Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Siva Maha Puranam-3    Chapters   

అథ ఏకచత్వారింశో%ధ్యాయః

ముక్తి నిరూపణము

ఋషయ ఊచుః |

ముక్తిర్నామ త్వయా ప్రోక్తా తస్యాం కిం ను భ##వేదిహ | అవస్థా కీ దృశీ తత్ర భ##వేదితి వదస్వ నః || 1

ఋషులు ఇట్లు పలికిరి-

నీవు ముక్తి అను పదమును వాడితివి. దానియందు ఏమి జరుగును? దానియందు ఎట్టి అవస్థ ఉండును? ఈ విషయమును మాకు చెప్పుము (1).

సూత ఉవాచ |

ముక్తిశ్చతుర్విధా ప్రోక్తా శ్రూయతాం కథయామి వః | సంసారక్లేశసంహర్త్రీ పరమానందదాయినీ || 2

సారూప్యాచైవ సాలోక్యా సాన్నిధ్యా చ తథా పరా | సాయుజ్యా చ చతుర్థీ సా వ్రతేనానేన యా భ##వేత్‌ || 3

ముక్తేర్దాతా ముని శ్రేష్ఠాః కేవలం శివ ఉచ్యతే | బ్రహ్మాద్యాన హి తే జ్ఞేయాకేవలం చ త్రివర్గదాః || 4

బ్రహ్మాద్యాస్త్రిగుణాధీశాశ్శివస్త్రి గుణతః పరః | నిర్వికారీ పరబ్రహ్మ తుర్యః ప్రకృతితః పరః || 5

జ్ఞానరూపో%వ్యస్సాక్షీ జ్ఞానగమ్యో%ద్వయస్స్వయమ్‌ | కైవల్యముక్తిదస్సో%త్ర త్రివర్గస్య ప్రదో%పి హి || 6

కైవల్యాఖ్యా పంచమీ చ దుర్లభా సర్వథా నృణామ్‌ | తల్లక్షణం ప్రవక్ష్యామి శ్రూయతామృషిసత్తమాః || 7

ఉత్పద్యతే యతస్సర్వం యేనైతత్పాల్యతే జగత్‌ | యస్మింశ్చ లీయతే తద్ధి యేన సర్వమిదం తతమ్‌ || 8

తదేవ శివరూపం హి పఠ్యతే చ మునీశ్వరాః | సకలం నిష్కంలం చేతి ద్వివిధం వేదవర్ణితమ్‌ || 9

సూతుడు ఇట్లు పలికెను--

సంసారదుఃఖమును పోగొట్టి పరమానందమును ఇచ్చే ముక్తి నాలుగు విధములని చెప్పబడినది. దానిని నేను మీకు చెప్పుచున్నాను. వినుడు (2). సారూప్యము, సాలోక్యము, సాన్నిధ్యము మరియు సాయుజ్యము అని ముక్తి నాలుగు విధములు. వాటిలో సాయుజ్యముక్తి ఈ వ్రతముచే లభించును (3). ఓ మహర్షులారా! కేవలము శివుడు మాత్రమే ముక్తిని ఇచ్చునది చెప్పబడినది. బ్రహ్మాదులు ముక్తిను ఇచ్చువారు కారు. వారు కేవలము ధర్మార్థకామములను మాత్రమే ఇచ్చెదరు (4). బ్రహ్మాదులు త్రిగుణములకు అధీశ్వరులు. శివుడు త్రిగుణములకు అతీతుడు. ఆయన వికారములు లేని పరంబ్రహ్మ. ప్రకృతికి అతీతుడగు తురీయుడు (5). జ్ఞానస్వరూపుడు, వినాశము లేనివాడు, సాక్షి, జ్ఞానముచే పొందదగిన వాడు, అద్వితీయుడు అగు ఆయన మాత్రమే స్వయముగా ముక్తిని ఇచ్చును. ధర్మార్థకామములను ఇచ్చువాడు కూడ ఆయనయే (6). సర్వవిధములుగా మానవులకు దుర్లభ##మైన కైవల్యమనే ఐదవ ముక్తి గలదు. ఓ మహర్షులారా! దాని లక్షణమును చెప్పెదను వినుడు (7). ఎవనినుండి ఈ జగత్తు సర్వము ఉదయించుచున్నదో, ఎవనిచే పాలించబడుచున్నదో, ఎవనియందు లీనమగునో, ఎవనిచే ఈ జగత్తు వ్యాపించబడియున్నదో (8), అదియే శివస్వరూపమని చెప్పబడుచున్నది. ఓ మహర్షులారా! అది సకలనిష్కలభేదముచే ద్వివిధముగా నున్నదని వేదములు వర్ణించుచున్నవి (9).

విష్ణునా తచ్చ న జ్ఞాతం బ్రహ్మణా న చ తత్తథా | కుమారాద్యైశ్చ న జ్ఞాతం న జ్ఞాతం నారదేన వై || 10

శుకేన వ్యాసపుత్రేణ వ్యాసేన చ మునీశ్వరైః | తత్పూర్వైశ్చాఖిలైర్దేవైర్వేదైశ్శాసై#్త్రస్తథా న హి || 11

సత్యం జ్ఞానమనంతం చ సచ్చిదానందసంజ్ఞితమ్‌ | నిర్గుణో నిరుపాధిశ్చావ్యయశ్శుద్ధో నిరంజనః || 12

న రక్తో నైవ పీతశ్చ న శ్వేతో నీల ఏవ చ | న హ్రస్వో న చ దీర్ఘశ్చ న స్థూలస్సూక్ష్మ ఏవ చ || 13

యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ | తదేవ పరమం ప్రోక్తం బ్రహ్మైవ శివసంజ్ఞకమ్‌ || 14

ఆకాశం వ్యాపకం యద్వత్తథైవ వ్యాపకం త్విదమ్‌ | మాయాతీతం పరాత్మానం ద్వంద్వాతీతం విమత్సరమ్‌ || 15

తత్ర్పాప్తిశ్చ భ##వేదత్ర శివజ్ఞానోదయాద్ధ్రువమ్‌ | భజనాద్వా శివసై#్యవ సూక్ష్మమత్యా సతాం ద్విజాః || 16

దానిని విష్ణువు గాని, బ్రహ్మ గాని, కుమారస్వామి మొదలగు వారుగాని, నారదుడు గాని తెలియకుండిరి (10). వ్యాసుని పుత్రుడగు శుకుడు, వ్యాసుడు, మహర్షులు, వారికి పూర్వమునందు ఉన్న సకలదేవతలు, వేదములు మరియు శాస్త్రములు కూడ తెలియలేకపోయెను (11). బ్రహ్మ సత్యజ్ఞానానంతము. దానికి సచ్చిదానందమని పేరు. అది నిర్గుణము. దానికి ఉపాధులు లేవు. అది వినాశము లేనిది, కర్మలేపము లేనిది మరియు శుద్ధమైనది (12). అది ఎరుపు కాదు, పచ్చనిది కాదు, తెల్లనిది కాదు, నీలవర్ణము కలది కాదు. అది పొట్టి కాదు, పొడుగు కాదు. అది స్థూలమైనది కాదు, సూక్ష్మమైనది కాదు (13). వాక్కులు మనస్సుతో సహా దానిని పొందజాలక దానినుండి వెనుదిరిగినవి. ఆ పరంబ్రహ్మయే శివుడు అనే నామమును కలిగియున్నది అని ఋషులు చెప్పుచున్నారు (14). అది ఆకాశము వలె సర్వవ్యాపకము. పరమాత్మ మాయకు, ద్వంద్వములకు అతీతమై మత్సరము ఇత్యాది దోషములు లేనిదై ఉండును (15). ఓ బ్రాహ్మణులారా! శివజ్ఞానము ఉదయించుట ద్వారా గాని, లేదా సూక్ష్మబుద్ధితో శివుని సేవించుట ద్వారా గాని దానిని సత్పురుషులు ఇహలోకములోనే నిశ్చయముగా పొందదగును (16).

జ్ఞానం తు దుష్కరం లోకే భజనం సుకరం మతమ్‌ | తస్మాచ్ఛివం చ భజత ముక్త్యర్థమపి సత్తమాః || 17

శివో హి భజనాధీనో జ్ఞానాత్మా మోక్షదః పరః | భ##క్త్యైవ బహవస్సిద్ధా ముక్తిం ప్రాపుః పరాం ముదా || 18

జ్ఞానమాతా శంభుభక్తిర్ముక్తిభుక్తిప్రదా సదా | సులభా యత్ర్పసాదాద్ధి సత్ర్పేమాంకురలక్షణా || 19

సా భక్తిర్వి విధా జ్ఞేయా సగుణా నిర్గుణా ద్విజాః | వైధీ స్వాభావికీ యా యా వరా సా సా స్మృతా పరా || 20

నైష్ఠిక్య నైష్ఠికీ భేదాద్ధ్వివిధైవ హి కీర్తితా | షడ్విధా నైష్ఠికీ భేదాద్ద్వితీయైకవిధా స్మృతా || 21

విహితావిహితా భేదాత్తామనేకాం విదుర్బుధాః | తయోర్బహువిధత్వాచ్చ విస్తారో న హి వర్ణ్యతే || 22

తే నవాంగే ఉభే జ్ఞేయే శ్రవణాదికభేదతః | సుదుష్కరే తత్ర్పసాదం వినా చ సుకరే తతః || 23

భక్తిజ్ఞానే న భిన్నే హి శంభునా వర్ణితే ద్విజాః | తస్మాద్భేదో న కర్తవ్యస్తత్కర్తుస్సర్వదా సుఖమ్‌ || 24

విజ్ఞానం న భవత్యేవ ద్విజా భక్తివిరోధినః | శంభుభక్తికరసై#్యవ భ##వేత్‌ జ్ఞానోదయో ద్రుతమ్‌ || 25

తస్మాద్భక్తిర్మహేశస్య సాధనీయా మునీశ్వరాః | తయైవ నిఖిలంసిద్ధం భవిష్యతి న సంశయః || 26

ఇతి పృష్టం భవద్భిర్యత్తదేవ కథితం మయా | తచ్ఛ్రు త్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః || 27

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం ముక్తినిరూపణం వర్ణనం నామ ఏకచత్వారింశో%ధ్యాయః (41).

లోకములో జ్ఞానము మిక్కిలి కఠినమైనది. కాని భక్తి తేలికయని పెద్దలు చెప్పెదరు. ఓ సత్పురుషులారా! కావున ముక్తికొరకు కూడ శివుని సేవించుడు (17). జ్ఞానస్వరూపుడు, పరంబ్రహ్మ అగు శివుడు సేవకు అధీనుడై మోక్షమును ఇచ్చును. అనేకులు సర్వోత్కృష్టమగు మోక్షమును భక్తిచే మాత్రమే ఆనందముగా పొందగల్గిరి (18). సర్వదా భుక్తిని మరియు ముక్తిని ఇచ్చే శంభునియందలి భక్తి జ్ఞానమునకు తల్లి. శుద్ధమగు ప్రేమ అంకురించుటయే దీని లక్షణము. ఇది శివుని అనుగ్రహముచే లభించును (19). ఓ బ్రాహ్మణులారా! సగుణము, నిర్గుణము అని భక్తి ద్వివిధముగా నున్నది. విధి విహితమైనది మరియు స్వభావసిద్ధమైనది అగు భక్తి సర్వశ్రేష్ఠమని చెప్పబడినది (20). ఆ భక్తినైష్ఠికీ (పూజాదికము కలది), అనైష్ఠికీ (పూజాదికము లేనిది) అని మరల ద్వివిధముగా నున్నది. నైష్ఠికీ భక్తిలో ఆరు భేదములు ఉండగా, అనైష్ఠికీ భక్తిలో భేదములు లేవు (21). విహితము, అవిహితము అని భక్తిలో అనేకభేదములు గలవని పండితులు చెప్పుచున్నారు. ఆ రెండింటిలో అనేకరకములు ఉండుటచే వివరములు వర్ణించబడుట లేదు (22). ఆ రెండు విధముల భక్తియందు శ్రవణము మొదలగు తొమ్మిదిఅంగములు గలవు. శివుని అనుగ్రహముచే తేలికగా సాధించదగిన ఈ భక్తి ఆ అనుగ్రహము లేనిచో దుష్కరమగును (23). ఓ బ్రాహ్మణులారా! భక్తిజ్ఞానములలో భేదము లేదని శంభుడు వర్ణించి యున్నాడు. కావున, వాటిలో భేదమును పాటించరాదు. వాటిని ఆచరించువానికి సర్వకాలములలో సుఖము లభించును (24). ఓ బ్రాహ్మణులారా! భక్తిని వ్యతిరేకించువానికి జ్ఞానము ఉదయించు ప్రసక్తిలేదు. శంభునియందు శ్రేష్ఠమగు భక్తి గలవానికి మాత్రమే శీఘ్రముగా జ్ఞానము ఉదయించును (25). ఓ మహర్షులారా! కావున మహేశ్వరునియందు భక్తిని సాధించవలెను. దానివలననే సర్వము సిద్ధించుననుటలో సందేహము లేదు (26). ఈ విధముగా మీరు అడిగినదానికి సమాధానమును నేను చెప్పియుంటిని. దీనిని విన్నవారికి పాపములన్నియు నశించుననుటలో సందేహము లేదు (27).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్రసంహితయందు ముక్తినిరూపణమనే నలుబది ఒకటవ అధ్యాయము ముగిసినది (41).

Siva Maha Puranam-3    Chapters