Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

తొంబదియవ అధ్యాయము - గ్రహనక్షత్ర పూజావిధి

వజ్ర ఉవాచ :

గ్రహాణాం భార్గవశ్రేష్ఠ! నక్షత్రాణాం తధైవచ |

పూజావిధి మహం త్వత్తః శ్రోతు మిచ్ఛామి తత్త్వతః || 1

మార్కండేయ ఉవాచ :

గ్రహం వాప్యధ నక్షత్రం యంపూజయితు మిచ్ఛతి |

ఉపస్పృస్య శుచిర్భూత్వా, కృత్వా తస్యాధ మండలమ్‌ || 2

మండలే కల్పితం వాపి స్వయం దైవవిదా నృప! | పూజ్య స్నానేన విధి వ త్స్నాతః ప్రయత మానసః ||

విధినో ప సమాదాయ ప్రయతో జాతవేదసమ్‌ | అథ వోప సమా దానే కృతే తత్ర పురోధసా || 4

ప్రాక్‌ తంత్రేచ కృతే తత్ర చక్షుష్పత్రే యధావిధి |

మండలా త్పశ్చిమే భాగే ప్రాజ్ముఖః ప్రయత శ్శుచిః || 5

మండలస్యతు శౌచార్థం పంచ గవ్యం ప్రకల్పయేత్‌ |

అభ్యుక్ష్య పంచగవ్యేన మండలం ప్రయత శ్శుచిః || 6

అర్ఘ్యాది కల్పనాం కుర్యాత్‌ పాద్యాన్తాం తదన న్తరమ్‌ |

జీవా దానం తతః కుర్యాజ్జీవస్యా వాహనం తతః || 7

పూజ్యస్యావాహనం కుర్యాత్‌ తతోర్ఘ్యం వినివేదయేత్‌ |

పాద్యం నివేదయే త్పశ్చా దాసనం చ నివేదయేత్‌ || 8

దత్త్వైవాచమనీయం చ మధుపర్కం నివేదయేత్‌ |

తతోసులేపనం దద్యాత్‌ తతో దద్యాద్విభూషణమ్‌ || 9

తతో యజ్ఞోపవీతం చ తతః ప్రతిసరాన్‌ శుభాన్‌ |

వస్త్రం తధా పతాకాం చ పుష్పం ధూపం తధైవ చ || 10

దీపంచ దత్వానై వేద్యం ముఖవాసం చ పార్థివ !

తతోగ్ని హవనం కుర్యా ద్యస్య యస్య యథా భ##వేత్‌ || 11

కృత్వైవోత్తర తంత్రంచ దత్వాపూర్ణాహుతిం తతః |

తదుక్తాం దక్షిణాం దత్వా మండలే ప్రతిపాదయేత్‌ || 12

హోతు ర్వస్త్రయుగం దేయం గౌ స్సువర్ణం తధై పచ |

గ్రాహ్యం కాలవిదా తచ్చ యద్దత్తం గ్రహమండరే || 13

యధాశక్తి చ దాతవ్యా బ్రాహ్మణానాంచ దక్షిణా | విసర్జనం తతః కార్యం తతో బ్రాహ్మణ భోజనమ్‌ || 14

భుక్తవత్సుచ విప్రేషు ప్రమార్‌ష్టి ర్మండలే భ##వేత్‌ | అర్ఘ్య పుష్పాదికం సర్వం జలే ప్రక్షిప్య పార్థివ! 15

ఆంబునా తర్పణం కార్యం పూజా స్యా త్తదన న్తరమ్‌ || 16

పూజావిధి స్తే గదితోమయాద్య, సమాసతః పార్థివ సంఘముఖ్య! |

అతః పరం కిం కథయామి తుభ్యం తన్మే పదస్వాఖిల రాజసింహ || 17

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే గ్రహర్ష పూజా విధి వర్ణనాంనామ సవతి తమోధ్యాయః

వజ్రుడు గ్రహములు నక్షత్రములయొక్కయు పూజావిధాన మానతిమ్మన మార్కండేయు డనియె. గ్రహమునుగాని నక్షత్రమునుగాని పూజింపనెంచినపుడు అచమనముసేసి శుచియై మండలముసేసి యందుతానుగాని దైవజ్ఞుడుగాని గ్రహనక్షత్ర ప్రతి మాకల్పనముసేసి యగ్ని ప్రతిష్ఠసేయవలెను. లేదా పురోహితుడంతమున్న యగ్ని యుపపాదనముసేసి పూర్వతంత్రము చక్షుప్పాత్ర ప్రయోగము యధావిధిగా ముగించుయున్న యెడల మండలమునకు బడమటిదిశ తూర్పుమొతమైకూర్చుండి మండలమును శుచిగానొనర్చుటకు పంచగవ్యము సభ్యుక్షణము సేయవలెను (చల్లవలెనన్నమాట) అటుపై అర్ఘ్యపాద్యాదికల్పనము సేయవలెను. అవ్వల జీవా దానము ( బలిపశువునుగొనివచ్చట) దానియందుజీవావాహనము సేసి పూజింపనెంచిన గ్రహమునో పీఠముపైకావాహనముసేసి అర్ఘ్యము పాద్యము ఆసనము అచమనీయము మధుపర్కము అనులేపనము (గంధము) అభరణము, జందెము హారములు పూలమాలలు వస్త్రము పతాక పుష్పము దీపము నైవేద్యము తాంబూలము (ముఖవాసము) నను నుపచారములు నివేదించి యటుపై నగ్నిహవ నలు స్వకులానుసారముగ నిర్వర్తింపవలెను. ఉత్తరతంత్రముగూడ యిట్లొనరించి పూర్ణాహుతి నొసంగి యందుజెప్పబడిన దక్షిణ నొసంగి మండలమందుంచవలయును. హోతకు వస్త్రయుగ్మము గోవు సువర్నము దానమీయవలెను. కాలజ్ఞుడు (జ్యోతిషికుడు) గ్రహమండల మందీయబడినదది తప్పక తీసికొన వలెను. అవుల యథాశక్తి బ్రాహ్మణులకు దక్షిణ నీయవలెను. అటుపై విసర్జనము (ఉద్వాసన) సేయవలెను. బ్రాహ్మణభోజనము పెట్టవలెను. విప్రభోజనమయిన తర్వాత నామండల ప్రమార్జన మొనరింపవలెను. అందలి అర్ఘ్యజలము పువ్వులు మొదలగునవెల్ల జలములందు గలిపి యట జలముతో తర్పణము సేయవలెను. అటుపై పూజసేయనగును. ఓరాజోత్తమ గ్రహనక్షత్రపూజావిధిసంగ్రహపరచి నీకిదితెల్పితిని. ఇటుపై నేమితెల్పుదునది చెప్పుమనియె.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమునందు ప్రథమ ఖండమున గ్రహనక్షత్ర పూజావిధియను తొంబదియవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters