Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Siva Maha Puranam-3    Chapters   

అథ పఞ్చదశో%ధ్యాయః

మల్లికార్జున జ్యోతిర్లింగావిర్భావము

సూత ఉవాచ |

అతః పరం ప్రవక్ష్యామి మల్లికార్జునసంభవమ్‌ | యశ్శ్రు త్వా భక్తిమాన్‌ ధీమాన్‌ సర్వపాపైః ప్రముచ్యతే || 1

పూర్వం చ కథితం యచ్చ తత్పునః కథయామ్యహమ్‌ | కుమారచరితం దివ్యం సర్వపాపవినాశనమ్‌ || 2

యదా పృథ్వీం సమాక్రమ్య కైలాసం పునరాగతః | కుమారస్స శివపుత్రస్తారకారిర్మహాబలః || 3

తదా సురర్షిరాగత్య సర్వం వృత్తం జగాద హ | గణశ్వరవివాహాది భ్రామయంస్తం స్వబుద్ధితః || 4

తచ్ఛ్రు త్వా స కుమారో హి ప్రణమ్య పితరౌ చ తౌ | జగామ పర్వతం క్రౌఞ్చం పితృభ్యాం వారితో%పి హి || 5

కుమారస్య వియోగేన తన్మాతా గిరిజా యదా | దుఃఖితాసీత్తదా శంభుస్తామువాచ సుబోధకృత్‌ || 6

కథం ప్రియే దుఃఖితాసి న దుఃఖం కురు పార్వతి | ఆయాస్యతి సుతస్సుభ్రూస్త్యజ్యతాం దుఃఖముత్కటమ్‌ || 7

సూతుడు ఇట్లు పలికెను-

ఇక పైన మల్లికార్జునుని ప్రాదుర్భావమును గురించి చెప్పెదను. భక్తిమంతుడు మరియు బుద్ధిమంతుడు అగు మానవుడు దీనిని విని సర్వపాపములనుండి విముక్తిని పొందును (1). సర్వపాపములను పోగొట్టే దివ్యమగు కుమారస్వామి యొక్క వృత్తాంతమును నేను పూర్వము చెప్పియుంటిని. దానిని మరల ఇప్పుడు చెప్పుచున్నాను (2). తారకాసుర సంహారకుడు, మహాబలశాలి, పార్వతీపుత్రుడు అగు ఆ కుమారస్వామి భూమిని ప్రదక్షిణము చేసి కైలాసమునకు తిరిగి వచ్చెను (3). అపుడు దేవర్షియగు నారదుడు వచ్చి గణశ్వరుని వివాహము మొదలగు వృత్తాంతమునంతనూ ఆతనికి చెప్పి ఆతని బుద్ధిని భ్రమింపజేసెను (4). దానిని విని ఆ కుమారస్వామి తల్లిదండ్రులు వారించిననూ వినకుండగా వారికి నమస్కరించి క్రౌంచపర్వతమునకు వెళ్లెను (5). కుమారస్వామి యొక్క వియోగముచే ఆతని తల్లియగు పార్వతి దుఃఖితురాలాయెను. అపుడు చక్కని బోధను చేయు శంభుడు ఆమెతోనిట్లనెను (6). ఓ ప్రియురాలా! ఏల దుఃఖించుచున్నావు? ఓ పార్వతీ! దుఃఖించకుము. ఓ సుందరీ! కుమారుడు రాగలడు. తీవ్రమగు దుఃఖమును విడనాడుము (7).

సా యదా చ న తన్మేనే పార్వతీ దుఃఖితా భృశమ్‌ | తదా చ ప్రేషితాస్తత్ర శంకరేణ సురర్షయః || 8

దేవాశ్చ ఋషయస్సర్వే సగణా హి ముదాన్వితాః | కుమారానయనార్థం వై తత్ర జగ్ముస్సుబుద్ధయః || 9

తత్ర గత్వా చ తే సర్వే కుమారం సుప్రణమ్య చ | విజ్ఞాప్య బహుధాప్యేనం ప్రార్థనాం చక్రురాదరాత్‌ || 10

దేవాదిప్రార్థనాం తాం చ శివాజ్ఞాసంకులాం గురుః | న మేనే స కుమారో హి మహాహంకారవిహ్వలః || 11

తతశ్చ పునరావృత్య సర్వే తే హి శివాంతికమ్‌ | స్వం స్వం స్థానం గతా నత్వా ప్రాప్య శంకరశాసనమ్‌ || 12

తదా చ గిరిజా దేవీ విరహం పుత్రసంభవమ్‌ | శంభుశ్చ పరమం దుఃఖం ప్రాప తస్మిన్ననాగతే || 13

అథో సుదుఃఖితౌ దీనౌ లోకాచారకరౌ తదా | జగ్మతుస్తత్ర సుస్నేహాత్స్వపుత్రో యత్ర సంస్థితః || 14

మిక్కిలి దుఃఖితురాలైయున్న పార్వతి ఆ మాటలను అంగీకరించలేదు. అపుడు శంకరుడు దేవతలను మరియు ఋషులను అచటకు పంపెను (8). గొప్ప బుద్ధిశాలురగు దేవతలు మరియు ఋషులు అందరు ఆనందముతో కూడినవారై తమ గణములతో గూడి కుమారస్వామిని దోడ్కొని వచ్చుటకై అచటకు వెళ్లిరి (9). వారందరు అచటకు వెళ్లి ఆ కుమారస్వామికి నమస్కరించి ఆదరముతో ప్రార్థించి పరిపరివిధముల విన్నవించిరి (10). గొప్పవాడు, పెద్ద అహంకారముచే కల్లోలితమైన మనస్సు గలవాడు అగు ఆ కుమారస్వామి శివుని ఆజ్ఞతో కూడుకొనియున్న ఆ దేవప్రార్థనను మన్నించలేదు (11). అపుడు వారందరు శివుని వద్దకు తిరిగి వచ్చి నమస్కరించి ఆయన అనుజ్ఞను పొంది తమ తమ స్థానములకు వెళ్లిరి (12). అపుడు పార్వతీదేవి పుత్రవిరహమువలన దుఃఖించెను. కుమారస్వామి తిరిగి రాని కారణముచే శివుడు కూడ మహాదుఃఖమును పొందెను (13). అపుడు లోకాచారమును పాటించే వారిద్దరు మహాదుఃఖమును పొంది దృఢమగు పుత్రప్రేమచే దీనులై తమ పుత్రుడు ఉన్న చోటికి వెళ్లిరి (14).

స పుత్రశ్చ కుమారాఖ్యః పిత్రోరాగమనం గిరేః | జ్ఞాత్వా దూరం గతో%స్నేహాద్యోజనత్రయమేవ చ || 15

క్రౌంచే చ పర్వతే దూరం గతే తస్మిన్‌ స్వపుత్రకే | తౌ చ తత్ర సమాసీనౌ జ్యోతీరూపం సమాశ్రితౌ || 16

పుత్రస్నేహాతురౌ తౌ వై శివౌ పర్వణి పర్వణి | దర్శనార్థం కుమారస్య స్వపుత్రస్య హి గచ్ఛతః || 17

అమావాస్యాదినే శంభుస్స్వయం గచ్ఛతి తత్ర హ | పౌర్ణమాసీదినే తత్ర పార్వతీ గచ్ఛతి ధ్రువమ్‌ || 18

తద్దినం హి సమారభ్య మల్లికార్జున సంభవమ్‌ | లింగం చైవ శివసై#్యకం ప్రసిద్ధం భువనత్రయే || 19

తల్లింగం యస్సమీక్షేత స సర్వైః కిల్బిషైరపి | ముచ్యతే నాత్ర సందేహస్సర్వాన్‌ కామానవాప్నుయాత్‌ || 20

దుఃఖం చ దూరతో యాతి సుఖమాత్యంతికం లభేత్‌ | జననీగర్భసంభూతం కష్టం నాప్నోతివై పునః || 21

ధనధాన్యసమృద్ధిశ్చ ప్రతిష్ఠారోగ్యమేవ చ | అభీష్టఫలసిద్ధిశ్చ జాయతే నాత్ర సంశయః || 22

జ్యోతిర్లింగం ద్వితీయం చ ప్రోక్తం మల్లికసంజ్ఞితమ్‌ | దర్శనాత్సర్వసుఖదం కథితం లోకహేతవే || 23

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయాం మల్లికార్జున జ్యోతిర్లింగవర్ణనం నామ పఞ్చదశో%ధ్యాయః (15).

పార్వతీపరమేశ్వరుల పుత్రుడగు ఆ కుమారస్వామి తన తల్లిదండ్రులు ఆ పర్వతమునకు వచ్చినారని తెలిసి కోపముతో మూడు యోజనముల దూరమునకు వెళ్లిపోయెను (15). తమ పుత్రుడు దూరముగా వెళ్లిపోగానే వారిద్దరు జ్యోతీరూపమును దాల్చి ఆ క్రౌంచపర్వతమునందు నిలిచియుండిరి (16). పుత్రునియందలి ప్రేమచే దుఃఖితులైన ఆ పార్వతీపరమేశ్వరులు ప్రతి పక్షమునందు తమ పుత్రుడగు కుమారస్వామిని చూచుటకై వెళ్లుచున్నారు (17). ఆ శంభుడు అమావాస్యనాడు అచటకు స్వయముగా వెళ్లును. పార్వతి అచటకు పూర్ణిమనాడు తప్పనిసరిగా వెళ్లుచుండును (18). ఆనాటినుండియు మల్లికార్జున శివలింగము అచట వెలసి ముల్లోకములలో ప్రసిద్ధిని గాంచెను (19). ఆ లింగమును దర్శించు మానవుడు సర్వపాపములనుండి విముక్తిని పొంది కోర్కెల నన్నిటిని బడయుననుటలో సందేహము లేదు (20). అట్టివానికి దుఃఖములు దూరముగా తొలగి పోవును. అతడు పరమసుఖము (మోక్షము)ను పొంది మరల తల్లి కడుపున పుట్టవలసిన కష్టమునకు గురి కాడు (21). ఆతనికి ధనధాన్యముల సమృద్ధి, కీర్తి, ఆరోగ్యము మరియు అభీష్టఫలావాప్తి కలుగుననుటలో సందేహము లేదు (22). దర్శించువారలకు సమస్తసుఖములనొసంగే, మల్లికార్జునుడను పేరు గల రెండవ జ్యోతిర్లింగమును గురించి మానవకల్యాణముకొరకై చెప్పియుంటిని (23).

శ్రీ శివమహాపురాణములోని కోటిరుద్ర సంహితయందు మల్లికార్జున జ్యోతిర్లింగావిర్భావమనే పదునైదవ అధ్యాయము ముగిసినది (15).

Siva Maha Puranam-3    Chapters