్చు వికారములు అంకురము. అంకురము నశించగానే అతడు మరల జ్ఞాని యగుననుటలో సందేహము లేదు (19). సర్వము శివుడే. శివుడే సర్వము. భేదము లేశ##మైననూ లేదు. అట్లైనచో, ఈ నానాత్వము కనబడుటకు కారణమేమి? నానాత్వమునుండి మరల ఏకత్వములోనికి వచ్చుట ఎట్లు? (20) సూర్యుడు అనే జ్యోతిర్మండలము ఒక్కటియే అయిననూ, జనులచే నానారూపములలో దర్శించబడుచున్నది. జలము మొదలగు వాటియందు సూర్యుడు భిన్నభిన్నముగా దర్శనమిచ్చుచున్నాడు. అదే విధముగా పరమేశ్వరునియందు ద్వైతము భాసించుచున్నది (21). ఆకాశము సర్వవ్యాపకమే అయిననూ దానికి దేనితోనైననూ సంగము మరియు బంధము లేదు. అటులనే సర్వవ్యాపకుడగు పరమేశ్వరుడు దేనిచేతనైననూ బంధించబడుటలేదు (22). అహంకారముతో కూడిన చైతన్యము జీవుడు కాగా, అహంకారవినిర్ముక్తమైన చైతన్యమే స్వయముగా శివుడు అగుచున్నది. జీవుడు కర్మఫలములననుభవించే అల్పుడు కాగా, శంకరుడు లేపము లేని బ్రహ్మ (23). బంగారమును వెండి మొదలగు వాటితో కలిపినచో, దాని విలువ తగ్గిపోవును. అటులనే అహంకారముతో కూడిన శివుని మహత్త్వము తగ్గిపోవును (24).

యథైవ హి సువర్ణాది క్షారాదేశ్శోధితం శుభమ్‌ | పూర్వవన్మూల్యతాం యాతి తథా జీవో%పి సంస్కృతేః || 25

ప్రథమం సద్గురుం ప్రాప్య భక్తిభావనసమన్వితః | శివబుద్ధ్యా కరోత్యుచ్చైః పూజనం స్మరణాదికమ్‌ || 26

తద్బుద్ధ్యా దేహతో యాతి సర్వపాపాదికో మలః | తదా%జ్ఞానం చ నశ్యేత జ్ఞానవాన్‌ జాయతే యదా || 27

తదాహంకారనిర్ముక్తో జీవో నిర్మలబుద్ధిమాన్‌ | శంకరస్య ప్రసాదేన యాతి శంకరతాం పునః || 28

యథాదర్శస్వరూపే చ స్వీయరూపం ప్రదృశ్యతే | తథా సర్వత్రగం శంభుం పశ్యతీతి సునిశ్చితమ్‌ || 29

జీవన్ముక్తస్స ఏవాసౌ దేహశ్శీర్ణశ్శివో మిలేత్‌ | ప్రారబ్ధవశగో దేహస్తద్బిన్నో జ్ఞానవాన్మతః || 30

శుభం లబ్ధ్వా న హృష్యేత కుప్యేల్లబ్ధ్వా%శుభం న హి | ద్వంద్వేషు సమతా యస్య జ్ఞానవానుచ్యతే హి సః || 31

కల్తీ బంగారమును క్షారము మొదలగు వాటితో శుద్ధి చేసినచో, మరల పూర్వమునందలి విలువ లభించును. అటులనే, జీవుడు కూడ సంస్కారములచే శుద్ధిని పొందును (25). మానవుడు స్వయముగా సద్గురువును పొంది భక్తిభావముతో కూడినవాడై గురువుయందు శివబుద్ధిని కలిగి అధికమగు పూజను మరియు భగవత్‌ స్మరణమును చేయవలెను (26). అట్టి సంస్కృతబుద్ధియొక్క ప్రభావముచే దేహమునుండి సకలపాపములు మొదలగు దోషములు దూరమగును. అప్పుడు అజ్ఞానమును కూడ నశించి ఆతడు జ్ఞానమును పొందును (27). అప్పుడా జీవుడు నిర్మలమగు బుద్ధి గలవాడై శంకరుని అనుగ్రహముచే అహంకారమునుండి వినిర్ముక్తుడై శంకరునిలో ఐక్యమగును (28). అపుడాతడు అద్దములో తన ముఖమును చూచు తీరున సర్వవ్యాపకుడగు శంభుని చూచుట నిశ్చితమగును (29). ఆతడే జీవన్ముక్తుడనబడును. ఆతని దేహము పడిపోయిన తరువాత ఆతడు శివునిలో ఐక్యమగును. దేహము ప్రారబ్ధకర్మానుసారముగా నడచును. కాని జ్ఞాని దేహముకంటే భిన్నమైనవాడు (30). శుభము లభించినపుడు హర్షమును పొందరాదు. అశుభము కలిగినపుడు కోపించరాదు. సుఖదుఃఖాదిద్వంద్వములయందు సమమగు చిత్తము కలవాడు మాత్రమే జ్ఞాని యనబడును (31).

ఆత్మయోగేన తత్త్వా నామథవా చ వివేకతః | యథా శరీరతో యాయాచ్ఛరీరం ముక్తిమిచ్ఛతః || 32

సదాశివో విలీయేత ముక్తో విరహమేవ చ | జ్ఞానమూలం తథాధ్యాత్మం తస్య భక్తిశ్శివస్య చ || 33

భ##క్తేశ్చ ప్రేమ సంప్రోక్తం ప్రేవ్ణుశ్చ శ్రవణం తథా | శ్రవణాచ్చాపి సత్సంగస్సత్సంగాచ్చ గురుర్బుధః|| 34

సంపన్నే చ తథా జ్ఞానే ముక్తో భవతి నిశ్చితమ్‌ | ఇతి చేత్‌ జ్ఞానవాన్‌ యో వై శంభుమేవ సదా జపేత్‌ || 35

అనన్యయా చ భక్త్యా వై యుక్తశ్శంభుం భ##జేత్పునః | అంతే చ ముక్తి మాయాతి నాత్ర కార్యా విచారణా || 36

అతో%ధికో న దేవో%స్తి ముక్తి ప్రాపై#్య చ శంకరాత్‌ | శరణం ప్రాప్య యం చైవ సంసారాద్వినివర్తతే || 37

ఇతి మే వివిధం వాక్యమృషీణాం చ సమాగతైః | నిశ్చిత్య కథితం విప్రా ధియా ధార్యం ప్రయత్నతః || 38

ముక్తిని కోరువాడు మనస్సును నిరోధించి తత్త్వములను వివేచన చేసి శరీరభిన్నమైన ఆత్మను దర్శించవలెను (32). అధ్యాత్మయోగము మరియు శివునియందు భక్తి అనునవి జ్ఞానమునకు మూలములు. జ్ఞాని మోక్షమును పొంది సదాశివునిలో విలీనుడగును. ఆతనికి సంసారమునుండి విముక్తి లభించును (33). భక్తినుండి ప్రేమ, ప్రేమనుండి శ్రవణము, శ్రవణమునుండి సత్సంగము, సత్సంగమునుండి పండితుడగు గురువు లభించెదరు. అప్పుడు జ్ఞానము సంపన్నమై మానవుడు ముక్తుడగును. ఇదినిశ్చయము.కావున, వివేకి సర్వదా శంభుని భజించవలెను (34, 35). సాధకుడు అన్యసంబంధము లేని భక్తితో కూడి శంభుని సేవించవలెను. ఆతనికి దేహత్యాగానంతరము ముక్తి లభించుననుటలో సందేహము లేదు (36). ముక్తిని పొందుటకొరకై శంకరునికంటే అధికమైన దైవము లేదు. ఆయనను శరణు పొందినవాడు సంసారమునుండి విముక్తిని పొందును (37). నేను వివిధవచనములను నన్ను కలిసిన ఋషులతో సమాలోచన చేసి నిశ్చయించి చెప్పితిని. ఓ విప్రులారా! దీనిని ప్రయత్నపూర్వకముగా బుద్ధియందు ధరించుడు (38).

ప్రథమం విష్ణవే దత్తం శంభునా లింగసమ్ముఖే | విష్ణునా బ్రహ్మణా సనకాదిషు || 39

నారదాయ తతః ప్రోక్తం తద్‌ జ్ఞానం సనకాదిభిః | వ్యాసాయ నారదేనోక్తం తేన మహ్యం కృపాలునా || 40

మయా చైవ భవద్భశ్చ భవద్భిర్లోకహేతవే | స్థాపనీయం ప్రయత్నేన శివప్రాప్తికరం చ తత్‌ || 41

ఇతి వశ్చ సమాఖ్యాతం యత్పృష్టో%హం మునీశ్వరాః | గోపనీయం ప్రయత్నేన కిమన్యచ్ఛ్రోతుమిచ్చథ || 42

ఈ జ్ఞానమును మున్ముందుగా శివుడు లింగసన్నిధిలో విష్ణువునకు ఇచ్చెను. విష్ణువు బ్రహ్మకు, బ్రహ్మ సనకాది మహర్షులకు చెప్పెను (39). తరువాత సనకాదులు ఈ జ్ఞానమును నారదునకు చెప్పిరి. నారదుడు వ్యాసునకు చెప్పెను. దయానిధియగు వ్యాసుడు నాకు చెప్పగా, నేను మీకు చెప్పితిని (40). మీరు లోకోపకారము కొరకై దీనిని ప్రయత్నపూర్వకముగా స్థిరము చేయుడు. ఈ జ్ఞానము శివునిపొందుటలో సహకరించును (41). ఓ మహర్షులారా! మీరు అడిగినదానికి నేను సమాధానమునిచ్చి యుంటిని. దీనిని మీరు రహస్యముగానుంచుడు. మీరు ఇంకనూ ఏమి వినగోరుచున్నారు? (42)

వ్యాస ఉవాచ |

ఏతచ్ఛ్రుత్వా తు ఋషయ ఆనందం పరమం గతాః | హర్షగద్గదయా వాచా నత్వా తే తుష్టపుర్ముహుః || 43

వ్యాసుడు ఇట్లు పలికెను --

ఈ వాక్యమును విని ఆ ఋషులు ఆనందమును పొంది ఆయనకు నమస్కరించి, హర్షముతో గద్గదమైన వాక్కుతో పలుమార్లు స్తుతించిరి (43).

ఋషయ ఊచుః |

వ్యాసశిష్య నమస్తే%స్తు ధన్యస్త్వం శైవసత్తమః | శ్రావితం నః పరం వస్తు శైవం జ్ఞానమనుత్తమమ్‌ || 44

అస్మాకం చేతసో భ్రాంతిర్గతా హి కృపయా తవ | సంతుష్టాశ్శివసద్‌ జ్ఞానం ప్రాప్య త్వత్తో విముక్తిదమ్‌ || 45

ఋషులు ఇట్లు పలికిరి-

ఓ వ్యాస శిష్యా! నీకు నమస్కారము అగుగాక! శివభక్తాగ్రగణ్యుడవగు నీవు ధన్యుడవు. మాకు పరమతత్త్వమును బోధించితివి. సర్వోత్కృష్టమైనదియగు శివసంబంధి జ్ఞానమును చెప్పితివి. నీ దయచే మా మనస్సులలోని సంశయములు దూరమైనవి. మోక్షమునిచ్చే పవిత్రమై శివజ్ఞానమును నీ నుండి పొంది మేము సంతోషించితిమి (44, 45).

సూత ఉవాచ |

నాస్తికాయ న వక్తవ్యమశ్రద్ధాయ శఠాయ చ | అభక్తాయ మహేశస్య న చాశుశ్రూషవే ద్విజాః || 46

ఇతిహాసపురాణాని వేదాన్‌ శాస్త్రాణి చాసకృత్‌ | విచార్యోద్ధృత్య తత్సారం మహ్యం వ్యాసేన భాషితమ్‌ || 47

ఏతచ్ఛ్రుత్వా హ్యేకవారం భ##వేత్సాపం హి భస్మసాత్‌ | అభక్తో భక్తిమాప్నోతి భక్తస్య భక్తివర్ధనమ్‌ || 48

పునశ్శ్రుతే చ సద్భక్తిర్ముక్తిస్స్యాచ్చ శ్రుతే పునః | తస్మాత్పునః పనశ్శ్రావ్యం భుక్తిముక్తిఫలేప్సుభిః || 49

ఆవృత్తయః పంచ కార్యాస్సముద్దిశ్య ఫలం పరమ్‌ | తత్ర్పాప్నోతి న సందేహో వ్యాసస్య వచనం త్విదమ్‌ || 50

న దుర్లభం హి తసై#్యవ యేనేదం శ్రుతముత్తమమ్‌ | పంచకృత్వస్తదావృత్వా లభ్యతే శివదర్శనమ్‌ || 51

పురాతనాశ్చ రాజానో విప్రా వైశ్యాశ్చ సత్తమాః | ఇదం శ్రుత్వా పంచకృత్వో ధియా సిద్ధిం పరాం గతాః || 52

శ్రోష్యత్యద్యాపి యశ్చేదం మానవో భక్తితత్పరః | విజ్ఞానం శివసంజ్ఞం వై భుక్తిం ముక్తిం లభేచ్చ సః || 53

సూతుడు ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణులారా! నాస్తికునకు, శ్రద్ధ లేనివానికి, మోసగానికి, మహేశ్వరునియందు భక్తి లేనివానికి, శ్రవణమునందు ఇచ్ఛ లేనివానికి దీనిని చెప్పరాదు (46). వ్యాసుడు ఇతిహాసపురాణములను, వేదశాస్త్రములను పలుమార్లు పరిశీలించి వాటిలోని సారమును తీసి నాకు చెప్పినాడు (47). దీనిని ఒక సారి విన్నచో, పాపము భస్మమగును. భక్తుడు కానివానికి భక్తి కలుగును. భక్తునకు భక్తి వర్ధిల్లును (48). మరల విన్నచో సద్భక్తి, మరల విన్నచో ముక్తి కలుగును. కావున భుక్తిని, ముక్తిని మరియు ఇతరఫలములను కోరువారు దీనిని మరల మరల వినుచుండవలెను (49). పరమఫలమును గోరువారు ఐదు పర్యాయములు విన్నచో దానిని నిస్సందేహముగా పొందెదరని వ్యాసుడు చెప్పియున్నాడు (50). ఈ ఉత్తమమగు జ్ఞానమును విన్నవారికి దుర్లభ##మైనది లేదు. దీనిని ఐదుసార్లు ఆవృత్తి చేసినవానికి శివదర్శనము లభించును (51). పూర్వపు రాజులు, బ్రాహ్మణులు, సత్పురుషులగు వైశ్యులు కూడ దీనిని ఐదు పర్యాయములు విని బుద్ధిలో ధారణ చేసి పరమసిద్ధిని పొందిరి (52). ఈ నాడైననూ ఏ మానవుడైతే దీనిని భక్తితత్పరతతో వినునో, వానికి శివజ్ఞానము, భుక్తి మరియు ముక్తి లభించును (53).

వ్యాస ఉవాచ |

ఇతి తద్వచనం శ్రుత్వా పరమానందమాగతాః | సమానర్చుశ్చ తే సూతం నానావస్తుభిరాదరాత్‌ || 54

నమస్కారైః స్తవైశ్చైవ స్వస్తివాచనపూర్వకమ్‌ | ఆశీర్భిర్వర్ధయామాసుస్సంతుష్టాశ్ఛిన్నసంశయాః || 55

పరస్పరం చ సంతుష్టాస్సూతస్తే చ సు బుద్ధయః | శంభు దేవం పరం మత్వా నమంతి స్మ భజంతి చ || 56

ఏతచ్ఛివసువిజ్ఞానం శివస్యాతిప్రియం మహత్‌ | భుక్తిముక్తిప్రదం దివ్యం శివభక్తివివర్ధనమ్‌ || 57

ఇయం హి సంహితా పుణ్యా కోటిరుద్రాహ్వయా పరా | చతుర్థీ శివపురాణస్య కథితా మే ముదావహా || 58

ఏతాం యః శృణుయాద్భక్త్యా శ్రావయేద్వా సమాహితః | స భుక్త్వేహాఖిలాన్‌ భోగానంతే పరగతిం లభేత్‌ || 59

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితయాం జ్ఞాననిరూపణం నామ త్రిచత్వారింశో% ధ్యాయః (43).

సమాప్తేయం కోటిరుద్రసంహితా చతుర్థీ |

వ్యాసుడు ఇట్లు పలికెను-

వారు సూతుని ఈ వచనమును విని పరమానంద భరితులై ఆయనను వివిధవస్తువులతో ఆదరపూర్వకముగా పూజించిరి (54). వారి సంశయములన్నియు తొలగిపోయెను. వారు సంతుష్టులై సూతుని నమస్కారములతో, స్తోత్రములతో, స్వస్తివాచనములతో మరియు ఆశీర్వచనములతో పెద్దను చేసి గౌరవించిరి (55). పుణ్యాత్ములగు ఆ మహర్షులు మరియు సూతుడు పరస్పరము చాల ఆనందమును పొంది పరమాత్మ యగు శంభుని స్మరించి నమస్కరించి సేవించిరి (56). శివునకు మిక్కిలి ప్రియమగు ఈ గొప్ప శివజ్ఞానము భుక్తిని, ముక్తిని ఇచ్చి శివభక్తిని పెంపొందింపజేయును. ఇది దివ్యమైనది (57). శివపురాణములో నాల్గవదియగు ఈ కోటిరుద్రసంహిత పరమపుణ్యప్రదము. ఆనందదాయకమగు దీనిని నేను చెప్పితిని (58). ఎవడైతే దీనిని భక్తితో వినునో, లేదా ఏకాగ్రచిత్తముతో వినిపించునో, వాడు ఇహ లోకములో సకల భోగములననుభవించి, మరణించిన పిదప మోక్షమును పొందును (59).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్రసంహితయందు జ్ఞాననిరూపణమనే నలుబది మూడవ

అధ్యాయము ముగిసినది (43).

కోటిరుద్ర సంహిత సమాప్తము

శ్రీ సాంబసదాశివార్పణమస్తు

శ్రీకృష్ణార్పణమస్తు

హరిః ఓం తత్సత్‌

Siva Maha Puranam-3    Chapters