Sri Koorma Mahapuranam    Chapters   

షట్త్రింశోధ్యాయః

అధ ప్రయాగమాహాత్త్యము

ఋషయ ఊచుః :-

మాహాత్మ్య మవిముక్తస్య యథావ త్సముదీరితమ్‌ | ఇదానీం చ ప్రయాగస్య మాహాత్మ్య బుూహి సువ్రత || || 1 ||

యాని తీర్థాని తత్రైవ విశ్రుతాని మహాన్తి వై | ఇదానీం కథయా స్మాకం సూత సర్వార్ధవి ద్భవాన్‌ || || 2 ||

ముప్పది ఆరవ అధ్యాయము

ప్రయాగ మాహాత్త్యము

ఋషులిట్లు పలికిరి.

మంచి నియమము కలవాడా! అవిముక్తక్షేత్రము యొక్క మహత్త్వమును గూర్చి ఉన్నదున్నట్లుగా నీ చేత తెలుపబడినది. ఇక ఇప్పుడు ప్రయాగ క్షేత్రము యొక్క మాహాత్మ్యమును గూర్చి తెలుపుము. (1)

ఆ ప్రదేశములో ఏయే తీర్థములు శ్రేష్ఠములైనవి, ప్రసిద్ధములైనవి కలవో, వానిని గూర్చి మాకిప్పుడు తెలుపుము. ఓ సూతుడా! నీవు అన్ని విషయములు తెలిసినవాడవుకదా! (2)

సూత ఉవాచ :-

శృణుధ్వ మృషయః సర్వే విస్తరేణ బ్రవీమి వః | ప్రయాగస్య చ మాహాత్మ్యం యత్ర దేవః పితామహః|| || 3 ||

మార్కణ్డయేన కథితం కౌన్తేయాయ మహాత్మనే | యథా యుధిష్ఠిరా యైత త్తద్వక్ష్యే భవతా మహమ్‌ || || 4 ||

నిహత్య కౌరవా న్సర్వాన్‌ భ్రాతృభిః సహ పార్థివః | శోకేన మహతా విష్ణో ముమోహ స యుధిష్ఠిరః || || 5 ||

అచిరేణా థ కాలేన మార్కణ్డయో మహాతపాః | సంప్రాప్తో హస్తినపురం రాజద్వారే స తిష్ఠతి || || 6 ||

ద్వారపాలోపి తం దృష్ట్వా రాజ్ఞే కథితవా న్ద్రుతమ్‌ | మార్కణ్డయో ద్రష్టు మిచ్ఛం స్త్వా మాస్తే ద్వార్యసౌ మునిః || || 7 ||

సూతుడిట్లు చెప్పెను :-

ఓ ఋషులారా! మీరందరు వినుడు. నేను ప్రయాగక్షేత్రము యొక్క మాహాత్మ్యమును విస్తరముగా చెప్పుదును. అక్కడ భగవంతుడగు బ్రహ్మ నివసించి యుండును. (3)

మహాత్ముడైన ధర్మరాజుకొరకు మార్కండేయ మహామునిచేత ఏ ప్రకారముగా చెప్పబడినదో దానిని నేను మీకు తెలియజెప్పుదును. (4)

తమ దాయాదులైన కౌరవులందరినీ యుద్ధములో చంపి, యుధిష్ఠిరుడు తన సోదరులతో గూడ గొప్ప శోకముతో కూడినవాడై మోహమును పొందెను. (5)

తరువాత కొద్ది కాలమునకు గొప్ప తపశ్శక్తి కలిగిన మార్కండేయముని హస్తిన పురమునకు విచ్చేసి రాజద్వారము వద్ద నిలిచి ఉండెను. (6)

ఆ మునిని చూచి ద్వారపాలుడు ఆ వృత్తాంతమును శీఘ్రముగా రాజునకు తెలియజేసెను. ''ఓ రాజా! మార్కండేయముని మిమ్ము దర్శించుటకు వచ్చి ద్వారము వద్ద వేచియున్నాడు'' అని. (7)

త్వరితో ధర్మపుత్ర స్తు ద్వార మభ్యేత్య సత్వరమ్‌ | ద్వార మభ్యాగత స్యేహ స్వాగతం తే మహామునే || || 8 ||

అద్య మే సఫలం జన్మ అద్య మే తారితం కులమ్‌ | అద్య మే పితర స్తుష్టా స్త్వయి తుష్టే సదా మునే || || 9 ||

సింహాసన ముపస్థాప్య పాదశౌచార్చనాదిభిః | యుధిష్ఠిరో మహాత్మేతి పూజయామాస తం మునిమ్‌ || || 10 ||

మార్కణ్డయ స్తు సంపృష్టః ప్రోవాచ స యుధిష్ఠిరమ్‌ | కిమర్థం ముహ్యసే విద్వన్‌ సర్వం జ్ఞాత్వా సమాగతః || || 11 ||

తతో యుధిష్ఠిరో రాజా ప్రణమ్య శిరసాబ్రవీత్‌ | కథయస్వ సమాసేన యేన ముఞ్చామి కిల్బిషమ్‌ || || 12 ||

నిహతా బహవో యుద్ధే పుమాంసో నపరాధినః | అస్మాభిః కౌరవైః సార్ధం ప్రసఙ్గా న్ముని సత్తమ || || 13 ||

వెంటనే ధర్మరాజు శీఘ్రముగా ద్వారము వద్దకు వచ్చి, ''ఓ మహామునీ! మా భవన ద్వారమునకు విచ్చేసిన మీకు స్వాగతము'' అని పలికెను. (8)

ఈనాడు నా జన్మ సార్థకమైనది. నేడు నా వంశము పవిత్రము చేయబడినది. ఓ మునీశ్వరా! నీవు సంతోషించినప్పుడు నా పితృదేవతలిప్పుడు తృప్తులైనారు. (9)

యుథిష్ఠిరుడు, మహాత్ముడైన ఆ మునిని సింహాసనముపై కూర్చుండబెట్టి, పాదములు కడిగి, అర్ఘ్యము మొదలగు వానితో పూజించెను. (10)

కుశల ప్రశ్నలు అడుగబడిన మార్కండేయుడు ధర్మరాజుతో ఇట్లనెను. పండితుడవైన ధర్మజా! అన్నియు తెలిసి కూడా నీవు ఎందుకు మోహము చెందుతున్నావు? (11)

తరువాత రాజగు ధర్మరాజు తలవంచి నమస్కరించి ఇట్లుపలికెను. ''మునీశ్వరా! ఏ ఉపాయముతో నేను పాపము నుండి విముక్తుడనగుదునో సంగ్రహముగా తెలుపుము''. (12)

గడచిన యుద్ధములో, మాచేత, కౌరవులచేత గూడ నిరపరాధులైన చాలా మంది మనుష్యులు చంపబడినారు. ఓ మునిశ్రేష్ఠా! దానికి పాప నివృత్తిని గూర్చి తెలుపుము. (13)

యేన హింసాసముద్భూతా జ్జన్మాన్తరకృతాదపి | ముచ్యేమ పాతకా దద్య తద్భవా న్వక్తు మర్హతి || || 14 ||

మార్కణ్డయ ఉవాచ :-

శృణు రాజ న్మహాభాగ ! యన్మాం పృచ్ఛసి భారత | ప్రయాగగమనం శ్రేష్ఠం నరాణాం పాపనాశనమ్‌ || || 15 ||

204 పేజీ మిస్సింగ్‌

205 పేజీ మిస్సింగ్‌

మెరయుచున్న బంగారు రంగు కాంతి కలిగిన, సూర్యమండల ప్రాంతములో సంచరించునవి, సమస్త మణులతో నిర్మింపబడినవి, పలు విధముల పతాకములతో కూడిన దివ్య విమానములతో, శ్రేష్ఠ వనితలు నిండి యుండగా శుభ లక్షణములు కలిగి సంతోషించును. గీత వాద్యముల ధ్వనులతో నిద్రనుండి మేలుకొలుపబడును. (34, 35)

ఎప్పటి వరకు తన పూర్వజన్మను స్మరించుకొనడో, అంతకాలముర స్వర్గములో పూజింపబడును. కర్మ ఫలము క్షీణించిన మనుష్యుడు ఆ స్వర్గము నుండి జారినవాడై, బంగారము రత్నములు నిండుగ కల సంపన్నమైన వంశములో జన్మించును మరల ఆ పుణ్యతీర్థమునే స్మరించి దాని వలన మరల అక్కడికి చేరుకొనును. (36, 37)

తన దేశములో కాని, అడవిలో కాని, పరదేశములోకాని, తన యింటిలోకాని ప్రయాగక్షేత్రమును స్మరించుచు ఎవడు తన ప్రాణములు విడుచునోవాడు బ్రహ్మలోకమును చేరు కొనునని మునిశ్రేష్ఠులు చెప్పుచున్నారు. ఎక్కడ భూమి బంగారు మయమో, వృక్షములు అన్ని కోరికలను ఫలింప జేయునో, ఎచట ఋషులు, మునులు, సిద్ధులు ఉందురో ఆ లోకమునకతడు వెళ్ళును. వేల కొలది స్త్రీలతో నిండి, మనోహరమైన, శుభకర గంగా నది యొడ్డున, సిద్ధులు, చారణులు, గంధర్వులచేత, దేవదానవులచేత అతడు పూజింపబడును. (39, 40, 41)

తరువాత స్వర్గము నుండి తొలగి జంబూ ద్వీపమునకు ప్రభువు కాగలడు. తరువాత మంగళకరమైన కార్యమును గూర్చి మరల మరల ఆలోచించువాడై, గుణవంతుడు, శీలము కలవాడుగా అగునని పెద్దల వలన వినుచున్నాము. కర్మచేత, మనస్సుచేత, మాటచేత కూడా సత్యమునందు, ధర్మము నందు ప్రతిష్ఠింపబడినవాడగును. (42, 43)

గఙ్గాయమునయో ర్మధ్యే యస్తు గ్రాసం ప్రయచ్ఛతి | సువర్ణ మథ ముక్తాం వా తథైవా న్య త్పరిగ్రహమ్‌ || || 44 ||

స్వకర్యే పితృకార్యే వా తీర్థే యోభ్యర్చయే న్నరః | నిష్ఫలం తస్య తత్తీర్థం యావ త్తత్ఫల మశ్నుతే || || 45 ||

అత స్తీర్థే గృహ్ణీయా త్పుణ్య ష్వాయతనేషు చ | నిమిత్తేషు చ సర్వేషు అప్రమత్తో ద్విజో భ##వేత్‌ || || 46 ||

కపిలాం పాటలాం ధేనుం యస్తు కృష్ణాం ప్రయచ్ఛతి | స్వర్ణశృఙ్గీం రౌప్యఖురాం చైలకర్ణీం పయస్వినీమ్‌ || || 47 ||

తస్య యావన్తి లోమాని సన్తి గాత్రేషు సత్తమ | తావ ద్వర్షసహస్రాణి రుద్రలోకే మహీయతే || || 48 ||

ఇతి శ్రీ కూర్మపురాణ ప్రయాగ మాహాత్మ్యే షట్త్రింశోధ్యాయః

గంగా యమునా నదుల మధ్య భాగములో ఎవడైతే అన్నదానము చేయునో, బంగారము లేదా ముత్యము మరియేదేని వస్తువు నిచ్చునో, తన పని సందర్భమున కాని, మరణించిన తల్లిదండ్రుల కర్మల సమయమున గాని తీర్థ స్థలములో ఏ మనుష్యుడు పూజించునో, అతనికి దాన ఫలము నను భవించునంత కాలము తీర్థ స్థలపుణ్యము లభించదు అది నిరర్థకమగును (44, 45)

అందువలన తీర్థ స్థలములో, దేవతా మందిరములో, పుణ్య స్థలములలో అన్ని నిమిత్తముల యందు దానము స్వీకరించకూడదు. బ్రాహ్మణుడీ విషయములో అప్రమత్తుడుగా నుండవలెను. (46)

కపిల వర్ణము, పాటల వర్ణము, నలుపు కలిగిన ఆవును, బంగారు కొమ్ములు కలదానిని, వెండి గిట్టలు కలదానిని, వెడల్పు చెవులు కలది, బాగుగా పాలిచ్చునదగు ఆవును ఎవడు దానము చేయునో అట్టివాడు, (47)

ఓ శ్రేష్ఠుడా! దానికి ఎన్ని రోమములుండునో అన్ని వేల సంవత్సరముల కాలము దాత రుద్రలోకములో పూజలందుకొనుచుండును. (48)

శ్రీ కూర్మపురాణములో ప్రయాగ మాహాత్మ్యములో ముప్పది యారవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters