Siva Maha Puranam-3    Chapters   

అథ అష్టాదశో%ధ్యాయః

ఓంకారేశ్వర జ్యోతిర్లింగ మాహాత్మ్యము

ఋషయ ఊచుః |

త్వయా సూత మహాభాగ శ్రావితా హ్యద్భుతా కథా | మహాకాలాఖ్యలింగస్య నిజభక్తసురక్షిణః || 1

జ్యోతిర్లింగం చతుర్థం చ కృపయా వద విత్తమ | ఓంకారం పరమేశస్య సర్వపాతకహారిణః || 2

ఋషులు ఇట్లు పలికిరి-

ఓ సూతా! మహాత్మా! తన భక్తులను చక్కగా రక్షించే మహాకాలేశ్వర జ్యోతిర్లింగముయొక్క అద్భుతమగు గాథను వినిపించితివి (1). ఓ మహాజ్ఞానీ! సర్వపాపములను పోగొట్టే పరమేశ్వరుని యొక్క నాల్గవ ఓంకారజ్యోతిర్లింగమును గూర్చి కూడ దయతో చెప్పుము.

సూత ఉవాచ |

ఓంకారే పరమేశాఖ్యం లింగమాసీద్యథా ద్విజాః | తథా వక్ష్యామి వః ప్రీత్యా శ్రూయతాం పరమర్షయః || 3

కస్మింశ్చిత్సమయే చాథ నారదో భగనాన్మునిః | గోకర్ణాఖ్యం శివం గత్వా సిషేవే పరభక్తిమాన్‌ || 4

తతస్స ఆగతో వింధ్య నగేశం మునిసత్తమః | తత్రై వ పూజితస్తేన బహుమానపురస్సరమ్‌ || 5

మయి సర్వం విద్యతే చ న న్యూనం హి కదాచన | ఇతి భావం సమాస్థాయ సంస్థితో నారదాగ్రతః || 6

తన్మానం తత్తదా శ్రుత్వా నారదో మానహా తతః | నిశ్శ్వస్య సంస్థితస్తత్ర శ్రుత్వా వింధ్యో%బ్రవీదిదమ్‌ || 7

సూతుడు ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణులారా! ఓంకారమునందు పరమేశ్వరలింగము ఆవిర్భవించిన తీరును చెప్పెదను. మహర్షులగు మీరు ప్రీతితో వినుడు (3). ఒకానొక సమయములో భక్తశిఖామణియగు భగవాన్‌ నారదమహర్షి గోకర్ణమునకు వెళ్లి శివుని సేవించెను (4). తరువాత ఆయన పర్వతరాజమగు వింధ్యవద్దకు వచ్చెను. అచట ఆతడు ఆయనను గొప్పగా మర్యాద చేసి పూజించెను (5). 'నా యందు సర్వము గలదు; ఏ కాలమునందైననూ నాలో లోపము లేదు' అను భావన గలవాడై ఆతడు నారదుని యెదుట నిలబడెను (6). గర్వమును పోగొట్టే నారదుడు ఆతని గర్వముతో కూడిన వచనములను విని నిట్టూర్పును విడిచి నిలచియుండెను. దానిని విని వింధ్యుడు ఇట్లు పలికెను (7).

వింధ్య ఉవాచ |

కిం న్యూనం చ త్వయా దృష్టం మయి నిశ్శ్వాసకారణమ్‌ | తచ్ఛ్రుత్వా నారదో వాక్యమబ్రవీత్స మహామునిః || 8

వింధ్యపర్వతుడు ఇట్లు పలికెను -

నీ నిట్టూర్పునకు కారణమగు దోషము నీకు నాలో ఏమి కనబడినది? ఈ మాటను విని ఆ నారద మహర్షి ఇట్లు పలికెను (8).

నారద ఉవాచ |

విద్యతే త్వయి సర్వం హి మేరురుచ్చతరః పునః | దేవేష్వపి విభాగో%స్య న తవాస్తి కదాచన || 9

నారదుడిట్లు పలికెను-

నీయందు సర్వము గలదు. కాని మేరువు నీకంటే ఎత్తైనవాడు. ఇంతేగాక, మేరుపర్వతము దేవతలలో ఒకనిగా లెక్కంచబడుచున్నాడు. ఆ ఘనత నీకు ఏ కాలమునందైననూ లేదు (9)

సూత ఉవాచ |

ఇత్యుక్త్వా నారదస్తస్మాజ్జగామ చ యథాగతమ్‌ | వింధ్యశ్చ పరతప్తో వై ధిగ్వై మే జీవితాదికమ్‌ || 10

విశ్వేశ్వరం తథా శంభుమారాధ్య చ తపామ్యహమ్‌ | ఇతి నిశ్చిత్య మనసా శంకరం శరణం గతః || 11

జగామ తత్ర సుప్రీత్యా హ్యోంకారో యత్రవై స్వయమ్‌ | చకార చ పునస్తత్ర శివమూర్తించ పార్థివీమ్‌ || 12

ఆరాధ్య చ తదా శంభుం షణ్మాసం స నిరంతరమ్‌ | న చచాల తపఃస్థానాచ్ఛివధ్యానపరాయణః || 13

ఏవం వింధ్యతపోదృష్ట్వా ప్రసన్నః పార్వతీపతిః | స్వరూపం దర్శయామాస దుర్లభం యోగినామపి || 14

ప్రసన్నస్స తదోవాచ బ్రూహి త్వం మనసేప్సితమ్‌ | తపసా తే ప్రసన్నో%స్మి భక్తానామీప్సితప్రదః || 15

సూతుడు ఇట్లు పలికెను -

నారదుడిట్లు పలికి అచటినుండి వచ్చిన దారిన వెళ్లెను. వింధ్యపర్వతుడు పరితాపమును చెందెను. నా జీవితము ఇత్యాదులు నిందార్హములు (10). నేను విశ్వేశ్వరుడగు శంభుని ఆరాధిస్తూ తపస్సు చేసెదను. ఆయన తన మనస్సులో ఇట్లు నిశ్చయించుకొని శంకరుని శరణు పొందెను (11). అపుడాతడు ఓంకారేశ్వరుడు స్వయముగా వెలసియున్న స్థలమునకు పరమప్రీతితో వెళ్లి అచట మట్టితో శివుని మూర్తిని చేసెను (12). అప్పుడు ఆతడు ఎడతెరపి లేకుండగా ఆరు మాసములు శంభుని ఆరాధించెను. శివధ్యానమునందు నిమగ్నుడైయున్న ఆతడు తాను తపస్సును చేయుచున్న చోటనుండి కదలలేదు (13). ఈ విధముగా వింధ్యుడు చేయుచున్న తపస్సును గాంచి పార్వతీపతి ప్రసన్నుడై యోగులకైననూ లభింపశక్యము కాని తన రూపమున సాక్షాత్కరింప జేసెను (14). ప్రసన్నుడైన శివుడు అపుడు ఇట్లు పలికెను. నీ మనస్సులోని కోరికను వెల్లడించుము. నీ తపస్సునకు నేను ప్రసన్నుడనైతిని. నేను భక్తుల కోరికలను తీర్చెదను (15).

వింధ్య ఉవాచ |

యది ప్రసన్నో దేవేశ బుద్ధిం దేహి యథేప్సితామ్‌ | స్వకార్యసాధినీం శంభో త్వం సదా భక్తవత్సలః || 16

వింధ్యపర్వతడు ఇట్లు పలికెను-

ఓ దేవదేవా! నా కార్యమును సాధించగల బుద్ధిని నేను కోరుచున్నాను. నీవు ప్రసన్నుడవైనచో, నాకు అట్టి బుద్ధిని ఇమ్ము. ఓ శంభూ! నీవు సర్వదా భక్తులయందు వాత్సల్యము గలవాడవు (16).

సూత ఉవాచ |

తచ్ఛ్రుత్వా భగవాన్‌ శంభుశ్చిచేత హృదయే చిరమ్‌ | పరోపతాపదం వింధ్యో వరమిచ్ఛతి మూఢధీః || 17

కిం కరోమి యదేతసై#్మ వరదానం భ##వేచ్ఛుభమ్‌ | మద్దత్తం పరదుఃఖాయ వరదానం యథా నహి || 18

తథాపి దత్తవాన్‌ శంభుస్తసై#్మ తద్వరముత్తమమ్‌ | వింధ్యపర్వతరాజ త్వం యథేచ్ఛసి తథా కురు || 19

ఏవం చ సమయే దేవా ఋషయశ్చామలాశయాః | సంపూజ్య శంకర తత్ర స్థాతవ్యమితి చాబ్రువన్‌ || 20

తచ్ఛ్రుత్వా దేవవచనం ప్రసన్నః పరమేశ్వరః | తథైవ కృతవాన్‌ ప్రీత్యా లోకానాం సుఖహేతవే || 21

ఓంకారం చైవ యల్లింగమేకం తచ్చ ద్విధాగతమ్‌ | ప్రణవే చైవ ఓంకారనామాసీత్స సదాశివః || 22

పార్థివే చైవ యజ్జాతం తదాసీత్సరమేశ్వరః | భక్తాభీష్టప్రదౌ చోభౌ భుక్తిముక్తిప్రదౌ ద్విజాః|| 23

తత్పూజాం చ తదా చక్రుర్దేవాశ్చ ఋషయస్తదా | ప్రాపుర్వరాననేకాంశ్చ సంతోప్య వృషభధ్వజమ్‌ || 24

స్వస్వస్థానం యయుర్దేవా వింధ్యో%పి ముదితోధికమ్‌ | కార్యం సాధితవాన్‌ స్వీయం పరితాపం జహౌ ద్విజాః || 25

య ఏవం పూజయేచ్ఛంభుం మాతృగర్భం వసేన్న హి | యదభీష్టం ఫలం తచ్చ ప్రాప్నుయన్నాత్ర సంశ్యయః || 26

ఏతత్తే సర్వమాఖ్యాతమోంకారప్రభ##వే ఫలమ్‌ | అతః పరం ప్రవక్ష్యామి కేదారం లింగముత్తమమ్‌ || 27

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ మాహాత్మ్యవర్ణనం నామ అష్టాదశో%ధ్యాయః (18).

సూతుడు ఇట్లు పలికెను-

ఈ మాటను విని శంభుభగవానుడు తన మనస్సులో చిరకాలము ఇట్లు తలపోసెను: విమోహితమైన బుద్ధిగల వింధ్యుడు ఇతరులకు కష్టమును కలిగించే వరమును కోరుచున్నాడు (17). ఏమి చేయవలెను? నేను ఈతనికి ఇచ్చు వరము శుభకరము కావలెను. నాచే ఈయబడిన వరము ఇతరుల దుఃఖమునకు హేతువు కారాదు (18). అయిననూ శంభుడు, 'పర్వతరాజమగు వింధ్యమా! నీకు నచ్చిన విధముగనే కానిమ్ము' అని పలికి వానికి ఆ ఉత్తమమగు వరమును ఇచ్చెను (19). అదే సమయములో దేవతలు మరియు పవిత్రాంతఃకరణులగు ఋషులు శంకరుని పూజించి అక్కడనే స్థిరముగా నుండుమని పలికిరి (20). దేవతల ఆ మాటను విని ప్రసన్నుడైన పరమేశ్వరుడు లోకములకు సుఖమును కలిగించుటకొరకై ప్రేమపూర్వకముగా అటులనే చేసెను (21). ఓంకారేశ్వరలింగము రెండు రూపములలోనున్నది. ఆ సదాశివుడు ప్రణవమునందున్నవాడై ఓంకారేశ్వరుడను పేరును గాంచెను (22). పార్థివమూర్తినుండి పుట్టిన లింగము పరమేశ్వరుడు ఆయెను. ఓ బ్రాహ్మణులారా! ఈ రెండు రూపములు కూడ భక్తులకు కామనలను, భుక్తిని మరియు ముక్తిని ఇచ్చును (23). అపుడు దేవతలు మరియు ఋషులు వృషభధ్వజుడగు ఆ శివుని పూజించి ప్రసన్నుని చేసుకొని అనేకవరములను పొందిరి (24). దేవతలు తమ తమ స్థానములకు వెళ్లిరి. ఓ బ్రాహ్మణులారా! వింధ్యుడు కూడ తన కార్యము సిద్ధించుటచే పరమానందమును పొంది తన మనస్సులోని పరితాపమును విడనాడెను (25). శివుని ఈ విధముగా పూజించువారలకు అభీష్టఫలములు లభించుటయే గాక, వారు మరల గర్భవాసదుఃఖమును అనుభవించరనుటలో సందేహము లేదు (26). ఈ విధముగా ఓంకారేశ్వరుని పూజించుటవలన లభించు ఫలమును గూర్చి మీకు చెప్పియుంటిని. ఈ పైన ఉత్తమమగు కేదార లింగమును గూర్చి చెప్పగలను (27).

శ్రీ శివమహాపురాణములోని కోటిరుద్రసంహితయందు ఓంకారేశ్వర జ్యోతిర్లింగ వర్ణనమనే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది (18).

Siva Maha Puranam-3    Chapters