Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

డెబ్బదియేడవ అధ్యాయము - మహాకల్పవర్ణనము

వజ్ర ఉవాచ :

మహా కల్పక్షయే బ్రహ్మన్‌ ! సమవస్థాం వదస్వమే | భవాన్‌ జ్ఞాన నిధిః స్ఫీతో యదా బ్రహ్మా పితామహః || 1

మార్కండేయ ఉవాచ |

పూర్ణే సంవత్సరశ##తే సంహృత్యసకలం జగత్‌ | శేతేబ్రహ్మా మహారాజ ! ప్రాగ్వ దేకార్ణవే తదా || 2

సన్యస్య దేహం యోగేన పురుషం ప్రతిపద్యతే | మోక్షస్థాన మనుప్రాప్తే దేవదేవే పితామహే || 3

యేగతా బ్రహ్మణ స్థానం ముచ్యస్తే సర్వ ఏవతే | అండస్యాభ్యంతరం సర్వం తదాంభోభిః ప్రపూర్యతే || 4

శరీర ధారిణ స్సర్వే తదా నశ్యన్తి పార్థివ ! అంతర్గతేనతోయేన భిన్న మండం జగత్పతే ! || 5

పూర్ణే బ్రహ్మాయుషి తదా బాహ్యస్థేంభసి లీయతే | ఏవంసా జగదాధారా ధరాతోయే ప్రలీయతే || 6

జ్యోతిష్యాపః ప్రలీయస్తే జ్యోతిర్వా¸° ప్రలీయతే | ఖే వాయుః ప్రలయం యాతి మనస్యాకాశ మేవచ || 7

మనః ప్రలీయతే బుద్ధౌ బుద్థి శ్చాత్మని లీయతే | అవ్యక్తె లీయతే చాత్మా ఆవ్యక్తః పురుషే పరే || 8

ఆనన్తాని తధోక్తాని యాన్యండాని పురామయా | సర్వాణి తాని సంహృత్య సమకాలం జగత్పతిః || 9

ప్రకృతౌ తిష్ఠతి తదా సా రాత్రి స్తస్య కీర్తితా | బ్రాహ్మే సమా శ##తే పూర్ణే పునరేవ జగత్పతిః || 10

(సర్వంవిధత్తే ధర్మజ్ఞ ! యధాపూర్వ ముదాహృతమ్‌ | అవ్యక్తాది క్రమేణాథ విధాయాండం మహేశ్వరః || 11

అండే శరీరే భవతి స్వయంభూ రమృత ద్యుతిః) స్వయం సఏప ధర్మజ్జ ! బ్రహ్మా శుభ చతుర్ముఖః || 12

సర్వే ష్వండేషు ధర్మజ్జ స్సమకాలం జగత్పతిః | స్వయం శరీరే భవతి ప్రాకామ్యా న్మనుజేశ్వరః || 13

బ్రహ్మాయుషోన్తే జగతా మవస్థా మయేరితా తేయదు బృందనాథ !

అతః పరంకిం కధయామితుభ్యం తస్మే పదస్వాయతలోహితాక్ష ! || 14

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే మహాపురాణ ప్రధమ ఖండే మార్కండేయ వజ్రసంవాదే మహాకల్ప వర్ణనంనామ సప్త స ప్తతి తమోధ్యాయః

వజ్రుండు మహాకల్పము చివరిస్థితి యేమో తెల్పుము. నీవు బ్రహ్మవలె నిండైన జ్ఞాననిధివన్న మార్కండేయు డనియె ! తనకు నూరేండ్లు నిండిన తర్వాత సర్వజగమును సంహరించి, మునుపటియట్లేకార్ణపమందు బరుండును. అతరి దేహమును విడిచి యోగసమాధియందు పురుషుని (బ్రహ్మమును) పొందును. పితామహుడట్లు మోక్షస్థానమందగా బ్రహ్మతోబాటు బ్రహ్మలోకమందు గల జీవులందరు ముక్తినందుదురు. అప్పుడు బ్రహ్మాండ మంతయు జలముల నిండును. శరీరధారులందరు నప్పుడు నశింతురు. బ్రహ్మాండము లోనున్న నీటిచే పగిలిపోవును. బ్రహ్మ యాయువు పూర్తికాగా సర్వ వ్యాపకమయిన యాత్మయందాయన లీనమగును. ఇట్లు సర్వజగత్తుల కాధారమైన భూమి యుదకమండు. ఆ యుదకము జ్యోతిస్సునందు, అది వాయువునందు నా వాయువు అకాశము నందు, ఆకాశము మనసునందు, అమనసుబుద్ధియందు (మహత్తత్వమందు) బుద్ధి యాత్మయందు ఆత్మ అవ్యక్త మనబ బడుపరమ పురుషు నందు లీనమగును. అనంతకోటి బ్రహ్మాండములని నేను మున్ను జెప్పినవన్నిటి వేకకాలమందువసంహరించి జగత్ర్ప భువుయందుండును. అపుడది యాయనకు రాత్రి యనబడును. బ్రాహ్మమయిన యాయువు నూరేండ్లు పూర్తియైన తర్వాత జగత్పతి (పరమేశ్వరుడు) యథాపూర్వముగ తిరిగి జగద్రచన సేయును. అరచన అవ్యక్తాది క్రమముగ జరుగును. అఆమృతమూర్తిదన శరీర భూతనుయిన యాయండమునందు తానే ప్రవేశించును. ఆయన అణిమాది సిద్థులలో ప్రాకామ్యమను సిద్ధి ననుసరించి అనంతకోటి బ్రహ్మాండములన్నింటియందు తానొక్కడై వ్యాపించియుందును. బ్రహృయుఃపూర్తి యందు జగత్తుల యవస్థను నీకెరింగించితిని. ఇంకేమి నీకు దెలుపవలెనో యడుగుము.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రధమఖండమునందు మహాకల్ప వర్ణనమను డెబ్బది యేడవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters