Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Siva Maha Puranam-3    Chapters   

అథ తృతీయో%ధ్యాయః

అనసూయా అత్రుల తపోవర్ణనము

సూత ఉవాచ |

బ్రహ్మపుర్యాం చిత్రకూటం లింగం మత్తగజేంద్రకమ్‌ | బ్రహ్మణా స్థాపితం పూర్వం సర్వకామసమృద్ధిదమ్‌ || 1

తత్పూర్వదిశి కోటీశం లింగం సర్వవరప్రదమ్‌ | గోదావర్యాః పశ్చిమే తల్లింగం పశుపతినామకమ్‌ || 2

దక్షిణస్యాం దిశి కశ్చిదత్రీశ్వర ఇతి స్వయమ్‌ | లోకానాముపకారార్థమనసూయాసుఖాయ చ || 3

ప్రాదుర్భూతస్స్వయం దేవో హ్యనావృష్ట్యామజీవయత్‌ | స ఏవ శంకరస్సాక్షాదంశేన స్వయమేవ హి || 4

సూతుడు ఇట్లు పలికెను-

చిత్రకూటము వద్ద బ్రహ్మపురియందు పూర్వము బ్రహ్మచే స్థాపించబడి సకలకామనలను, సంపదలను ఇచ్చే మత్త గజేంద్రక లింగము గలదు (1). దానికి తూర్పు దిక్కునందు వరములనన్నిటినీ ఇచ్చే కోటీశ్వరలింగము గలదు. గోదావరీనది యొక్క పశ్చిమతీరమునందు పశుపతీశ్వరుడు గలడు (2). జనులలో అసూయను నిర్మూలించి సుఖమును ఇచ్చి ఉపకారమును చేయుటకై భగవానుడు స్వయముగా దక్షిణదిక్కులోఅత్రీశ్వరుడై వెలసినాడు (3). అనావృష్టి కలిగినప్పుడు శంకరదేవుడు స్వయముగా అంశ##చే అట్లు వెలసి ప్రాణులకు జీవనమును ఒసంగినాడు (4).

ఋషయ ఊచుః |

సూత సూత మహాభాగ కథమత్రీశ్వరో హరః | ఉత్పన్నో పరమో దివ్యస్తత్త్వం కథయ సువ్రత || 5

ఋషులు ఇట్లు పలికిరి-

ఓ సూతా! సూతా! మహాత్మా! గొప్ప వ్రతము గలవాడా! పరమప్రకాశస్వరూపుడగు హరుడు అత్రీశ్వరుడై వెలసిన వృత్తాంతములోని తత్త్వమును చెప్పుము (5).

సూత ఉవాచ|

సాధు పృష్టమృషిశ్రేష్ఠాః కథయామి కథాం శుభామ్‌ | యాం కథాం సతతం శ్రుత్వా పాతకైర్ముచ్యతే ధ్రువమ్‌ || 6

దక్షిణస్యాం దిశి మహత్కామదం నామ యద్వనమ్‌ | చిత్రకూటసమీ పే%స్తి తపసాం హితదం సతామ్‌ || 7

తత్ర చ బ్రహ్మణః పుత్రో హ్యత్రినామా ఋషిస్స్వయమ్‌ | తపస్తేపే % తికఠినమనసూయాసమన్వితః || 8

పూర్వం కదాచిత్తత్రైవ హ్యనావృష్టిరభూన్మునే | దుఃఖిదా ప్రాణినాం దైవాద్వికటా శతవార్షికీ || 9

వృక్షాశ్శుష్కాస్తదా సర్వే పల్లవాని ఫలాని చ | నిత్యార్థం న జలం క్వాపి దృష్టమాసీన్మునీశ్వరాః || 10

ఆర్ద్రీ భావో న లభ్యేత ఖరా వాతా దిశో దశ | హాహాకారో మహానాసీత్పృథివ్యాం దుఃఖదో%తి హి || 11

సంవర్తం చైవ భూతానాం దృష్ట్వా త్రిగృహిణీ ప్రియా | సాధ్వీచైవాబ్రవీదత్రిం మయా దుఃఖం న సహ్యతే || 12

సూతుడు ఇట్లు పలికెను-

ఓ మహర్షులారా! చక్కగా ప్రశ్నించితిరి. ఆ శుభగాథను చెప్పెదను. ఆ కథను నిత్యము విన్నవారు నిశ్చయముగా పాపములనుండి విముక్తలగుదురు (6). దక్షిణ దిక్కులో చిత్రకూటపర్వతమునకు సమీపములో కామదమనే గొప్ప అడవి గలదు. అది తపస్సును చేసుకునే సత్పురుషులకు హితమును కలిగించుచుండెను (7). అచట బ్రహ్మపుత్రుడగు అత్రిమహర్షి అనసూయతో గూడి స్వయముగా మిక్కిలి కఠినమగు తపస్సును చేసెను (8). ఓ మునీ! పూర్వము ఒకానొక సమయములో అదే స్థానములో దైవవశముచే భయంకరమగు అనావృష్టి వంద సంవత్సరములు కొనసాగి ప్రాణులకు దుఃఖమును కలిగించెను (9). అపుడు చెట్లు అన్నియు ఎండిపోయి చిగుళ్లు, పండ్లు కరువాయెను. ఓ మహర్షులారా! నిత్యకర్మకొరకై నీరు ఎక్కడను దొరకకుండెను (10). ఎక్కడనైననూ తడి కానరాలేదు. పది దిక్కులలో వేడి గాలులు వీచుచుండెను. భూమండలములో మహాదుఃఖమును కలిగించు హాహాకారము బయలుదేరెను (11). ప్రాణుల వినాశమును గాంచి అత్రియొక్క పతివ్రతయగు భార్య నేనీ దుఃఖమును చూడలేకున్నానని అత్రితో చెప్పెను (12).

సమాధౌ చ విలీనో%భూదాసనే సంస్థితస్స్వయమ్‌ | ప్రాణాయామం త్రిరావృత్త్యా కృత్వా మునివరస్తదా || 13

ధ్యాయతి స్మ పరం జ్యోతిరాత్మస్థమాత్మనా చ సః | అత్రిర్మునివరో జ్ఞానీ శంకరం నిర్వికారకమ్‌ || 14

స్వామిని ధ్యానలీనే చ శిష్యాస్తే దూరతో గతాః | అన్నం వినా తదా తే తు ముక్త్వా తం తం స్వగురుం మునిమ్‌ || 15

ఏకాకినీ తదా జాతా సానసూయా పతివ్రతా || 16

సిషేవే సా చ సతతం తం ముదా మునిసత్తమమ్‌ | పార్థివం సుందరం కృత్వా మంత్రేణ విధిపూర్వకమ్‌ || 17

మానసైరుపచారైశ్చ పూజయామాస శంకరమ్‌ | తుష్టావ శంకరం భక్త్యా సంసేవిత్వా ముహుర్ముహుః || 18

బద్ధాంజలిపుటా భూత్వా ప్రక్రమ్య స్వామినం శివమ్‌ | దండవత్ర్ప ణిపాతేన ప్రతిప్రక్రమణం తదా || 19

చకార సుచరిత్రా సానసూయా మునికామినీ | దైత్యాశ్చ దానవాస్సర్వే దృష్ట్వా తు సుందరీం తదా || 20

అపుడా మహర్షి స్వయముగా ఆసనమును బంధించి మూడు మార్లు ప్రాణాయామమును చేసి సమాధిలో విలీనుడాయెను (13). జ్ఞానియగు ఆ అత్రిమహర్షి పరంజ్యోతిస్స్వరూపుడు, ఆత్మస్వరూపుడు, వికారములు లేనివాడు అగు శంకరుని మనస్సులో ధ్యానించుచుండెను (14). తమ గురువగు అత్రి మహర్షి ధ్యానమగ్నుడు కాగానే ఆతని శిష్యులు ఆహారము లభించకపోవుటచే ఆయనను వీడి దూరముగా పోయిరి (15). పతివ్రతయగు ఆ అనసూయ అపుడు ఏకాకిని ఆయెను (16). అపుడామె ఉత్సాహముతో అత్రిమహర్షియొక్క మట్టి బొమ్మను సుందరముగా చేసి యథావిధిగా దానిని నిత్యము మంత్రపూర్వకముగా సేవించెను (17). మరియు ఆమె శంకరుని భక్తితో పలుమార్లు చక్కగా సేవించి, మానసోపచారములచే ఆయనను పూజించెను (18). ఆమె చేతులను జోడించి శివస్వామికి ప్రదక్షిణ సాష్టాంగప్రణామములను చేసి తరువాత ప్రతి ప్రదక్షిణమును కూడ చేసెను (19). అత్రియొక్క ప్రియురాలు, సుందరి, గొప్ప శీలము గలది అగు ఆ అనసూయను దైత్యదానవు లందరు చూచిరి (20).

విహ్వలాశ్చాభవంస్తత్ర తేజసా దూరతః స్థితాః | అగ్నిం దృష్ట్వా యథా దూరే వర్తంతే తద్వదేవ హి || 21

తథైనాం చ తదా దృష్ట్వా నాయాంతీహ సమీపగాః | అత్రేశ్చ తపసశ్చై వానసూయాశివసేవనమ్‌ || 22

విశిష్యతే స్మ విప్రేంద్రా మనోవాక్కాయసంస్కృతమ్‌ | తావత్కాలం తు సా దేవీ పరిచర్యాం చకార హ || 23

యావత్కాలం మునివరః ప్రాణాయామపరాయణః | తౌ దంపతీ తదా తత్ర స్వస్వకార్యపరాయణాః || 24

సంస్థితౌ మునిశార్దూలా నాన్యః కశ్చిత్పరః స్థితః | ఏవం జాతే తదా కాలే హ్యత్రిశ్చ ఋషిసత్తమః || 25

ధ్యానే చ పరమే లీనో న వ్యబుధ్యత కించన | అనసూయాపి సా సాధ్వీ స్వామినం వై శివం తథా || 26

భేజే నాన్యత్పరం కించిజ్జానీతే స్మ చ సా సతీ | తసై#్యవ తపసా సర్వే తస్యాశ్చ భజనేన చ || 27

దేవాశ్చ ఋషయశ్చైవ గంగాద్యాస్సరితస్తథా | దర్శనార్థం తయోస్సర్వాః పరే ప్రీత్యా సమాయయుః || 28

వారు ఆమెయొక్క తేజస్సును తట్టుకొనలేక, జనులు అగ్నిని చూచి దూరముగా తొలగిపోవు రీతిని ఆమెకు దూరముగా పోయిరి. (21). అత్రియొక్క తపస్సును మించిన శివసేవను చేయుచున్న ఆమెను చూచి అపుడు వారు దగ్గరకు రాకుండిరి (22). ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! ప్రాణాయామమునందు నిమగ్నుడైన ఆ మహర్షి ఎంతకాలము వరకు తపస్సును చేసెనో, అంతకాలము ఆమె మనో వాక్కాయములయందు సంస్కృతమైన శివపూజను చేసెను. ఆ దంపతులు ఆ సమయములో అచట తమ తమ కార్యములను చేయుచూ నివసించిరి (23, 24). ఓ మహర్షీ! అచట మూడవ వ్యక్తి లేకుండెను. ఈ విధముగా అచట కొంతకాలము గడిచెను. కాని, ధ్యానమునందు నిమగ్నుడైయున్న అత్రి మహర్షికి లోకము తెలియదు. పతివ్రతయగు అనసూయ కూడ శివస్వామిని అదే విధముగా కొలిచెను (25, 26). భర్తృసేవ, శివపూజ తక్క మరియొకటి ఆ పతివ్రతకు తెలియదు. ఆయన తపస్సును, ఆమె సేవను చూచుటకై దేవతలు, ఋషులు, గంగా మొదలగు సర్వనదులు మరియు ఇతరులు పరమ ప్రీతితో విచ్చేసిరి (27, 28).

దృష్ట్వా చ తత్తపస్సేవాం విస్మయం పరమం యయుః | తయోస్తదద్భూతం దృష్ట్వా సమూచుర్భజనం పరమ్‌ || 29

ఉభయోః కిం విశేష్టం చ తపసో భజనస్య చ | అత్రేశ్చైవ తపః ప్రోక్తమనసూయాను సేవనమ్‌ || 30

తత్సర్వముభయోర్దృష్ట్వా సమూచుర్భజనం వరమ్‌ | పూర్వైశ్చ ఋషిభిశ్చైవ దుష్కరం తు తపః కృతమ్‌ || 31

ఏతాదృశం తు కేనాపి క్వం కృతం నైతదబ్రువన్‌ | ధన్యో%యం చ మునిర్ధన్యా తథేయమనసూయకా || 32

యదైతాభ్యాం పరప్రీత్యా క్రియతే సుతపః పునః | ఏతాదృశం శుభం చైతత్తపో దుష్కరముత్తమమ్‌ || 33

త్రిలోక్యా క్రియతే కేన సాంప్రతం జ్ఞాయతే న హి | తయోరేవ ప్రశంసాం చ కృత్వా తే తు యథాగతమ్‌ || 34

గతాస్తే చ తదా తత్ర గంగా న గిరిశం వినా | గంగా మద్భజనప్రీత్యా సాధ్వీ ధర్మవిమోహితా || 35

ఆయన యొక్క అద్భుతమగు తపస్సును, ఆమెయొక్క సేవను చూచి విస్మయమును పొంది ఆ రెండింటిలో ఆమె సేవయే శ్రేష్ఠమైనదని వారు పలికిరి (29). అత్రియొక్క తపస్సు, అనసూయ యొక్క సేవ అను రెండింటిలో ఏది గొప్పది? అని వారు సమగ్రముగా పరిశీలించి ఆమె సేవయే గొప్పదని తేల్చిరి. పూర్వకాలములో కూడ ఋషులు కఠినమైన తపస్సును చేసియున్నారు (30, 31). ఇట్టి తపస్సును పూర్వము ఎవరు చేసిరి? ఎవ్వరైననూ చేయలేదు. ఆ ముని ధన్యుడు. అదే విధముగా ఈ అనసూయ కూడ ధన్యురాలు (32). వీరు ఇద్దరు పరమప్రీతితో చేయుచున్న గొప్ప శుభకరమైన ఉత్తమతపస్సును చేయుట మిక్కిలి కఠినము (33). ముల్లోకములో ఈ కాలములో ఇట్టి తపస్సును చేయువారు ఉన్నారా? అను విషయము తెలియదు. వారీ విధముగా ఆ ఇద్దరినీ అధికముగా ప్రశంసించి వచ్చిన దారిని వెళ్లిరి. కాని, గంగాదేవి మరియు శివుడు మిగిలి యుండిరి. గంగ ఇట్లు తలపోసెను: మమ్ములను సేవించుటలో గల ప్రీతిచే ఈ సాధ్వి సర్వమును మరచియున్నది (34, 35).

కృత్వోపకారమే తస్యా గమిష్యామీత్యువాచ సా | శివో%పి ధ్యానసంబద్ధో మునేరత్రేర్మునీశ్వరాః || 36

పూర్ణాంశేన స్థితస్తత్ర కైలాసం తం జగామ న | పంచాశచ్చ తథా చాత్ర చత్వారి ఋషిసత్తమాః || 37

వర్షాణి చ గతాన్యసన్‌ వృష్టిర్నైవాభవత్తదా | యావచ్చాప్యత్రిణా హ్యేవం తపసా ధ్యానమాశ్రితమ్‌|| 38

అనసూయా తదా నైవ గృహ్ణామీతీషణా కృతా | ఏవం చ క్రియమాణ హి మునినా తపసి స్థితే |

అనసూయాసుభజనే యజ్జాతం శ్రూయతామితి || 39

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం అనసూయాత్రితపో వర్ణనం నామ తృతీయో%ధ్యాయః (3)

ఈమెకు ఉపకారమును చేసి నేను వెళ్లగలను అని గంగాదేవి పలికెను. ఓ మునీశ్వరులారా! శివుడు కూడ అత్రిమహర్షి యొక్క ధ్యానముచే కట్టివేయబడినవాడై అచటనే పూర్ణాంశముతో వెలసి కైలాసమునకు వెళ్లలేదు. ఓ మహర్షులారా! ఏభై నాలుగు సంవత్సరములు గడచినవి. కాని వర్షములు పడనే లేదు. అత్రిమహర్షి ఈ తీరున ధ్యానమగ్నుడై తపస్సును చేయుచున్నంతవరకు (36-37) ఆహారమును భుజించనని అపుడు అనసూయ నిశ్చయించుకొనెను. ఈ విధముగా ఆ ముని తపస్సును, అనసూయ సేవను చేయుచుండగా జరిగిన వృత్తాంతమును వినుడు (39).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్ర సంహితయందు అనసూయా అత్రుల తపోవర్ణనమనే మూడవ అధ్యాయము ముగిసినది (3).

Siva Maha Puranam-3    Chapters