Sri Koorma Mahapuranam    Chapters   

అథ అష్టవింశో7ధ్యాయః

పార్థాయ వ్యాసదర్శనమ్‌

ఋషయ ఊచుః -

కృతం త్రేతా ద్వాపరఞ్చ కలిశ్చేతి చతుర్యుగమ్‌ | ఏషాం ప్రభావం సూతాద్య కథయస్వ సమాసతః || || 1 ||

గతే నారాయణ కృష్ణే స్వమేవ పరమం పదమ్‌ | పార్థః పరమధర్మాత్మా పాణ్డవః శత్రుతాపనః || || 2 ||

కృత్వా చైవోత్తరవిధిం శోకేన మహతా వృతః | అపశ్య త్పథి గచ్ఛన్తం కృష్ణద్వైపాయనం మునిమ్‌ || || 3 ||

ఇరవై ఎనిమిదవ అధ్యాయము

ఋషులిట్లు పలికిరి = ఓ సూతుడా! కృత, త్రేతా, ద్వాపర, కలియుగములను నాలుగు యుగముల యొక్క మహిమను సంగ్రహముగా ఇప్పుడు తెలుపుము. (1)

సూతుడు చెప్పెను -

నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడు భూలోకమను వదిలి తన పరమపదమునకు వెళ్లగా, శత్రువులను తపింప జేయువాడు, మిక్కిలి ధర్మాత్ముడు, పాండుకుమారుడును అగు అర్జునుడు; (2)

ఎక్కువ దుఃఖముతో కూడిన వాడై శ్రీకృష్ణుని పరలోకక్రియల నాచరించి వచ్చుచు దారిలో వెళ్లుచున్న వ్యాసమునిని చూచెను. (3)

శిషై#్యః ప్రశిషై#్య రభితః సంవృతం బ్రహ్మవాదినమ్‌ | పపాత దణ్డవ ద్భూమౌ త్యక్త్వా శోకం తదార్జునః || || 4 ||

ఉవాచ పరమప్రీత్యా కస్మా దేత న్మహామునే | ఇదానీం గచ్ఛసి క్షిప్రం కం వా దేశం ప్రతి ప్రభో || || 5 ||

సన్దర్శనాద్వై భవతః శోకో మే విపులో గతః | ఇదానీం మమ యత్కార్యం బ్రూహి పద్మదలేక్షణ || || 6 ||

త మువాచ మహాయోగీ కృష్ణద్వైపాయనః స్వయమ్‌ | ఉపవిశ్చ నదీతేరే శిషై#్యః పరివృతో మునిః || || 7 ||

ఇతి శ్రీ కూర్మపురాణ పార్థాయ వ్యాసదర్శనం నామ అష్టావింశో ధ్యాయః

బ్రహ్మవాదియగు ఆ వేద వ్యాసుడు, తన శిష్యులతో, ప్రశిష్యులతో అనుసరించబడి వెళ్లుచుండగా చూచి అర్జునుడు తన దుఃఖమును విడిచి నేల మీద కర్ర వలె పడి నమస్కరించెను. (4)

తరువాత మిక్కిలి సంతోషముతో ఇట్లనెను. ''ఓ మహామునీ! ఇప్పుడు శీఘ్రముగా వెళ్లుచున్నావు. ఏ కారణము వలన, ఏ ప్రదేశమునకు వెళ్లుచుంటివో చెప్పుము స్వామీ! (5)

మీ యొక్క దర్శనము వలన నా అధికమైన శోకము తొలగిపోయినది. తామరరేకులవంటి కన్నులు కలవాడా! ఇప్పుడు నేను నిర్వహించవలసిన కర్తవ్యమేమో తెలుపుము!! (6)

గొప్ప యోగీశ్వరుడగు వేదవ్యాసుడు స్వయముగా అర్జునునితో తన శిష్యులతో నదీ తీరమందు పరివేష్టింపబడిన వాడై కూర్చుండి యిట్లు చెప్పెను. 97)

శ్రీ కూర్మ పురాణములో అర్జునుడు వేదవ్యాసుని దర్శించుట అను ఇరువది యెనిమిదవ అధ్యాయము సమాప్తము

Sri Koorma Mahapuranam    Chapters