Sri Koorma Mahapuranam    Chapters   

అష్టమోధ్యాయః

అథ ముఖ్యాదిసర్గ కథనమ్‌

కూర్మఉవాచ:

ఏవం భూతాని సృష్టాని స్థావరాణి చరాణి చ| యదా స్య తాః ప్రజాః సృష్టా న వ్యవర్ధన్త ధీమతః|| 1

తమోమాత్రావృతో బ్రహ్మ తదా శోచత దుఃఖితః| తతః స విదధే బుద్ధి మర్థనిశ్చయగామినీమ్‌|| 2

అథా త్మని సమద్రాక్షీత్‌ తమోమాత్రాం నియామికామ్‌| రజః స్తత్త్వం చ సంవృత్తం వర్తమానం స్వధర్మతః|| 3

తమస్తు వ్యనుద త్పశ్చాద్రజః సత్వేన సంయుతః| తత్తమః ప్రతినున్నంవై మిథునం సమజాయత|| 4

అధర్మాచరణా విప్రా హింసా చాశుభలక్షణా | స్వాం తనుం స తతో బ్రహ్మా తా మపోహత భాస్వరామ్‌|| 5

అష్టమాధ్యాయము

కూర్మస్వామి చెప్పెను:

ఈవిధముగా స్థావరములు, చరములు అగు భూతములు సృష్టించబడినవి. బుద్ధిమంతుడగు బ్రహ్మదేవునిచేత సృజింపబడిన ప్రజలు వృద్ధినొందకపోయిరి.(1)

తమోగుణపరిమాణముచేత ఆవరింపబడిన బ్రహ్మ దుఃఖము కలవాడై విచారించెను. అప్పుడతడు విషయములందు నిశ్చయమును సాధించు బుద్ధిని సంపాదించుకొనెను.(2)

తరువాత, తనను వశము చేసికొని నియమించుచున్న తమోగుణపు పరిమాణమును తనయందు కనుగొన్నాడు. తన ధర్మము ననుసరించి ప్రవర్తించు రజస్సు, సత్త్వమును గూడ గమనించెను.(3)

తరువాత రజస్సత్త్వగుణములతో కూడుకున్నవాడై తమోగుణమును పారద్రోలెను. అట్లు తొలిగించబడిన తమోగుణము స్త్రీ పురుషుల జంటగా ఏర్పడెను.(4)

బ్రాహ్మణులారా! అశుభలక్షణమైన హింస, అధర్మము యొక్క ఆచరణమునుచూచి బ్రహ్మ ప్రకాశవంతమైన ఆశరీరమును వదిలిపెట్టెను.(5)

ద్విధా కరో త్పున ర్దేహం అర్థేన పురుషో7 భవత్‌| అర్ధేన నారీ పురుషో విరాజ మసృజత్ప్రభుః|| 6

నారీం చ శతరూపాఖ్యాం యోగినీం ససృజే శుభామ్‌| సా దివం పృథివీం చైవ మహిమ్నా వ్యాప్య సంస్థితా|| 7

యోగైశ్వర్యబలోపేతా జ్ఞానవిజ్ఞానసంయుతా | యో భవత్పు రుషా త్పుత్రో విరాడ వ్యక్తజన్మనః|| 8

స్వాయంభువో మను ర్దేవః సో7భవ త్పురుషో మునిః | సా దేవీ శతరూపాఖ్యా తపః కృత్వా సుదుశ్చరమ్‌ || 9

భర్తారం దీప్తయశసం మను మేవా న్వపద్యత | తస్మాచ్చ శతరూపా సా పుత్రద్వయ మసూయత || 10

మరల తనదేహమును రెండు భాగాలుగా విభజించెను. ఒకసగముతో పురుషుడుగా ఆయెను. మరియొక సగముతో స్త్రీరూపమును పొందెను. ఈ విధముగా ప్రభువు విరాట్పురుషుని సృజించెను.(6)

శతరూప అనుపేరు గల యోగిని అగు మంగళకర స్త్రీని సృజించెను. ఆయోగిని తన మహిమచేత భూమిని ఆకాశమును కూడ వ్యాపించి నిలిచినది.(7)

యోగబలము, ఐశ్వర్యబలముతోకూడినది, జ్ఞానవిజ్ఞానములు కలిగియున్నది, ఆమె ఉండెను. అవ్యక్తమైన జన్మముకల పురుషుని నుండి విరాడ్రూపుడైన ఏకుమారుడు కలిగెనో, (8) అతడు స్వాయంభువమనువు, దేవతారూపుడు, ముని అగుపురుషుడు. శతరూప అనుపేరు గల ఆదేవి మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సును చేసి; (9) ప్రకాశించు కీర్తి కలిగిన మనువుచే పతిగా పొందినది. అతని వలన ఆశతరూప ఇద్దరు కుమారులను కనెను.(10)

ప్రియవ్రతోత్తానపాదౌ కన్యాద్వయ మనుత్తమమ్‌ | తయోః ప్రసూతిం దక్షాయ మనుః కన్యాం దదౌ పునః || 11

ప్రజాపతి రథా కూతిం మానసో జగృహే రుచిః| ఆకూత్యా మిథునం జజ్ఞే మానసస్య రుచేః శుభమ్‌|| 12

యజ్ఞస్య దక్షిణాం చైవ యాభ్యాం సంవర్ధితం జగత్‌| యజ్ఞస్య దక్షిణాయాం చ పుత్రా ద్వాదశ జజ్ఞిరే||13

యామా ఇతి సమాఖ్యాతా దేవాః స్వాయంభువే7న్తరే| ప్రసూత్యాం చ తథా దక్షః చతస్రో వింశతిం తథా|| 14

ససర్జ కన్యా నామాని తాసాం సమ్యక్‌ నిబోధత| శ్రద్ధా లక్ష్మీర్థృతి స్తుష్టిః పుష్టిర్మేధా క్రియా తథా|| 15

వారు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనుపేరు కలవారు. శ్రేష్టులైన ఇద్దరు కన్యలను గూడ ఆమె పొందెను. మనువు వారిద్దరిలో ప్రసూతి అనుకన్యను దక్షునికి వివాహయు చేసెను.(11)

రెండవ కన్యను ఆహుతిని మానసపుత్రుడైన రుచి అనువాడు పత్నిగా స్వీకరించెను. ఆరుచికి ఆకూతి వలన మంగళకరమైన శిశుద్వయము కలిగెను. (12)

యజ్ఞునికి దక్షిణ అను కన్యను అర్పించెను. వారిద్దరిచేత ప్రపంచము పెంపొందించబడినది. ఆయజ్ఞ పురుషునికి దక్షిణయందు పండ్రెండు మంది కుమారులు కలిగిరి (13)

వారు యాములు అని పిలువబడు దేవతలు. స్వాయంభువ మన్వంతరములో వారు కలిగిరి. దక్షుడు ప్రసూతి యందు ఇరువది నాలుగు మంది కన్యలను; (14) పొందెను. వారి పేర్లను చక్కగా తెలిసికొనుడు. శ్రద్ధ లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ; (15)

బుద్ధి ర్లజ్జా వపుః శాన్తిః సిద్ధిః కీర్తి స్త్రయోదశీ| పత్న్యర్థం ప్రతిజగ్రాహ ధర్మో దాక్షాయణీః శుభాః || 16

తాభ్యాః శిష్టా యవీయస్య ఏకాదశ సులోచనాః| ఖ్యాతిః సత్యథ సంభూతిః స్మృతిః ప్రీతిః క్షమా తథా|| 17

సన్తతి శ్చానసూయా చ ఊర్జా స్వాహా స్వధా తథా| భృగుర్భవో మరీచిశ్చ తథా చైవా జ్గీరా మునిః|| 18

పులస్త్యః పులహ శ్చైవ క్రతుః పరమధర్మవిత్‌| అత్రి ర్వసిష్ఠో వహ్నిశ్చ పితరశ్చ యథాక్రమమ్‌|| 19

ఖ్యాత్యాధ్యా జగృహుః కన్యా మునయో జ్ఞానసత్తమాః| శ్రద్ధాయా ఆత్మజః కామో దర్పో లక్ష్మీసుతః స్మృతః||20

బుద్ధి, లజ్జ, వపువు, శాంతి, సిద్ధి, కీర్తి- అను ఈపదమూడు మందిని దక్ష పుత్రికలను ధర్ముడు భార్యలుగా స్వీకరించెను.(16)

వారు కాక మిగిలిన పదునొకండుగురు చిన్నవారు వరుసగా ఖ్యాతి, సతి. సంభూతి స్మృతి, ప్రీతి, క్షమ, (17) సంతతి, అనసూయ, ఊర్జా, స్వాహా, స్వథా అనువారు కలరు. వారిని క్రమముగా భృగువు ఖ్యాతిని, శివుడు సతిని, మరీచి సంభూతిని, అంగిరసుడు స్మృతిని (18) పులస్త్యుడు ప్రీతిని, పులహుడు క్షమను, క్రతువు సంతతిని, గొప్ప ధర్మములు తెలిసిన అత్రి అనసూయను, వశిష్ఠుడు ఊర్జను, అగ్నిహోత్రుడు స్వాహాదేవిని, పితృదేవతలు స్వధను; (19) జ్ఞాన వరిష్ఠులైన పూర్వోక్తమునులు ఆయా కన్యలను తమ భార్యలుగా స్వీకరించిరి. శ్రద్ధయొక్క పుత్రుడు కాముడు, లక్ష్మీ సుతుడు దర్పుడు అని పేర్కోనబడినారు. (20)

ధృత్యాస్తు నియమః పుతః తుష్ట్యాః సన్తోష ఉచ్యతే| పుష్ట్యాలాభః సుతశ్చాపి మేధాపుత్రః శమస్తథా|| 21

క్రియాయాశ్చా భవ త్పుత్రోదణ్డశ్చ నయ ఏవ చ| బుడ్ఢ్యా బోధః సుత స్తద్వత్‌ ప్రమాదో7 పి వ్యజాయత్‌|| 22

లజ్జాయా వినయః పుత్రో వపుషో వ్యవసాయకః| క్షేమః శాన్తి సుతశ్చాపి సిద్ధః సిద్ధే రజాయత|| 23

యశః కీర్తిసుత స్తద్వత్‌ ఇత్యేతే ధర్మసూనవః | కామస్య హర్షః పుత్రోభూత్‌ దేవానన్దో7 ప్యజాయత|| 24

ఇత్యేషవై సుఖోదర్కః సర్గో ధర్మస్య కీర్తితః| జజ్ఞే హింసా త్వధర్మాద్వై నికృతిం చానృతం సుతమ్‌|| 25

ధృతియొక్క కుమారుడు నియముడు, తుష్టికి సంతోషుడను పుత్రుడు, పుష్టికి లాభుడను సుతుడు మేధకు శముడను కుమారుడును కలిగిరి.(21)

క్రియకు దండుడు, నయుడు అను కుమారులు కలిగిరి. అదేవిధముగా బుద్ధి అనునామెకు బోధుడు, ప్రమాదుడు అనువారు పుత్రులుగా జన్మించిరి. (22)

లజ్జకు వినయుడును పుత్రుడు కలిగెను. వపుస్సుకు వ్యవసాయకుడనువాడు, శాంతికి క్షేముడను పుత్రుడు, సిద్దికి సిద్దుడను కొడుకు కలిగిరి. (23)

కీర్తికి యశుడను పుత్రుడు - ఈవిధముగా వీరందరు ధర్ముని కుమారులు. కామునికి హర్షుడను కుమారుడు, దేవానందుడను వాడు కూడ జన్మించిరి. (24)

ఈ విధముగా సుఖమైన భవిష్యత్తు కలిగిన ధర్ముని సర్గము తెలుపబడినది. అధర్మునివలన హింసజనించెను. నికృతి అనుకుమారుని కూడ అధర్ముడు పొందెను.(25)

నికృతే స్తనయో జజ్ఞే భయం నరకమేవ చ| మాయా చ వేదనా చైవ మిథునం త్విద మేతయోః|| 26

భయా జ్జజ్ఞే7 థ వై మాయా మృత్యుం భూతాపహారిణమ్‌| వేదనా చ సుతం చాపి దుఃఖం జజ్ఞే7 థ రౌరవాత్‌|| 27

మృత్యో ర్వృధి ర్జరాశోకౌ తృష్టా క్రోధశ్చ జజ్ఞిరే| దుఃఖోత్తరాః స్మృతా హ్యేతే సర్వే చాధర్మలక్షణాః|| 28

నైషాం భార్యాస్తి పుత్రోవా సర్వే తేహూర్థ్వ రేతసః| ఇత్యేష తామసః సర్గో జజ్ఞే ధర్మనియామకః|| 29

సంక్షేపేణ మయా ప్రోక్తా విసృష్టి ర్మునిపుజ్గవాః||30

ఇతి శ్రీ కూర్మపురాణ ముఖ్యాదిసర్గ కథనే7 ష్టమో7 ధ్యాయః||

నికృతికి భయము, నరకము అనుకుమారులు కలిగిరి. మాయ, వేదన అనువారు వీరికి భార్యలుగా రెండు జంటలేర్పడినవి.(26)

భయమునుండి మాయవలన ప్రాణులను నశింపజేయు మృత్యువు జనించెను. నరకము నుండి వేదన అను భార్య దుఃఖమును పుత్రునిగా కనెను.(27)

మృత్యువునకు వ్యాధి, జర, శోకము, తృష్ణ, క్రోధము అనునవి సంతానముగా కలిగెను. ఇవి అన్నియు అధర్మలక్షణము కలిగిన దుఃఖ పరిణామము కలవిగా చెప్పబడినవి. (28)

వీనికి భార్యకాని, కుమారుడు కానిలేరు. ఇవి అన్నియు ఊర్థ్వరేతస్సు కలిగినవి. ఈరీతిగా తమోగుణము ప్రధానముగా కల సర్గము ఏర్పడినది. మునిశ్రేష్ఠులారా! ఈ సృష్టి క్రమము నాచేత సంగ్రహముగా తెలుపబడినది (29,30)

శ్రీ కూర్మపురాణములో ముఖ్యాది సర్గకథనమను అష్టమాధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters