Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

తొంబదియెనిమిదవ అధ్యాయము - గ్రహనక్షత్ర ధూపదీప విధానము

మార్కండేయ ఉవాచ :

ధ్రువస్థాన నివిష్టానాం దేవతానాం మహీపతే! | గుగ్గులుం ఘృతసంయుక్తం ధూపం దద్యా ద్విచక్షణః || 1

ధూపం త్వగురు రర్కాయ సమేరుంచ తధేందవే | భౌమాయ గుగ్గులుం దద్యా త్సర్జం దద్యా ద్బుధాయచ ||

శిలాజతు తు జీవాయ దాతవ్యం పార్థివోత్తమ! | శ్రీవాసకం తు శుక్రాయ నఖం సౌరాయ పార్థివ! || 3

మదశ్చ రాహవే దేయః కేతవే చ వసా తధా ||

కృత్తికానాం ఘృతం దేయం రోహిణీనాం చ చందనమ్‌ |

ఇల్వలానాం చ కర్పూర మార్ద్రాయంచ నఖం తధా || 4

పునర్వసో శ్చాప్యగురుం పుష్యస్యచ తధాక్షతమ్‌ | శ్రీవాసకం చ సార్పస్య పైత్రస్యచ తధా ఘృతమ్‌ || 5

ప్రియంగుం మధునా యుక్తం భాగ్యస్య సఘృతం భ##వేత్‌ |

ఘృతేన మధునా యుక్త మార్యవ్ణుస్య శతావరీమ్‌ || 6

కుందురుంచైవ హస్తాయ త్వాష్ట్రాయచ పలం భ##వేత్‌ |

వాయవ్యాయ చ కర్పూర మైంద్రాగ్న్యాయ మిసి ర్భవేత్‌ || 7

మైత్రాయ కుంకుమం దేయ శాక్రాయ మృగజం భ##వేత్‌ |

శాటీ మూలం చ మూలాయ ఆప్యాయ నలదం తధా || 8

గుగ్గులుం వైశ్వదేవాయ బ్రాహ్మాయ ఘృతచందనే | వైష్ణవాయాగురుం దద్యా ద్వాసవాయ తధా పలమ్‌ || 9

వారుణాయ తధో శీరమాజాయ చ ఫలం భ##వేత్‌ | ఆహిర్బుధ్న్యాయ దాతవ్యం దేవదారుం నరాధిప! || 10

కంకోలికాని పౌష్ణాషాయ అశ్వినాయచ చందనమ్‌ | యామ్యాయ గుగ్గులు ర్దేయః సతతంభూతి మిచ్ఛతా || 11

మార్కండేయుడనియె. ధ్రువస్థానమందున్న దేవతలకు గుగ్గులు నేతితో కలిపి ధూపమువేసి యాఘ్రాణింప జేయవలెను. రవికి అగోరు శశికి సమేరువు కుజునికి గుగ్గులు బుధునికి సర్జము గురునికి శిలాజిత్తు శుక్రునికి శ్రీవాసకము శనికి నఖము రాహువునకు మదము కేతువునకు వస ధూపము వేయవలెను. కృత్తికకు నెయ్యి రోహినికి చందనము మృగశిరకు కర్పూరము ఆర్ద్రకు నఖము పునర్వసువునకు అగురు పుష్యమికి అక్షతము ఆశ్లేషకు శ్రీవాసకమా మఖకు నెయ్యి పూర్వఫల్గునికి నెయ్యి తేనెతోడి ప్రియంగువు ఉత్తరఫల్గునికి (అర్యువ్ణుము) తేనెతోడినెయ్యి. హస్తకు శతావరి కుందురువు చిత్తకు (తాష్ట్రమనకు) పలము వాయవ్యమునకు (స్నారికి) కర్పూరము ఐంద్రాగ్నమునకు (విశాఖకు) ముసి (పాలామిశ్రికాబోలు) అనూరాధకు కుంకుమపువ్వు జ్యేష్ఠకు (శాక్రము) కస్తూరి మూలకు శాటీమూలము ఆవ్యమునకు (పూర్వాషాఢకు నలదము వ్యైశ్వదేవమునకు గుగ్గులు బ్రాహ్మములకు నెయ్యి చందనము వైష్ణవమునకు అగురు వాసవమునకు పలము వారుణమునకు పట్టివేరు. అజముకు ఫలము అహిర్బుధ్నమునకు దేవధారువు పౌష్ణమునకు కంకోలికములు అశ్వినికి చందనము భరణికి గుగ్గులు ధూపము వేయవలెను. దానివలన భాగ్యవంతుడగును. ||

కర్పూరం కుంకుమంచైవ చందనం మృగజం తధా |

తురుష్క మగురుం కాంతాం గుగ్గులుంచ క్రమాద్దిశామ్‌ || 12

ప్రాచ్యాదీనాం మహీనాథ! సాగరాణాంచ చందనమ్‌ |

సర్వాభావే చ దాతవ్యాః సర్వేషామేవ గుగ్గులుమ్‌ || 13

వనస్పతి రసోదివ్వః గంధాడ్యో గంధ ఉత్తమః | అఘ్రాణ స్సర్వదేవానాం గుగ్గులు ప్రవర శ్శుభః || 14

దీప శ్చ్యాజ్యేన దాతవ్యః సర్వేషాధమ విశేషతః | తైలేన వా మహీనాథ ! వసాఢ్యేన వివర్జయేత్‌ || 15

యద్యద్గ్రహ్యషాపాభిహితం మయాత్ర ఋక్షస్యవా భూమితిప్రధాన! |

తద్దేవతాయాశ్చ తధైవ దేయం దిశాం తధా నాత్ర విచారమస్తి || 16

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే గ్రమర్ష ధూపో నామ ఆష్టనవతి తమోధ్యాయః

ఎనిమిది దిక్కులకు వరుసగా పచ్చకర్పూరము కుంకుమపువ్వు చందనము కస్తూరి తురుష్కము అగురు కాంత=గుగ్గులు ధూపము వేయవలెను. సాగరమునకు చందనము. ఈ చెప్పినవి లేనియెడ గుగ్గులు ధూపము వేయవలెను. గుగ్గులు వనస్పతి రసము దివ్యము. పదిమళమంతమయిన ఉత్తమ గంధము. ఐర్వదేవతా సాధారణమైన శుభప్రధమైన యాఘ్రాణము గుగ్గులు. అందరకు అవునేతితో దీపము పెట్టినలునది నువ్వుల నూనెయునుయోగ్యమే. వసతోడి నూనెదీపము పనికిరాదు. గ్రహమున కేదేరిచెప్పబడినదో అదిమరి నక్షత్రమునకు తదధిదేవతకు దిక్కులకు నర్హమగును. ఇందు మరి విమర్శలేదు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రధమఖండమున గ్రహనక్షత్రధూప దీపములు అనుతొంబదియోనిమిదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters