Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

డెబ్బది తొమ్మిదవ అధ్యాయము - పద్మనాభోపాఖ్యానము

వజ్ర ఉవాచ -

కస్త్వసౌ బాలవేషేణ కల్పాంతేషు పునః పునః | దృష్టోపి స త్వయా జ్ఞాత స్తత్ర కౌతూహలం మహత్‌ || 1

మార్కండేయ ఉవాచ -

భూయో భూయ స్త్వసౌ దృష్టోమయాదేవో జగత్పతిః | కల్పక్షయే న విజ్ఞాత స్తన్మాయామోహితేనవై || 2

కల్పక్షయే వ్యతీతే తు తం తు దేవం పితామహాత్‌ | అనిరుద్ధం విజానామి పితరం తే జగత్పతిమ్‌ || 3

వజ్ర ఉవాచ :-

జ్ఞాతవానసి తందేవం కధందేవాత్‌ పితామహాత్‌ | దుర్విజ్ఞేయం జగద్యోనిం సర్వభూత భవోద్భవమ్‌ |7 4

వజ్రుడు నీవు కల్పాంతములందు మురలమరల చూచినబాలవేషధారి యెవ్వడు? నీవు చూచియు నెరుంగజాలవైతివి. ఇది వినవేడుకయ్యయ్యెడునను మార్కండేయుడనియె. ఈజగత్పతి నేనెన్నో పర్యాయములు చూచితిని. కల్పాంతమందీ చూచిన మహానుభావుడెవ్వడోయెరుంగను. ఆయన మాయకుమోహమందితిని. కల్పాంతము వెళ్లినతర్వాత బ్రహ్మవలన నాతడనిరుద్దుడని తెలిసితిని. అనవజ్రుండు సర్వభూతకారణుడు జగత్తుమూలము నెరుంగరానివాడునగు నాయననెట్లు బ్రహ్మవలన నెరింగితివో సవిస్తరముగ నానతిమ్మన మార్కండేయుడనియె.

మార్కడేయ ఉవాచ :

మాయయామోహితస్తస్య బాలస్యామితతేజసః | దృష్ట్వోదరే జగత్‌కృత్స్నం విస్మయావిష్టచేతనః || 5

గత్వాహం బ్రహ్మ సదృశం పృష్టవాన్‌ తం పితామహమ్‌ | ఏకార్ణవేమయాలోకే దేవ దేవే జగత్పతౌ || 6

దృష్టోబాలో మహాతేజా స్తస్యాహమవశస్తతః | ప్రవిష్టో జఠరే తస్యదేవ! సర్వం చరాచరమ్‌ || 7

మయా దృష్టం జగత్సర్వం నచ జానామి బాలకమ్‌ | ధ్రువం తం భగవాన్‌ వేత్తి సర్వజ్ఞత్వా జ్జగద్గురుః || 8

ఏవం పృష్టోమయా బ్రహ్మా మామువాచ జగద్గురుః | మార్కండేయ! విజానామి హ్యనిరుద్ధం జగద్గురుమ్‌ || 0

త్వంచ తం వేత్థ తత్త్వేన సచకల్పక్షయే మునే | త్వయాదృష్టం యధాతస్య జఠరే భువనం మునే! || 10

తథా ద్భష్టం మయా తస్య జగద్యోనే ర్మహాత్మనః | మదీయస్య దినస్యాన్తేకదాచి ద్భృగునందన ! || 11

ఏకార్ణవే తదా లోకే నష్టే స్థావర జంగమే | నాగ పర్యంక శయనే పశ్యామి పురుపం తదా || 12

తస్మిన్‌కాలే నజానామి తమహం తేనమోహితః | తతః పృచ్ఛామి తందేవం కోభవానితి విస్మితః || 13

సమా మువాచ ప్రహసన్‌ ! మమేదం సకలం జగత్‌ | నతుమాంవేత్సి తత్త్వేన జగతా మీశ్వరేశ్వరమ్‌ || 14

మయాప్యుక్త స్సదేవేశో మమేదం సకలం జగత్‌ | వృథా ప్రలయ మధ్యే తే మత్సమీపే విశేషతః || 15

విప్రత్యయశ్చయదితే ప్రవిశ్యజఠరం మమ | త్రైలోక్య మఖిలం పశ్య సంహృతం యన్మయాస్వయమ్‌ || 16

ఏవముక్త స్సతుమయా తదా కేనాపి హేతునా | ప్రవిశ్య జఠరం మే స క్షణమాత్రా ద్వినిర్గతః || 17

నిర్గమ్య మా మబ్రవీచ్చ దృష్టం త్రిభువనం మయా | తవోదరే జగన్నాధ ! త్వంచపశ్య మమోదరే || 18

ఏవముక్త్యా స సుష్వాస భోగి భోగసనే తదా | అహ మప్యవశ స్తస్య ప్రవిష్టో జఠరం తదా || 19

పశ్యామి జగతీం బ్రహ్మన్‌ ! సశైలవన కాననామ్‌ | స సముద్రసరిద్ధ్వీపలోక పాతాళ భూషితామ్‌ || 20

దృష్ట్వాహం పృధివీం తస్య తధా జఠరసంస్థితామ్‌ | నిర్గమిష్యన్న పశ్యామి శరీరం తస్య భార్గవ ! || 21

అన్తరిక్షం ప్రపశ్యామి నిరాలంబం పరిభ్రమన్‌ | పరిభ్రమణ భిన్నోస్మి తమేవ శరణం గతః || 22

తతస్తు తస్య పశ్యామి రంధ్రహీనం తు విగ్రహమ్‌ | తస్యదేహా ద్వినిర్గంతుం శక్తి ర్నాసీ త్తధాచమే || 23

రంధ్రహీనా న్మహాభాగ ! తమేవ శరణం గతః |

తతో హం గతవాన్‌ బ్రహ్మన్‌ ! రంధ్రం ప్రాప్తం మయానఘ! || 24

వాలాగ్రాదపి సూక్ష్మం తత్తతోహం తేన నిర్గతః | పద్మనాలేని నిష్క్రాతం పశ్యామ్యాత్మాన మాత్మనా ||

నాభి నరసి తత్పద్మం జాతం దేవస్య శార్‌జ్గిణః | శేష రత్నార్క శైవాలి వికాసిత దలం మహత్‌ || 26

తతోహం పద్మ జన్మేతి లోకే ఖ్యాతి ముపాగతః | నాభిజాతం చ యత్పద్మం తస్య దేవస్య భార్గవ! || 27

తన్మహా మండలం కృత్స్నం మేరు స్తస్యచ కర్ణికా | తత్రాహం తస్య సంభూతో దేవదేవస్య చక్రిణః || 28

దేవస్స విష్ణు ర్జగతా మధీశః సర్వేశ్వరః సర్వజగత్ప్రధానః |

యోబాలరూపీ భవతా న్త కాలే దృష్టోస్య సర్వస్య చారాచరస్య || 29

ఏవం హి తస్యోదర సంస్థితేన మయోషితం జాతకుతూహలేన |

తసై#్యవ మాయా పరిమోహితేన కల్పాంతకాలేషు సదా నరేంద్ర || 30

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ప్రధమ ఖండే మార్కండేయ వజ్ర సంవాదే పద్మనాభో పాఖ్యానం నామ ఏకోనాశీతి తమోధ్యాయః ||

అమితతేజస్వియగు నా బాలునిమాయకు దబ్బిబ్బుపడి యాయనకడుపులోనెల్ల జగమ్ముంగని యాశ్చర్యమొంది పితామహునిదరికేగి యడిగితిని. భగవంతుడనీవు. సర్వజ్ఞుడ నీవొక్కడవ యాబాలునెరుంగ గలవాడవు. జగద్గురువవు కావున యానతిమ్మన బ్రహ్మనాతోనిట్లనియె. అతడు అనిరుద్ధుడు జగద్గురువు. కల్పాంతవేళ నీవుకూడ యతనిందెలియనేరవు. అతని గర్భమందు జరా చరజగమ్ము నీవు చూచినట్లేనుంజూచితిని. నాగ పర్యంకశాయిగ నేనాతనింగంటిని. ఆ చూచినసమయమున నాతని నెవ్వడో యెరుంగను. మోహవడి యాపనినేయడిగితిని. ఆతడు నాతో నల్లననవ్వుచు నీజగమ్మెల్ల నాదియ. నారచనయేయన్నమాట. జగదీశ్వరులకీశ్వరుడనునేను. నన్నీవు తెలియలేవు. అనవిని నే నీ జగత్తునాదియ (నారచించినదియ) ఇదంతయు నా ముందే యీప్రళయ మందు వ్యర్థమైపోయినది. నీకిటనమ్మకము గల్గదేని నాజఠరమందు బ్రవేశించి నాచేతనే యుపసంహృతమయిన ముల్లోకమును నందు గనుము. అనవిని నేనేదోయొక కారణమున నాకడుపునాతడు ప్రవేశించి క్షణములోనే యీవలికివచ్చి నాతో నేను నీగర్బమున ద్రిభువన ముంగంటిని. నీవును నా గర్బమున నదిచూడుమని భోగిభోగపర్యంక మందప్పుడు నిదురవోయెను. నేను నవశుడనై యాతని కడుపునంజొచ్చి సశైలవనకానన ససాగరద్వీపపాతాలయునైన సర్వభువనకోశముంగంటిని. కాంచి యాక్షణము యీవలికివచ్చి యిటనాతని శరీరముంగాననైతిని. అట్టిటుదిరిగి నిరాలంబమైన యంతరిక్షముకాంచితిని. ఆత్రిప్పుటకలసిపోయిన నేనాయనను శరణందితిని అవ్వల నాతని శరీరమును రంధ్రహీనముగ జూచితిని, రంధ్రములేని ఆదేహమును వెలువడివచ్చుటకు నాకుశక్తిలేదయ్యెను. అందుచే నాతనినేశరణుసొచ్చితిని, అప్పుడు వాలాగ్రముగంటె (వెంట్రుకకొనకంటె) సూక్ష్మమయిన యొకరంధ్రము లభించియందుండి వెలుపడితిని. నేనొక తామరతూటినుండి వచ్చుచున్నట్లు ననునే నెరింగితిని. అవిష్ణువుయొక్క నాభి (బొడ్డు) యను సరస్సనందు పద్మము మొలచినది. శేషునిపడగలమీది రత్నములనెడి సూర్యుని వలన దాని రేకులు విచ్చికొన్నవి. అంతటనేను పద్మజన్ముడనను విఖ్యాతి నందితిని. అంతని నాభియందు బొడమిన యాపద్మము సర్వబ్రహ్మాండముండలము. దానిదుద్దుమేరువు. అచక్రాయుధునివలన నేనందు జనించితిని. ఆదేవుడు విష్ణువు. సర్వ జగధీశుడు. సర్వేశ్వరుడు సర్వజగత్ర్పధానుడు చరాచర ప్రళయమందు నీవు చూచిన బాలమూర్తియాతడే. ముచ్చటకొని యేనాతనియుదరమందు మాయాపరిమోహితుడనై కల్చాంతకాలమందు నివసింతును.

శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము నందు ప్రథమఖండమున పద్మనాభోపాఖ్యానమను డెబ్బదితొమ్మిదవ అధ్యాయము

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters