Siva Maha Puranam-3    Chapters   

అథ ద్వావింశో%ధ్యాయః

వారాణసీ నగర మాహాత్మ్యము

సూత ఉవాచ |

అతఃపరం ప్రవక్ష్యామి శ్రూయతామృషిసత్తమాః | విశ్వేశ్వరస్య మాహాత్మ్యం మహాపాతకనాశనమ్‌ || 1

యదిదం దృశ్యతే కించిజ్జగత్యాం వస్తుమాత్రకమ్‌ | చిదానందస్వరూపం చ నిర్వికారం సనాతనమ్‌ || 2

తసై#్యవ కైవల్యరతేర్ద్వితీయేచ్ఛా తతో%భవత్‌ | స ఏవ సగుణో జాతశ్శివ ఇత్యభిధీయతే || 3

స ఏవ హి ద్విధా జాతః పుంస్త్రీరూపప్రభేదతః | యః పుమాన్‌ స శివః ఖ్యాతః స్త్రీ శక్తిస్సా హి కథ్యతే || 4

చిదానందే స్వరూపాభ్యాం పురుషావపి నిర్మితౌ | అదృష్టాభ్యాం తదా తాభ్యాం స్వభావాన్మునిసత్తమాః || 5

తావద్దృష్ట్వా తదా తౌ చ స్వమాతృపితరౌ ద్విజాః | మహాసంశయమాపన్నౌ ప్రకృతిః పురుషశ్చ తౌ || 6

తదా వాణీ సముత్పన్నా నిర్గుణాత్పరమాత్మనః | తపశ్చైవ ప్రకర్తవ్యం తతస్సృష్టిరనుత్తమా || 7

ఓ మహర్షులారా! ఈ పైన మహాపాపములను పోగొట్టే విశ్వేశ్వరుని మాహాత్మ్యమును చెప్పెదను. వినుడు (1). ఈ జగత్తులో కానవచ్చే సర్వవస్తుజాలము వికారములు లేనిది, శాశ్వతమైనది, చిదానందఘనము అగు పరబ్రహ్మ మాత్రమే అయి ఉండెను (2). అపుడు అద్వితీయ ఆనందఘనమగు ఆ పరబ్రహ్మకు రెండవదానియందు ఇచ్ఛ కలిగెను. ఆ పరబ్రహ్మయే సగుణమై శివుడు అను నామమును పొందెను (3). ఆ శివుడే స్త్రీ పురుషభేదముచే రెండు రూపములను దాల్చెను. పురుషునకు శివుడనియు స్త్రీ కి శక్తి అనియు ఖ్యాతి కలిగెను (4). ఓ మహర్షులారా! చైతన్యము మరియు ఆనందము స్వరూపముగా గలవారు, ఇంద్రియగోచరము కానివారు అగు ఆ శక్తిశివుల నుండియే మాయాప్రభావముచే ప్రకృతిపురుషులు నిర్మించబడిరి (5). ఓ బ్రాహ్మణులారా! అప్పుడు ఆ ప్రకృతిపురుషులు తమ ఆ తల్లిదండ్రులను గాంచి గొప్ప సంశయమును పొందిరి (6). అప్పుడు నిర్గుణపరబ్రహ్మనుండి, తపస్సును చేసి తరువాత సర్వశ్రేష్ఠమగు సృష్టిని చేయుడు అను శబ్దము వినవచ్చెను (7).

ప్రకృతిపురుషాపూచతుః |

తపసస్తు స్థలం నాస్తి కుత్రావాభ్యాం ప్రభో%ధునా | స్థిత్వా తపః ప్రకర్తవ్యం తవ శాసనతశ్శివ || 8

తతశ్చ తేజసస్సారం పంచక్రోశాత్మకం శుభమ్‌ | సర్వోపకరణౖర్యుక్తం సుందరం నగరం తథా || 9

నిర్మాయ ప్రేషితం తత్స్వం నిర్గుణన శివేన చ | అంతరిక్షే స్థితం తచ్చ పురుషస్య సమీపతః || 10

తదధిష్ఠాయ హరిణా సృష్టికామనయా తతః | బహుకాలం తపస్తప్తం తద్ధ్యానమవలంబ్య చ || 11

శ్రమేణ జలధారాశ్చ వివిధాశ్చాభవంస్తదా | తాభిర్వ్యాప్తం చ తచ్ఛూన్యం నాన్యత్కించిదదృశ్యత || 12

తతశ్చ విష్ణునా దృష్టం కిమేతద్దృశ్యతే%ద్భుతమ్‌ | ఇత్యాశ్చర్యం తదా దృష్ట్వా శిరసః కంపనం కృతమ్‌ || 13

తతశ్చ పతితః కర్ణాన్మణిశ్చ పురతః ప్రభోః | తద్బభూవ మహత్తీర్థం నామతో మణికర్ణికా || 14

ప్రకృతిపురుషులు ఇట్లు పలికిరి-

ఓ ప్రభూ! తపస్సును చేయుటకు స్థలము లేదు. ఓ శివా! మేము నీ ఆజ్ఞచే ఇప్పుడు ఏ స్థలములో కూర్చుండి తపస్సును చేయదగును? (8) అపుడు నిర్గుణుడగు శివుడు తేజోఘనము, శుభకరము, అయిదు క్రోసుల పరిమాణము గలది, సమస్తపరికరములతో కూడియున్నది అగు సుందరమైన నగరమును నిర్మించి పంపించెను. అది అంతరిక్షములో పురుషుని సమీపములో నిలబడెను (9, 10). అపుడు విష్ణువు సృష్టిని చేయగోరి దానిని అధిష్ఠించి శివుని ధ్యానిస్తూ చిరకాలము తపస్సును చేసెను (11). ఆ శ్రమచే అనేకములగు నీటి ధారలు పుట్టి ఆ శూన్యమంతయు వాటితో నిండిపోయెను. ఇతరము ఏమియు కానరాలేదు (12). అప్పుడు విష్ణువు దానిని చూచి 'ఇది ఏమి అద్భుతము కానవచ్చుచున్నది?' అని పలికి ఆశ్చర్యముతో తలపంకించెను (13). అప్పుడు ప్రభువుయొక్క చెవినుండి ఆతని యెదుట ఒక మణి పడెను. అదియే మణికర్ణికయను గొప్ప తీర్థము ఆయెను (14).

జలౌఘే ప్లావ్యమానా సా పంచక్రోశీ యదాభవత్‌ | నిర్గుణన శివేనాశు త్రిశూలేన ధృతా తదా || 15

విష్ణుస్తత్రై వ సుష్వాప ప్రకృత్యా స్వస్త్రి యా సహ | తన్నాభికమలాజ్జాతో బ్రహ్మా శంకరశాసనాత్‌ || 16

శివాజ్ఞాం స సమాసాద్య సృష్టిం చక్రే%ద్భుతాం తదా | చతుర్దశమితా లోకా బ్రహ్మాండే యత్ర నిర్మితాః || 17

యోజనానాం చ పంచాశత్కోటిసంఖ్యాప్రమాణతః | బ్రహ్మాండసై#్యవ విస్తారో మునిభిః పరికీర్తితః || 18

బ్రహ్మాండే కర్మణా బద్ధాః ప్రాణినో మాం కథం పునః | ప్రాప్స్యంతీతి విచింత్యైతత్పంచక్రోశీ విమోచితా || 19

ఇయం చ శుభదా లోకే కర్మనాశకరీ మతా | మోక్షప్రకాశికా కాశీ జ్ఞానదా మమ సుప్రియా || 20

అవిముక్తం స్వయం లింగం స్థాపితం పరమాత్మనా | న కదాచిత్త్వయా త్యాజ్యమిదం క్షేత్రం మమాంశక || 21

ఇత్యుక్త్వా చ త్రిశూలాత్స్వాదవతార్య హరస్స్వయమ్‌ | మోచయామాస భువనే మర్త్యలోకే హి కాశికామ్‌ || 22

అయిదు క్రోసుల నిడివి గల ఆ క్షేత్రము జలసమూహములో కొట్టుకొని పోవుచుండగా నిర్గుణుడగు శివుడు అపుడు దానిని వెంటనే త్రిశూలముపై నిలబెట్టెను (15). విష్ణువు తన భార్యయగు ప్రకృతితో గూడి అచటనే నిద్రించెను. శంకరుని శాసనముచే ఆయన నాభికమలమునుండి బ్రహ్మ పుట్టెను (16). అపుడాతడు శివుని ఆజ్ఞన పొంది అద్భుతమగు సృష్టిని చేసెను. దానియందలి బ్రహ్మాండములో పదునాల్గు లోకములు నిర్మించబడెను (17). బ్రహ్మాండముయొక్క పరిమాణము ఏబది కోట్ల యోజనములని మునులు ప్రశంసించుచున్నారు (18). బ్రహ్మాండములో కర్మచేత బంధింపబడిన ప్రాణులు మరల నన్ను చేరు ఉపయామేది? అని అలోచించి ఆ పంచక్రోశిని విడిచిపెట్టెను (19). ఈ కాశీ లోకములో శుభములనిచ్చునది, కర్మబంధమును నశింపజేయునది, మోక్షసాధనమగు జ్ఞానమును ప్రకాశింపజేసి ఇచ్చునది, నాకు మిక్కిలి ప్రియమైనది అని చెప్పబడినది (20). పరమాత్మయే అచట స్వయముగా అవిముక్త లింగమును స్థాపించెను. నా అంశయగు ఓ విష్ణూ! నీవు ఈ క్షేత్రమును ఎన్నటికీ విడువదగదు (21). అని పలికి శివుడు స్వయముగా కాశీని త్రిశూలమునుండి దింపి బ్రహ్మాండములోని మనుష్యలోకములో విడిచిపెట్టెను (22).

బ్రహ్మణశ్చ దినే సా హి న వినశ్యతి నిశ్చితమ్‌ | తదా శివస్త్రి శూలేన దధాతి మునయశ్చ తామ్‌ || 23

పునశ్చ బ్రహ్మణా సృష్టౌ కృతాయాం స్థాప్యతే ద్విజాః | కర్మణాం కర్షణాచ్చైవ కాశీతి పరిపఠ్యతే || 24

అవిముక్తేశ్వరం లింగం కాశ్యాం తిష్ఠతి సర్వదా | ముక్తిదాతృ చ లోకానాం మహాపాతకినామపి || 25

అన్యత్ర ప్రాప్యతే ముక్తిస్సారూప్యాదిర్మునీశ్వరాః | అత్రైవ ప్రాప్యతే జీవైస్సాయుజ్యా ముక్తిరుత్తమా || 26

యేషాం క్వాపి గతిర్నాస్తి తేషాం వారాణసీ పురీ | పంచక్రోశీ మహాపుణ్యా హత్యాకోటివినాశినీ || 27

అమరా మరణం సర్వే వాంఛంతీహ పరే చ కే | భుక్తిముక్తిప్రదా చైషా సర్వదా శంకరప్రియా || 28

బ్రహ్మా చ శ్లాఘతే చామూం విష్ణుస్సిద్ధాశ్చ యోగినః | మునయశ్చ తథైవాన్యే త్రిలోకస్థా జనాస్సదా || 29

బ్రహ్మయొక్క దినము పూర్తి అయినప్పుడు కూడ ఆ నగరము నశించదు. ఓ మునులారా! ఆ సమయములో శివుడు దానిని త్రిశూలముచే ధరించియుండును (23). ఓ బ్రాహ్మణులారా! మరల బ్రహ్మ సృష్టిని చేయగానే అది అచట స్థాపించబడును. కర్మలను ఆకర్షించి నశింపజేయును కనుక దానికి కాశీ అను పేరు వచ్చెను (24). మహాపాపాత్ములగు జనులకైననూ ముక్తిని ఇచ్చే అవిముక్తేశ్వరలింగము సర్వదా కాశీయందు ఉండును (25). ఓ మునీశ్వరులారా! ఇతర క్షేత్రములు సారూప్యము (భగవానునితో సమానమగు రూపమును కలిగియుండుట) ఇత్యాది ముక్తులను మాత్రమే ఈయగల్గును. కాని జీవులు ఇచట మాత్రమే ఉత్తమమగు సాయుజ్యముక్తి (పరమేశ్వరునిలో ఐక్యమగుట) ని పొందెదరు (26). ఎవరికైతే ఎక్కడైననూ ముక్తి లేదో వారికి ఐదు క్రోసుల నిడివి గలది, మహాపవిత్రమైనది, కోటిహత్యల పాతకమునైననూ నశింపజేయునది అగు వారాణసీ నగరము ముక్తిని ఇచ్చును (27). దేవతలు ఇచట మరణమును కోరుచుండ ఇతరులగురించి చెప్పునదేమున్నది? సర్వకాలములలో శంకరునకు ప్రియమైన ఈ నగరము భుక్తిని మరియు ముక్తిని ఇచ్చును (28). బ్రహ్మ, విష్ణువు, సిద్ధులు, యోగులు, మునులు మరియు ముల్లోకములలోని ఇతరజనులు దీనిని సర్వదా కొనియాడచుందురు (29).

కాశ్యాశ్చ మహిమానం వై వక్తుం వర్షశ##తైరపి | శక్నోమ్యహం న సర్వం హి యథాశక్తి బ్రువే తతః || 30

కైలాసస్య పతిర్యో వై హ్యంతస్సత్త్వో బహిస్తమాః | కాలాగ్నిర్నామతః ఖ్యాతో నిర్గుణో గుణవాన్‌ భవః

ప్రణిపాతైరనేకైశ్చ వచనం చేదమబ్రవీత్‌ || 31

వంద సంవత్సరములలోనైననూ కాశీనగరముయొక్క మహిమను సమగ్రముగా చెప్పే శక్తి నాకు లేదు. అయిననూ యథాశక్తిగా చెప్పుచున్నాను (30). లోపల సత్త్వగుణము గలవాడు, బయటకు తమోగుణము గలవాడు, కాలాగ్ని అను పేరుతో ప్రఖ్యాతిని చెందినవాడు, నిర్గుణుడు, కాని సగుణుడు, సద్రూపుడు, కైలాసపతి అగు రుద్రుడు పలుమార్లు నమస్కరించి ఇట్లు పలికెను (31).

రుద్ర ఉవాచ |

విశ్వేశ్వర మహేశాన త్వదీయో%స్మి న సంశయః | కృపాం కురు మహాదేవ మయి త్వం సాంబం ఆత్మజే || 32

స్థాతవ్యం చ సదాత్రైవ లోకానాం హితకామ్యయా | తారయస్వ జగన్నాథ ప్రార్థయామి జగత్పతే || 33

రుద్రుడు ఇట్లు పలికెను-

ఓ విశ్వేశ్వేరా! మహేశ్వరా! నేను నిస్సందేహముగా నీ వాడను. ఓ మహాదేవా! సాంబా! పుత్రుడనగు నాపై దయను చూపుము (32). ఓ జగన్నాథా! నీవు లోకముల హితమును గోరి సర్వదా ఇచటనే స్థిరముగానుండి తరింపజేయుమని ప్రార్థించుచున్నాను (33).

సూత ఉవాచ |

అవిముక్తో%పి దాంతాత్మా తం సంప్రార్థ్య పునః పునః | నేత్రాశ్రూణి ప్రముచ్యైవ ప్రీతః ప్రోవాచ శంకరమ్‌ || 34

జితేంద్రియుడగు అవిముక్తుడు కూడ ఆనందముతో కన్నులవెంబడి నీరు స్రవించుచుండగా పలుమార్లు శంకరుని ప్రార్థించి ఇట్లు పలికెను (34).

అవిముక్త ఉవాచ |

దేవదేవ మహాదేవ కాలామయసుభేషజ | త్వం త్రిలోకపతిస్సత్యంసేవ్యో బ్రహ్మాచ్యుతాదిభిః || 35

కాశ్యాం పుర్యాం త్వయా దేవ రాజధానీ ప్రగృహ్యతామ్‌ | మయా ధ్యానతయా స్థేయమచింత్యసుఖహేతవే || 36

ముక్తిదాతా భవానేన కామదశ్చ న చాపరః | తస్మాత్త్వముపకారాయ తిష్ఠోమాసహితస్సదా || 37

జీవాన్‌ భవాబ్ధేరఖిలాంస్తారయ త్వం సదాశివ | భక్తకార్యం కురు హర ప్రార్థయామి పునః పునః || 38

అవిముక్తుడు ఇట్లు పలికెను-

ఓ దేవదేవా! మహాదేవా! కాలము అనే రోగమునకు గొప్ప మందువంటి వాడా! ముల్లోకములకు ప్రభువగు నీవు యథార్థముగా బ్రహ్మ, విష్ణువు మొదలగు వారిచే సేవింపబడుచున్నావు (35). ఓ దేవా! నీవు కాశీనగరమును రాజధానిగా స్వీకరించుము. ఊహకు అందని సుఖమును పొందుటకై నేను నిన్ను ధ్యానించుచూ ఉండెదను (36). కోర్కెలనీడేర్చి మోక్షమునిచ్చునది నీవు తక్క మరియొకరు కాదు. కావున నీవు లోకోపకారముకొరకై పార్వతితో గూడి సర్వకాలములయందు స్థిరముగానుండుము (37). ఓ సదాశివా! సమస్తజీవులను సంసారసముద్రమునుండి గట్టెక్కించుము. ఓ హరా! భక్తుల కార్యమును చక్కబెట్టుము. నేను నిన్ను మరల మరల ప్రార్థించుచున్నాను (38).

సూత ఉవాచ |

ఇత్యేవం ప్రార్థితస్తేన విశ్వనాథేన శంకరః | లోకానాముపకారార్థం తస్థౌ తత్రాపి సర్వరాట్‌ || 39

యద్దినం హి సమారభ్య హరః కాశ్యాముపాగతః | తదారభ్య చ సా కాశీ సర్వశ్రేష్ఠతరా%భవత్‌ || 40

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం విశ్వేశ్వరమాహాత్మ్య వర్ణనం నామ ద్వావింశో%ధ్యాయః (22).

సూతుడు ఇట్లు పలికెను-

ఆ విశ్వనాథుడు ఇట్లు ప్రార్థించగా సర్వజగన్నాథుడగు శంకరుడు లోకోపకారముకొరకై అచ్చట కూడ స్థిరముగానుండెను (39). ఏ దినమునుండి శివుడు కాశీకి వచ్చినాడో, అది మొదలుకొని ఆ కాశి అన్నింటికంటే మరింత శ్రేష్ఠము ఆయెను (40).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్రసంహితయందు విశ్వేశ్వరమాహాత్మ్య వర్ణనమనే ఇరువది రెండటవ అధ్యాయము ముగిసినది (22).

Siva Maha Puranam-3    Chapters