Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

డెబ్బదిఆరవ అధ్యాయము-కల్పాంతవర్ణనము

వజ్ర ఉవాచ :

బ్రాహ్మస్య దిపసస్యాన్తే యాదృశీ ద్విజ ! జాయతే | జగతోస్యసమావస్థాతాదృశీం వక్తు మర్హసి || 1

మార్కండేయ ఉవాచ :

వృత్తే ప్రక్షాలనే రాజన్‌ ! కత్పస్యాన్తే చతుర్దిశమ్‌ | ఉత్తిష్ఠన్తి తదా ఘోరా దివి సప్త దివాకరాః || 2

తేతు పీత్వాం జలం సర్వ శోషయన్తి జగత్త్రయమ్‌ | వినాశంసర్వభూతానామయోగుడ సమా తదా || 3

భూమిర్భవతి భూపాల ! దగ్ధా స్సర్వేచ జంతవః | వినష్టకిల్బిసా స్సర్వే జీవ మాత్రావశేషకాః || 4

జనలోక మధా೭೭సాద్య తత్ర తిష్ఠన్తి నిర్భయాః ! భూర్భూవ స్వర్మహశ్చైవ తదా నశ్యన్తి పార్థివ ! 5

జనలోకాదయో లోకాః నతు సశ్యన్తి పార్థివ ! | తతోర్కా స్తే తు నశ్యన్తి సంహితా రుద్రతేజసా || 6

ఉత్తిష్ఠన్తి మహారౌర్రా స్తతో దివిచరా ఘనాః | కేచి దంజన పుంజాభాః కేచిద్గజ కులోపమాః || 7

కేచిత్పురవరాకారాః కేచిద్ధారిద్ర సన్నిభాః | హరితాలాంజన ప్రఖ్యా స్తధా హింగులవ ప్రభాః || 8

శుకపత్ర నిభాః కేచిత్‌ కేచి న్నీలోపల ప్రభాః | విద్యున్మాలా వినద్ధాంగాః గర్జంతోధ బలాహకాః || 9

అక్రమ్య గగనం రాజన్‌ ! పురయన్తి మహీతలమ్‌ | గంగాప్రవాహ ప్రతిమై ర్ధారాపాతైః పునః పునః || 10

తతస్సముబ్రా భూపాల! వేలోద్భేద తరంగిణః | ఛాదయన్తి మహీం సర్వాం దగ్ధాం సూర్యగభ స్తిభిః || 11

తతస్సం వర్తకో వాయుర్ఘ నానా రుజతి క్షణాత్‌ | తతో వాయుంసమాదాయ స్వశరీరే పితామహ || 12

స్వపిత్యేకార్ణవే లోకే నష్ట స్థావరజంగమే | నష్టచంబ్రార్క పవన గ్రహనక్షత్రతారకే || 13

సుప్త్వా యుగ సహస్రంతు దేవదేవో జగత్పతిః | పునర్విబుద్ధః కురుతే సృష్టిం ప్రాగ్వత్‌ పితామహః || 14

సృష్టిం కరోతి ధర్మజ్ఞ కల్పే కల్పే పునః పునః | పితామహస్య రాత్ర్యన్తే తస్మాద్ధి సృజతి ప్రజాః || 15

జంతూనాం జననాత్‌ రాజన్‌ ! జన ఇత్యభి ధీయతే |

ఏతావ దుక్తం తవ భూమిపాలా! కల్పే గతే యద్భవతీహలోకే |

అతః పరంసర్వయదుప్రధాన ! వదస్వ కింతే కధ యామి రాజన్‌ || 17

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ప్రధమఖండే మార్కండేయ వజ్రసంవాదే కల్పాంత వర్ణనం నామ షట్‌సప్తతి తమోధ్యాయః

వజ్రుండు ఓ విప్రోత్తమ ! బ్రహ్మయొక్క పగటి చివరిస్థితియేమో తెలుపుమన మార్కండేయు డనియె : ప్రక్షాళన కాలము జరిగిపోవ కల్చాంతమందు నాల్గుదెసలందు నేడుగురు సూర్యులు ఘోర రూపు లాకసమున నుదయింతురు. వారుదక మంతయుం ద్రావి ముల్లోకముల నెండింతురు. సర్వభూతములు నశింప నయ్యెడ పుడమి యునుపగుండువలె నుండును. సర్వ జంతువులు దగ్థము లగును. కిల్బిషములు వోయి యందరు ప్రాణమాత్రావశిష్ణులై జనలోకముం బొందియుట నిర్భయముగ నుందురు. భూలోకము భువర్లోకము (అంతరిక్షము) సువర్లోకము (ఆదిత్యమండలము) మహర్లోకము (చంద్రమఃస్థానము) నయ్యెడ నశించును. జనలోకము మొదలు మీది లోకములు నశింపవు. రుద్రతేజస్సుచే గప్పవడి యా సూర్యులందరు నశింతురు. అవ్వల మహారౌద్రము లయిన మేఘములు దివంబున గ్రమ్ముకొనును. కొన్ని కాటుకవలె యేనుగుల మందవలె పురములట్లుగ పసుపురంగు అరిదళము కాటుకవలెను యింగువరంగులో చిలుక రెక్కలట్లు (ఆకుపచ్చగ) నల్లగులువలట్లు మెరుపుదీగలతో బెనవేసికొని గర్జించుచు గగనముం గ్రమ్ముకొని గంగాప్రవాహమట్టు ధారాపాతముగ నవని నెల్ల నీట మరిమరి ముంచెత్తును. అవ్వల సముద్రములు చెలియలికట్టలం ద్రెంచు కెరటములతో సూర్యకిరణదగ్దమైన మహినెల్ల నాక్రమించును. అంతలో సాంవర్తికవాయువు (ప్రలయవాయువు) మేఘము లను క్షణములో జెదరగోట్టును. అటుపై బ్రహ్మ యా వాయువుం దన శరీరమునందాకర్షించికొని లోకమేకార్ణవమైన యత్తరి స్థావర జంగమములు నశించినయెడ చంద్ర సూర్యులు గ్రహ నక్షత్రములు గాలి మొదలగునవన్నియు నష్టములైన వేళ నిదురవోవును. అట్లొక వేయియుగములు నిద్రించి యా జగత్ర్పభువు మేల్కని మరల పూర్వమట్లు సృష్టికావించును. ప్రతికల్పమందు నాయన తన రాత్రి చివర మరల మరల సృష్టిచేయుచుండును. జీవుల జననమువలన నీలోకము జనలోకమని పేరొందినది. కల్పాంతస్థితి యిది యిందాక తెలిపితిని. ఇంకేమి తెల్పుమందువో యది యింక జెప్పెదను.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమున ప్రథమ ఖండమున కల్పాంతవర్ణనమను డెబ్బదియారవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters