Siva Maha Puranam-3    Chapters   

అథ చతుర్వింశో%ధ్యాయః

గౌతమ మహర్షి యొక్క పరోపకార శీలము

సూత ఉవాచ |

శ్రూయతామృషయః శ్రేష్ఠా కథాం పాపప్రణాశినీమ్‌ | కథయామి యథా వ్యాసాత్సద్గురోశ్చ శ్రుతా మయా || 1

పురా ఋషివరశ్చాసీద్గౌతమో నామ విశ్రుతః | అహల్యా నామ తస్యాసీత్పత్నీ పరమధార్మికీ || 2

దక్షిణస్యాం హి దిశి యో గిరిర్బ్ర హ్యేతి సంజ్ఞకః | తత్ర తేన తపస్తప్తం వర్షాణామయుతం తథా || 3

కదాచిచ్చ హ్యానావృష్టిరభవత్తత్ర సువ్రతాః | వర్షాణాం చ శతం రౌద్రీ లోకా దుఃఖముపాగతాః || 4

ఆర్ద్రం చ పల్లవం న స్మ దృశ్యతే పృథివీతలే | కుతో జలం విదృశ్యేత జీవానాం ప్రాణధారకమ్‌ || 5

తదాతే మునయశ్చైవ మనుష్యాః పశవస్తథా| పక్షిణశ్చ మృగాస్తత్ర గతాశ్చైవ దిశో దశ|| 6

తాం దృష్ట్వా చర్షయే విప్రాః ప్రాణాయామపరాయణాః| ధ్యానేన చ తదా కేచిత్‌కాలం నిన్యుస్సుదారుణమ్‌||7

గౌతమో%పి స్వయం తత్ర వరుణార్థే తపశ్శుభమ్‌ | చకార చైవ షణ్మాసం ప్రాణాయమపరాయణః ||8

తతశ్చ వరుణసన్తసై#్మ వరం దాతుం సరమాగతః | ప్రసన్నో %స్మి వరం బ్రూహి దదామి చ వచో % బ్రవీత్‌|| 9

తతశ్చ గౌతమస్తం వైవృష్టిం చ ప్రార్థయత్తదా | తతస్స వరుణస్తం వై ప్రత్యువాచ మునిం ద్విజాః || 10

సూతుడు ఇట్లు పలికెను-

ఓ మహర్షులారా! సద్గురువు అగు వ్యాసునుండి నేను విన్న విధముగా పాపములను నిర్మూలించే కథను నేను చెప్పుచున్నాను. వినుడు(1). పూర్వము గౌతముడని ప్రఖ్యాతినా గాంచిన మహర్షి ఉండేవడివాడు. ఆయనకు పరమధర్మాత్మరాలగు అహల్యయను భార్య ఉండెడిది (2). ఆయన దక్షిణ దిక్కునందు గల బ్రాహ్మపర్వతమునందు పదివేదల సంవత్సరములు తపస్సును చేసెను (3). ఓ గొప్ప వ్రతము గలవారా! ఒకప్పుడు అచట భయంకరమగు వంద సంవత్సరముల అనావృష్టి కలిగెను. ప్రాణులు దుఃఖమును పొందినవి (4). భూతములపై పచ్చని ఆకు కానదాకుండెను. అట్టి స్థితిలో జీవుల ప్రాణములను నిలబెట్టె నీరు ఎక్కడ కానవచ్చును? (5) అప్పుడు ఆ ఋషులు, సామాన్య మానవులు, పశువులు, మరియు పక్షులు నలు దిక్కులకు చెదిరిపొయినవి (6). ఓ బ్రాహ్మణులారా! ఆ స్థితిని చూచిన ఋషులలో కొందరు ప్రాణాయామముతోను, మరికొంందరు ధ్యానముతోను ఆ మిక్విలి భయంకరమగు కాలమును గడుపుచుండిరి (7). గౌతముడు కూడ అక్కడ స్వయముగా ప్రాణమయామమునందు నిమగ్నుడై ఆరు మాసములు వరుణుని ఉద్దేశించి శుభకరమగు తపస్తసును చేసెను (8). అప్పుడు వరుణుడు ఆయనకు వరమును ఇచ్చుటకు విచ్చేసి, నేను ప్రసన్నుడనైనతిని. వరమును కొరుకొనుడుమ అని పలికెను (9). ఓ బ్రాహ్మణులారా! అప్పుడు గౌతముడు ఆయనను వర్షమును గురించి ప్రార్థించగా, వరునుడు ఆ మహర్షితో ఇట్లు పలికెను (10).

వరుణ ఉవాచ|

దేవాజ్ఞం చ సముల్లంఘ్య కథం కుర్యామహం చ తామ్‌ | అన్యత్రార్ఱయ సుజ్ఞో%సి యదహం కరవాణి తే || 11

వరుణుడు ఉవాచ |

దేవతలన ఆజ్ఞను ఉల్లంఘించి నేను వర్షమును కురిపించుట ఎట్లు సంభవించును? నీవు గొప్ప జ్ఞానివి. మరియొక వరమును కోరుకొనుము. నేను తీర్చగలను (11).

సూత ఉవాచ |

ఇత్యేతద్వచనం తస్య వరుణస్య మహాత్మనః ! పరోపకారీ తచ్ఛ్రు త్వా గౌతమో వాక్యమబ్రవీత్‌ ||

సూతుడు ఇట్లు పలికెను-

మహాత్ముడగు వరుణుని ఈ మాటను విని పరోపకారస్వభావము గల గౌతముడు ఇట్లు పలికెను(12).

గౌతమ ఉవాచ |

యది ప్రసన్నోదేవేశ యది దేయో వరో మమ | యదహం ప్రార్థయామ్యద్య కర్తవ్యం హిత్వయా తథా|| 13

యతస్త్వం జలరాశీశసన్తస్మార్ధేయం జలం మమ | అక్షయం సర్వదేవేశ దివ్యం నిత్యఫల ప్రదమ్‌ || 14

గౌతము ఇట్లు పలికెను-

ఓ దేవాదేవా! నీవు ప్రసన్నుడైవై నాకు వరమును ఈయదలచినచో, నేను దేనిని కోరెదనో దాననే నీవు ఈయవలెను (13). ఓ సర్వదేవప్రభూ! నీవు జలరాసులకు అధీశ్వరుడవు గనుక, నాకు శాశ్వతఫము నిచ్చే అక్షయదివ్య జలమునిమ్ము(14).

సూత ఉవాచ|

ఇతిం సంప్రార్థిత స్తేన వరుణో గౌతమేన వై| ఉవాచం వచనం తసై#్మ గర్తశ్చ క్రియతాం త్వయా|| 15

ఇత్యుక్తే చ కృతస్తేన గర్తో హస్తప్రమాణతః | జలేన పూరితస్తేన దివ్యేన వరుణన సః || 16

అథోవాచ మునిం దేవో వరుణో హి జలాధిపః | గౌతమం మునిశార్థూలం పరోపకృతి శాలినమ్‌|| 17

సూతుడు ఇట్లు పలికెను-

ఆ గౌతముడు ఈ విధముగా ప్రార్థించగా వరుణుడు అయనతో 'నీవు బిలమును చేయుమని చెప్పెను 15) వరుణుడు అట్లు చెప్పగానే ఆయన చేయి లోతుగల గోతిని చూసెను. వరుణుడు దానిని దివ్యజలముతో నింపెను. 16) తరువాత జలాధిపతియగు వరుణదేవుడు పరోపకారస్వభావము గల గౌతమమహర్షిని ఉద్దేశించి ఇట్లు పలికెను17

వరుణ ఉవాచ!

అక్షయ్యం చ జలం తే%స్తు తీర్థభూతం మహామునే | తవ నామ్నా చ విఖ్యాతం క్షీతావేతద్భవిష్యతి|| 18

అత్ర దత్తం హుతం తప్తం సురాణం యజనం కృతమ్‌ | పితౄణం చ కృతం శ్రాద్ధం సర్వమేవాక్షయం భ##వేత్‌ || 19

వరుణుడు ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! ఈ జలము నీకు అక్షయమగుటయే గాక, ఇది తీర్థము అగును. ఇది భూమండలముతో నీపేరుతో ప్రఖ్యాతిని పొందగలదు. (18) ఇచట చేయబడే దానము, హోమము, తపస్సు, దేవయజ్ఞము మరియు పితృశ్రాద్ధము ఇత్యాది సర్వము అక్షయమగును(19)

సూత ఉవాచ|

ఇత్యుక్త్వాంతర్దధే దేవః స్తుతస్తేన మహర్షిణా | గౌతమో%పి సుఖం ప్రాప కృత్వాన్యో పకృతిం మునిః 20

మహతో హ్యాశ్రయః పుంసాం మహత్త్వాయోపజాయతే| మహాంతస్తత్స్వరూపం చ పశ్యంతి నేతరే%శుభాః || 21

యాదృఙ్నరం చ సేవేత తాదృశం ఫలమశ్నుతే | మహతస్సేవయోచ్చత్వం క్షుద్రస్య క్షుద్రతాం తథా|| 22

సింహస్య మందిరే సేవా ముక్తా ఫలకరీ మతా | శృగాలమందిరే సేవా త్వస్థలాభకరీ స్మృతా || 23

ఉత్తమానాం స్వభావో%యం పరదుఃఖాసహిష్ణుతా| స్వయం దుఃఖం చ సంప్రాప్తం మన్యతేన్యస్య వార్యతే|| 24

వృక్షాశ్చ హాటకం చైవ చందనం చేక్షుకస్తథా| ఏతే భువి పరార్ధే చ దక్షా ఏవం న కేచన|| 25

దయాలు రమదస్పర్శ ఉపకారీ జితేంద్రయః| ఏతైశ్చ పుణ్యస్తంభైస్తు చతుర్భిర్ధార్యతే మహీ || 26

సూతుడు ఇట్లు పలికెను-

వరుణదేవుడు ఇట్లు పలికి ఆ మహర్షిచే స్తుతించబడినవాడై అంతర్ధానమును చెందెను. ఇతరులకు ఉపకారమును చేసిన గౌతమమహర్షి కూడా సుఖమును పొందెను (20). మహాత్ములను ఆశ్రయించు పురుషులకు కూడ గొప్పదనము అబ్బును మహాత్ములు మాత్రమే ఈశ్వరస్వరూపమును చూడగల్గుదురు. అది పాపాత్ములగు ఇతరులకు కానరాదు (21). మానవుడు ఎటువంటి వ్యక్తిని సేవించునో, అటువంటి ఫలమును మాత్రమే పొందును. గొప్పవారిని సేవించినచో గొప్పదనము, నీచులను సేవించినచో నీచత్వము కలుగును (22). సింహము యొక్క నివాసములో సేవ చేసినచో ముత్యములు లభించును. నక్కయొక్క మందిరములో సేవ చేసినచో ఎముకలు దొరకును. (23) ఇతరుల దుఃఖమును సహించలేకపోవుట ఉత్తముల స్వభావమై యున్నది. వారు తమకు కలిగిన దుఃఖమును సహించి, ఇతరుల దుఃఖమును నివారించెదరు(24) చెట్లు, బంగారము, చందనము మరియు చెరుకు అనునవి ఈ భూలోకములో పరోపకారము కొరకు మాత్రమే ఉన్నవి. ఇంతటి పరోపకారసామర్థ్యము ఇతరులలో లేదు. (25) దయాస్వభావుడు, గర్వము నెరుంగని వాడు, పరోపకారి మరియు ఇంద్రియజయము గలవాడు అనే ఈ నల్గురు పుణ్యమూర్తులు భూమండలమును నిలబెట్టు స్తంభములవంటివారు. (26)

తతశ్చ గౌతమస్తత్ర జలం ప్రాప్య సుదుర్లభమ్‌| నిత్యనైమిత్తికం కర్మ చకార విధిత్తదా|| 27

తతో వ్రీహీన్‌ యవాంశ్చైవ నీవారానప్యనేకధా| వాపయామాస తత్రై వ హవనార్థం మునీశ్వరః || 28

ధన్యాని వివిధానీహ వృక్షాశ్చ వివిధాస్తథా | పుష్పాణి చ ఫలాన్యేవ హ్యాసంస్తత్రాప్యనేకశః || 29

తచ్ఛ్రుత్వా ఋషయశ్చాన్యే తత్రాయాతాస్సహస్రశః | పశవః పక్షిణశ్చాన్యే జీవాశ్చ బహవో%గమన్‌|| 30

తద్వనం సుందరం హ్యాసీత్పృథివ్యాం మండలే పరమ్‌ | తదక్షయకరాయో గా దనావృష్ఠిర్న దుఃఖదా|| 31

ఋషయో%పి వనే తత్ర శుభకర్మపరాయణాః వాసం చక్రురనేకే చ శిష్య భార్యాసుతాన్వితాః|| 32

ధన్యాని వాపయామాసుః కాలక్రమణ హేతవే| ఆనందస్తద్వనే హ్యాసీ త్ర్ప భావాద్గౌతమస్య చ|| 33

ఇతి శ్రీ శివ మహాపురాణ కోటిరుద్రసంహితాయాం గౌతమ ప్రభావవర్ణనం నామ చతుర్వింశో ధ్యాయః (24)

తరువాత గౌతముడు ఆచట మిక్కిలి దుర్లభమగు నీటిని పొందినవాడై నిత్య నైమిత్తికర్మలను యథావిధిగా ఆచరించెను. (27) తరువాత ఆ మహర్షి హోమము కొరకై అచటనే వరిధాన్యము, యవలు, నివ్వెరధాన్యము మొదలగు వివిధములగు పంటధాన్యములు పండించెను(28) అక్కడ వివిధధాన్యముల పంటలు, వివిధరకముల చెట్లు, పుష్పములు, మరియు ఫలములు లభించుట ఆరంభమాయెను. (29) ఈ వార్తను విని వేలాది ఇతరమహర్షులు అచటకు వచ్చిరి. మరియు పశుపక్ష్యాది ఇతరజీవులు కూడ అనేకములు అచటకు చేరినవి (30) భూమండలములో ఆ వనము పరమసుందరమై భాసిల్లెను. అక్షయమగు ఆ జలనిధి ఉండుటచే వారికి అనావృష్ఠిమూలకముగు దుఃఖము కలుగలేదు(31) అనేక మహర్షులు కూడ తమ శిష్యులతో మరియు భార్యపుత్రులతో కూడి ఆ వనమునందు నివసించి శుభకర్మలను నిష్ఠతో చేసుకొనుచుండిరి (32) వారు జీవనాధారము కొరకై ధాన్యములను పండించిరి. గౌతముని ప్రభావము వలన ఆ వనములో ఆనందము వెల్లివిరిసెను. (33)

శ్రీ శివమహాపురాణములోని కోటిరుద్రసంహితయందు గౌతముని ప్రభావమును వర్ణించే ఇరువది నాల్గవ అధ్యాయము ముగిసినది (24).

Siva Maha Puranam-3    Chapters