Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ఎనుబదిబదినాలుగవ అధ్యాయము - షడ్‌లగ్నవ్ణరనము

మారర్కండేయ ఉవాచ :-

లగ్నాని ద్వాదశో క్తాని దినరాత్రేణ నిత్యశః | యత్రా దిత్యః స్థితో రాశౌ తదాధ్యాని నరాధిప! || 1

మేషో వృషోధ మిథునః కుశీర స్సింహ ఏవ చ | కన్యా తలా తధా కీటో ధన్వీ మకర ఏవచ || 2

కుంభో మీన శ్చ రాజేంద్ర! లగ్నా ద్వాదశ కీర్తితాః |

కుజ శ్శుక్రో బుధ శ్చంద్ర స్సూర్య శ్చాంద్రి స్సిత స్తధా || 3

భౌమో జీవ శ్చ సౌరశ్చ శని ర్జీవ స్తధైవచ | మేషాధీనాం క్రమేణోక్తాః ప్రభవః పృధివీపతే!! 4

లగ్నస్యార్థం స్మృతా హోరా తయోర్విపమ రాశిషు | ఆదిత్య చంద్రౌ చంద్రార్కా వీశ్వరౌ సమ రాశిఘ || 5

లగ్న త్రిభాగో ద్రేక్కాణః క్రమా త్తేషాం తధేశ్వరాః | లగ్నేశః పంచమేశశ్చ నవమేశ స్తధైవ చ || 6

మేశాధ్యాః కథితా నిత్యం మేష సింహ ధనుర్ధరాః | మకరాధ్యా స్తధా ప్రోక్తా వృష కన్యా మృగా స్తధా || 7

తులాద్యా మిధున స్తౌలీ కుంభశ్చ వసుధాధిప! కుశీరాద్యాః కుళీరశ్చ కీటోమీన స్తధైవ చ || 8

ఆద్యు క్త రాశి ప్రభృతి గణనీయా నవాంశకాః | రాశీనాం తు యధోక్తానాం క్రమా న్నవ నవేశ్వరాః || 9

న్వరాశిత స్తధారభ్య క్రమేణౖవ నవేశ్వరాః | రాశీశ్వరేశ్వరాః ప్రోద్వా రాశీనాం ద్వాదశాంశకాః || 10

పంచభౌమస్య సౌరస్య పంచ త్రింశాంశకా మతాః | జీవ స్యాష్టౌ వినిర్దిష్టాః సప్త ప్రోక్తాః బుధస్యతు || 11

శుక్రస్తోక్తాః తథా పంచరాశౌ విషమ సంజ్ఞకే | ఆద్యాస్తు పంచ శుక్రశ్య తతస్సప్త బుధస్యతు || 12

జీవస్యాష్టౌ తథా ప్రోక్తాః పంచ సౌరస్య చాప్యథ |

కుజస్యతు తధా పంచరాశౌ తు సమ సంఖ్యకే || 13

లగ్నంచ హోరాచ తధా ద్రికాణం నవాంశకం ద్వాదశభాగ సంజ్ఞమ్‌ |

త్రింశాంశకం చాప్యథ షష్ఠమత్ర షడ్‌భేదమాహు ర్మునయశ్చ లగ్నమ్‌ || 14

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్ర సంవాదే షడ్‌ లగ్న వర్ణనం నామ చతురశీతి తమోధ్యాయః

మార్కండేయు డిట్లుపలికెను :-

ప్రతి అహోరాత్రమునందును పన్నెండు రాసులు అవృత్త మగును. (ఈ పండ్రెండు రాసులు ను ఇరువది నక్షత్రములే గాని వేరుగాదు. నక్షత్ర చక్రమును పండ్రెండుగ విభజించగా పండ్రెండు రాసులైనవి.) ఇవి తూర్పక్షితిజము (Horizon) మీది నుండి ఉదయించుచు క్రమముగ పైకి వచ్చి పశ్చిమక్షితిజమున అస్తమించుటను బట్టి లగ్నములన బడుచున్నవి. ఇవి మేషము, వృషభము, మిధునము, కర్కాటకము, కన్య, తుల, పృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము అనునవి. వీనికి వరుసగా కుజుడు, శుక్రుడు, బుధుడు, చండ్రుడు, సూర్యుడు, శని, బృహస్పతి అను వారధిపతులు. అరువది గడియల అహోరాత్రమున అవృత్తమలగు పండ్రెండు లగ్నములలో నొక్కక్కదానికి ఇంచుమించుగా అయిదేసి గడియలు వచ్చునన్నచో లగ్నపరిమాణముల సగము కాలము (21/2 గటియలు-సుమారు) ఒక్కొక్క హోర అనబడును. వీనిలో మేషము, మిధునము, సంహము, తుల, ధనుస్సు, కుంభము, అను చేసి లగ్నముల విషయమన మొదట హోరకు సూర్యుడు, రెండవ హోరకు చంద్రుడు అధిపతులు. సమలగ్నమలగు వృషభము. కర్కాటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనము అనెడి సరి లగ్నముల విషయమున మొదట హోరకు చంద్రుడు రెండవ హోరకు సూర్యుడు అధిపతులు. లగ్నములో మూడవ వంతు కాలము ద్రేక్కాణము అనబడును. ఈ విషయములో నే లగ్నమునకు నెవరధిపతియో అతడు ఆ లగ్నములోని మొదట ద్రేక్కాణమునకును, ఆ లగ్నము నుండి అయిదవ లగ్నము యొక్క అధిపతి రెండవ ద్రేక్కాణమనకును, అదే లగ్నము నుండి తొమ్మిదవ లగ్నము యొక్క అధిపతి ఆ లగ్నము నందలి మూడవ ద్రేక్కాణమునకును అధిపతులగుదురు. ఇక నవాంశము విషయము- లగ్న పరిమాణములో తొమ్మిదవ భాగము నవాంశము (నవమాంపము) అనబడును. (లగ్నములను నక్షత్రములుగ గణన చేసినపుడు ప్రతి నక్షత్రము యొక్క నాల్గవ వంతులు తొమ్మదిచేరి ఒక లగ్నమగును.) కనుక గ్రహము ఝుష, సింహ, ధనుస్సు లలో నున్నప్పుడును లేదా- గణన చేయు కాలమనకు సంబంధించిన (తాత్కాలిక) లగ్నము ఈ చెప్పిన మూడింటిలో నేదైవ యయినప్పుడును ఆ గ్రహముగాని ఆ లగ్నాంశములుకాని తొమ్మిదింట వరకు లెక్కింప వలెను. అట్లే వృషభము కన్య మకరములలో నేదైన లగ్నమయినపుడు మకరము మొదలు లగ్నములను తొమ్మిదింటిని లెక్కింప వలెను.

మిధున, తుల కుంభమలలో నేదైన లగ్నమైనపుడు తుల మొదలుకొని తొమ్మిది లగ్నములను లెక్కింప వలెను. కర్కట వృశ్చిక మీనములలో నేదైన లగ్నమయినపుడు కర్కటము మొదలుకొని తొమ్మిదింటిని లెక్కింపవలెను. అట్లు లెక్కించు నపుడు తాత్కాలిక సవాంశము ఏ లగ్నమునకు చెందియున్నదో ఆ రాశిలో నా గ్రహము ఉన్నట్లును, ఆ లగ్నము నవాంశ లగ్నమైనట్లుచు లెక్కలోనికి తీసుకొనిరావలెను. ఏ రాసులకు నెవ్వరధిపతులో నాయా పేర్లుగల రాసులకును వారే యధిపతులు.

ఇక ద్వాదశాంశ విషయము-- ప్రతి రాశిని పండ్రెండు భాగములు చేయగా నొక్కొక్క పండ్రెండవభాగము ఆ రాశి యొక్క ద్వాదశాంశమగును. ఏ రాశికి నెవ్వరధిపతియో ఆ పేరుగల ద్వాదశాంశమనకు నతడే యధిపతి.

ఇదికాక త్రింశాంశ విషయమున (మొత్తము నక్షత్ర చక్రము లేదా రాశిచక్రము మూడు వందల అరువది భాగములు (డిగ్రీలు) కాగా ఒక్కొక్క రాశికి (లగ్నమునకు) ముప్పది భాగములు వచ్చును. ఇదియే త్రింశాంశము. ఆ లగ్నములో మొదటి అయిదు భాగములు కుజునకు, తరువాతి అయిదు భాగములు శనికి, తరువాత యేడు భాగములు బుధునకు, చివరి యైదు భాగములు శుక్రునకు (మొత్తము ముప్పది భాగములు) సంబంధించినవి. ఇట్లేసమ లగ్నముల విషయమున మొదట యైదు భాగములు శుక్రునకు తరవాత ఏడు బుధునకు. తరువాత ఎనిమిది బృహస్పతికి, తరువాత యైదు శనికి, చివరి యైదు కుజునకు సంబంధించినవి. ఇట్లు లగ్నము హోర, ద్రేక్కాణము నవాంశము, ద్వాదశాంశమ, త్రింశాంశము అని అరు విధములుగ శుభాశుభ నిర్ణయమునకై విభజించ వచ్చునని మునులుచెప్పిరి.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters